25-12-2020 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“క్రిస్మసు దినమునఁ దురకల కృష్ణుని పూజల్”
(లేదా…)
“క్రిస్మసునాడు సాయబులు కృష్ణుని పూజ లొనర్తు రెల్లెడన్”
"శ్రీ రాముని దయ చేతను..." సరదా పూరణ:ముస్ముసి నవ్వులన్ గొనుచు ముగ్ధల తోడుత డాన్సుజేయుచున్మెస్మరిజమ్మిదే యనుచు మెండుగ మెక్కుచు కోడి మాంసమున్కిస్మిసు వేసి పాయసము, కేకల తోడుత విస్కి త్రాగుచున్ క్రిస్మసునాడు సాయబులు కృష్ణుని పూజ లొనర్తు రెల్లెడన్...సాయిబులు = sahebs (british rulers) కృష్ణుడు = రామకృష్ణ పరమహంస జీససు క్రైస్తును "జేసు కృష్ణుడు" అనేవారు
శుభరాత్రి!
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
🙏
స్వధర్మో నిధనం శ్రేయః పరధర్మో భయావహః విస్మయమౌ వాక్యమ్మిదిక్రిస్మసు దినమున దురకల కృష్ణుని పూజల్?!భస్మమగుటయే మేలగునస్మన్మమతము నితరము హానినిగూర్చున్
క్రమముగాభస్మము జేయపాపమును బాలుడు జన్మము నొందెనెప్పుడోకిస్మిసు పచ్చకప్పురపు ఖీరును రాతిరి గ్రోలునెవ్వరో సుస్మితులై వ్రజాంగనలు జోకను శ్రావణ మందు బ్రహ్మమౌక్రిస్మసునాడు; సాయిబులు; కృష్ణుని పూజ లొనర్తురెల్లడల్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ధన్యవాదములు గురుదేవా! నమస్సులు! 🙏🙏🙏
విస్మయమందగనేటికిభస్మముగాగనుమతములుభాసురజగతిన్రశ్మినినింపగజరిగెనుక్రిస్మసుదినమునతురకలక్రుష్ణునిపూజల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"ఉస్మానూ కృష్ణయ్యా" ఇస్మాయిలు బిలిచె "రండి యింటికి నేడేక్రిస్మసు పండగ గృహమున" క్రిస్మసు దినమునఁ దురకల కృష్ణుని పూజల్!మెర్రీ క్రిస్మస్ ప్రభువు మిమ్ము లెల్లరిని చల్లగ చూచు గాక!ఆమెన్!జిలేబి
డిస్మసు జేయగ మతిజెడి భస్మముఁ దనువంత దాల్చి పరమాత్ముని నా మస్మరణ మాని వాడనె క్రిస్మసు దినమునఁ దురకల కృష్ణుని పూజల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'డిస్మిసు' టైపాటు.
సత్యభామ శ్రీ కృష్ణునితో యిట్లనుచున్నదికందముతస్మద్వాల్లభ్యంబులునస్మత్తనూ విభవము నంబుజనాభావిస్మయముగ విఫలమగుటక్రిస్మసు దినమునఁ దురకల కృష్ణుని పూజల్ ఆదిభట్ల సత్యనారాయణ
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "... నస్మద్దేహవిభవమ్ము..." అనండి. (రెండవ గణంగా జగణం వేయరాదు)
ఈ నాటి శంకరా భరణము వారి సమస్య క్రిస్మసు దినమున దురకల కృష్ణుని పూజల్ఇచ్చిన పాదము కందమునా పూరణ తేటగీతిలోక్రీస్తును కొలుచు నెప్పడు క్రైసవ జనులెల్లరు తెలుపుము, బురఖా లిచట దాల్చుసంప్ర దాయంబు నెవరిదో? సత్య భామపరిణయం బాడె నెవరిని? భక్తు లెపుడుకీడు బాపచేయునదేమి?క్రిస్మసు దినమున, దురకల, కృష్ణుని, పూజలన్మనసు బెట్టి
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'కొలుతు రెవ్వరు..' అనండి.
