31, డిసెంబర్ 2020, గురువారం

సమస్య - 3591

1-1-2021 (శుక్రవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“నూతన సంవత్సరమున నూటికి నూఱే”

(లేదా…)

“నూతన వత్సరమ్మునను నూటికి నూఱె యటంచు నవ్వెదన్”

59 కామెంట్‌లు:


 1. "శ్రీ రాముని దయ చేతను..."

  సరదా పూరణ:

  ప్రీతిని కందివారివిట పెక్కులు చూచుచు కైపదమ్ములన్
  చేతులు నొవ్వకుండగను చెన్నుగ వేగపు రీతి రోజునన్
  కోతలు కోసి పూరణలు గొప్పగ జేయగ నాకు మార్కులే
  నూతన వత్సరమ్మునను నూటికి నూఱె యటంచు నవ్వెదన్...

  రిప్లయితొలగించండి
 2. 31.12.2020
  *అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో*

  నా పూరణ ప్రయత్నం..🙏💐

  *కం||*

  రోతగ నుండిన గతమిక
  నీ తరమునకంతమనుచు నివ్విధముగనే
  చూతము మంచిని నిక్కము
  *“నూతన సంవత్సరమున నూటికి నూఱే”*

  *కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
  🙏🌹🙏

  రిప్లయితొలగించండి

 3. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  చేతులు రెండిటిన్ కడిగి చెన్నుగ నీటిని సోపులేకయే
  మూతుల గంతలన్ విడుచు ముక్కుల నిండుగ గాలి పీల్చుచున్
  భీతిని వీడుచున్ కలియ పేరిమి మీరగ పేరిశాస్త్రులన్
  నూతన వత్సరమ్మునను నూటికి నూఱె యటంచు నవ్వెదన్..

  రిప్లయితొలగించండి
 4. చేతలమాటలపోందిక
  నీతరపుయువతమనసులనింపగచూడన్
  ప్రీతిగప్రార్ధనచేయగ
  నూతనసంవత్సరముననూటికినూఱే

  రిప్లయితొలగించండి
 5. శ్రీమాత్రేనమః/శ్రీగురుభ్యోనమః

  (ఈ క్రొత్త ఆంగ్ల వత్సరమా!)

  మా తలరాతలు మార్చుచు

  మూతులు ముక్కలను మూయు ముష్టిబతుకుకున్

  పాతర వేసిన చాలీ

  నూతన సంవత్సరమున,నూటికి నూఱే.
  మీ ఆచార్య లక్ష్మణ పెద్దింటి

  రిప్లయితొలగించండి
 6. కందం
  యాతనఁ గరోన బెట్టగ
  జాతికి శార్వరి తమమ్ము జలిపింపఁగఁ ప్రా
  భాతమొసంగెడు నాశలు
  నూతన సంవత్సరమున నూటికి నూఱే!

  ఉత్పలమాల
  యాతనఁ బెట్టు కోవిడు ప్రయాణము సాగఁగ రెచ్చి శార్వరిన్,
  యూతము నీయఁ గోవిదులు నుత్తమనౌషధమున్ గనుంగొనన్
  జాతికి మంచిఁ జేసెడు దినమ్ములు వచ్చెడునాశలన్నియున్
  నూతన వత్సరమ్మునను నూటికి నూఱె యటంచు నవ్వెదన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుదేవులకు మరియు కవిమిత్రులందరకూ నూతన ఆంగ్లవత్సర శుభాకాంక్షలు

   తొలగించండి
 7. నూతనసంవత్సరశుభాకాంక్షలతో
  తాతలుతండ్రులందరునుతాల్మినిజీవనయానమంతటన్
  ప్రీతిగపిల్లపాపలనుప్రేమగఁజూచుచుమార్గదర్శులై
  ఈతరమంతకున్సుఖమునీయగకాలమునాసఁజేయగా
  వూతనవత్సరమ్ముననునూటికినూఱెయటంచునవ్వెదన్

  రిప్లయితొలగించండి
 8. యాతనఁ గల్గజేయ గతయబ్దము మానవులన్ కరోనచే
  భీతిని పొందుచున్ ప్రజలు వీడగ నుండ్రి గృహమ్ములందునన్
  రాతలు మారు తప్పక, కిరాతక మైన కరోన నాశ మీ
  నూతన వత్సరమ్మునను నూటికి నూఱె యటంచు నవ్వెదన్

