24-12-2020 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చలి బాధకు దాఁగుము హిమశైలమునందున్”
(లేదా…)
“చలి యిడు బాధ వోవు హిమశైలమునం దల దాఁచుకొన్నచో”
"శ్రీ రాముని దయ చేతను..." సరదా పూరణ:తొలుతను ప్రేమజూపుచును తొయ్యలి జేరుచు మాటనీయగాకలువల రాణియే త్వరగ గర్భము దాల్చుచు పెండ్లిముందునన్కలిసిన వెంటనే కినిసి కన్నుల నందున నీరుకార్చగా చలి యిడు బాధ వోవు హిమశైలమునం దల దాఁచుకొన్నచో...
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
🙏
వెలగల మాటలనాడుచువిలువలు పెంచంగ వలెను వినుకోవయ్యా!చలిగొన్న వానన దగునేచలి బాధకు దాఁగుము హిమశైలము నందున్!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "వాని నన దగునె" అనండి.
వెలివేయుముదేహపుసిరిమలిసంధ్యనుమనసుపెట్టుమాధవునందున్చలితముగాకనుచూపునచలిబాధకుదాగుముహిమశైలమునందున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆటవిడుపు సరదా పూరణ: (జిలేబి గారికి అంకితం)నలుబది నేతలాదటను నవ్వుచు వీడగ నిన్ను వేగమే కులుకుచు మోడి చిత్రమును గొప్పగ నెత్తుచు వంగభూమినిన్పలువురు భాజపా జనులు పండుగ జేయగ దీది నీకికన్ చలి యిడు బాధ వోవు హిమశైలమునం దల దాఁచుకొన్నచో...
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
చెలి కౌగిటలో సతతముచలిబాధకు దాగుము,హిమ శైలము నందున్సులువుగ గ్రీష్మ ఋతువులోచెలితో గడుప మనుజునకు క్షేమంబగునే
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు. "చెలి కౌగిలిలో..." అనండి.
పలితముగాకకేశములుపన్నులునేలనురాలనప్పుడేపులిమినమోహగంధమునుఫూయనిరోయుచుపారిపోవుచున్మలినముగానిమానసమునాదనునమ్మికనుండగాతుదిన్చలియిడుబాధవోవుహిమశైలమునన్దలదాల్చుకోన్నచో
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదములుగురువుగారు
బోనసు సరదా పూరణ:సలుపగ యుద్ధమున్ భళిగ చంపను కోరుచు చీని మూర్ఖులన్తెలివిగ సైన్య రక్షకులు తేకువ మీరగ టెంటులందునన్బలుపగు నారు కోటులను వైనపు రమ్మును నీకు చేర్చగా చలి యిడు బాధ వోవు హిమశైలమునం దల దాఁచుకొన్నచో...
మీ బోనసు పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కందంవలచితి ప్రవరా! నినునేపిలిచి వరూధినొసఁగ నులి వెచ్చని బిగి కౌగిలి! మేలగు నోషధి యీచలి బాధకు! దాగుము హిమశైలమునందున్చంపకమాలవలపులు జారుచుండె జలపాతపు రీతిని నిన్నుగాంచఁగన్బులకలు రేగవే ప్రవర! మోహము జూపు వరూధిణిన్గనన్బిలిచి వధూటి కోరి నులివెచ్చని కౌగిట దాగరమ్మనన్జలి యిడు బాధ వోవు! హిమశైలమునం దల దాఁచుకొన్నచో!!
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.'వరూధిని+ఒసగ' అన్నపుడు సంధి లేదు. "పిలిచి వరూధిని యిడ నులి వెచ్చని..." అనండి. 'వరూధినిన్గనన్' టైపాటు.
గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ :కందంవలచితి ప్రవరా! నినునేపిలిచి వరూధిని యిడ నులి వెచ్చని బిగి కౌగిలి! మేలగు నోషధి యీచలి బాధకు! దాగుము హిమశైలమునందున్! చంపకమాలవలపులు జారుచుండె జలపాతపు రీతిని నిన్నుగాంచఁగన్బులకలు రేగవే ప్రవర! మోహము జూపు వరూధినిన్గనన్బిలిచి వధూటి కోరి నులివెచ్చని కౌగిట దాగ రమ్మనన్జలి యిడు బాధ వోవు! హిమశైలమునం దల దాఁచుకొన్నచో!!
చలిమల పుత్రికాయుత ప్రశస్త శివాద్భుత నాట్య కేళికిన్నెవవగు గాన నయ్యది వినిర్మలమైన విహార సీమయైచెలువము నింపుగాదె!సుఖ శీకరదివ్య మనోజ్ఞ ధామమై-చలి యిడు బాధ వోవు హిమ శైలమునం దల దాచుకొన్నచో
చాల బాగుందండీ! అభినందనలు! నెలవగు టైపాటు! 🙏🙏
మీ పూరణ మనోజ్ఞంగా ఉన్నది. అభినందనలు. సీతాదేవి గారన్నట్లు టైపాటు.
