18, డిసెంబర్ 2020, శుక్రవారం

సమస్య - 3578

19-12-2020 (శనివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“విపినమ్మున ధర్మరాజు పిజ్జాను దినెన్”

(లేదా…)

“విపినమ్మందున ధర్మరాజు దినియెన్ పిజ్జాను బర్గర్లతో”

73 కామెంట్‌లు:


 1. "శ్రీ రాముని దయ చేతను..."

  సరదా పూరణ:

  కపటమ్మయ్యెడి నాటకంపు ట్రయలున్ కంగారునన్ క్రుళ్ళుచున్
  తపమున్ జేయుచు జూబ్లి హిల్సు వనినిన్ తంటాలనున్ సైచుచున్
  కుపితుండౌచును నాకలిన్ వడివడిన్ కుర్మానుతా గానకన్
  విపినమ్మందున ధర్మరాజు దినియెన్ పిజ్జాను బర్గర్లతో...

  రిప్లయితొలగించండి
 2. తపసిగసాధనఁజేయగ
  విపరీతముగానిరీతివిందునుకనగా
  జపమునకనువగుభోజ్యము
  విపినమ్మునధర్మరాజుపిజ్జానుతినెన్

  రిప్లయితొలగించండి

 3. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  చపలమ్మయ్యెడి యక్షునిన్ పలుకులన్ జంబమ్మునన్ నవ్వుచున్
  విపులమ్మయ్యెడి యుత్తరమ్ములిడగన్ బీభత్సమౌ నాకలిన్
  జపమున్ జేయుచు నాఖరిన్ యుగమునన్ సయ్యాటమున్ పొందుచున్
  విపినమ్మందున ధర్మరాజు దినియెన్ పిజ్జాను బర్గర్లతో...

  రిప్లయితొలగించండి
 4. కుపితుండాయనకాదుగాకనగతాగూఢంపుటాలోచనన్
  తపమున్ఁజేయగసిద్ధమైతనకుయుద్ధంబున్జయంబీయగా
  విపరీతాక్రుతికూడదంచుతనుగావీరుండుగానుంటకై
  విపినమ్మందునధర్మరాజుఁదినియెన్పిజ్జానుబర్గర్లతో

  రిప్లయితొలగించండి
 5. క్రమాలంకార పూరణం

  తపియించె సీత యెక్కడ?
  నృపతిగ ధర్మాసనమున నెగ్గెనెవండో?
  చెపుమా పిల్లల చేష్టలు-
  విపినమ్మున-ధర్మరాజు-పిజ్జానుదినెన్

  రిప్లయితొలగించండి

 6. బోనసు సరదా పూరణ:

  ప్రాభాకర మహాభారతమున:

  శపథమ్మున్ గొని కృష్ణయే కినుకనున్ శాస్త్రీయమౌ తీరునన్
  తపమున్ జేయుచు రక్తమున్ తడుపగన్ ధారాళమౌ వేణినిన్
  విపులమ్మయ్యెడి స్వప్నమున్ గనియెనే వేసారగా నాకలిన్
  విపినమ్మందున ధర్మరాజు దినియెన్ పిజ్జాను బర్గర్లతో...

  రిప్లయితొలగించండి
 7. సుపరిచితులతోడ కలిసి
  యపర్ణ సుతుడేగెనంట యడవిని గల పా
  దపముల నరుక దలచి యా
  విపినమ్మున ధర్మరాజు పిజ్జాను దినెన్.

  రిప్లయితొలగించండి
 8. మ||
  అపహాస్యంబగు ద్వాపరంపు యుగమందాభారతంబుండకన్
  చపలంబైన కలిన్ గలుంగ భువిలో సంప్రాప్తమౌ వైపరీ
  త్యపథంబుల్ చరవాణులున్ కలుషముల్ దైన్యస్థితుల్ లోకమున్
  విపినమ్మందునధర్మరాజు దినెడిన్ పిజ్జాలు బర్గర్లతో

  ఆదిపూడి రోహిత్ శర్మ

  రిప్లయితొలగించండి
 9. సమస్య :
  విపినమ్మందున ధర్మరాజు దినియెన్
  పిజ్జాను బర్గర్లతో

  (ఎంతో కాలానికి మళ్లీ భార్య మీనాక్షితో భాగ్యనగరానికి వచ్చిన సుందరేశ్వరరావు ఆబగా తింటున్న బావమరది ధర్మరాజును చూపించి ఆశ్చర్యచపలాక్షితో అంటున్నాడు )

  మత్తేభవిక్రీడితము
  .........................

