20-12-2020 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సకల సుఖములకు నెలవు శ్మశానమె సుమ్మీ”
(లేదా…)
“సకల సుఖాలవాలము శ్మశానమె యందురు పండితోత్తముల్”
"శ్రీ రాముని దయ చేతను..." సరదా పూరణ:తికమక చెంది యాకలిని తిండియు త్రిప్పయు కానరాకయేవికలపు మానసమ్ముగొని భీతిని జెందుచు నర్ధరాత్రినిన్నికటమునందు గాంచగను నిక్కపు రీతిని నక్కబావకున్ సకల సుఖాలవాలము శ్మశానమె యందురు పండితోత్తముల్...
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.ఇది ఎంతమాత్రం సరదా పూరణ కాదు!
🙏
వికలమనస్కుండైనట్టికథా నాయకుడు దలచె డెందమునందున్తకరారులన్ని తొలగునుసకల సుఖములకు నెలవు శ్మశానమె సుమ్మీ!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
చంపకమాల (సరసీ)చంపకమాలఒకరిని పేదవారిగను నొక్కరి నాస్తిపరుండటంచు నింకొకరిని నగ్రవర్ణమని యొక్కరి వర్ణము నీచ మంచు నీమకిలి జగాన భేదముల మాటున మ్రగ్గక యందరొక్కటౌసకల సుఖాలవాలము శ్మశానమె యందురు పండితోత్తముల్
కందంప్రకటించి కలిమిలేములువికటించెడు వర్ణ భేద వేదన కన్నన్సకలుర నొకటిగ జూడఁగసకల సుఖములకు నెలవు శ్మశానమె సుమ్మీ!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా🙏
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
ఆటవిడుపు సరదా పూరణ: (జిలేబి గారికి అంకితం)హా! కేజరివాలా! తికమక చెంది వైద్యులిక తీర్చను జాలక మేటి కోవిడున్రకరకమైన పీనుగులు రాత్రిని ప్రొద్దుట హస్తినాపురిన్ప్రకటితమైన వ్యాధిగొని వందలు రాగను, ప్రేతగోపుకున్సకల సుఖాలవాలము శ్మశానమె యందురు పండితోత్తముల్...
ప్రకటితశాంతికివనమదివికలముగాకనుమనసునవేదనతీరన్పకపకనవ్వగనాకముసకలసుఖములకునెలవుశ్మశానమెసుమ్మీ
మకిలినియంటిజీవితపుమార్గముఁదోచకకుందగాధరన్పకపకనవ్వుచున్పిలచుపార్వతివల్లభుడాయెడన్తగన్తికమకయేమిలేదుగనతీరునువేదనతండ్రికౌగిటన్సకలసుఖాలవాలముశ్మశానమెయందురుపండితోత్తముల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు."మకిలిని నంటి..." అనండి.
సరిదిద్దుకుంటాను
అకటా!కరోన ననుకొనెసకల సుఖములకు నెలవు శ్మశానమె సుమ్మీవికలము నుండదు నిచటని చకచక మని పంపుచుండె శాంతియు కొరకున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు."కరోన యనుకొనె" అనండి.
బోనసు సరదా పూరణ:అపరకర్మలు చేయు పురోహితులు 10, 11, 12, అంత్యక్రియలు జరుపుటకు మా ఎర్రగడ్డ శ్మశానవాటికలో ప్రత్యేక మండపమున్నది :)నకనక లాడి బంధువులు నందము వీడుచు కర్మకాండకున్వికలపు మానసమ్మునను విత్తము గూర్చగ నప్పుజేయుచున్ చకచక దుడ్డు లాగుటకు శాస్త్రుల వారికి యెర్రగడ్డనున్ సకల సుఖాలవాలము శ్మశానమె యందురు పండితోత్తముల్...
మీ బోనసు సరదా బాగున్నది. ఇది నిజంగానే సరదా పూరణ! అభినందనలు.
సకలమెరింగినట్టి సఖి, సారము దెల్యగ పొందు యెట్టులేప్రకటితమయ్యె గాదె పలు భావనలన్నియుదోషమెంచకన్చకచక వ్రాయుపద్దెములు శంభుని కంఠము జేరిమెర్వగాసకల సుఖాలవాలము శ్మశానమె యందురు పండితోత్తముల్!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు."సార మెఱుంగగ పొందు నెట్టులే...దోషమెంచకే...జేరి వెల్గగా..." అనండి.