సీతాదేవి గారూ !కృతజ్ఞతలు. గురువర్యా! నమస్తే
బలవంతుడు శత్రువనుచు ఖలుడతనిని జంపనెంచి కపటము తో నె చ్చెలిగ నటియించుచు పలికె చలి బాధకు దాఁగుము హిమశైలమునందున్
వలపుల పతి కౌగిలి లో చలి బాధకు దాగుము : హిమ శైలము నందున్ సలుపు ను శివుడు తపంబును విలసిత కళ్యాణ ములకు విశ్వము కెల్లన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'విశ్వమునకెల్లన్' అనడం సాధువు. అక్కడ "విశ్వమ్మునకున్" అనండి.
సలుపగ లేక యుద్ధమును శత్రువు జంపెడి కోర్కెహెచ్చగా చెలిమరినంచు చెప్పుకుని క్షేమము కోరెడి వాడినంచు తా బలికె నికారమందున నబద్దమటంచునెఱంగి యిట్టులన్ చలి యిడు బాధ వోవు హిమశైలమునం దల దాఁచుకొన్నచో
పలుకంగ దలచె నివ్విధిచెలి బాధకు దాగుము హిమశైలమునందున్ చెలియకు భయమంది బలికెచలిబాధకు దాగుము హిమశైలమునందున్ తలపులనుంచి బ్రహ్మమును తన్మయులౌచును నాత్మనందునన్నిలుచుచు ధ్యానమార్గమున నిశ్చలరూపున మౌనివర్యులేవెలువడ నగ్నితేజమది వ్రేల్చగ పాపపు రాశినందునన్చలియిడు బాధవోవు హిమశైలమునన్ దలదాచుకొన్నచో
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.మొదటి పూరణ రెండవ పాదంలో యతి తప్పింది. సవరించండి.
ధన్యవాదములు గురుదేవా! నమస్సులు! సవరిస్తాను! 🙏🙏🙏
సవరించిన పూరణపలుకంగ దలచె నివ్విధిచెలి బాధకు దాగుము హిమశృంగమునందున్ చెలియకు భయమంది బలికెచలిబాధకు దాగుము హిమశైలమునందున్
వలచిన భామ తోడుత వివాహముకాగ వసంతమందునన్చెలగెడు మండుటెండలకు చేతము కూడుట కిచ్చగింపకన్కలికిలకొల్కి దోడబిగు కౌగిలి క్షౌద్రహిమాంశుకై చనన్చలి యిడు బాధ వోవు హిమశైలమునం దల దాఁచుకొన్నచో.క్షౌద్రహిమంశు- Honeymoon
రాయబారిగా హనుమంతు డిట్లు బుద్ధి సెప్పె:వలచితివిక సీతమ్మన్ఖలుడా! రావణ! విడువుము కడకున్ బ్రాణమ్ములు గొను రాముడు, చనుమికచలి బాధకు దాఁగుము హిమశైలమునందున్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.'చిలుకల కొల్కి' ఉంది.. మరి 'కలికిల కొల్కి'?
చం:బలివిడి గొన్న పెట్టుబడి బాటలు వేయగ నష్టమొందగన్కలతయె చెంద కుండగను కారణ మెంచక నప్పుజేయుచున్నిలువున ముంచి నెల్లరల నేతల యండ విదేశ మేగగన్చలియిడు బాధ వోవు హిమశైలమునం దల దాచుకొన్నచోవై. చంద్రశేఖర్
ధన్యవాదములు
వెలుగులదొర తపనమునకు కలగుచు వాతానుకూల్యకరణ బిస గొనన్విలువను జూడగ పుట్టినచలి బాధకు దాఁగుము హిమశైలమునందున్బిస = యంత్రమువాతానుకూల్యకరణ బిస = Air conditionerచలి = భయము
ఈనాటి శంకరాభరణం వారిచ్చిన సమస్య*“చలి బాధకు దాఁగుము హిమశైలమునందున్”*(లేదా…)*“చలి యిడు బాధ వోవు హిమశైలమునం దల దాఁచుకొన్నచో”*నా పూరణ1)కందముశిలల మయంబుల హిమగిరిసలిలంబులు చల్లగుండు శాంతిని గూర్చున్ !యిలలో ! నరుడా ! యిడుముల చలి బాధకు దాగుము హిమ శైలము నందున్2)చంపకమాలసలిలపు ధారలన్ దనరు చల్లని గాలులు హాయి గొల్పగా,శిలల మయంబునౌ మనము చేతన మొందుచు నుష్ణమౌనులే!చెలియలి చెంతనుండగను శీతల ముష్ణము కాకపోవునా!చలియిడు బాధవోవు హిమ శైలమునం దల దాఁచుకొన్నచోఆదిభట్ల సత్యనారాయణ
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.'కూర్చున్+ఇలలో' అన్నపుడు యడాగమం రాదు. "శాంతి నొసగు నీ యిలలో..." అనండి.