  విపులంబైనది హైద్రబాదు నగరం ;
  బెంతెంతగా మారెనో !
  అపుడిప్పట్టున వింతవింతలగు నీ
  యాహారముల్ లేవులే !
  చపలాక్షీ ! గను ; చిత్రనామకపు న
  క్షత్రంపు హోటేలులో
  " విపిన "మ్మందున ధర్మరాజు దినియెన్
  పిజ్జాను బర్గర్లతో .
  ( విపినం - స్టార్ హోటల్ కి పెట్టుకొన్న పేరు )

  రిప్లయితొలగించండి
 10. ధర్మరాజు, ఒక నటుడు, నాటక అంకము ఆధారంగా ఈ నా ప్రయత్నము :

  మ:

  విపరీతంబగు దీక్షతో జనులు సంవీక్షింప యంకమ్మునున్
  చపలం బెంచక సాగె, నంతరముగా సాపాటు కై కోరగా
  చెపితే తిండిగ తెచ్చినారనగ, కించిత్తైన తర్కించకన్
  విపినమ్మందున ధర్మరాజు దినియెన్ పిజ్జాను బర్గర్ల తో

  అంకము=నాటక భాగము

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "సంవీక్షింప నంకమ్మునున్.." అనండి. 'చెపితే' అన్నది వ్యావహారికం.

   తొలగించండి
  2. * సూచించిన మార్పులతో..

   ధర్మరాజు, ఒక నటుడు, నాటక అంకము ఆధారంగా ఈ నా ప్రయత్నము :

   మ:

   విపరీతంబగు దీక్షతో జనులు సంవీక్షింప నంకమ్మునున్
   చపలం బెంచక సాగె, నంతరముగా సాపాటు కై కోరగా
   చెపితిన్, తిండిగ తెచ్చినారనగ, కించిత్తైన తర్కించకన్
   విపినమ్మందున ధర్మరాజు దినియెన్ పిజ్జాను బర్గర్ల తో

   అంకము=నాటక భాగము

   వై. చంద్రశేఖర్

   తొలగించండి
 11. కృపమును బొందగ "కృష్ణుని
  కపటము" నాటకము నందు కంఠము పోగా
  తపమును జేయగవెళ్ళిన
  విపినమ్మున ధర్మరాజు పిజ్జాను దినెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వెళ్ళిన' అన్నది వ్యావహారికం. "వెడలిన" అనండి.

   తొలగించండి
 12. చపలత తో కల గంటిని
  విపరీతపు దృశ్య మొకటి వేడుక గూర్చెన్
  సుపరిచి తుండనియె నిటుల
  విపినమ్మున ధర్మ రాజు పిజ్జాను దినె న్

  రిప్లయితొలగించండి
 13. రిప్లయిలు
  1. కపిచేష్టాకృతచర్యలౌఁ గన నివే, కాంతారమందయ్యయో!
   విపరీతేచ్ఛలుఁ బుట్టె నేలమది? వైవిధ్యమ్ములై వింతలై,
   నృపుడై ద్వాపరమందు వెల్గి కలిలో నిర్లజ్జతో నెట్లుగా?
   విపినమ్మందున ధర్మరాజు దినియెన్ పిజ్జాను బర్గర్లతో?.

   కంజర్ల రామాచార్య.

   తొలగించండి
  2. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 14. అపరాధమ్మని చెప్పినన్ వినక వాడా మూర్ఖునిన్ గూడి పా
  దపముల్ ద్రుంచు నెపమ్ముతో వెడలె కాంతారమ్ముకుత్సాహియై
  యపరాహ్నమ్మది దాటుచుండెనని యాహారంబుగానంతటన్
  విపినమ్మందున ధర్మరాజు దినియెన్ పిజ్జాను బర్గర్లతో

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కాంతారమ్మున కుత్సాహియై' అనడం సాధువు.

   తొలగించండి
 15. మత్తేభవిక్రీడితము
  అపురూపంపు జవాబులన్ వినియు నా యక్షుండు మోదమ్మునన్
  గపటాతీతుడటంచుఁ దమ్ములను తా కాపాడు ఘట్టమ్ముతో
  నపుడా నాటికి దర్శకుండుఁ బలుకన్ ప్యాకప్పు సాయంత్రమై
  విపినమ్మందున ధర్మరాజు దినియెన్ పిజ్జాను బర్గర్లతో

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కందం
   ఉపయుక్కమ్ముగ యక్షుఁడు
   కృపఁ జూపిన సీను ముగిసి కేల్జూపుచు ప్యా
   కపుఁ జెప్ప దర్శకుండట
   విపినమ్మున ధర్మరాజు పిజ్జాను దినెన్

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'ఉపయుక్తమ్ముగ' టైపాటు.