విస్మయ మౌ గద వినుటకు క్రిస్మసు దినమున దురకలు కృష్ణుని పూజల్ సుస్మితు లౌదురు లోకులు తస్మాత్ జాగ్రత్త లండ్రు దైవజ్ఞు లిలన్
కందంక్రిస్మస్ ముక్కోటి కలిసివిస్మయమన నొక్క నాడె ప్రియముగ రాగారస్మిన్ పెంజారులనఁగగ్రిస్మస్ దినమున దురకల కృష్ణుని పూజల్(రస్మి = ఆచార సంబంధమైనది) ఉత్పలమాలక్రిస్మసు 'ముక్తి' పర్వములు రెండు మతమ్ముల ముఖ్యపండుగల్విస్మయ మందగన్ గలిసి వేడుక నొక్కదినాన వచ్చినన్రస్మిని దూదినేకెడు కులస్తులు ద్వైతులనంగ సాయబుల్క్రిస్మసునాడు సాయబులు కృష్ణుని పూజ లొనర్తు రెల్లెడన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా🙏
భస్మము దేహమంతయును పాముకు వచ్చివాడనెన్ క్రిస్మసు నాడు పెద్దలకు కేలుల మోడ్చి నమస్కరించుచున్ క్రిస్మసునాడు సాయబులు కృష్ణుని పూజ లొనర్తు రెల్లెడన్ విస్మయ మందనేల సురభిన్ గొని వాగిన పిచ్చి మాటలే.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.మొదటి పాదంలో గణభంగం. సవరించండి.
భస్మముగాగదుర్మతముభాసిలఁజేయగమానవాళినిన్విస్మయమందగాభువినివీచెనుచల్లనిగాలులేవనిన్క్రిస్మసుమహ్మదేలయనిక్రీడగతాల్మినిబూనియాడుచున్క్రిస్మసునాడుసాయబులుక్రుష్ణునిపూజయోనర్తురెల్లెడన్
ఇలలో సంభ్రమముగ బాబులు క్రిస్మసునాడు సాయబులు కృష్ణుని పూజ లొనర్తు రెల్లెడన్? పువ్వులెట్టిరి గదా చెవిని కవులకు కవివరా! జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'పెట్టిరి'ని 'ఎట్టిరి' అన్నారు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
సమస్య :క్రిస్మసు నాడు సాయబులు కృష్ణుని పూజ లొనర్తు రెల్లెడన్ ( నాకు వచ్చిన కల )విస్మయమయ్యె స్నేహితుడ !వింతగు స్వప్నము వచ్చె నమ్ముమా ;అస్మతు లోకమందెదియొ యాత్మసుఖంకరదృశ్యభాగ్య మా కస్మిక మద్భుతంబుగను గాంచితి ; జాగృతజాతి గంటినే !క్రిస్మసునాడు సాయబులు కృష్ణుని పూజ లొనర్తు రెల్లెడన్ !!
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
మనోహరమైనపూరణ, గురువుగారికివందనములు
మైలవరపు వారి పూరణ విస్మయమంద లోకమున వేదన గూర్చె కరోన., దానిచేసుస్మితభావనల్ చెరిగె., శోకము శేషమునయ్యె., నెవ్వరోయస్మదపాయమున్ దొలగ నౌషధమౌ హరిపూజనంబనన్క్రిస్మసునాడు సాయబులు కృష్ణుని బూజనొనర్తురెల్లెడన్ !!మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తస్మాత్! గురువులు దినమనివిస్మయమౌనిది హలీము వేడిగ నిచ్చెన్కిస్మిసు,కేకుని ( గలిపియుక్రిస్మసు దినమునఁ దురకల కృష్ణుని పూజల్
ముగ్గురు వివిధమతస్తులైన స్త్రీలు నస్మ, నమీత, నాన్సి లోకకల్యాణంకోసం బూని చేసుకున్నారు క్రిస్మస్ఉ||విస్మయమొందు పండుగిది వీనుల విందుగనెల్లరున్ గనన్సుస్మితమౌట మానవులు సూక్ష్మముగా పరికించినంతటన్నస్మ నమీత నాన్సి యను నాయికలెల్లరు బూని జేయగన్క్రిస్మసు నాడు సాయబులు కృష్ణునిపూజలొనర్తురెల్లెడున్రోహిత్
కృష్ణుడు అందరిలో ఒకడు గా ఈ నా ప్రయత్నము: ఉ: కిస్మతు పండెనో యనుచు కృష్ణుడు పాడుతు గెంతులేయగన్రస్మియె మూలమై తనరె రాతిరి వేళన మద్యపానమున్భస్మము చేతమన్న పరిభాష గ్రహించగ గూడె స్నేహితుల్క్రిస్మసు నాడు సాయబులు కృష్ణుని పూజ లొనర్తు రెల్లెడన్రస్మి=రాబడివై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'పాడుచు.. వేళను...' అనండి
ధన్యవాదములు, మార్పు చేస్తాను
అస్మత్సమస్య యిదియే“క్రిస్మసు దినమునఁ దురకల కృష్ణుని పూజల్”విస్మయమొందకు డిదిగనియస్మద్విధులకిది నిత్యమలవా టెగదా !అస్మద్విధుఁడు = మనబోఁటివాఁడు
మీ పూరణ హాస్యస్ఫోరకంగా ఉన్నది. అభినందనలు.