ఇలలోనాకలిమంటలచలిబాధలునేమిసేయు బల్కుము గురుడాబలహీనులకెటులజెపుతుచలి బాధకు దాఁగుము హిమశైలమునందున్??
చెలులిద్దరున్న భవుడేనొలుకుల మంటలను కాగి నోర్పుగ నుండెన్యిల జీవుని కెటులతగునుచలి బాధకు దాఁగుట హిమశైలమునందున్??
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.'చెపుతు' అన్నది సాధువు కాదు. "బలహీనుల కెటు జెప్పుదు" అనండి. 'ఉండెన్+ఇల' అన్నపుడు యడాగమం రాదు. "కాగి యోర్పు గలుగ నీ । యిల..." అనండి.
🙏 ధన్యవాదాలు గురువర్యా
సమస్య :చలి యిడు బాధవోవు హిమ శైలమునం దల దాచుకొన్నచో ( ప్రవరునితో వరూధిని )ఉలుకును బల్కు లేక నిటు లుండుట మంచిది కాదు సుందరా !యెలమిని నాదు మందిర మ దెంతయు నీకయి వేచె మాన్యుడా !పులకల నాయెదన్ శిరము బొందిక నుంపు ; వరూధినీవరా !చలి యిడు బాధ వోవు ; హిమ శైలమునం దలదాచుకొన్నచో .
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. 'లేక యిటు' అని ఉండాలి కదా?
చెలిబిగి కౌగిలింత నిడ చెన్నును చూపుచు రాత్రివేళలోచలి యిడు బాధ వోవు, హిమశైలమునం దల దాఁచుకొన్నచోమలహరు దర్శనమ్మునను మందిరమందున పూజచేయుచున్,కలుగు విమోచనమ్ము మసికంధరుడౌ జడదారి ప్రేమతో
మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
గురువర్యులకు నమస్సులు. ధన్యవాదములు.
నిలువగ నీడలే దరయఁ దిండికి గింజలు లేవు సర్వమున్వలపునుఁ జూపి దోచె మురిపమ్మునకై బలియైతి నంచుఁదానల విటు డొక్కరుండు వెలయాలిని వీడి దలంచె నిట్లు పుంశ్చలి యిడు బాధ వోవు హిమశైలమునం దల దాఁచుకొన్నచో!కంజర్ల రామాచార్య.
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదములండీ.
ధన్యవాదములు🙏🏻🙏🏻.సవరణతోవలచిన భామ తోడుత వివాహముకాగ వసంతమందునన్చెలగెడు మండుటెండలకు చేతము కూడుట కిచ్చగింపకన్కలికియు దాను గూడ బిగుకౌగిలి క్షౌద్రహిమాంశువందునన్చలి యిడు బాధ వోవు హిమశైలమునం దల దాఁచుకొన్నచో.క్షౌద్రహిమంశు- Honeymoon
ఈనాటి శంకరాభరణం వారిచ్చిన సమస్య*“చలి బాధకు దాఁగుము హిమశైలమునందున్”*(లేదా…)*“చలి యిడు బాధ వోవు హిమశైలమునం దల దాఁచుకొన్నచో”*నా పూరణ (సరిచేసి)కందముశిలల మయంబుల హిమగిరిసలిలంబులు చల్లగుండు శాంతినొసగు నీ యిలలో ! నరుడా ! యిడుముల చలి బాధకు దాగుము హిమ శైలము నందున్చంపకమాలసలిలపు ధారలన్ దనరు చల్లని గాలులు హాయి గొల్పగా,శిలల మయంబునౌ మనము చేతన మొందుచు నుష్ణమౌనులే!చెలియలి చెంతనుండగను శీతల ముష్ణము కాకపోవునా!*“చలియిడు బాధవోవు హిమ శైలమునం దల దాఁచుకొన్నచో”*ఆదిభట్ల సత్యనారాయణ
చెలియా తలుపునుదీయుముచలిబాధకు తాళజాల సఖియాయనగాచెలికొంటెగపలికె నిటులచలి బాధకు దాఁగుము హిమశైలమునందున్
అబ్బబ్బ ఏమి చలి అండి బాబోయ్!బలికా వద్దోయి నరుడచలి బాధకు, దాఁగుము హిమశైలమునందున్చెలిచెంత వెచ్చగాను గుహలోన కప్పుకొని కంబళమ్మువలె సుమీజిలేబి
వెలవెలబోయెలాహిరితపించెనుత్ర్యంబకబాబగాంచగాచలిమలయందుదివ్యపురుషాగ్రణియిచ్చెరసాయనంబుదావిలవిలలాడెపూర్వభవవిస్మృతిదొల్గగయోగసాధనన్మలమలమాడుతాపమునమౌనజపంబునమోహపాపమన్*“జలి యిడు బాధ వోవు హిమశైలమునం దల దాఁచుకొన్నచో”*
బలికా వద్దు జిలేబి! మహిల! చలి యిడు బాధ వోవు హిమశైలమునం దల దాఁచుకొన్నచో మగని లావగు కరములలోన నిక్కముగ సుమీ !జిలేబి
ఇలనిడుములు వణికించగచలి బాధకు దాఁగుము హిమశైలమునందున్అల హిమ పుత్రి పతి శివుడుకలిగించుర మోక్ష వేడి కాచున్ నిన్నున్...భారతీనాథ్ చెన్నంశెట్టి....