చకితులు కాబోరెవ్వరు ప్రకటిత మగు కష్టము లవి భౌతిక మునకే నికరపు టాత్మ ల కు నగును సకల సుఖములకు నెలవు శ్మ శానమె సుమ్మీ
అకుతో భయుడౌ నట చల పకార ముండదట లేమి బాధయు మరియున్ వికరపు దుఃఖము లుండక సకల సుఖములకు నెలవు శ్మశానమె సుమ్మీ
శకలము గాగ దేహము విశాల జగంబు న నెక్కడుండినన్తికమక వీడి చేరెడు ప్రతీక, ప్రపుణ్య పరాత్ప రేశుడేప్రకటితుడై వెలింగెడు పురంబ గునంద్రు పరంబు జేర నాసకల సుఖాలవాలము శ్మశానమె యందురు పండితోత్తముల్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
వికృతపు యోచనుండదట విత్తమె యక్కర లేని చోటు దో షికముల బాధ లేదచట జిహ్నపు పన్నగ ముండదందురో యి, కలిమి లేమి మచ్చరము లేవియు లేని ప్రదేశమేకదా సకల సుఖాలవాలము శ్మశానమె యందురు పండితోత్తముల్
వికలపు మానస స్థితినందకాల మరణమ్ముచేత నాత్మలరూపున్ వికటంబౌ భూతతతికిసకల సుఖములకు నెలవు శ్మశానమె సుమ్మీ నకనకలాడు నక్కలకు నంజుడు ముక్కల గూర్చు భూమి యామికచర కాకభీరువుల మేలగు వాసము గబ్బిలాలకున్ప్రకటిత యాలవాలము తిరంబుగప్రేతలు భూతకోటికిన్సకల సుఖాలవాలము శ్మశానమె యందురు పండితోత్తముల్
వికటపు కామక్రోధముల వీర విహారము బారినంబడిన్వికలపు మానసంబులను వెక్కసమందెడి మానవాళికిన్నికరపు శాంతినిచ్చుటకు నీలగళుండిల నిర్ణయించినన్సకల సుఖాలవాలము శ్మశానమె యందురు పండితోత్తముల్
కాశీ మహాశ్మశానముఒకపరి మున్కవేసినను యొప్పుగగంగను దొల్గుపాపమేఒకదళ మర్పణమ్ముననె యొద్దిక గల్గును స్వర్గవాసమేఒకపరి రామనామమదె యూదగ వీనుల నీలకంఠుడే సకల సుఖాలవాలము శ్మశానమె యందురు పండితోత్తముల్
మూడవ పాదమున విశ్వనాథుడే గా చదువ ప్రార్ధన! 🙏🙏🙏
సవరించిన పూరణకాశీ మహాశ్మశానముఒకపరి మున్కవేసినను యొప్పుగగంగను దొల్గుపాపమేఒకదళ మర్పణమ్ముననె యొద్దిక గల్గును సర్వసంపదల్ఒకపరి రామనామమదె యూదును వీనుల విశ్వనాథుడేసకల సుఖాలవాలము శ్మశానమె యందురు పండితోత్తముల్
తొలగించు ఆప్షన్ రావడం లేదు! 😒😒
మీ నాల్గు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.౧. 'మానస స్థితి' అన్నపుడు 'స' గురువై గణభంగం.౨. ప్రకటిత+ఆలావాలము = ప్రకటితాలవాలము అవుతుంది. యడాగమం రాదు. ౩. బారినన్ + పడిన్... 'పడిన్' అన్న ప్రయోగం సాధువు కాదు. ౪. "మున్క వేసినను నొప్పుగ.." అనండి.
ధన్యవాదములు గురువర్యా! సవరణలు చేస్తాను! 🙏🙏🙏🙏
ఒకవిధముండ దీ మనికినోపిక తోడుత నోపగావలెన్,రకరకమైన బాధలను రంజిలు సౌఖ్య విహార యానముల్యికనట నుండ, వీ బ్రతుకు నిట్టులె వీడ, ప్రశాంత క్రాంతమైసకల సుఖాలవాలము శ్మశానమె యందురు పండితోత్తముల్!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'ఓపిక, ఓపగా..' పునరుక్తి. 'యానముల్+ఇక' అన్నపుడు యడాగమం రాదు.
సమస్య :సకలసుఖాలవాలము శ్మ శానమె యందురు పండితోత్తముల్ (కామపిశాచియైన రాజుకు బుద్ధిరావటానికై అగ్నిగుండంలో దూకబోతున్న కన్యక తనవారితో )వికలము గాని ధర్మమును విశ్రుతరీతిన నిర్వహించిరే !యికపయి నేను మీ మదుల నింపుగ నుండెద శాశ్వతమ్ముగన్ !మకరమువంటి రాట్కుమతి మత్సరముష్కరు డంతమందులే !సకలసుఖాలవాలము శ్మ శానమె యందురు పండితోత్తముల్ .( మహాకవి గురజాడవారి " కన్యక " కవిత ఆధారంగా )
అకటా నూకలు ఖాళీచకితులు కానేల మిత్తి సాజము కాదా !నికనే దోసములంటవుసకల సుఖములకు నెలవు శ్మశానమె సుమ్మీ!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు."కాదా । యికనే..." అనండి.
🙏 ధన్యవాదాలు, గురువర్యా
ఈనాడు శంకరాభరణం వారిచ్చిన సమస్య*“సకల సుఖములకు నెలవు శ్మశానమె సుమ్మీ”*(లేదా…)*“సకల సుఖాలవాలము శ్మశానమె యందురు పండితోత్తముల్”*నా పూరణకందమువికలము గాదుగ హృదయముసుకరము గాదీర్ఘనిద్ర జోగొట్టంగానికరమగు చింత లేమినిసకల సుఖములకు నెలవు శ్మశానమె సుమ్మీచంపకమాలవికలము గాదుగా మనము విన్నది గన్నది లేకపోవుటన్రకరక మైన జబ్బులిడు రంపపు కోతలు నిష్క్రమించుటన్సుకరపు దీర్ఘనిద్రతన సోలిన దేహము విశ్రమించుటన్సకలసుఖాలవాలముశ్మశానమె యందురు పండితోత్తముల్ ఆదిభట్ల సత్యనారాయణ
ఒకపరి యొలికెను జేరగనిక రమ్మని మనుజులేడ్వ నెంతకు రాడేప్రకటిత మదులకు జక్కగసకల సుఖములకు నెలవు శ్మశానమె సుమ్మీ
చం: వికటపు చేష్టలన్, నిధులు వేగమె చేగొన, క్షుద్ర విద్యలన్ప్రకటిత మొంద రాతిరిని పంతము బూనిన రీతి నొప్పగన్వికలము నొందకుండగను వేల్పును గొల్చ నుపక్రమించగన్సకల సుఖాలవాలము శ్మశానమె యందురు పండితోత్తముల్వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు."...గొల్వ నుపక్రమించగన్" అనండి.