  రిప్లయితొలగించండి
 9. వ్రాతల మార్చు నను కొనగ
  భూతము గ కరో న వచ్చి ముంచెను జగతిన్
  చేతల పై యాశ పడుట
  నూతన సంవత్సర మున నూటికి నూఱె

  రిప్లయితొలగించండి

 10. బోనసు సరదా పూరణ:

  వ్రాతల నావి చూడగను భళ్ళున నవ్వుచు రోజురోజునన్
  ప్రీతిని గౌరవించి కడు ప్రేమను జూపగ, భక్తితోడుతన్
  చేతుల నెత్తి ప్రార్థనను చేయగ నేనిట రాణి వారికిన్
  నూతన వత్సరమ్మునను నూటికి నూఱె యటంచు నవ్వెదన్...

  రిప్లయితొలగించండి
 11. పాతవి రోగ కీటకము బాధలకన్నను పెద్దగన్ కరో

  నా తమకమ్ము చుట్టగనునందరు భీతిలినిండ్లనుండగా

  వాహ్ , తగు మందు వచ్చెనను వార్తల ధైర్యము గుండె నింపగా

  నూతన వత్సరమ్మునను నూటికి నూఱె యటంచు నవ్వెదన్”

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి


 12. కోతలు కోయకు బిడ్డా
  నూతన సంవత్సరమున నూటికి నూఱే
  నా తెలుగు పరీక్షన యని
  చైతన్యము పొందవలెను చదువను చదువన్


  జిలేబి

  జి

  రిప్లయితొలగించండి


 13. వయసాయె నైన నేమి వి
  నయ! నూతన వత్సరమ్మునను నూటికి నూ
  ఱె యటంచు నవ్వెదన్ స్వా
  మి యాన యతనమ్ము గూడి మించారగనన్


  జిలేబి

  రిప్లయితొలగించండి
 14. మా తలరాత మూతులకు మావుల పెయ్యల మూత లయ్యె భూ
  మాతకు యాతయామమయె మాస్కులు స్వాస్థ్యము శాని టైజరుల్
  చేతన మందు భీతియు దృశించు ప్రజాళి స్పృశించ త్రాణకున్
  *“నూతన వత్సరమ్మునను నూటికి నూఱె యటంచు నవ్వెదన్”*

  రిప్లయితొలగించండి
 15. తాతల కాలము నుండియు
  జూతుముగద రూప్యమునకు చొప్పడు నెపుడున్
  సీతా! పైసలు మారవు
  నూతన సంవత్సరమున నూటికినూరే

  చేతనగల్గు జీవులకు చింతలు వంతలు భోగభాగ్యముల్
  శీతము వాతతాపములు క్షేమము కీడును లాభనష్టముల్
  ఆతత కాలచక్రమున నంచెలవారిగ
  సంభవించునన్
  నూతన వత్సరమ్మునను నూటికినూరె
  యటంచు నవ్వెదన్

  రిప్లయితొలగించండి
 16. క్రొవ్విడి వెంకట రాజారావు:

  భీతిని గొల్పుచు జనతను
  యాతన బెట్టిన కరోన నణచెడి టీకా
  తోతెంచెడి దినములుగల
  నూతన సంవత్సరమున నూటికి నూఱే!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురువుగారికి మరియు గ్రూపులోని కవిమిత్రులందరికీ పేరుపేరునా వారికీ వారి కుటుంబ సభ్యులకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు.

   తొలగించండి
 17. భీతిల కోయి వసుంధర
  కేతెంచుచునుండెనిప్పు డిరువది యొకటై
  పాత కరోన మ్రగ్గును
  నూతన సంవత్సరమున నూటికి నూఱే

  రిప్లయితొలగించండి
 18. ప్రీతిగ స్వాగతించినను పేరిమి వీడుచు వెంటతెచ్చెనే
  నూతన రోగమొక్కటి వినోదము లేవలదందు వేలరా?
  కోతలు మానుమంటినిక కోవిడు నాశనమౌను తప్పకన్
  నూతన వత్సరమ్మునను నూటికి నూఱె యటంచు నవ్వెదన్

  రిప్లయితొలగించండి
 19. సమస్య :
  నూతనవత్సరమ్మునను
  నూటికి నూరె యటంచు నవ్వెదన్

  (పౌరుని మనోగతం )

  ఆతతమైన బాసలవి
  యంతము లేకయె చేయుచుండుటల్ ;
  శ్రోతకు గర్ణపుష్పముల
  సొంపులు గుల్క నమర్చుచుండుటల్ ;
  నేతల బండనాలుకల
  నీచపు దిట్టుల దండకంబులున్;
  నూతనవత్సరమ్మునను
  నూటికి నూరె యటంచు నవ్వెదన్ .