వెలగల మాటలనాడుచువిలువలు పెంచంగ వలెను వినుకోవయ్యా!చలిగొను వానినన దగునెచలి బాధకు దాఁగుము హిమశైలము నందున్!! ****సవరణతో...ధన్యవాదములతో...🙏
కం:ఇలలో బొంతల యందున చలిబాధకు దాగుము హిమశైలము నందున్ మలమల మండెడి ఎండలనలివేణినిగూడిసమయమానందముతో
లలనల జోలికి నేఁగ ననల మంటిన రీతిఁ గాదె నయముగ నీ కుత్తల మణఁగ నెంచినను బుం శ్చలి బాధకు దాఁగుము హిమశైలము నందున్ సలసల కాఁగ నేల యిట సంతత చింతిత మానసమ్మునన్ వలవల యేడ్వ నేల యిట భాస్కర చండ కరార్తి తోడుతం గలవర మేల డెందమున ఘర్మపుఁ దాపము వోవు చక్కగం జలి యిడు, బాధ వోవు హిమశైలమునం దల దాఁచుకొన్నచో
అద్భుతమైన విరుపుతో చక్కని పూరణార్యా! నమోనమః!💐💐💐 🙏🙏🙏
ధన్యవాదములండి డా. సీతా దేవి గారు.
విరుపులో తాపభారాన్ని విరిచేశారు.... కామేశ్వర రావు గారూ.... అద్భుతమైన పూరణమండీ.... నమస్సులు!
చలిగిలిలేదునీవెపుఁడు జడ్డుతనంబును జూపుచున్నచోచలివడకించునిన్ను మనజాలుదువాత్మ నియంత్రణంబునన్చలినెదిరించి చిక్కనగు స్థైర్యము నింపిన మానసంబునన్చలి యిడు బాధ వోవు హిమశైలమునం దల దాఁచుకొన్నచో
లలితా!పతికౌగిలిలోచలిబాధకుదాగుము,హిమశైలమునందున్ నలయా శంభునికొఱకైశిలవలెదాజేసెతపము శైలజ రక్తిన్
విలయముదాండవించగను వేలకువేలుగబ్రాణనష్టమైనీలువగనీడలేనియెడ నేర్పునగొండను నాశ్రయించగాదెలియగరానిధైర్యమును దెంపునుగల్గుచునొక్కసారిగాచలియిడుబాధవోవు హిమశైలమునందలదాచుకొన్నచో
రెండవపాదములో నిలువగ అనిచదువవలసినది
చెలి నయనమ్ములా రుచులు ఛిన్నము జేయును ధ్వాంతమున్ హృదిన్వెలసిన నాభి యాకసమె ఫెళ్ళున ద్రుంచును పాపరాసులన్విలసిత శీతశైలమది విచ్చిన చన్గవ పాపు ద్వంద్వముల్*చలి యిడు బాధ వోవు హిమశైలమునం దల దాఁచుకొన్నచో*తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష
అల తాపంబున నెండను,జలధారలు గురియువేళ సంద్రమునందున్,కలలో నెవరో యనిరట,చలి బాధకు దాఁగుము హిమశైలమునందున్!
రిప్లయితొలగించండి"శ్రీ రాముని దయ చేతను..."
సరదా పూరణ:
తొలుతను ప్రేమజూపుచును తొయ్యలి జేరుచు మాటనీయగా
కలువల రాణియే త్వరగ గర్భము దాల్చుచు పెండ్లిముందునన్
కలిసిన వెంటనే కినిసి కన్నుల నందున నీరుకార్చగా
చలి యిడు బాధ వోవు హిమశైలమునం దల దాఁచుకొన్నచో...
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండివెలగల మాటలనాడుచు
రిప్లయితొలగించండివిలువలు పెంచంగ వలెను వినుకోవయ్యా!
చలిగొన్న వానన దగునే
చలి బాధకు దాఁగుము హిమశైలము నందున్!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"వాని నన దగునె" అనండి.