మారుస్తానండి, ధన్యవాదములు
వికటకవికిడెసమస్యను "సకల సుఖములకు నెలవు శ్మశానమె సుమ్మీ"పకపక మని రాయలడగ నకనక లాడుచు మొదలిడె, నటనగ సభనన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు."సభనున్/సభలో" అనండి.
రకరకములైన కష్టములొకటొకటిగ వచ్చుచుండ నోపికసడలెన్యికనర్థమయ్యె నిప్పుడుసకల సుఖములకు నెలవు శ్మశానమె సుమ్మీ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'సడలెన్+ఇక' అన్నపుడు యడాగమం రాదు. "... నోపిక చనగా । నిక నర్థమయ్యె..." అనండి.
🙏🏽
వికలమొనర్చు సమస్యలుసకలము మటుమాయమగును చనిపోవగనేప్రకటముగ దెలిపెదవినుడుసకల సుఖములకు నెలవు శ్మశానమె సుమ్మీ
ఉప్పు నిడుచుండు సతతము ముప్పు యనుచుచప్పిడి కబళమునుపెట్డి చంపు చుండు,కాల కూట కషాయముల్ గళము లోనపోసి త్రాగమందురు షుగర్ పోవు నంచు,యింట నున్న జనమునకు నంటు ననుచురోగ మొచ్చిన చేర్చు నారు బయట గదిలోన,యెలుకలు ,బొద్దింకలును తిరుగుచుపలుక రించును మంచము పైన జేరి,జరుగు చుండు మూత్ర మల వి సర్జనములుతెలియ కుండగన్,కడుగంగ నలవి కాదుపక్ష వాతము దరిచేర, శిక్ష లొందుచుండు సమయమున సఖల సుఖములకు నె లవు స్మశానమె సుమ్మీ తలంచి నంత
నికటంబాయెను జీవితపు కడపటి మజిలి! వెడలెద పుట్టిన దెసకే!అకటా యేమిబతుకిదియొ!సకల సుఖములకు నెలవు శ్మశానమె సుమ్మీజిలేబి
అరకొర తెలివివలదు వినుమొర! సకల సుఖాలవాలము శ్మశానమె యందురు పండితోత్తముల్! కనుక రవంత విభుని తలంపు కావలె నరుడా!జిలేబి
సకృదనివర్తితైకపరిసజ్జితగమ్యము సర్వదుఃఖవారకము మహేశ్వరస్థిరవిరాజితమోక్షనిదానమై దగన్ప్రకృతివిభిన్నరూపముల ప్రాపకసర్వజనానివార్యమౌసకలసుఖాలవాలము శ్మశానమె యందురు పండితోత్తముల్కంజర్ల రామాచార్య.
చకితపు వింత పోకడలు సర్వములున్ లయమంది మానవప్రకట వికారసంజనిత వైర విదూర వినాశ యోచనల్వెకిలి తనంబులున్ సమయు భీకర రుద్ర నివాస యోగ్యమౌసకల సుఖాలవాలము శ్మశానమె యందురు పండితోత్తముల్
బెకబెకలాడుకప్పలును బేరములాడగ ఓటుకోసమైనకనకలాడినట్టి పలు నాయక మాన్యులు నాశతోడుతన్చకచక చేరగోరగను సంతల చేపలటంచు ఖేదమున్వికల మనస్కులయ్యు పరి వేష్టితులై ననిరిట్టులా వినన్సకల సుఖాలవాలము శ్మశానమె యందురు పండితోత్తముల్
ప్రకృతి పిలిచె రారమ్మనియికనెవడునిట నినుగోర డీశుడె తోడౌసకలుర నొక్కటి నిచ్చటసకల సుఖములకు నెలవు శ్మశానమె సుమ్మీ!!సకలురు నొకటౌ చోటుకుపకపక నవ్వుతు చలాకి పల్కుల నిడుతూయికపై నిదియే మజిలీసకల సుఖములకు నెలవు శ్మశానమె సుమ్మీ!!
