16, డిసెంబర్ 2020, బుధవారం

సమస్య - 3576

17-12-2020 (గురువారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“చుట్టము వచ్చెనని మిగుల శోకింపఁ దగున్”

(లేదా…)

చుట్టము వచ్చినాఁడనుచు శోకము వెట్టుట ధర్మ మిద్ధరన్”

http://kandishankaraiah.blogspot.com

88 కామెంట్‌లు:


 1. "శ్రీ రాముని దయ చేతను..."

  సరదా పూరణ:

  గుట్టుగ కూలిపోవగను క్రొత్తది జాబది సాఫ్టువేరునన్
  పొట్టను పూడ్చజాలకయె పొంగెడి దుఃఖము నోర్వలేక నే
  గట్టిగనీ కరోనయగు కాలము నందున నేడ్చుచుండగా
  చుట్టము వచ్చినాఁడనుచు శోకము వెట్టుట ధర్మ మిద్ధరన్...

  రిప్లయితొలగించండి


 2. కట్టిరి కొత్తిల్లరరే
  పెట్టిరి "స్వాగత్" అని భళి పేరు, జిలేబీ
  యెట్టెట్టా! వరుసగ మీ
  చుట్టము వచ్చెనని మిగుల శోకింపఁ దగున్?  జిలేబి

  రిప్లయితొలగించండి
 3. ఉత్పలమాల
  దట్టముగా ప్రపంచమున దాడినిఁ జేయఁగ వ్యాప్తిఁ జెందుచున్
  గట్టడి జేసినందరిని కాలును బైటకు పెట్టనీయదై
  పెట్టగ మూతికిన్ దొడుగు, భీకర కోవిడు బాధితుండనన్
  చుట్టము వచ్చినాఁడనుచు శోకము వెట్టుట ధర్మ మిద్ధరన్

   

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కందం
   చుట్టుచు లోకమునంతట
   గుట్టుగ ప్రాణాలుఁ దీయు కోవిడు వైరస్
   ముట్టిన వాడను శంకను
   చుట్టము వచ్చెనని మిగుల శోకింపఁ దగున్

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   "...గట్టడి జేసి యందరిని..."

   తొలగించండి
  3. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ :

   ఉత్పలమాల
   దట్టముగా ప్రపంచమున దాడినిఁ జేయఁగ వ్యాప్తిఁ జెందుచున్
   గట్టడి జేసి యందరిని కాలును బైటకు పెట్టనీయదై
   పెట్టగ మూతికిన్ దొడుగు, భీకర కోవిడు బాధితుండనన్
   చుట్టము వచ్చినాఁడనుచు శోకము వెట్టుట ధర్మ మిద్ధరన్

   తొలగించండి
 4. పట్టునురోగముమనకని
  అట్టిట్టగుజీవితంబునాచుట్టముచే
  గుట్టిదితెలియుమునరుడా
  చుట్టమువచ్చెననిమిగులశోకింపఁదగున్

  రిప్లయితొలగించండి
 5. పెట్టిన బాధల నెంతో
  గుట్టుగ భరియించుచుండ గుర్రుగ జూడన్
  మెట్టిన చోటన నాడది
  చుట్టము వచ్చెనని మిగుల శోకింపఁ దగున్!!


  రిప్లయితొలగించండి

 6. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  గట్టి తెరాస రాజ్యమిట గండర గండ్లది రాకపూర్వమే
  చట్టము కాంగ్రెసయ్యలది జారుచు పోయెడి ముందురోజులన్
  తొట్టిని నీరులేక కడు దుఃఖము నొందగ హైద్రబాదునన్
  చుట్టము వచ్చినాఁడనుచు శోకము వెట్టుట ధర్మ మిద్ధరన్...