సమస్య:క్రిస్మసునాడు సాయబులు కృష్ణుని పూజ లొనర్తు రెల్లెడన్విస్మయమొంద మేరి యను బేలకు నేసయ బుట్టె యెన్నడో?దస్ముని గొల్వనేరక ముదమ్మున సల్పు నమాజులెవ్వరో?అస్మిత భావనల్ విడిచి హైందవు లెల్లరు గొల్తురెవ్వనిన్క్రిస్మసునాడు; సాయబులు; కృష్ణుని పూజ లొనర్తు రెల్లెడన్.దస్ముడు-అగ్నిహోత్రుడుఅస్మిత- అహంకారం
భస్మము చేసిరీదినము పాత పరంపరలెన్నియో మరిన్క్రిస్మసునాడు సాయబులు కృష్ణుని పూజ లొనర్తు రెల్లెడన్విస్మయ మొందకుం డు , మును పెద్దలు సూచన జేసిరే గదావిస్మృతి నొందుమీకతను పెద్దగ నెంచిన నేమి మేలగున్
అస్మితమందువేల? తగ దట్లుగఁ దల్చుట వాస్తవమ్మె, యేవిస్మయకారికాదది వివేకులకున్ సహనైకదైవచిత్తోస్మి' వచించువారికి మతోన్మదబుద్ధులు కాని వారికిన్ క్రిస్మసునాడు సాయబులు కృష్ణుని పూజ లొనర్తు రెల్లెడన్.నిన్నటి పూరణ..మలమలమాడు నెండలొగిఁ బమ్మినచోఁ దపియింతువేని యేకలతయొ బుట్టెనేని నయగారములొల్కు లతాంగి పొందుకైతలకుదు వేని జేరు వనితం గొని శీతనగమ్ము, సౌఖ్యమున్ చలి యిడు బాధ వోవు హిమశైలమునం దల దాఁచుకొన్నచో.అస్మిత=అహంకృతికంజర్ల రామాచార్య.
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
విస్మయమొంది విందుకును వేడుక చర్చికి రాగ పండగౌక్రిస్మసునాడు సాయబులు:; కృష్ణుని పూజ లొనర్తు రెల్లెడన్కశ్మల భావమింతయును కానక ప్రీతిగ వీరు వారలున్విస్మయమొందితిన్, కలన, భిన్నతనేకత కాన రాగ, నే...భారతీనాథ్ చెన్నంశెట్టి....
ధన్యవాదములండీ
విస్మయమొందమేరియనుబేలకుబుత్రుడుబుట్టెనెప్పుడో?కిస్మిసుజేర్చిపాయసముక్షేమమొసంగగబంచుదెవ్వరో?సుస్మితునందచందములసూరిమురారికిశ్రావణంబునన్*“క్రిస్మసునాడు ;సాయబులు; కృష్ణుని పూజ లొనర్తు రెల్లెడన్”*
భస్మము బంగరగుననగవిస్మయమైన విన వచ్చు :; వివరము చూడన్విస్మయముకు విశ్మయమౌక్రిస్మసు దినమునఁ దురకల కృష్ణుని పూజల్”...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు. మూడవ పాదం ?
ధన్యవాదములండీ 3వ పాదము. “ విశ్మయమునకును వింత” గా చదువుకొన వినతి
కశ్మలమూడ్చమేరియనుకన్యకునెన్నడుబుట్టెనేసుడే?యస్మితమంచనల్లనుమహమ్మదునెవ్వరుగొల్తురో?మహావిస్మయమందబాలకునివెన్నునిమార్గశిరానగోదకున్క్రిస్మసునాడు;సాయబులు;గృష్ణుని పూజలొనర్తురెల్లెడన్
కిస్మతు రెండు మతములకువిస్మయమీరోజు పర్వదినమై నప్పన్కస్మలమేలేని ప్రజల్క్రిస్మసు దినమునఁ దురకల కృష్ణుని పూజల్
విస్మయమేల చేసెదరు వేడుకతోడను క్రైస్తవుల్ యిలన్వస్మతు బాపుమంచునట పస్తులు నుండుచు పర్వమొప్పుగాభస్మము దాల్చుశైవులును బాయక శ్రావణ మాసమందునన్క్రిస్మసునాడు సాయబులు కృష్ణుని పూజ లొనర్తు రెల్లెడన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'క్రైస్తవుల్ భువిన్' అనండి.