ప్రకటితమోహలోభమనురాగసరాగవిరాగరాగమంచాకటబల్కెనొక్కడు,శ్మశానప్రసూతిపురాణమిద్దియే*“సకల సుఖాలవాలము శ్మశానమె; యందురు పండితోత్తముల్”*వికలమనస్కజన్యమునవీనవిరక్తివిముక్తితీర్థమే
సవరించిన పూరణలు 🙏🙏🙏వికలపు మానస దశనందకాల మరణమ్ముచేత నాత్మలరూపున్ వికటంబౌ భూతతతికిసకల సుఖములకు నెలవు శ్మశానమె సుమ్మీ నకనకలాడు నక్కలకు నంజుడు ముక్కల గూర్చు భూమి యామికచర కాకభీరువుల మేలగు వాసము గబ్బిలాలకున్ప్రకటపు నాలవాలము తిరంబుగప్రేతలు భూతకోటికిన్సకల సుఖాలవాలము శ్మశానమె యందురు పండితోత్తముల్ వికటపు కామక్రోధములు వీర విహారము సల్పుచుండగావికలపు మానసంబులను వెక్కసమందెడి మానవాళికిన్నికరపు శాంతినిచ్చుటకు నీలగళుండిల నిర్ణయించినన్సకల సుఖాలవాలము శ్మశానమె యందురు పండితోత్తముల్కాశీ మహాశ్మశానముఒకపరి మున్కవేసినను నొప్పుగగంగను దొల్గుపాపమేఒకదళ మర్పణమ్ముననె యొద్దిక గల్గును సర్వసంపదల్ఒకపరి రామనామమదె యూదును వీనుల విశ్వనాథుడేసకల సుఖాలవాలము శ్మశానమె యందురు పండితోత్తముల్
యిక నీతో సంసారమునికరమ్మిది చేయ జాల నిజమిది యనుచున్చకచక జని దూకె నదినిసకల సుఖములకు నెలవు శ్మశానమె సుమ్మీ
సుకరమె జీవన మిల స్వీయ కుక్షి నింపంగ బాధ లక్కట కనమే వికల ప్రాణావళి కిఁక సకల సుఖములకు నెలవు శ్మశానమె సుమ్మీ సుకమల దివ్య పీఠ మగు సుందర వాసము పద్మయోనికిన్ మకరనిహంతృ చక్రకర మాధవుఁ డుండు వటచ్ఛదస్థితిం బ్రకటిత సత్య మియ్యది ధరాతల మందుఁ ద్రిశూలపాణికిన్సకల సుఖాలవాలము శ్మశానమె యందురు పండితోత్తముల్
వికల మనస్కులు,రోగులుకకలావికలము నగుచును గన్పడుకంటెన్ నకలంకుహరునిచేరినసకలశుభములకు నెలవుస్మశానమె సుమ్మీ
సుకరముగా గడించగను సొమ్ములు మార్గము లెంచు చుండెడిన్మకిలపు మానసమ్మునను మానవు లెప్పుడు, తోషమిచ్చునేవికలముగాగ రుగ్మతల విగ్రహమీ భువి, శంభు వాసమున్సకల సుఖాలవాలము శ్మశానమె యందురు పండితోత్తముల్
వికలమనస్కులందఱును వెంపరులాడుచు బల్కునిట్లుగాసకలసుఖాలవాలము శ్మశానమం,డ్రుపండితోత్తముల్సకలము విష్ణుమాయనిలసంభవమౌననినీవెఱుంగుమాసకలసుఖంబులందగను శంభుని వేడుమయెల్లవేళలన్
సకలచరాచరంబులిల చావునుపుట్టుక చక్రమందునన్వికలమునొందుచున్దిరుగు వేసటచెందుచు విశ్రమింపకన్సుకరముకాదు జీవనము శుష్క సుఖంబుల వేట వ్యర్థమేసకల సుఖాలవాలము శ్మశానమె యందురు పండితోత్తముల్
శ్రీమాత్రేనమః/శ్రీగురుభ్యోనమఃఒకరని గాదు జూడగను నుర్విని చుట్టుచు మాయలాడియైచకచకమంచు లక్షలుగ జంపగ కోవిడు భేద మెంచకే!ఇక మనకేది దిక్కగును!యెంచగసర్వవిధాల నిక్క మాసకలసుఖాలవాలము స్మశానమె,యందురు పండితోత్తముల్మీ ఆచార్య లక్ష్మణ పెద్దింటి యానాం.
సకలము మాయని యెరుగకవికలంబగు మనము తోడ వేదన పడకన్నికటముగా నెల్లరకునుసకలసుఖములకునెలవుశ్మశానమె సుమ్మీ
రిప్లయితొలగించండి"శ్రీ రాముని దయ చేతను..."
సరదా పూరణ:
తికమక చెంది యాకలిని తిండియు త్రిప్పయు కానరాకయే
వికలపు మానసమ్ముగొని భీతిని జెందుచు నర్ధరాత్రినిన్
నికటమునందు గాంచగను నిక్కపు రీతిని నక్కబావకున్
సకల సుఖాలవాలము శ్మశానమె యందురు పండితోత్తముల్...
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఇది ఎంతమాత్రం సరదా పూరణ కాదు!
🙏
తొలగించండివికలమనస్కుండైన
రిప్లయితొలగించండిట్టికథా నాయకుడు దలచె డెందమునందున్
తకరారులన్ని తొలగును
సకల సుఖములకు నెలవు శ్మశానమె సుమ్మీ!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచంపకమాల (సరసీ)
రిప్లయితొలగించండిచంపకమాల
ఒకరిని పేదవారిగను నొక్కరి నాస్తిపరుండటంచు నిం
కొకరిని నగ్రవర్ణమని యొక్కరి వర్ణము నీచ మంచు నీ
మకిలి జగాన భేదముల మాటున మ్రగ్గక యందరొక్కటౌ
సకల సుఖాలవాలము శ్మశానమె యందురు పండితోత్తముల్
కందం
తొలగించండిప్రకటించి కలిమిలేములు
వికటించెడు వర్ణ భేద వేదన కన్నన్
సకలుర నొకటిగ జూడఁగ
సకల సుఖములకు నెలవు శ్మశానమె సుమ్మీ!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
తొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
హా! కేజరివాలా!