🙏
తొలగించండివెలివేయుముదేహపుసిరి
రిప్లయితొలగించండిమలిసంధ్యనుమనసుపెట్టుమాధవునందున్
చలితముగాకనుచూపున
చలిబాధకుదాగుముహిమశైలమునందున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
నలుబది నేతలాదటను నవ్వుచు వీడగ నిన్ను వేగమే
కులుకుచు మోడి చిత్రమును గొప్పగ నెత్తుచు వంగభూమినిన్
పలువురు భాజపా జనులు పండుగ జేయగ దీది నీకికన్
చలి యిడు బాధ వోవు హిమశైలమునం దల దాఁచుకొన్నచో...
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండిచెలి కౌగిటలో సతతము
రిప్లయితొలగించండిచలిబాధకు దాగుము,హిమ శైలము నందున్
సులువుగ గ్రీష్మ ఋతువులో
చెలితో గడుప మనుజునకు క్షేమంబగునే
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"చెలి కౌగిలిలో..." అనండి.
పలితముగాకకేశములుపన్నులునేలనురాలనప్పుడే
రిప్లయితొలగించండిపులిమినమోహగంధమునుఫూయనిరోయుచుపారిపోవుచున్
మలినముగానిమానసమునాదనునమ్మికనుండగాతుదిన్
చలియిడుబాధవోవుహిమశైలమునన్దలదాల్చుకోన్నచో
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములుగురువుగారు
తొలగించండి
రిప్లయితొలగించండిబోనసు సరదా పూరణ:
సలుపగ యుద్ధమున్ భళిగ చంపను కోరుచు చీని మూర్ఖులన్
తెలివిగ సైన్య రక్షకులు తేకువ మీరగ టెంటులందునన్
బలుపగు నారు కోటులను వైనపు రమ్మును నీకు చేర్చగా
చలి యిడు బాధ వోవు హిమశైలమునం దల దాఁచుకొన్నచో...
మీ బోనసు పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికందం
తొలగించండివలచితి ప్రవరా! నినునే
పిలిచి వరూధినొసఁగ నులి వెచ్చని బిగి కౌ
గిలి! మేలగు నోషధి యీ
చలి బాధకు! దాగుము హిమశైలమునందున్
చంపకమాల
వలపులు జారుచుండె జలపాతపు రీతిని నిన్నుగాంచఁగన్
బులకలు రేగవే ప్రవర! మోహము జూపు వరూధిణిన్గనన్
బిలిచి వధూటి కోరి నులివెచ్చని కౌగిట దాగరమ్మనన్
జలి యిడు బాధ వోవు! హిమశైలమునం దల దాఁచుకొన్నచో!!
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి'వరూధిని+ఒసగ' అన్నపుడు సంధి లేదు. "పిలిచి వరూధిని యిడ నులి వెచ్చని..." అనండి.
'వరూధినిన్గనన్' టైపాటు.
గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ :
తొలగించండికందం
వలచితి ప్రవరా! నినునే
పిలిచి వరూధిని యిడ నులి వెచ్చని బిగి కౌ
గిలి! మేలగు నోషధి యీ
చలి బాధకు! దాగుము హిమశైలమునందున్!
చంపకమాల
వలపులు జారుచుండె జలపాతపు రీతిని నిన్నుగాంచఁగన్
బులకలు రేగవే ప్రవర! మోహము జూపు వరూధినిన్గనన్
బిలిచి వధూటి కోరి నులివెచ్చని కౌగిట దాగ రమ్మనన్
జలి యిడు బాధ వోవు! హిమశైలమునం దల దాఁచుకొన్నచో!!
చలిమల పుత్రికాయుత ప్రశస్త శివాద్భుత నాట్య కేళికిన్
రిప్లయితొలగించండినెవవగు గాన నయ్యది వినిర్మలమైన విహార సీమయై
చెలువము నింపుగాదె!సుఖ శీకరదివ్య మనోజ్ఞ ధామమై-
చలి యిడు బాధ వోవు హిమ శైలమునం దల దాచుకొన్నచో
చాల బాగుందండీ! అభినందనలు! నెలవగు టైపాటు! 🙏🙏
తొలగించండిమీ పూరణ మనోజ్ఞంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిసీతాదేవి గారన్నట్లు టైపాటు.
సీతాదేవి గారూ !
తొలగించండికృతజ్ఞతలు. గురువర్యా! నమస్తే
బలవంతుడు శత్రువనుచు
రిప్లయితొలగించండిఖలుడతనిని జంపనెంచి కపటము తో నె
చ్చెలిగ నటియించుచు పలికె
చలి బాధకు దాఁగుము హిమశైలమునందున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివలపుల పతి కౌగిలి లో
రిప్లయితొలగించండిచలి బాధకు దాగుము : హిమ శైలము నందున్
సలుపు ను శివుడు తపంబును
విలసిత కళ్యాణ ములకు విశ్వము కెల్లన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'విశ్వమునకెల్లన్' అనడం సాధువు. అక్కడ "విశ్వమ్మునకున్" అనండి.