   తొలగించండి
  3. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ :

   కందం
   ఉపయుక్తమ్ముగ యక్షుఁడు
   కృపఁ జూపిన సీను ముగిసి కేల్జూపుచు ప్యా
   కపుఁ జెప్ప దర్శకుండట
   విపినమ్మున ధర్మరాజు పిజ్జాను దినెన్

   తొలగించండి


 16. టపటప కందముల తినెను
  విపినమ్మున ధర్మరాజు, పిజ్జాను దినెన్,
  టుపుటుపు బండిని బెంగ్లూ
  రు పట్టణమెడలి జిలేబి రొప్పుచు సుమ్మీ !  జిలేబి

  రిప్లయితొలగించండి


 17. ధర్మరాజు అనేవాడి మేఘాలయా టూర్  అపురూపంబగు దృశ్యమయ్యె నయగారాలొల్కు మేఘాలయా!
  చపటమ్ముల్ చలి చేత కొంకరులు! విస్తారమ్ముగా వీక్షకుల్!
  విపులమ్మై చిర పుంజి నిర్ఝరమదే! విస్ఫారితంబయ్యెడా
  విపినమ్మందున ధర్మరాజు దినియెన్ పిజ్జాను బర్గర్లతో


  జిలేబి

  రిప్లయితొలగించండి
 18. అపరాలను వండితినెను
  విపినమ్మున ధర్మరాజు ; పిజ్జాను దినెన్
  విపరీతమైన చలిలో
  విపణికి జని తిమ్మరాజు వేడుక దీరన్

  రిప్లయితొలగించండి
 19. రిప్లయిలు
  1. విపినమ్మేడనొ!పిజ్జలేడనొ! యవేవీ? కాంచగన్ బర్గరుల్,
   శ్రవణీయమ్మదొ? ధర్మరాజు తినునే? చాలీ సమస్యార్థముల్
   సవరించం దగు దీనినిన్ వెస నమస్కారమ్మిదే శంకరా!
   విపినమ్మందున ధర్మరాజు దినియెన్ పిజ్జాను బర్గర్లతో.

   కంజర్ల రామాచార్య.

   తొలగించండి
  2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదాన్ని వాట్సప్ లో సవరించారు కదా!

   తొలగించండి
  3. అవునండీ మీ సూచనతో గణభంగమును సవరించితిని.

   తొలగించండి
 20. కం.
  తపమే రీతిగ సాగును
  ఉపుమా తినలేని మునులు ఓర్వగ లేరే
  అపహాస్యము చేయదగునె
  విపినమ్మున ధర్మరాజు పిజ్జా దినినన్


  జపమును కాసేపాపియు
  తపముగ వెదకిన జొమాటొ తప్పగ దొరకున్
  నెపమౌ యంతర్జాలము
  విపినమ్మున ధర్మరాజు పిజ్జాను దినన్

  (జొమాటొ= మధుర పదార్ధములను చేర్చు కంపెనీవారు)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'మునులు+ఓర్వగ' అన్నపుడు సంధి నిత్యం. విసంధిగా వ్రాయరాదు. "మౌను లోర్వగలేరే" అనండి.
   "నెపమౌ నంతర్జాలము.." అనండి.

   తొలగించండి
 21. కపిరా జెచ్చట గాంచె నామహిజనున్ గర్మిత్తునౌ లంకలో?
  కపట ద్యూతము నోడియే ప్రభువు తా గానన్ బ్రవేశించె? నీ
  యుపవాసంబుల నెద్దిచేకొనె మహాయోగ్యంబుగాజంట తాన్?
  విపినమ్మందున, ధర్మరాజు, దినియెన్ పిజ్జాను బర్గర్లతో.