రస్మిని ఖర్చుచేయుచును రంజిలు చుందురు క్రీస్తు భక్తులేవిస్మయ మొందగా ప్రజలు ప్రీతిని నిప్పుల సాగునెవ్వరో?సుస్మితమైన మోములను చొక్కుచు హిందువు లేమి చేతురో?క్రిస్మసునాడు, సాయబులు, కృష్ణుని పూజ లొనర్తు రెల్లెడన్
సత్యభామ శ్రీ కృష్ణునితో యిట్లనుచున్నదికందము. (సరి చేసి)తస్మద్వాల్లభ్యంబులునస్మద్దేహ విభవమ్ము నంబుజనాభావిస్మయముగ విఫలమగుటక్రిస్మసు దినమునఁ దురకల కృష్ణుని పూజల్ ఆదిభట్ల సత్యనారాయణ
విస్మయమనియనిపించునుక్రిస్మసుదినమున దురకలకృష్ణునిపూజల్ భస్మముధరించువారలుకశ్మములులేకయుండి ఘటియించెగదే
క్రిస్మస్సేకాదశియునుకిస్మిసు ద్రాక్షలునుబోలు కృష్ణుడు క్రీస్తున్మెస్మరిజముతలపించునుక్రిస్మసు దినమునఁ దురకల కృష్ణుని పూజల్
భస్మాసుర నిభ రా జనెవిస్మయముగ నివ్విధమ్ము వెఱ్ఱి ప్రణిధులే, యస్మద్బోధన నాపుమ క్రిస్మసు దినమునఁ, దురకల, కృష్ణుని పూజల్ సస్మిత సుంద రానన ప్రశాంత మనమ్మున నాలకించుమా విస్మయ మేల స్వప్నమున వింతలు చిత్రమె యివ్విధమ్మునన్ భస్మము ఫాల మందు నిడి బ్రాహ్మణ సంతతి పల్క మంత్రముల్ క్రిస్మసునాఁడు సాయబులు కృష్ణుని పూజ లొనర్తు రెల్లెడన్
క్రిస్మసునాడుసాయిబులుకృష్ణుని పూజలొనర్తు రెల్లెడన్ విస్మయమాయెనే?సరళ! పెద్దగనచ్చెరువందబోకుమాక్రిస్మసువంటిపండుగలు గృష్ణునిపూజలనెవ్వరైననున్ కశ్మలమొందకుండగను గమ్మనిభక్తిని జేయగానగున్
విస్మయమొందె మానసము వేడుకగా జనులెల్ల నొక్కటైక్రిస్మసు పర్వమందుతమ క్షేమము గోరుచు క్రీస్తు పూజలన్రశ్ములునింపి కన్నులను రంజిలజేతురదేమి వింతయోక్రిస్మసునాడు సాయబులు కృష్ణుని పూజ లొనర్తు రెల్లెడన్
ఉ.అస్మిత భావమున్ విడువ యామిని చందమె జీవకోటికిన్రస్మిని బొందగా జనులు రాగము మోహనమై నివర్తి యాకస్మిత సామరస్యతను కానగు వేల్పులె పంచభూతముల్క్రిస్మసునాడు, సాయబులు, కృష్ణుని పూజ లొనర్తు రెల్లెడన్. రస్మి = రాబడి రాగము = ఈర్ష్య మోహనము = మైకము నివర్తి = నివృత్తి, removing..... అయ్యలసోమయాజుల సుబ్బారావు.
"కిస్మిసు జీడిపప్పులును క్షీరపు టన్నము కూడినట్లుగా భస్మమొనర్చి వాసి, ప్రజ భాసిలగా నిల యెట్టులౌ"ననన్ విస్మయ మంద మిత్రుడనె "భిన్న మతమ్ముల భావమొక్కటై క్రిస్మసు నాడు సాయిబులు కృష్ణుని పూజలొనర్తు రెల్లెడన్" -మాచవోలు శ్రీధరరావు
విస్మయమేల?చేసెదరు వేడుకతోడను క్రైస్తవుల్ భువిన్వస్మతు బాపుమంచునట పస్తులు నుండుచు పర్వమొప్పుగాభస్మము దాల్చుశైవులును బాయక శ్రావణ మాసమందునన్*క్రిస్మసునాడు సాయబులు కృష్ణుని పూజ లొనర్తు రెల్లెడన్*
రిప్లయితొలగించండి"శ్రీ రాముని దయ చేతను..."
సరదా పూరణ:
ముస్ముసి నవ్వులన్ గొనుచు ముగ్ధల తోడుత డాన్సుజేయుచున్
మెస్మరిజమ్మిదే యనుచు మెండుగ మెక్కుచు కోడి మాంసమున్
కిస్మిసు వేసి పాయసము, కేకల తోడుత విస్కి త్రాగుచున్
క్రిస్మసునాడు సాయబులు కృష్ణుని పూజ లొనర్తు రెల్లెడన్...