సలుపగ లేక యుద్ధమును శత్రువు జంపెడి కోర్కెహెచ్చగా
రిప్లయితొలగించండిచెలిమరినంచు చెప్పుకుని క్షేమము కోరెడి వాడినంచు తా
బలికె నికారమందున నబద్దమటంచునెఱంగి యిట్టులన్
చలి యిడు బాధ వోవు హిమశైలమునం దల దాఁచుకొన్నచో
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపలుకంగ దలచె నివ్విధి
రిప్లయితొలగించండిచెలి బాధకు దాగుము హిమశైలము
నందున్
చెలియకు భయమంది బలికె
చలిబాధకు దాగుము హిమశైలము
నందున్
తలపులనుంచి బ్రహ్మమును తన్మయులౌచును నాత్మనందునన్
నిలుచుచు ధ్యానమార్గమున నిశ్చలరూపున మౌనివర్యులే
వెలువడ నగ్నితేజమది వ్రేల్చగ పాపపు రాశినందునన్
చలియిడు బాధవోవు హిమశైలమునన్ దలదాచుకొన్నచో
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిమొదటి పూరణ రెండవ పాదంలో యతి తప్పింది. సవరించండి.
ధన్యవాదములు గురుదేవా! నమస్సులు! సవరిస్తాను! 🙏🙏🙏
తొలగించండిసవరించిన పూరణ
తొలగించండిపలుకంగ దలచె నివ్విధి
చెలి బాధకు దాగుము హిమశృంగము
నందున్
చెలియకు భయమంది బలికె
చలిబాధకు దాగుము హిమశైలము
నందున్
వలచిన భామ తోడుత వివాహముకాగ వసంతమందునన్
రిప్లయితొలగించండిచెలగెడు మండుటెండలకు చేతము కూడుట కిచ్చగింపకన్
కలికిలకొల్కి దోడబిగు కౌగిలి క్షౌద్రహిమాంశుకై చనన్
చలి యిడు బాధ వోవు హిమశైలమునం దల దాఁచుకొన్నచో.
క్షౌద్రహిమంశు- Honeymoon
రాయబారిగా హనుమంతు డిట్లు బుద్ధి సెప్పె:
తొలగించండివలచితివిక సీతమ్మన్
ఖలుడా! రావణ! విడువుము కడకున్ బ్రాణ
మ్ములు గొను రాముడు, చనుమిక
చలి బాధకు దాఁగుము హిమశైలమునందున్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి'చిలుకల కొల్కి' ఉంది.. మరి 'కలికిల కొల్కి'?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచం:
రిప్లయితొలగించండిబలివిడి గొన్న పెట్టుబడి బాటలు వేయగ నష్టమొందగన్
కలతయె చెంద కుండగను కారణ మెంచక నప్పుజేయుచున్
నిలువున ముంచి నెల్లరల నేతల యండ విదేశ మేగగన్
చలియిడు బాధ వోవు హిమశైలమునం దల దాచుకొన్నచో
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు
తొలగించండివెలుగులదొర తపనమునకు
రిప్లయితొలగించండికలగుచు వాతానుకూల్యకరణ బిస గొనన్
విలువను జూడగ పుట్టిన
చలి బాధకు దాఁగుము హిమశైలమునందున్
బిస = యంత్రము
వాతానుకూల్యకరణ బిస = Air conditioner
చలి = భయము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈనాటి శంకరాభరణం వారిచ్చిన సమస్య
రిప్లయితొలగించండి*“చలి బాధకు దాఁగుము హిమశైలమునందున్”*
(లేదా…)
*“చలి యిడు బాధ వోవు హిమశైలమునం దల దాఁచుకొన్నచో”*
నా పూరణ
1)కందము
శిలల మయంబుల హిమగిరి
సలిలంబులు చల్లగుండు శాంతిని గూర్చున్ !
యిలలో ! నరుడా ! యిడుముల
చలి బాధకు దాగుము హిమ శైలము నందున్
2)చంపకమాల
సలిలపు ధారలన్ దనరు చల్లని గాలులు హాయి గొల్పగా,
శిలల మయంబునౌ మనము చేతన మొందుచు నుష్ణమౌనులే!
చెలియలి చెంతనుండగను శీతల ముష్ణము కాకపోవునా!
చలియిడు బాధవోవు హిమ శైలమునం దల దాఁచుకొన్నచో
ఆదిభట్ల సత్యనారాయణ
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి'కూర్చున్+ఇలలో' అన్నపుడు యడాగమం రాదు. "శాంతి నొసగు నీ యిలలో..." అనండి.