  రిప్లయితొలగించండి
 7. చుట్టము జూపుగ వచ్చెను
  నిట్ట నిలువు నింటనుండె నిండుగ శకమున్
  తట్టుకొన శక్తి లేదయె
  చుట్టము వచ్చెనని మిగుల శోకింపఁ దగున్

  రిప్లయితొలగించండి
 8. ఎట్టులఁజూచినన్మిగులనెవ్వగకల్గునుబంధువోచ్చినన్
  పట్టెడుపప్పునన్నమునువడ్డనఁజేయుటభారమేగదా
  ముట్టెనునింగినేధరలుమూసెనునోటినిరోగమేవెసన్
  చుట్టమువచ్చినాడనుచుశోకమువెట్టుటధర్మమిద్ధరన్

  రిప్లయితొలగించండి

 9. బోనసు సరదా పూరణ:

  గుట్టుగ నేడ్చుచుండగను క్రుద్ధుడు నౌచును ఖర్గపూరునన్
  దట్టపురీతి దుఃఖమును తాళను జాలక బ్రహ్మచారి తా
  గట్టిగ కౌగిలించగను కమ్మని భార్యను శోభనంబునన్
  చుట్టము వచ్చినాఁడనుచు శోకము వెట్టుట ధర్మ మిద్ధరన్...

  రిప్లయితొలగించండి
 10. అందరికీ నమస్సులు🙏
  ఉ.మా

  గట్టిగ దుడ్డు పోగిడగ గౌరవ మొందెను సంఘమందునన్
  గుట్టుగ లంచముల్ మరిగి గోతము నింపగ గూడపెట్టగన్
  పట్టెను జుట్టముల్ చితక బాదుచు సంపద సీజు చేయగన్
  *“చుట్టము వచ్చినాఁడనుచు శోకము వెట్టుట ధర్మ మిద్ధరన్”*

  *వాణిశ్రీ నైనాల, విజయవాడ*

  రిప్లయితొలగించండి
 11. కొట్టమున వసిం చెడు బరి
  కట్టెఁ బలకరింప చాల కాలము పిదపన్
  బట్టణమునుండి దగ్గరి
  చుట్టము వచ్చెనని మిగుల శోకింపఁ దగున్

  రిప్లయితొలగించండి
 12. కుట్టగ కరోన పురుగదె
  గిట్టదుగా యిరుగుపొరుగు గేహమె
  ప్రియమై
  పట్టవు యాతిథ్యవిధులు
  చుట్టము వచ్చెనని మిగుల శోకింప దగున్

  కృష్ణ రాయబారమునకు ముందు దుర్యోధనుని అంతరంగము

  గుట్టుగ రాజ్యభాగమును గూర్చగ పాండవ పక్షపాతియై
  దిట్టతనంబునన్ మనకు దీరుగ నీతుల జెప్పవచ్చెడిన్
  జెట్టిని వాసుదేవుడను జిత్తుల
  మారిని జూచినంతనే
  చుట్టము వచ్చినాడనుచు శోకము బెట్టుట ధర్మమిద్ధరన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   "పట్టపు టాతిథ్యవిధులు..."

   తొలగించండి
  2. ధన్యవాదములు గురుదేవా! సవరించెదను! 🙏🙏🙏

   తొలగించండి
  3. సవరించిన పూరణ

   కుట్టగ కరోన పురుగదె
   గిట్టక దామిరుగు పొరుగు గేహమె
   ప్రియమై
   గుట్టుగ జీవించు నెడను
   చుట్టము వచ్చెనని మిగుల శోకింప దగున్

   తొలగించండి
 13. కట్టిన యిల్లు లేక బరికట్టె నివాసము నుండె చిన్నదౌ
  కొట్టము నందు, తిన కూడును లేక తదీపు వేళలో
  పట్టణమందు నుండి పరివారము గైకొని యాకలంచునో
  చుట్టము వచ్చినాఁడనుచు శోకము వెట్టుట ధర్మ మిద్ధరన్

  రిప్లయితొలగించండి
 14. పుట్టింటి వారు వచ్చిన
  పెట్టుచు వంటకములెన్నొ ప్రేమగ సతియున్
  మెట్టింటి మామ వచ్చిన
  చుట్టము వచ్చెనని మిగుల శోకింపఁ దగున్?