తికమక చెంది వైద్యులిక తీర్చను జాలక మేటి కోవిడున్
రకరకమైన పీనుగులు రాత్రిని ప్రొద్దుట హస్తినాపురిన్
ప్రకటితమైన వ్యాధిగొని వందలు రాగను, ప్రేతగోపుకున్
సకల సుఖాలవాలము శ్మశానమె యందురు పండితోత్తముల్...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండిప్రకటితశాంతికివనమది
రిప్లయితొలగించండివికలముగాకనుమనసునవేదనతీరన్
పకపకనవ్వగనాకము
సకలసుఖములకునెలవుశ్మశానమెసుమ్మీ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమకిలినియంటిజీవితపుమార్గముఁదోచకకుందగాధరన్
రిప్లయితొలగించండిపకపకనవ్వుచున్పిలచుపార్వతివల్లభుడాయెడన్తగన్
తికమకయేమిలేదుగనతీరునువేదనతండ్రికౌగిటన్
సకలసుఖాలవాలముశ్మశానమెయందురుపండితోత్తముల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"మకిలిని నంటి..." అనండి.
సరిదిద్దుకుంటాను
తొలగించండిఅకటా!కరోన ననుకొనె
రిప్లయితొలగించండిసకల సుఖములకు నెలవు శ్మశానమె సుమ్మీ
వికలము నుండదు నిచటని
చకచక మని పంపుచుండె శాంతియు కొరకున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"కరోన యనుకొనె" అనండి.
రిప్లయితొలగించండిబోనసు సరదా పూరణ:
అపరకర్మలు చేయు పురోహితులు 10, 11, 12, అంత్యక్రియలు జరుపుటకు మా ఎర్రగడ్డ శ్మశానవాటికలో ప్రత్యేక మండపమున్నది :)
నకనక లాడి బంధువులు నందము వీడుచు కర్మకాండకున్
వికలపు మానసమ్మునను విత్తము గూర్చగ నప్పుజేయుచున్
చకచక దుడ్డు లాగుటకు శాస్త్రుల వారికి యెర్రగడ్డనున్
సకల సుఖాలవాలము శ్మశానమె యందురు పండితోత్తముల్...
మీ బోనసు సరదా బాగున్నది. ఇది నిజంగానే సరదా పూరణ! అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండిసకలమెరింగినట్టి సఖి, సారము దెల్యగ పొందు యెట్టులే
రిప్లయితొలగించండిప్రకటితమయ్యె గాదె పలు భావనలన్నియు
దోషమెంచకన్
చకచక వ్రాయుపద్దెములు శంభుని కంఠము జేరిమెర్వగా
సకల సుఖాలవాలము శ్మశానమె యందురు పండితోత్తముల్!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"సార మెఱుంగగ పొందు నెట్టులే...దోషమెంచకే...జేరి వెల్గగా..." అనండి.
చకితులు కాబోరెవ్వరు
రిప్లయితొలగించండిప్రకటిత మగు కష్టము లవి భౌతిక మునకే
నికరపు టాత్మ ల కు నగును
సకల సుఖములకు నెలవు శ్మ శానమె సుమ్మీ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅకుతో భయుడౌ నట చల
రిప్లయితొలగించండిపకార ముండదట లేమి బాధయు మరియున్
వికరపు దుఃఖము లుండక
సకల సుఖములకు నెలవు శ్మశానమె సుమ్మీ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశకలము గాగ దేహము విశాల జగంబు న నెక్కడుండినన్
రిప్లయితొలగించండితికమక వీడి చేరెడు ప్రతీక, ప్రపుణ్య పరాత్ప రేశుడే
ప్రకటితుడై వెలింగెడు పురంబ గునంద్రు పరంబు జేర నా
సకల సుఖాలవాలము శ్మశానమె యందురు పండితోత్తముల్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండివికృతపు యోచనుండదట విత్తమె యక్కర లేని చోటు దో
రిప్లయితొలగించండిషికముల బాధ లేదచట జిహ్నపు పన్నగ ముండదందురో
యి, కలిమి లేమి మచ్చరము లేవియు లేని ప్రదేశమేకదా
సకల సుఖాలవాలము శ్మశానమె యందురు పండితోత్తముల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివికలపు మానస స్థితినం
రిప్లయితొలగించండిదకాల మరణమ్ముచేత నాత్మలరూపున్
వికటంబౌ భూతతతికి
సకల సుఖములకు నెలవు శ్మశానమె సుమ్మీ
నకనకలాడు నక్కలకు నంజుడు ముక్కల గూర్చు భూమి యా
మికచర కాకభీరువుల మేలగు వాసము గబ్బిలాలకున్
ప్రకటిత యాలవాలము తిరంబుగ
ప్రేతలు భూతకోటికిన్
సకల సుఖాలవాలము శ్మశానమె యందురు పండితోత్తముల్
వికటపు కామక్రోధముల వీర విహారము బారినంబడిన్
తొలగించండివికలపు మానసంబులను వెక్కస
మందెడి మానవాళికిన్