  రిప్లయితొలగించండి
 20. చేతన నింపిన - జీవన
  భాతియు గలుగును, సరగున వాంఛిత మమరున్,
  చేతన్ నిల్చును, విజయము
  నూతన సంవత్సరమున నూటికి నూఱే!

  రిప్లయితొలగించండి
 21. నేత యనంగ నీతఁడని నిక్కముగా కడగండ్లఁ దేర్చునం
  చాతత వాంఛలం గొని నయంబుగ నమ్ముచు వేతనమ్ములన్
  బ్రీతిగఁ బెంచుమంచుఁ గడు వేడఁగ నిప్పుడె యప్పుడే యనున్
  నూతనవత్సరమ్మునను నూటికి నూరె యటంచు నవ్వెదన్.

  రిప్లయితొలగించండి
 22. చేతలు సరియగు వైనను
  మూతుల మూతలు కరముల పూతలు చాలున్
  భీతిల నేటికి మనకిక
  నూతన సంవత్సరమున నూటికి నూఱే

  రిప్లయితొలగించండి
 23. అందరికీ నమస్సులు🙏

  రోతగు క్లబ్బులన్ దిరిగి రోడ్డుకు నడ్డుపడంగ తూగుచున్
  వ్రాతలు మార్చగన్ భటుల రచ్చకు తప్పక గాలినూదగన్
  యాతన జెప్పజాలనిక నాయువు నిల్పగ ఫైను కట్టితిన్
  *“నూతన వత్సరమ్మునను నూటికి నూఱె యటంచు నవ్వెదన్”*

  *వాణిశ్రీ నైనాల, విజయవాడ*

  రిప్లయితొలగించండి
 24. ఈనాటి శంకరాభరణం వారిచ్చిన

  సమస్య

  *“నూతన సంవత్సరమున నూటికి నూఱే”*
  (లేదా…)
  *“నూతన వత్సరమ్మునను నూటికి నూఱె యటంచు నవ్వెదన్”*

  కందము

  గతమున వేతన మందక
  బతుకుల భారముగ గడుపు బడుగుల్లారా
  వెతలను విడువుడు మీరిక
  నూతన సంవత్సరమున నూటికి నూఱే

  ఉత్పలమాల

  మూతికి గుడ్డఁగట్టితిమి ముందుకు పోవగ మానుకొంటిమే
  చేతుల శానిటైజరును జేబునఁ బెట్టుకు పోవుచుంటిమే
  తాతల నాడులేని కడు దైన్యపు రోగము కష్టఁ బెట్టగా
  నూతన వత్సరమ్మునను నూటికి నూఱె యటంచు నవ్వెదన్

  ఆదిభట్ల సత్యనారాయణ

  రిప్లయితొలగించండి
 25. ఉ:

  వేతన జీవులెల్లరకు వేగమె జీతము పెంపు సేయగన్
  కోతలు లేని భత్యమును కోరిన రీతిని నందజేయనై
  నేతలు చెప్పు మాటలను నెమ్మది నెంచి నొసంగ మార్కులన్
  నూతన వత్సరమ్మునను నూటికి నూరె యటంచు నవ్వెదన్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 26. క్రొవ్విడి వెంకట రాజారావు:

  భీతినిగొల్పి లోకులను వేచిన దుష్ట కరోన రోగమున్
  సాతి నొనర్చు మందులను చక్కగ దెచ్చి జనాళి కెంతయున్
  యూతి నొసంగ దల్చి చను నుత్తమ వైద్యుల కిచ్చుమార్కులున్
  నూతన వత్సరమ్మునను నూటికి నూఱె యటంచు నవ్వెదన్

  రిప్లయితొలగించండి
 27. కె.వి.యస్. లక్ష్మి:

  భీతిలజేయు కరోనను
  సాతి నొనర్చెడి తలపున చనుదెంచినదౌ
  నూతన టీకా కిత్తును
  నూతన సంవత్సరమున నూటికి నూఱే

  రిప్లయితొలగించండి
 28. నూతన కరోన మనెనట
  నూతన సంవత్సరమున ; నూటికి నూఱే
  శాతము మనకు వ శమగును
  ఆతంక పడకు జతనము నలవరచదగున్