  రిప్లయితొలగించండి
 15. తట్టనె లేదు సుమీ మన
  కిట్టాగవుతుందని పలుకే కరువౌనా
  ఎట్టా జూసిన కొరొనా
  చుట్టము వచ్చెనని మిగుల శోకింపఁ దగున్

  రిప్లయితొలగించండి
 16. బెట్టుగ కరోన బెరయగ
  కట్టడి కొనసా గు చున్న కాలము నందున్
  యెట్టుల నానం దించెద
  చుట్టము వచ్చెనని మిగుల శోకింపఁ దగున్

  రిప్లయితొలగించండి
 17. సమస్య :
  చుట్టము వచ్చినాడనుచు
  శోకము వెట్టుట ధర్మ మిద్ధరన్

  ( శిష్టుడైన తండ్రి కొడుకుతో ...)

  నెట్టికసీల నీ జనని ;
  నిండగు నైతికవర్తనుండ నే ;
  బెట్టినపేరురా మనదు
  బేరిమి వంశము ; నీచు డీతనిన్
  బుట్టినయింటివారె పరి
  పూర్ణముగా ద్యజియించి ; రిట్టి యీ
  చుట్టము వచ్చినాడనుచు
  శోకము వెట్టుట ధర్మ మిద్ధరన్ .
  (నెట్టికసీల - సదాచారసంపన్న ; పేరిమి వంశము -గౌరవనీయవంశము )

  రిప్లయితొలగించండి
 18. ఎన్నికల ముందు అభ్యర్థుల ఎంపిక ఆధారంగా ఈ నా ప్రయత్నము:

  ఉ:

  చట్టము ముందు నిల్చునని చక్కగ నెంపిక జేయ వారసున్
  గట్టిగ పట్టు బట్టి మరి గద్దియ నెక్కుట నిశ్చయంబనన్
  గిట్టని వారు వేళ యని గేలిని సేయుచు వంకలెంచగన్
  చుట్టము వచ్చినాడనుచు శోకము పెట్టుట ధర్మ మిద్ధరన్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి


 19. కటక పురమున గృహంబె
  న్నుట, చుట్టము వచ్చినాఁడనుచు శోకము వె
  ట్టుట, ధర్మ మిద్ధరన్, కట
  కట తప్పదు రాజధాని కనుక జిలేబీ !


  జిలేబి

  రిప్లయితొలగించండి
 20. పట్ట కరోన భూతమయి బంధులుమిత్రులు దూరమైరి చే
  పట్ట ప్రభుత్వమే ప్రజల ప్రాణములన్ పరిరక్షణమ్మునన్
  గట్టి ప్రయత్నముల్ తరుమగా కడు కర్కశమైన రోగమున్
  చుట్టము వచ్చినాడనుచు శోకము వెట్టుట ధర్మ మిద్ధరన్

  రిప్లయితొలగించండి
 21. తిట్టిన తిట్టు తిట్టకనె తిట్టె గతమ్మున నిప్పుడేలనో!
  చుట్టపుఁ జూపుగా గృహముఁ జొచ్చటకెయ్యది హేతువుండునో!
  పెట్టునొ చిచ్చు! చాడులు వచించునొ! నమ్మగ రాని యట్టి యా
  చుట్టము వచ్చినాఁడనుచు శోకము వెట్టుట ధర్మ మిద్ధరన్

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
 22. మట్టిని నమ్ముచు బ్రతికు చు
  నెట్టెట్టో జీవనము ల నీడ్చు చు నుండన్
  గుట్టును రట్టొ న రింపగ
  చుట్టము వచ్చె నని మిగుల శోకింప దగున్

  రిప్లయితొలగించండి
 23. సమస్య :-
  “చుట్టము వచ్చెనని మిగుల శోకింపఁ దగున్”