నికరపు శాంతినిచ్చుటకు నీలగళుండిల నిర్ణయించినన్
సకల సుఖాలవాలము శ్మశానమె యందురు పండితోత్తముల్
కాశీ మహాశ్మశానము
తొలగించండిఒకపరి మున్కవేసినను యొప్పుగ
గంగను దొల్గుపాపమే
ఒకదళ మర్పణమ్ముననె యొద్దిక గల్గును స్వర్గవాసమే
ఒకపరి రామనామమదె యూదగ వీనుల నీలకంఠుడే
సకల సుఖాలవాలము శ్మశానమె యందురు పండితోత్తముల్
మూడవ పాదమున విశ్వనాథుడే గా చదువ ప్రార్ధన! 🙏🙏🙏
తొలగించండిసవరించిన పూరణ
తొలగించండికాశీ మహాశ్మశానము
ఒకపరి మున్కవేసినను యొప్పుగ
గంగను దొల్గుపాపమే
ఒకదళ మర్పణమ్ముననె యొద్దిక గల్గును సర్వసంపదల్
ఒకపరి రామనామమదె యూదును వీనుల విశ్వనాథుడే
సకల సుఖాలవాలము శ్మశానమె యందురు పండితోత్తముల్
తొలగించు ఆప్షన్ రావడం లేదు! 😒😒
తొలగించండిమీ నాల్గు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి౧. 'మానస స్థితి' అన్నపుడు 'స' గురువై గణభంగం.
౨. ప్రకటిత+ఆలావాలము = ప్రకటితాలవాలము అవుతుంది. యడాగమం రాదు.
౩. బారినన్ + పడిన్... 'పడిన్' అన్న ప్రయోగం సాధువు కాదు.
౪. "మున్క వేసినను నొప్పుగ.." అనండి.
ధన్యవాదములు గురువర్యా! సవరణలు చేస్తాను! 🙏🙏🙏🙏
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిఒకవిధముండ దీ మనికి
నోపిక తోడుత నోపగావలెన్,
రకరకమైన బాధలను
రంజిలు సౌఖ్య విహార యానముల్
యికనట నుండ, వీ బ్రతుకు
నిట్టులె వీడ, ప్రశాంత క్రాంతమై
సకల సుఖాలవాలము శ్మ
శానమె యందురు పండితోత్తముల్!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'ఓపిక, ఓపగా..' పునరుక్తి. 'యానముల్+ఇక' అన్నపుడు యడాగమం రాదు.
సమస్య :
రిప్లయితొలగించండిసకలసుఖాలవాలము శ్మ
శానమె యందురు పండితోత్తముల్
(కామపిశాచియైన రాజుకు బుద్ధిరావటానికై అగ్నిగుండంలో దూకబోతున్న కన్యక తనవారితో )
వికలము గాని ధర్మమును
విశ్రుతరీతిన నిర్వహించిరే !
యికపయి నేను మీ మదుల
నింపుగ నుండెద శాశ్వతమ్ముగన్ !
మకరమువంటి రాట్కుమతి
మత్సరముష్కరు డంతమందులే !
సకలసుఖాలవాలము శ్మ
శానమె యందురు పండితోత్తముల్ .
( మహాకవి గురజాడవారి " కన్యక " కవిత
ఆధారంగా )
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఅకటా నూకలు ఖాళీ
రిప్లయితొలగించండిచకితులు కానేల మిత్తి సాజము కాదా !
నికనే దోసములంటవు
సకల సుఖములకు నెలవు శ్మశానమె సుమ్మీ!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"కాదా । యికనే..." అనండి.
🙏 ధన్యవాదాలు, గురువర్యా
తొలగించండిఈనాడు శంకరాభరణం వారిచ్చిన సమస్య
రిప్లయితొలగించండి*“సకల సుఖములకు నెలవు శ్మశానమె సుమ్మీ”*
(లేదా…)
*“సకల సుఖాలవాలము శ్మశానమె యందురు పండితోత్తముల్”*
నా పూరణ
కందము
వికలము గాదుగ హృదయము
సుకరము గాదీర్ఘనిద్ర జోగొట్టంగా
నికరమగు చింత లేమిని
సకల సుఖములకు నెలవు శ్మశానమె సుమ్మీ
చంపకమాల
వికలము గాదుగా మనము విన్నది గన్నది లేకపోవుటన్
రకరక మైన జబ్బులిడు రంపపు కోతలు నిష్క్రమించుటన్
సుకరపు దీర్ఘనిద్రతన సోలిన దేహము విశ్రమించుటన్
సకలసుఖాలవాలముశ్మశానమె యందురు పండితోత్తముల్
ఆదిభట్ల సత్యనారాయణ
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిఒకపరి యొలికెను జేరగ
రిప్లయితొలగించండినిక రమ్మని మనుజులేడ్వ నెంతకు రాడే
ప్రకటిత మదులకు జక్కగ
సకల సుఖములకు నెలవు శ్మశానమె సుమ్మీ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచం:
రిప్లయితొలగించండివికటపు చేష్టలన్, నిధులు వేగమె చేగొన, క్షుద్ర విద్యలన్
ప్రకటిత మొంద రాతిరిని పంతము బూనిన రీతి నొప్పగన్
వికలము నొందకుండగను వేల్పును గొల్చ నుపక్రమించగన్
సకల సుఖాలవాలము శ్మశానమె యందురు పండితోత్తముల్
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"...గొల్వ నుపక్రమించగన్" అనండి.