  గర్మిత్తు-బంగారం

  రిప్లయితొలగించండి
 22. ధర్మరాజు అనే యువకుని పరిస్థితి

  తపియించెను తిండికొరకు
  విపినమ్మున ధర్మరాజు, పిజ్జాను దినెన్
  నెపమెంచక దొరికినపుడె
  అపరాధముగాదు సూవె యాకలిమహిమన్

  రిప్లయితొలగించండి
 23. కపటద్యూతమునందునోడిసతితోగష్టంబులన్బొందియున్
  దపమున్జేసెనుమిత్రునక్షయపుఁబాత్రన్గోరిభక్ష్యాన్నమున్
  *“విపినమ్మందున ధర్మరాజు దినియెన్; పిజ్జాను బర్గర్లతో”*
  జపిదుర్వాసునకాతిథేయమిడగాసామీరినేబంచెలే


  (దుర్వాసుని తినడానికి రమ్మని కృష్ణునానతి ధర్మరాజు భీముని పంపుతూ...)

  రిప్లయితొలగించండి
 24. విపినమున కరిగె నాతడు
  తపమునకై కాదు వేట తమకము తోడన్
  యుపహారము తెచ్చుకొనగ
  విపినమ్మున ధర్మరాజు పిజ్జాను తినెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'తోడన్+ఉపహారము' అన్నపుడు యడాగమం రాదు. "తమకముతో తా । నుపహారము..." అనండి.

   తొలగించండి
 25. అపుడే వేటకునేగిన
  నపురూపపు మనుజుడొకడు హర్షముతోడన్
  గపటపుబలుకుగ నిట్లనె
  విపినమ్మునధర్మరాజు పిజ్జానుదినెన్

  రిప్లయితొలగించండి
 26. తపమొనరించెడు గహనపు
  విపినంబున ఫాస్టుఫుడ్సు విపరీతంబే
  కపివర వివరింపుమెటుల
  విపినమ్మున ధర్మరాజు పిజ్జాను దినెన్?

  రిప్లయితొలగించండి
 27. కృపతోడ నిమ్మని యడిగి
  యపుడు సపరివార ముండి యక్షయ పాత్రన్
  విపులం గూర్చొని యింపుగ
  విపినమ్మున ధర్మరాజు బెన్రొట్టెఁ దినెన్

  [విపుల =నేల; పిజ్జా కి తెనుఁగునఁ బెన్రొట్టెగా నామకరణము]


  విపరీతమ్ముగఁ కాంక్ష వుట్టగను నిర్భీతుండు స్నానమ్ము సే
  సి పవిత్రంపు శరీరుఁడై ఘనుఁడు సచ్ఛీలుండు సంరంభియై
  కపి జంత్వాదులఁ గాంచ నెంచి చని యుత్కంఠార్తి రమ్యంపు టా
  విపినమ్మందున ధర్మరాజు దినియెం బెన్రొట్టెఁ దన్మాతనున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు బాగున్నవి కాని... సమస్యాపాదాన్ని (అందులోని పదాలను) మార్చకూడదని నియమం కదా?

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
   పాదము మధ్యలో వచ్చిన పిజ్జా యన్యదేశ్య పదము. నా పద్యముల వాడను గావున పిజ్జాకి బదులు పెన్రొట్టె యని యతి పదము మారకుండ వ్రాసితినండి. యతిపాదమునకు భంగము లేదు.
   పూర్వము మొదటను వచ్చిన యన్య దేశ్య పదములను సంధిగతముగ దేశ్య పదముల యర్థమునఁ బూరించుచుంటిని.
   ఇక్కడ యన్య దేశ్యము మధ్యలో నుండట వలన యది కుదర లేదు. కనుక అదే యర్థమున (యతి మారకుండ; పి-పె) తెనుఁగు మాట వాడితిని.

   తొలగించండి
  3. బర్గర్లతో : ఇదికూడ యన్యదేశ పదము. బర్గర్ పిజ్జా కి తల్లి లాంటిది. అందుకే తన్మాతనున్

   తొలగించండి
 28. విపినమ్మందునధర్మరాజుదినియెన్ పిజ్జానుబర్గర్లతో
  నపురూపమ్ముగబల్కగాదగునె,హర్షానీకున్యాయంబునే!
  విపినంబందుననుండునేకనగనీపిజ్జాలుచింతింపుమా
  యపహాస్యంబుగ నుండునీపలుకుమాయాజాలమౌనట్లుగా

  రిప్లయితొలగించండి
 29. విపినంబుల్ తపమాచరించుటలు లేవీ కాలమందీ భువిన్
  విపణిన్ భోజనశాలలందున గనన్ పిజ్జాలు బర్గర్లునున్
  విపరీతంబదిగాదుజూడ మరి యా వింతేమిటో మిత్రమా
  విపినమ్మందున ధర్మరాజు దినియెన్ పిజ్జాను బర్గర్లతో

  రిప్లయితొలగించండి