ఇలలోనాకలిమంటల
రిప్లయితొలగించండిచలిబాధలునేమిసేయు బల్కుము గురుడా
బలహీనులకెటులజెపుతు
చలి బాధకు దాఁగుము హిమశైలమునందున్??
చెలులిద్దరున్న భవుడే
తొలగించండినొలుకుల మంటలను కాగి నోర్పుగ నుండెన్
యిల జీవుని కెటులతగును
చలి బాధకు దాఁగుట హిమశైలమునందున్??
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి'చెపుతు' అన్నది సాధువు కాదు. "బలహీనుల కెటు జెప్పుదు" అనండి.
'ఉండెన్+ఇల' అన్నపుడు యడాగమం రాదు. "కాగి యోర్పు గలుగ నీ । యిల..." అనండి.
🙏 ధన్యవాదాలు గురువర్యా
తొలగించండిసమస్య :
రిప్లయితొలగించండిచలి యిడు బాధవోవు హిమ
శైలమునం దల దాచుకొన్నచో
( ప్రవరునితో వరూధిని )
ఉలుకును బల్కు లేక నిటు
లుండుట మంచిది కాదు సుందరా !
యెలమిని నాదు మందిర మ
దెంతయు నీకయి వేచె మాన్యుడా !
పులకల నాయెదన్ శిరము
బొందిక నుంపు ; వరూధినీవరా !
చలి యిడు బాధ వోవు ; హిమ
శైలమునం దలదాచుకొన్నచో .
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి'లేక యిటు' అని ఉండాలి కదా?
చెలిబిగి కౌగిలింత నిడ చెన్నును చూపుచు రాత్రివేళలో
రిప్లయితొలగించండిచలి యిడు బాధ వోవు, హిమశైలమునం దల దాఁచుకొన్నచో
మలహరు దర్శనమ్మునను మందిరమందున పూజచేయుచున్,
కలుగు విమోచనమ్ము మసికంధరుడౌ జడదారి ప్రేమతో
మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిగురువర్యులకు నమస్సులు. ధన్యవాదములు.
తొలగించండినిలువగ నీడలే దరయఁ దిండికి గింజలు లేవు సర్వమున్
రిప్లయితొలగించండివలపునుఁ జూపి దోచె మురిపమ్మునకై బలియైతి నంచుఁదా
నల విటు డొక్కరుండు వెలయాలిని వీడి దలంచె నిట్లు పుం
శ్చలి యిడు బాధ వోవు హిమశైలమునం దల దాఁచుకొన్నచో!
కంజర్ల రామాచార్య.
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములండీ.
తొలగించండిధన్యవాదములు🙏🏻🙏🏻.
రిప్లయితొలగించండిసవరణతో
వలచిన భామ తోడుత వివాహముకాగ వసంతమందునన్
చెలగెడు మండుటెండలకు చేతము కూడుట కిచ్చగింపకన్
కలికియు దాను గూడ బిగుకౌగిలి క్షౌద్రహిమాంశువందునన్
చలి యిడు బాధ వోవు హిమశైలమునం దల దాఁచుకొన్నచో.
క్షౌద్రహిమంశు- Honeymoon
ఈనాటి శంకరాభరణం వారిచ్చిన సమస్య
రిప్లయితొలగించండి*“చలి బాధకు దాఁగుము హిమశైలమునందున్”*
(లేదా…)
*“చలి యిడు బాధ వోవు హిమశైలమునం దల దాఁచుకొన్నచో”*
నా పూరణ (సరిచేసి)
కందము
శిలల మయంబుల హిమగిరి
సలిలంబులు చల్లగుండు శాంతినొసగు నీ
యిలలో ! నరుడా ! యిడుముల
చలి బాధకు దాగుము హిమ శైలము నందున్
చంపకమాల
సలిలపు ధారలన్ దనరు చల్లని గాలులు హాయి గొల్పగా,
శిలల మయంబునౌ మనము చేతన మొందుచు నుష్ణమౌనులే!
చెలియలి చెంతనుండగను శీతల ముష్ణము కాకపోవునా!
*“చలియిడు బాధవోవు హిమ శైలమునం దల దాఁచుకొన్నచో”*
ఆదిభట్ల సత్యనారాయణ
చెలియా తలుపునుదీయుము
రిప్లయితొలగించండిచలిబాధకు తాళజాల సఖియాయనగా
చెలికొంటెగపలికె నిటుల
చలి బాధకు దాఁగుము హిమశైలమునందున్
రిప్లయితొలగించండిఅబ్బబ్బ ఏమి చలి అండి బాబోయ్!