సాయిబులు = sahebs (british rulers)
కృష్ణుడు = రామకృష్ణ పరమహంస జీససు క్రైస్తును "జేసు కృష్ణుడు" అనేవారు
తొలగించండిశుభరాత్రి!
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండిస్వధర్మో నిధనం శ్రేయః పరధర్మో భయావహః
రిప్లయితొలగించండివిస్మయమౌ వాక్యమ్మిది
క్రిస్మసు దినమున దురకల కృష్ణుని పూజల్?!
భస్మమగుటయే మేలగు
నస్మన్మమతము నితరము హానిని
గూర్చున్
క్రమముగా
తొలగించండిభస్మము జేయపాపమును బాలుడు
జన్మము నొందెనెప్పుడో
కిస్మిసు పచ్చకప్పురపు ఖీరును రాతిరి గ్రోలునెవ్వరో
సుస్మితులై వ్రజాంగనలు జోకను శ్రావణ మందు బ్రహ్మమౌ
క్రిస్మసునాడు; సాయిబులు; కృష్ణుని పూజ లొనర్తురెల్లడల్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు గురుదేవా! నమస్సులు! 🙏🙏🙏
తొలగించండివిస్మయమందగనేటికి
రిప్లయితొలగించండిభస్మముగాగనుమతములుభాసురజగతిన్
రశ్మినినింపగజరిగెను
క్రిస్మసుదినమునతురకలక్రుష్ణునిపూజల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండి"ఉస్మానూ కృష్ణయ్యా"
ఇస్మాయిలు బిలిచె "రండి యింటికి నేడే
క్రిస్మసు పండగ గృహమున"
క్రిస్మసు దినమునఁ దురకల కృష్ణుని పూజల్!
మెర్రీ క్రిస్మస్
ప్రభువు మిమ్ము లెల్లరిని చల్లగ చూచు గాక!
ఆమెన్!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిడిస్మసు జేయగ మతిజెడి
రిప్లయితొలగించండిభస్మముఁ దనువంత దాల్చి పరమాత్ముని నా
మస్మరణ మాని వాడనె
క్రిస్మసు దినమునఁ దురకల కృష్ణుని పూజల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'డిస్మిసు' టైపాటు.
సత్యభామ శ్రీ కృష్ణునితో యిట్లనుచున్నది
రిప్లయితొలగించండికందము
తస్మద్వాల్లభ్యంబులు
నస్మత్తనూ విభవము నంబుజనాభా
విస్మయముగ విఫలమగుట
క్రిస్మసు దినమునఁ దురకల కృష్ణుని పూజల్
ఆదిభట్ల సత్యనారాయణ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"... నస్మద్దేహవిభవమ్ము..." అనండి. (రెండవ గణంగా జగణం వేయరాదు)
ఈ నాటి శంకరా భరణము వారి సమస్య
రిప్లయితొలగించండిక్రిస్మసు దినమున దురకల కృష్ణుని పూజల్
ఇచ్చిన పాదము కందము
నా పూరణ తేటగీతిలో
క్రీస్తును కొలుచు నెప్పడు క్రైసవ జను
లెల్లరు తెలుపుము, బురఖా లిచట దాల్చు
సంప్ర దాయంబు నెవరిదో? సత్య భామ
పరిణయం బాడె నెవరిని? భక్తు లెపుడు
కీడు బాపచేయునదేమి?
క్రిస్మసు దిన
మున, దురకల, కృష్ణుని, పూజలన్మనసు బెట్టి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'కొలుతు రెవ్వరు..' అనండి.
విస్మయ మౌ గద వినుటకు
రిప్లయితొలగించండిక్రిస్మసు దినమున దురకలు కృష్ణుని పూజల్
సుస్మితు లౌదురు లోకులు
తస్మాత్ జాగ్రత్త లండ్రు దైవజ్ఞు లిలన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికందం
రిప్లయితొలగించండిక్రిస్మస్ ముక్కోటి కలిసి
విస్మయమన నొక్క నాడె ప్రియముగ రాగా
రస్మిన్ పెంజారులనఁగ
గ్రిస్మస్ దినమున దురకల కృష్ణుని పూజల్
(రస్మి = ఆచార సంబంధమైనది)
ఉత్పలమాల
క్రిస్మసు 'ముక్తి' పర్వములు రెండు మతమ్ముల ముఖ్యపండుగల్
విస్మయ మందగన్ గలిసి వేడుక నొక్కదినాన వచ్చినన్
రస్మిని దూదినేకెడు కులస్తులు ద్వైతులనంగ సాయబుల్
క్రిస్మసునాడు సాయబులు కృష్ణుని పూజ లొనర్తు రెల్లెడన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించండిభస్మము దేహమంతయును పాముకు వచ్చివాడనెన్
రిప్లయితొలగించండిక్రిస్మసు నాడు పెద్దలకు కేలుల మోడ్చి నమస్కరించుచున్
క్రిస్మసునాడు సాయబులు కృష్ణుని పూజ లొనర్తు రెల్లెడన్
విస్మయ మందనేల సురభిన్ గొని వాగిన పిచ్చి మాటలే.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమొదటి పాదంలో గణభంగం. సవరించండి.