  రిప్లయితొలగించండి
 29. చేతులఁ గూర్చి వందనము చేసినఁ, శ్రద్ధగ క్షాలనమ్ము నా
  చేతులఁ సబ్బు వాడి మరి చేసినచో, నిక నింటి వంట లా
  చేతులఁ తృప్తిగా తినినఁ చిక్కుట చక్కని స్వాస్థ్యమంతటన్
  నూతన వత్సరమ్మునను నూటికి నూఱె యటంచు నవ్వెదన్౹౹

  రిప్లయితొలగించండి
 30. శ్రీ గురుభ్యోనమః

  జీతము వేతన జీవుల
  కోతల పాలిట బడకయె కూర్చగ ప్రభుతల్
  నాతము నిండుగ పండగ
  నూతన సంవత్సరమున నూటికి నూఱే


  యాతన సుంతయున్ గలదె హాజరు లేదనుటంచు పీడనల్
  చూతమనంగ యెల్లెడల సోధన బోధనలెల్ల కల్లలే
  జాతికి మాత్రమే విచితి సాంతము మీఱి తరించు వేగమే
  నూతన వత్సరమ్మునను నూటికి నూఱె యటంచు నవ్వెదన్

  రిప్లయితొలగించండి
 31. కవి మిత్రులందరికీ
  నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు

  కందము::

  పాతకి కరోన పెట్టగ

  వాతల నెన్నో , కినిసిన వర్షము నేర్పెన్

  నీతులు , పాటించ కలుగు

  నూతన సంవత్సరమున నూటికి నూఱే”

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి
 32. సీతాకాలపుచదువులు
  కోతలులేకుండనిన్నగుణములనొసగెన్,
  జాతకచక్రమునేటిది
  నూతన సంవత్సరమున నూటికి నూఱే

  కొరుప్రోలు రాధాకృష్ణ రావు

  రిప్లయితొలగించండి
 33. *పోయిన సంవత్సరోదయ శంకరాభరణసమస్యతో సహా హహహ* 😀😀😉

  ఉ||
  నూతనవత్సరంబున వినూత్నవినోదవిహారమెందుకీ
  నీతిని శంకరాభరణ నిత్యసమస్యలయందు జెప్పిరే
  యాతనలేలొకో యిపుడు హాహహ సవ్వడులందు జెప్పెదన్
  నూతనవత్సరంబునను నూటికినూరెయటంచు నవ్వెదన్

  ఆదిపూడి రోహిత్

  రిప్లయితొలగించండి
 34. రిప్లయిలు
  1. నూతనవత్సరమ్మున వినూతనరీతులు సంభవించనన్
   బ్రాతిగ దల్చుటేల? నది ప్రాతదియైనను నూరు లారులై
   యాతన లెల్లఁ దప్పునొ సఖా! సుఖదుఃఖసమన్వయమ్ములై
   నూతన వత్సరమ్మునను నూటికి నూఱె యటంచు నవ్వెదన్.

   కంజర్ల రామాచార్య.

   తొలగించండి
  2. జీతము లెల్ల హెచ్చునని జీవితయానము సత్పథమ్మునం
   దాతతగమ్యలక్ష్యకమునై కొనసాగు నటంచుఁ దల్తువే!
   యాతన లెల్ల దప్పనివె, యాధులు వ్యాధుల కించనత్వముల్
   నూతన వత్సరమ్మునను నూటికి నూఱె యటంచు నవ్వెదన్.

   అకించనత్వము ఏమి లేని స్థితి.

   కంజర్ల రామాచార్య.

   తొలగించండి
 35. గురుదేవులకు కవిమిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. అసనారె

  రిప్లయితొలగించండి
 36. చూతము ముందర కాలము
  భీతిగ లేకుండ ప్రగతి ప్రీతిగ నుండున్
  భాతిగ నుండగ నాశలు
  నూతన సంవత్సరమున నూటికి నూఱే

  రిప్లయితొలగించండి
 37. కోతలు గావివి నాన్నా
  ప్రీతిగ నే పలుకుచుంటి విధిగా వచ్చున్
  వ్రాత పరీక్షలొ మార్కులు
  నూతన సంవత్సరమున నూటికి నూఱే!!