బలికా వద్దోయి నరుడ
చలి బాధకు, దాఁగుము హిమశైలమునందున్
చెలిచెంత వెచ్చగాను గు
హలోన కప్పుకొని కంబళమ్మువలె సుమీ
జిలేబి
వెలవెలబోయెలాహిరితపించెనుత్ర్యంబకబాబగాంచగా
రిప్లయితొలగించండిచలిమలయందుదివ్యపురుషాగ్రణియిచ్చెరసాయనంబుదా
విలవిలలాడెపూర్వభవవిస్మృతిదొల్గగయోగసాధనన్
మలమలమాడుతాపమునమౌనజపంబునమోహపాపమన్
*“జలి యిడు బాధ వోవు హిమశైలమునం దల దాఁచుకొన్నచో”*
రిప్లయితొలగించండిబలికా వద్దు జిలేబి! మ
హిల! చలి యిడు బాధ వోవు హిమశైలమునం
దల దాఁచుకొన్నచో మగ
ని లావగు కరములలోన నిక్కముగ సుమీ !
జిలేబి
ఇలనిడుములు వణికించగ
రిప్లయితొలగించండిచలి బాధకు దాఁగుము హిమశైలమునందున్
అల హిమ పుత్రి పతి శివుడు
కలిగించుర మోక్ష వేడి కాచున్ నిన్నున్
...భారతీనాథ్ చెన్నంశెట్టి....
వెలగల మాటలనాడుచు
రిప్లయితొలగించండివిలువలు పెంచంగ వలెను వినుకోవయ్యా!
చలిగొను వానినన దగునె
చలి బాధకు దాఁగుము హిమశైలము నందున్!!
****సవరణతో...
ధన్యవాదములతో...🙏
కం:ఇలలో బొంతల యందున
రిప్లయితొలగించండిచలిబాధకు దాగుము హిమశైలము నందున్
మలమల మండెడి ఎండల
నలివేణినిగూడిసమయమానందముతో
లలనల జోలికి నేఁగ న
రిప్లయితొలగించండినల మంటిన రీతిఁ గాదె నయముగ నీ కు
త్తల మణఁగ నెంచినను బుం
శ్చలి బాధకు దాఁగుము హిమశైలము నందున్
సలసల కాఁగ నేల యిట సంతత చింతిత మానసమ్మునన్
వలవల యేడ్వ నేల యిట భాస్కర చండ కరార్తి తోడుతం
గలవర మేల డెందమున ఘర్మపుఁ దాపము వోవు చక్కగం
జలి యిడు, బాధ వోవు హిమశైలమునం దల దాఁచుకొన్నచో
అద్భుతమైన విరుపుతో చక్కని పూరణార్యా! నమోనమః!💐💐💐 🙏🙏🙏
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిధన్యవాదములండి డా. సీతా దేవి గారు.
తొలగించండివిరుపులో తాపభారాన్ని విరిచేశారు.... కామేశ్వర రావు గారూ.... అద్భుతమైన పూరణమండీ.... నమస్సులు!
తొలగించండిచలిగిలిలేదునీవెపుఁడు జడ్డుతనంబును జూపుచున్నచో
రిప్లయితొలగించండిచలివడకించునిన్ను మనజాలుదువాత్మ నియంత్రణంబునన్
చలినెదిరించి చిక్కనగు స్థైర్యము నింపిన మానసంబునన్
చలి యిడు బాధ వోవు హిమశైలమునం దల దాఁచుకొన్నచో
లలితా!పతికౌగిలిలో
రిప్లయితొలగించండిచలిబాధకుదాగుము,హిమశైలమునందున్
నలయా శంభునికొఱకై
శిలవలెదాజేసెతపము శైలజ రక్తిన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివిలయముదాండవించగను వేలకువేలుగబ్రాణనష్టమై
రిప్లయితొలగించండినీలువగనీడలేనియెడ నేర్పునగొండను నాశ్రయించగా
దెలియగరానిధైర్యమును దెంపునుగల్గుచునొక్కసారిగా
చలియిడుబాధవోవు హిమశైలమునందలదాచుకొన్నచో
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిరెండవపాదములో నిలువగ అనిచదువవలసినది
తొలగించండిచెలి నయనమ్ములా రుచులు ఛిన్నము జేయును ధ్వాంతమున్ హృదిన్
రిప్లయితొలగించండివెలసిన నాభి యాకసమె ఫెళ్ళున ద్రుంచును పాపరాసులన్
విలసిత శీతశైలమది విచ్చిన చన్గవ పాపు ద్వంద్వముల్
*చలి యిడు బాధ వోవు హిమశైలమునం దల దాఁచుకొన్నచో*
తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష
అల తాపంబున నెండను,
రిప్లయితొలగించండిజలధారలు గురియువేళ సంద్రమునందున్,
కలలో నెవరో యనిరట,
చలి బాధకు దాఁగుము హిమశైలమునందున్!