భస్మముగాగదుర్మతముభాసిలఁజేయగమానవాళినిన్
రిప్లయితొలగించండివిస్మయమందగాభువినివీచెనుచల్లనిగాలులేవనిన్
క్రిస్మసుమహ్మదేలయనిక్రీడగతాల్మినిబూనియాడుచున్
క్రిస్మసునాడుసాయబులుక్రుష్ణునిపూజయోనర్తురెల్లెడన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఇలలో సంభ్రమముగ బా
బులు క్రిస్మసునాడు సాయబులు కృష్ణుని పూ
జ లొనర్తు రెల్లెడన్? పు
వ్వులెట్టిరి గదా చెవిని కవులకు కవివరా!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'పెట్టిరి'ని 'ఎట్టిరి' అన్నారు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసమస్య :
రిప్లయితొలగించండిక్రిస్మసు నాడు సాయబులు
కృష్ణుని పూజ లొనర్తు రెల్లెడన్
( నాకు వచ్చిన కల )
విస్మయమయ్యె స్నేహితుడ !
వింతగు స్వప్నము వచ్చె నమ్ముమా ;
అస్మతు లోకమందెదియొ
యాత్మసుఖంకరదృశ్యభాగ్య మా
కస్మిక మద్భుతంబుగను
గాంచితి ; జాగృతజాతి గంటినే !
క్రిస్మసునాడు సాయబులు
కృష్ణుని పూజ లొనర్తు రెల్లెడన్ !!
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిమనోహరమైనపూరణ, గురువుగారికివందనములు
తొలగించండి
రిప్లయితొలగించండిమైలవరపు వారి పూరణ
విస్మయమంద లోకమున వేదన గూర్చె కరోన., దానిచే
సుస్మితభావనల్ చెరిగె., శోకము శేషమునయ్యె., నెవ్వరో
యస్మదపాయమున్ దొలగ నౌషధమౌ హరిపూజనంబనన్
క్రిస్మసునాడు సాయబులు కృష్ణుని బూజనొనర్తురెల్లెడన్ !
!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండితస్మాత్! గురువులు దినమని
రిప్లయితొలగించండివిస్మయమౌనిది హలీము వేడిగ నిచ్చెన్
కిస్మిసు,కేకుని ( గలిపియు
క్రిస్మసు దినమునఁ దురకల కృష్ణుని పూజల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిముగ్గురు వివిధమతస్తులైన స్త్రీలు నస్మ, నమీత, నాన్సి లోకకల్యాణంకోసం బూని చేసుకున్నారు క్రిస్మస్
రిప్లయితొలగించండిఉ||
విస్మయమొందు పండుగిది వీనుల విందుగనెల్లరున్ గనన్
సుస్మితమౌట మానవులు సూక్ష్మముగా పరికించినంతటన్
నస్మ నమీత నాన్సి యను నాయికలెల్లరు బూని జేయగన్
క్రిస్మసు నాడు సాయబులు కృష్ణునిపూజలొనర్తురెల్లెడున్
రోహిత్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికృష్ణుడు అందరిలో ఒకడు గా ఈ నా ప్రయత్నము:
రిప్లయితొలగించండిఉ:
కిస్మతు పండెనో యనుచు కృష్ణుడు పాడుతు గెంతులేయగన్
రస్మియె మూలమై తనరె రాతిరి వేళన మద్యపానమున్
భస్మము చేతమన్న పరిభాష గ్రహించగ గూడె స్నేహితుల్
క్రిస్మసు నాడు సాయబులు కృష్ణుని పూజ లొనర్తు రెల్లెడన్
రస్మి=రాబడి
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'పాడుచు.. వేళను...' అనండి
ధన్యవాదములు, మార్పు చేస్తాను
తొలగించండిఅస్మత్సమస్య యిదియే
రిప్లయితొలగించండి“క్రిస్మసు దినమునఁ దురకల కృష్ణుని పూజల్”
విస్మయమొందకు డిదిగని
యస్మద్విధులకిది నిత్యమలవా టెగదా !
అస్మద్విధుఁడు = మనబోఁటివాఁడు
మీ పూరణ హాస్యస్ఫోరకంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిసమస్య:
రిప్లయితొలగించండిక్రిస్మసునాడు సాయబులు కృష్ణుని పూజ లొనర్తు రెల్లెడన్
విస్మయమొంద మేరి యను బేలకు నేసయ బుట్టె యెన్నడో?