  ****తండ్రి తో కొడుకు పల్కిన మాటలు.

  రిప్లయితొలగించండి
 38. కోతలుగోయుచు వ్రాసిన
  నూతనసంవత్సరమున నూటికినూఱే
  ప్రీతిని నిత్తురు మార్కులు
  భ్రాతలు!పూరించుడయ్య!రయమున దీనిన్

  రిప్లయితొలగించండి
 39. మేతలు మేయని నేతలు
  రైతుల కడగండ్లు లేని రాజ్యము గల్గెన్
  చేతన మానందమయము
  నూతన సంవత్సరమున నూటికినూరే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుదేవులకు, కవిమిత్రులందరికీ నూతన ఆంగ్లసంవత్సర శుభాకాంక్షలు! 💐💐💐

   తొలగించండి
 40. భూతలము లోన నగరము
  లే తీరున గొప్పవి యగు నీ యూరుల కే
  రీతి నయిన గణనమ్ముల
  నూతన సంవత్సరమున నూటికి నూఱే


  ఏతరి జూచినం బుడమి నెన్నఁడు మార వహర్నిశల్ నరుల్
  సూతురె హెచ్చు తగ్గులను జొప్పడ వత్సర కాలమం దిలం
  బాతది యెట్లు వచ్చెనొ యపారపు టాసలు జూపి యట్టులే
  నూతన వత్సరమ్మునను నూటికి నూఱె యటంచు నవ్వెదన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నూత్నాం గ్లాబ్ద మొసంగుఁ గాత జన సందోహేప్సి తాకాంక్షలన్
   రత్నవ్రాత స శౌక్తికేయ యుత పారావార వృత్తావనిన్
   యత్నోద్దీపిత కార్య కాయ ఘన సద్యః ప్రాప్త సాఫల్యమున్
   నూత్నారోగ్యద కీటక క్షయము సంతోషమ్ములన్ వేగమే


   వచ్చెను గ్రొత్త యేఁడు మఱి పన్నుగఁ దెచ్చును సంబరమ్ములం
   గుచ్చుగఁ బుట్టి నట్టి పురుగుం గని చంపును దిట్టయై వడిం
   బచ్చని పంట లిచ్చుచును బాడి నొసంగును మిక్కుటమ్ముగా
   నచ్చము తిమ్మ నిచ్చు నిఁక నందఱి కింపగు సొమ్ము విద్దెలన్

   తొలగించండి
  2. [ నూత్నారోగ్యద కీటకక్షయము = ఆరోగ్యము నిచ్చునదియు, కీటకమును నాశము చేయు నట్తిది , టీకా]

   తొలగించండి
 41. వ్రాతలు దప్పుగానయిన పండితవర్యులుమార్కులిచ్చిరే
  నూతనవత్సరమ్మునను నూటికినూఱెయటంచునవ్వెదన్
  వ్రాతలువ్రాయగానగును బాగుగనందఱి మెచ్చుకోలుగా
  నీతినిగూడినట్టివియు నేరములేనివి యుండమేలగున్

  రిప్లయితొలగించండి
 42. వేతన మెంతయు వచ్చిన
  చేతులు తడపంగవలయు జేబులు నిండన్
  భీతిలరేశకమైనా
  నూతన సంవత్సరమున నూటికినూరే

  రిప్లయితొలగించండి
 43. పాతను పాతరవేయగ
  చేతనచేతన బ్రతుకున చింతలుదొలగన్
  వ్రాతనుమార్చుట తథ్యము
  నూతన సంవత్సరమున నూటికి నూఱే

  రిప్లయితొలగించండి
 44. మూతికిముక్కుకున్ముసుగు మోమునుజూచుట దుష్కరంబగున్
  చేతికి చేయిగల్పుటన చేరి జనాంతుని పల్కరించుటే
  రోతగపాతవత్సరము రోసిలజేసినదిప్పుడైననీ
  నూతన వత్సరమ్మునను నూటికి నూఱె యటంచు నవ్వెదన్

  రిప్లయితొలగించండి
 45. కం//
  కోతలుగోయకు ప్రభువా
  నూతన సంవత్సరమున నూటికి నూఱే !
  జాతులకేతురు మార్కులు
  మాతలరాతలను మార్చు మాన్యుడు రాడా !!

  రిప్లయితొలగించండి
 46. భూతలమును వేధించిన
  భూతము కోవిడును దరిమి పోద్రోల నికన్
  చేతనతో మేలగు భువి
  నూతన సంవత్సరమున నూటికి నూఱే

  రిప్లయితొలగించండి