  *కందం**

  ముట్టుకొనగ యొకరి నొకరు
  గట్టి నిబంధనలు గలవు కరొనా వేళన్
  ఇట్టి సమయమున కరొనా
  చుట్టము వచ్చెనని మిగుల శోకింపఁ దగున్
  ....................✍️చక్రి

  రిప్లయితొలగించండి
 24. అట్టిట్టిది కాదు మహిజ
  మట్టి గరచు రావణుడిక మనడని మనమున్
  దట్టగ మండోదరి తా
  చుట్టము వచ్చెనని మిగుల శోకింపఁ దగున్.

  రిప్లయితొలగించండి
 25. దట్టపుజీకటిన్ ముసురు దాడియొనర్చగజొప్పగప్పునన్
  బట్టియెయేడ్వశీతలపువాయువురివ్వునవీయపొట్టిదౌ
  గట్టెలగూడుచాలదనిగందరగోళమునందుదూరపున్
  *“జుట్టము వచ్చినాఁడనుచు శోకము వెట్టుట ధర్మ మిద్ధరన్”*

  రిప్లయితొలగించండి
 26. సమస్య :-
  “చుట్టము వచ్చెనని మిగుల శోకింపఁ దగున్”

  *కందం**

  మట్టి పొలము నిచ్చె రయితు
  కట్టగ నమరావతి నిల కాలము మారెన్
  గట్టిగ పోరు సమయమున
  చుట్టము వచ్చెనని మిగుల శోకింప దగున్
  ....................✍️చక్రి

  రిప్లయితొలగించండి
 27. ఈనాటి శంకరాభరణం వారిచ్చిన సమస్య

  *“చుట్టము వచ్చెనని మిగుల శోకింపఁ దగున్”*
  (లేదా…)
  *“చుట్టము వచ్చినాఁడనుచు శోకము వెట్టుట ధర్మ మిద్ధరన్”*

  నా పూరణ

  ఉత్పలమాల

  కట్టడి చేసెనే కరొన కాలమునందున రాకపోకలన్
  వట్టిగ కూరుచుంటినని వారణ తీవ్రపు కారణంబులన్
  కట్టిన నాదు నాథుడిక కాలము జెల్లుటఁ చూసిపోవగా
  చుట్టము వచ్చినాడనుచు శోకము వెట్టుట ధర్మమిధ్ధరిన్

  ఆదిభట్ల సత్యనారాయణ

  రిప్లయితొలగించండి

 28. మైలవరపు వారి పూరణ

  చుట్టముతో భుజించుటన సొంపగు., గేస్తునకున్ సుధర్మమౌ!
  చుట్టము వచ్చు వచ్చునని చూచి, నిరీక్షణ జేసి తింటి.,ని....
  ప్పట్టున నీవు వచ్చితెడబాసితి ధర్మమటంచు గుందుచున్
  చుట్టము వచ్చినాఁడనుచు శోకము వెట్టుట ధర్మ మిద్ధరన్!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 29. ఆడవారి కష్టాలు 😢😢

  కిట్టని కుంపటి పైనను
  నిట్టూర్చుచు వంటవండి నీరసపడగా
  తిట్టుచు నిండిన గ్యాసును
  చుట్టము వచ్చెనని మిగుల శోకింపదగున్

  రిప్లయితొలగించండి
 30. తట్టపురోజులు వచ్చిన
  వెట్టి పరిస్థితులయందునేమరియుండన్
  బిట్టుగ కరోన సోకును
  చుట్టము వచ్చెనని మిగుల శోకింపఁ దగున్

  రిప్లయితొలగించండి
 31. ముట్టక నింతయు నామెను
  గిట్ట సవతి మాయదారి కీటక మామెం
  బట్టగను బలుకరించఁగఁ
  జుట్టము వచ్చెనని మిగుల శోకింపఁ దగున్