దస్ముని గొల్వనేరక ముదమ్మున సల్పు నమాజులెవ్వరో?
అస్మిత భావనల్ విడిచి హైందవు లెల్లరు గొల్తురెవ్వనిన్
క్రిస్మసునాడు; సాయబులు; కృష్ణుని పూజ లొనర్తు రెల్లెడన్.
దస్ముడు-అగ్నిహోత్రుడు
అస్మిత- అహంకారం
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభస్మము చేసిరీదినము పాత పరంపరలెన్నియో మరిన్
రిప్లయితొలగించండిక్రిస్మసునాడు సాయబులు కృష్ణుని పూజ లొనర్తు రెల్లెడన్
విస్మయ మొందకుం డు , మును పెద్దలు సూచన జేసిరే గదా
విస్మృతి నొందుమీకతను పెద్దగ నెంచిన నేమి మేలగున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅస్మితమందువేల? తగ దట్లుగఁ దల్చుట వాస్తవమ్మె, యే
రిప్లయితొలగించండివిస్మయకారికాదది వివేకులకున్ సహనైకదైవచి
త్తోస్మి' వచించువారికి మతోన్మదబుద్ధులు కాని వారికిన్
క్రిస్మసునాడు సాయబులు కృష్ణుని పూజ లొనర్తు రెల్లెడన్.
నిన్నటి పూరణ..
మలమలమాడు నెండలొగిఁ బమ్మినచోఁ దపియింతువేని యే
కలతయొ బుట్టెనేని నయగారములొల్కు లతాంగి పొందుకై
తలకుదు వేని జేరు వనితం గొని శీతనగమ్ము, సౌఖ్యమున్
చలి యిడు బాధ వోవు హిమశైలమునం దల దాఁచుకొన్నచో.
అస్మిత=అహంకృతి
కంజర్ల రామాచార్య.
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండివిస్మయమొంది విందుకును వేడుక చర్చికి రాగ పండగౌ
రిప్లయితొలగించండిక్రిస్మసునాడు సాయబులు:; కృష్ణుని పూజ లొనర్తు రెల్లెడన్
కశ్మల భావమింతయును కానక ప్రీతిగ వీరు వారలున్
విస్మయమొందితిన్, కలన, భిన్నతనేకత కాన రాగ, నే
...భారతీనాథ్ చెన్నంశెట్టి....
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములండీ
తొలగించండివిస్మయమొందమేరియనుబేలకుబుత్రుడుబుట్టెనెప్పుడో?
రిప్లయితొలగించండికిస్మిసుజేర్చిపాయసముక్షేమమొసంగగబంచుదెవ్వరో?
సుస్మితునందచందములసూరిమురారికిశ్రావణంబునన్
*“క్రిస్మసునాడు ;సాయబులు; కృష్ణుని పూజ లొనర్తు రెల్లెడన్”*
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభస్మము బంగరగుననగ
రిప్లయితొలగించండివిస్మయమైన విన వచ్చు :; వివరము చూడన్
విస్మయముకు విశ్మయమౌ
క్రిస్మసు దినమునఁ దురకల కృష్ణుని పూజల్”
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమూడవ పాదం ?
ధన్యవాదములండీ
తొలగించండి3వ పాదము. “ విశ్మయమునకును వింత” గా చదువుకొన వినతి
కశ్మలమూడ్చమేరియనుకన్యకునెన్నడుబుట్టెనేసుడే?
రిప్లయితొలగించండియస్మితమంచనల్లనుమహమ్మదునెవ్వరుగొల్తురో?మహా
విస్మయమందబాలకునివెన్నునిమార్గశిరానగోదకున్
క్రిస్మసునాడు;సాయబులు;గృష్ణుని పూజలొనర్తురెల్లెడన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికిస్మతు రెండు మతములకు
రిప్లయితొలగించండివిస్మయమీరోజు పర్వదినమై నప్పన్
కస్మలమేలేని ప్రజల్
క్రిస్మసు దినమునఁ దురకల కృష్ణుని పూజల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివిస్మయమేల చేసెదరు వేడుకతోడను క్రైస్తవుల్ యిలన్
రిప్లయితొలగించండివస్మతు బాపుమంచునట పస్తులు నుండుచు పర్వమొప్పుగా
భస్మము దాల్చుశైవులును బాయక శ్రావణ మాసమందునన్
క్రిస్మసునాడు సాయబులు కృష్ణుని పూజ లొనర్తు రెల్లెడన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'క్రైస్తవుల్ భువిన్' అనండి.