మారుస్తానండి, ధన్యవాదములు
తొలగించండివికటకవికిడెసమస్యను
రిప్లయితొలగించండి"సకల సుఖములకు నెలవు శ్మశానమె సుమ్మీ"
పకపక మని రాయలడగ
నకనక లాడుచు మొదలిడె, నటనగ సభనన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"సభనున్/సభలో" అనండి.
రకరకములైన కష్టము
రిప్లయితొలగించండిలొకటొకటిగ వచ్చుచుండ నోపికసడలెన్
యికనర్థమయ్యె నిప్పుడు
సకల సుఖములకు నెలవు శ్మశానమె సుమ్మీ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'సడలెన్+ఇక' అన్నపుడు యడాగమం రాదు. "... నోపిక చనగా । నిక నర్థమయ్యె..." అనండి.
🙏🏽
తొలగించండివికలమొనర్చు సమస్యలు
రిప్లయితొలగించండిసకలము మటుమాయమగును చనిపోవగనే
ప్రకటముగ దెలిపెదవినుడు
సకల సుఖములకు నెలవు శ్మశానమె సుమ్మీ
ఉప్పు నిడుచుండు సతతము ముప్పు యనుచు
రిప్లయితొలగించండిచప్పిడి కబళమునుపెట్డి చంపు చుండు,
కాల కూట కషాయముల్ గళము లోన
పోసి త్రాగమందురు షుగర్ పోవు నంచు,
యింట నున్న జనమునకు నంటు ననుచు
రోగ మొచ్చిన చేర్చు నారు బయట గది
లోన,యెలుకలు ,బొద్దింకలును తిరుగుచు
పలుక రించును మంచము పైన జేరి,
జరుగు చుండు మూత్ర మల వి
సర్జనములు
తెలియ కుండగన్,కడుగంగ నలవి కాదు
పక్ష వాతము దరిచేర, శిక్ష లొందు
చుండు సమయమున సఖల సుఖములకు నె
లవు స్మశానమె సుమ్మీ తలంచి నంత
రిప్లయితొలగించండినికటంబాయెను జీవిత
పు కడపటి మజిలి! వెడలెద పుట్టిన దెసకే!
అకటా యేమిబతుకిదియొ!
సకల సుఖములకు నెలవు శ్మశానమె సుమ్మీ
జిలేబి
రిప్లయితొలగించండిఅరకొర తెలివివలదు విను
మొర! సకల సుఖాలవాలము శ్మశానమె యం
దురు పండితోత్తముల్! కను
క రవంత విభుని తలంపు కావలె నరుడా!
జిలేబి
సకృదనివర్తితైకపరిసజ్జితగమ్యము సర్వదుఃఖవా
రిప్లయితొలగించండిరకము మహేశ్వరస్థిరవిరాజితమోక్షనిదానమై దగన్
ప్రకృతివిభిన్నరూపముల ప్రాపకసర్వజనానివార్యమౌ
సకలసుఖాలవాలము శ్మశానమె యందురు పండితోత్తముల్
కంజర్ల రామాచార్య.
చకితపు వింత పోకడలు సర్వములున్ లయమంది మానవ
రిప్లయితొలగించండిప్రకట వికారసంజనిత వైర విదూర వినాశ యోచనల్
వెకిలి తనంబులున్ సమయు భీకర రుద్ర నివాస యోగ్యమౌ
సకల సుఖాలవాలము శ్మశానమె యందురు పండితోత్తముల్
బెకబెకలాడుకప్పలును బేరములాడగ ఓటుకోసమై
రిప్లయితొలగించండినకనకలాడినట్టి పలు నాయక మాన్యులు నాశతోడుతన్
చకచక చేరగోరగను సంతల చేపలటంచు ఖేదమున్
వికల మనస్కులయ్యు పరి వేష్టితులై ననిరిట్టులా వినన్
సకల సుఖాలవాలము శ్మశానమె యందురు పండితోత్తముల్
ప్రకృతి పిలిచె రారమ్మని
రిప్లయితొలగించండియికనెవడునిట నినుగోర డీశుడె తోడౌ
సకలుర నొక్కటి నిచ్చట
సకల సుఖములకు నెలవు శ్మశానమె సుమ్మీ!!
సకలురు నొకటౌ చోటుకు
పకపక నవ్వుతు చలాకి పల్కుల నిడుతూ
యికపై నిదియే మజిలీ
సకల సుఖములకు నెలవు శ్మశానమె సుమ్మీ!!