  [ముట్టకను = ముట్టకుండకయే]


  వట్టిగఁ జుట్టపక్కములు వత్తురు సూడఁగ విత్త మున్నచోఁ
  బట్టిన పట్టు వీడకయె పంతము పట్టి కరమ్ము నింటిదౌ
  గుట్టును రట్టు చేయుచును ఘోరతరమ్ముగ దుఃఖ మీయఁగాఁ
  జుట్టము వచ్చినాఁడనుచు శోకము వెట్టుట ధర్మ మిద్ధరన్

  [జుట్టము వచ్చినాఁ డనుచు: వచ్చిన వాఁడు చుట్ట మనుచు]

  రిప్లయితొలగించండి
 32. ఇట్టాంటూసులు బాగని
  తట్టగ మురియు సతిపతులు తమకంబొప్పన్
  గట్టిగ కౌగిలి నుండిన
  చుట్టము వచ్చెనని మిగుల శోకింపఁ దగున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ఇట్టాంటి' గ్రామ్యపదం.

   తొలగించండి
  2. 🙏 ధన్యవాదాలు
   సవరించి:

   ఇట్టెడు నల్పము బ్రతుకని
   తట్టగ మురియు సతిపతులు పరిరంభమునన్
   గట్టిగ పూనిన వేళల
   చుట్టము వచ్చెనని మిగుల శోకింపఁ దగున్

   తొలగించండి
 33. ఎట్టి పరిస్థితుల్ భువినియేర్పడెనిప్పుడు జూడ నెల్లెడన్
  దట్టపు మబ్బుతొట్టువలు దాపగునట్లుకరోన లోకమున్
  జుట్టగచుట్టివేసినది జూడగలేమిక చుట్టపక్కముల్
  చుట్టము వచ్చినాఁడనుచు శోకము వెట్టుట ధర్మ మిద్ధరన్”

  రిప్లయితొలగించండి
 34. చుట్టము వచ్చిన ముదమన
  బట్టిరి గత కాలమందు బరగ న్నేడో
  పట్టెడు వెట్టగ బరువై
  చుట్టము వచ్చెనని మిగుల శోకింపఁ దగున్!
  రిప్లయితొలగించండి
 35. పుట్టెడుసంతసమాయెను
  చుట్టమువచ్చెనని,మిగులశోకింపదగున్
  పుట్టిన యింటనుదుఃఖము
  కట్టడిలేనంతరాగ కరోననచటన్

  రిప్లయితొలగించండి
 36. కురుక్షేత్రయుద్ధమున అర్జునునితో శ్రీకృష్ణ పరమాత్మ వ్యంగోక్తులు...

  ఉత్పలమాల
  పుట్టెడు దుఃఖమున్ బొలతి పొందఁగ జేసిన వారె వీరలున్
  జెట్టులుఁ బుట్టలున్ దిరుగఁ జీకటి చాటున మ్రగ్గఁ జేయ మీ
  పట్టిన సంధికిన్ వినక భండన మెంచిన వెన్నుజూపుచున్
  జుట్టము వచ్చినాఁడనుచు శోకము వెట్టుట ధర్మ మిద్ధరన్!


  రిప్లయితొలగించండి
 37. పట్టుమని తల్లిదండ్రులఁ
  గట్టిగ నింటికి పిలువని కాలమునందున్
  బెట్టుగ తమ్ముడు రాగా
  చుట్టము వచ్చెనని మిగుల శోకింపఁ దగున్.

  రిప్లయితొలగించండి
 38. ఎట్టుగజూచినన్వినుడియిట్టులుసేయుటమంచిగాదయా
  చుట్టమువచ్చినాడనుచుశోకమువెట్టుట,ధర్మమిద్ధరన్
  మట్టినీనమ్ముకొన్ననరమానవుబాగును జూడగోరుటే
  యట్టులెపేదవారికిలనాశ్రయమీయగబూనుకోవలెన్

  రిప్లయితొలగించండి