రస్మిని ఖర్చుచేయుచును రంజిలు చుందురు క్రీస్తు భక్తులే
రిప్లయితొలగించండివిస్మయ మొందగా ప్రజలు ప్రీతిని నిప్పుల సాగునెవ్వరో?
సుస్మితమైన మోములను చొక్కుచు హిందువు లేమి చేతురో?
క్రిస్మసునాడు, సాయబులు, కృష్ణుని పూజ లొనర్తు రెల్లెడన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిసత్యభామ శ్రీ కృష్ణునితో యిట్లనుచున్నది
కందము. (సరి చేసి)
తస్మద్వాల్లభ్యంబులు
నస్మద్దేహ విభవమ్ము నంబుజనాభా
విస్మయముగ విఫలమగుట
క్రిస్మసు దినమునఁ దురకల కృష్ణుని పూజల్
ఆదిభట్ల సత్యనారాయణ
విస్మయమనియనిపించును
రిప్లయితొలగించండిక్రిస్మసుదినమున దురకలకృష్ణునిపూజల్
భస్మముధరించువారలు
కశ్మములులేకయుండి ఘటియించెగదే
క్రిస్మస్సేకాదశియును
రిప్లయితొలగించండికిస్మిసు ద్రాక్షలునుబోలు కృష్ణుడు క్రీస్తున్
మెస్మరిజముతలపించును
క్రిస్మసు దినమునఁ దురకల కృష్ణుని పూజల్
భస్మాసుర నిభ రా జనె
రిప్లయితొలగించండివిస్మయముగ నివ్విధమ్ము వెఱ్ఱి ప్రణిధులే,
యస్మద్బోధన నాపుమ
క్రిస్మసు దినమునఁ, దురకల, కృష్ణుని పూజల్
సస్మిత సుంద రానన ప్రశాంత మనమ్మున నాలకించుమా
విస్మయ మేల స్వప్నమున వింతలు చిత్రమె యివ్విధమ్మునన్
భస్మము ఫాల మందు నిడి బ్రాహ్మణ సంతతి పల్క మంత్రముల్
క్రిస్మసునాఁడు సాయబులు కృష్ణుని పూజ లొనర్తు రెల్లెడన్
క్రిస్మసునాడుసాయిబులుకృష్ణుని పూజలొనర్తు రెల్లెడన్
రిప్లయితొలగించండివిస్మయమాయెనే?సరళ! పెద్దగనచ్చెరువందబోకుమా
క్రిస్మసువంటిపండుగలు గృష్ణునిపూజలనెవ్వరైననున్
కశ్మలమొందకుండగను గమ్మనిభక్తిని జేయగానగున్
విస్మయమొందె మానసము వేడుకగా జనులెల్ల నొక్కటై
రిప్లయితొలగించండిక్రిస్మసు పర్వమందుతమ క్షేమము గోరుచు క్రీస్తు పూజలన్
రశ్ములునింపి కన్నులను రంజిలజేతురదేమి వింతయో
క్రిస్మసునాడు సాయబులు కృష్ణుని పూజ లొనర్తు రెల్లెడన్
ఉ.
రిప్లయితొలగించండిఅస్మిత భావమున్ విడువ యామిని చందమె జీవకోటికిన్
రస్మిని బొందగా జనులు రాగము మోహనమై నివర్తి యా
కస్మిత సామరస్యతను కానగు వేల్పులె పంచభూతముల్
క్రిస్మసునాడు, సాయబులు, కృష్ణుని పూజ లొనర్తు రెల్లెడన్.
రస్మి = రాబడి
రాగము = ఈర్ష్య
మోహనము = మైకము
నివర్తి = నివృత్తి, removing
..... అయ్యలసోమయాజుల సుబ్బారావు.
"కిస్మిసు జీడిపప్పులును క్షీరపు టన్నము కూడినట్లుగా
రిప్లయితొలగించండిభస్మమొనర్చి వాసి, ప్రజ భాసిలగా నిల యెట్టులౌ"ననన్
విస్మయ మంద మిత్రుడనె "భిన్న మతమ్ముల భావమొక్కటై
క్రిస్మసు నాడు సాయిబులు కృష్ణుని పూజలొనర్తు రెల్లెడన్"
-మాచవోలు శ్రీధరరావు
విస్మయమేల?చేసెదరు వేడుకతోడను క్రైస్తవుల్ భువిన్
రిప్లయితొలగించండివస్మతు బాపుమంచునట పస్తులు నుండుచు పర్వమొప్పుగా
భస్మము దాల్చుశైవులును బాయక శ్రావణ మాసమందునన్
*క్రిస్మసునాడు సాయబులు కృష్ణుని పూజ లొనర్తు రెల్లెడన్*