ప్రకటితమోహలోభమనురాగసరాగవిరాగరాగమం
రిప్లయితొలగించండిచాకటబల్కెనొక్కడు,శ్మశానప్రసూతిపురాణమిద్దియే
*“సకల సుఖాలవాలము శ్మశానమె; యందురు పండితోత్తముల్”*
వికలమనస్కజన్యమునవీనవిరక్తివిముక్తితీర్థమే
సవరించిన పూరణలు 🙏🙏🙏
రిప్లయితొలగించండివికలపు మానస దశనం
దకాల మరణమ్ముచేత నాత్మలరూపున్
వికటంబౌ భూతతతికి
సకల సుఖములకు నెలవు శ్మశానమె సుమ్మీ
నకనకలాడు నక్కలకు నంజుడు ముక్కల గూర్చు భూమి యా
మికచర కాకభీరువుల మేలగు వాసము గబ్బిలాలకున్
ప్రకటపు నాలవాలము తిరంబుగ
ప్రేతలు భూతకోటికిన్
సకల సుఖాలవాలము శ్మశానమె యందురు పండితోత్తముల్
వికటపు కామక్రోధములు వీర విహారము సల్పుచుండగా
వికలపు మానసంబులను వెక్కస
మందెడి మానవాళికిన్
నికరపు శాంతినిచ్చుటకు నీలగళుండిల నిర్ణయించినన్
సకల సుఖాలవాలము శ్మశానమె యందురు పండితోత్తముల్
కాశీ మహాశ్మశానము
ఒకపరి మున్కవేసినను నొప్పుగ
గంగను దొల్గుపాపమే
ఒకదళ మర్పణమ్ముననె యొద్దిక గల్గును సర్వసంపదల్
ఒకపరి రామనామమదె యూదును వీనుల విశ్వనాథుడే
సకల సుఖాలవాలము శ్మశానమె యందురు పండితోత్తముల్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండియిక నీతో సంసారము
రిప్లయితొలగించండినికరమ్మిది చేయ జాల నిజమిది యనుచున్
చకచక జని దూకె నదిని
సకల సుఖములకు నెలవు శ్మశానమె సుమ్మీ
సుకరమె జీవన మిల స్వీ
రిప్లయితొలగించండియ కుక్షి నింపంగ బాధ లక్కట కనమే
వికల ప్రాణావళి కిఁక
సకల సుఖములకు నెలవు శ్మశానమె సుమ్మీ
సుకమల దివ్య పీఠ మగు సుందర వాసము పద్మయోనికిన్
మకరనిహంతృ చక్రకర మాధవుఁ డుండు వటచ్ఛదస్థితిం
బ్రకటిత సత్య మియ్యది ధరాతల మందుఁ ద్రిశూలపాణికిన్
సకల సుఖాలవాలము శ్మశానమె యందురు పండితోత్తముల్
వికల మనస్కులు,రోగులు
రిప్లయితొలగించండికకలావికలము నగుచును గన్పడుకంటెన్
నకలంకుహరునిచేరిన
సకలశుభములకు నెలవుస్మశానమె సుమ్మీ
సుకరముగా గడించగను సొమ్ములు మార్గము లెంచు చుండెడిన్
రిప్లయితొలగించండిమకిలపు మానసమ్మునను మానవు లెప్పుడు, తోషమిచ్చునే
వికలముగాగ రుగ్మతల విగ్రహమీ భువి, శంభు వాసమున్
సకల సుఖాలవాలము శ్మశానమె యందురు పండితోత్తముల్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివికలమనస్కులందఱును వెంపరులాడుచు బల్కునిట్లుగా
రిప్లయితొలగించండిసకలసుఖాలవాలము శ్మశానమం,డ్రుపండితోత్తముల్
సకలము విష్ణుమాయనిలసంభవమౌననినీవెఱుంగుమా
సకలసుఖంబులందగను శంభుని వేడుమయెల్లవేళలన్
సకలచరాచరంబులిల చావునుపుట్టుక చక్రమందునన్
రిప్లయితొలగించండివికలమునొందుచున్దిరుగు వేసటచెందుచు విశ్రమింపకన్
సుకరముకాదు జీవనము శుష్క సుఖంబుల వేట వ్యర్థమే
సకల సుఖాలవాలము శ్మశానమె యందురు పండితోత్తముల్
శ్రీమాత్రేనమః/శ్రీగురుభ్యోనమః
రిప్లయితొలగించండిఒకరని గాదు జూడగను నుర్విని చుట్టుచు మాయలాడియై
చకచకమంచు లక్షలుగ జంపగ కోవిడు భేద మెంచకే!
ఇక మనకేది దిక్కగును!యెంచగసర్వ
విధాల నిక్క మా
సకలసుఖాలవాలము స్మశానమె,
యందురు పండితోత్తముల్
మీ ఆచార్య లక్ష్మణ పెద్దింటి యానాం.
శ్రీమాత్రేనమః/శ్రీగురుభ్యోనమః
రిప్లయితొలగించండిఒకరని గాదు జూడగను నుర్విని చుట్టుచు మాయలాడియై
చకచకమంచు లక్షలుగ జంపగ కోవిడు భేద మెంచకే!
ఇక మనకేది దిక్కగును!యెంచగసర్వ
విధాల నిక్క మా
సకలసుఖాలవాలము స్మశానమె,
యందురు పండితోత్తముల్
మీ ఆచార్య లక్ష్మణ పెద్దింటి యానాం.
సకలము మాయని యెరుగక
రిప్లయితొలగించండివికలంబగు మనము తోడ వేదన పడకన్
నికటముగా నెల్లరకును
సకలసుఖములకునెలవుశ్మశానమె సుమ్మీ