27, డిసెంబర్ 2020, ఆదివారం

సమస్య - 3587

28-12-2020 (సోమవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“కవుల కల్పన కాదె సాగరమథనము”

(లేదా…)

“కవుల మనోజ్ఞకల్పనయె కాక పయోదధిఁ ద్రచ్చ సాధ్యమే”

70 కామెంట్‌లు:

  1. 27 12 2020
    అందరికీ నమస్సులు🙏

    నా పూరణ ప్రయత్నం..

    *తే గీ*

    వినగ నెన్నియో గాథలు ప్రియముగాను
    లోక మంతయు నెరుగును సాకు లేల
    నిజము నిజమని తెలుపగ ఋజువులేల
    *“కవుల కల్పన కాదె! సాగరమథనము”*

    *కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
    🙏🙏

    రిప్లయితొలగించండి

  2. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    పవలును రేయినిన్ గనక పద్యము లల్లెడి వారిజూచుచున్
    చెవులను మూయుచున్ నగుచు చేరుచు నొక్క వధానమందునన్
    కవుల సమూహమందునిటు గట్టిగ బల్కిన చెప్పుదెబ్బలే:
    “కవుల మనోజ్ఞకల్పనయె కాక పయోదధిఁ ద్రచ్చ సాధ్యమే”

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
      ఆయా నగరాలలో జరిగిన అవధానాలకు పృచ్ఛకుడిగా వెళ్ళి నేనిచ్చిన సమస్యలు గుర్తుకు వచ్చాయి...
      1. నంద్యాల - "నంద్యాల పురప్రజల్ స్తుతి కనర్హు లవిజ్ఞులు నీతిదూరులున్" (ఛందోగోపనము)
      2. కర్నూలు - "కవి యొక్కండును గానరాఁడు గద యీ కర్నూలునం జూడఁగన్"
      3. శ్రీకాకుళం - "శ్రీనాథుండు చరించి రోసెనఁట యీ శ్రీకాకుళమ్మున్ గటా!"
      4. తిరుపతి - "తిరుమల వేంకటేశ్వరుఁడె దేవుఁడు క్రైస్తవ భక్తకోటికిన్"
      5. మాచర్ల - "మదిరాపానవిశేషమత్తులు గదా మాచర్ల వాసుల్ సదా"
      మరికొన్ని నగరాలలో నిషిద్ధాక్షరి పృచ్ఛకుడిగా పిలిచారు. లేకుంటే ఇలాంటివి మరికొన్ని సిద్ధమయ్యేవి!

      తొలగించండి
  3. కవుల కల్పన కాదె సాగరమథనము
    నెటుల జెప్పిన వినరైరినేమిజేతు
    ఋషులు దర్శించి జూపగ ఋజువులేల
    వారి మాటలు నేరీతి కానివౌను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "వినరైరి యేమి జేతు... మాట లేరీతిగ కానివౌను.." అనండి.

      తొలగించండి

  4. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    పవలును రేయినిన్ దవిలి పట్టును వీడక నాల్గు ప్రక్కలన్
    నవనవలాడు రీతులను నందము నొందుచు దేవులాడగన్
    కువలయమందునన్ గనము గొప్పగ నుండెడి పాలసంద్రమున్
    కవుల మనోజ్ఞకల్పనయె కాక పయోదధిఁ ద్రచ్చ సాధ్యమే?

    రిప్లయితొలగించండి
  5. గ్రంథముల లోని వాటిని కల్ల లనుచు
    నమ్మకము లేని యొక్కడు నైజము గను
    పల్కె నిట్టుల నొకచోట వాద మందు
    "కవుల కల్ప న కాదె సాగర మ థ నము "

    రిప్లయితొలగించండి
  6. తేటగీతి
    మనుజుని మనమ్ము సాగరమనగఁ నొప్ప
    మన్మథనమున సర్వసంభవమనంగ
    సురల మురిపించు పాత్రలన్ సొంపుఁ దీర్చు
    కవుల కల్పన కాదె సాగరమథనము

    చంపకమాల
    అవనిని మానవుందగు మహాత్మునిగన్ మలచంగ నెంచి సిం
    ధువనఁగ నొప్పు మానసము తోడ మహోన్నత కార్య మైన సం
    భవమగు నంచు దెల్ప సురవంద్యుల పాత్రల నాటకమ్ముగన్
    గవుల మనోజ్ఞకల్పనయె కాక పయోదధిఁ ద్రచ్చ సాధ్యమే?

    రిప్లయితొలగించండి
  7. కవులకలమున వెలువడు కల్పనలను
    స్వీకరించు టుచితమేను చింతపడక
    మౌనమే తగు నిట్టిది మానసమున
    కవుల కల్పన కాదె సాగరమథనము
    వినరు వింతైన దేదియు విజ్ఞులయ్యు
    ట్విస్టు లననివి యేనుగా వినుము దెలియ!!

    రిప్లయితొలగించండి
  8. దధినిమానసభాండంబుదర్వితోడ
    వెలికితీయంగదాగినవెన్నదోంగ
    సాధ్యమేరీతినగునయ్యశమములేక
    కవులకల్పనగాదెసాగరమథనము

    రిప్లయితొలగించండి
  9. తేట గీతి::
    భవునకునిరువురు వలదు పత్నులునిక

    భువికి విడు గంగయనెడి , తిమురు పలుకులు

    కవుల కల్పన కాదె :; సాగరమథనము”

    వేళ గరళము మింగిన వేల్పె ఋజువు

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  10. మైలవరపు వారి పూరణ

    దివిజులు సేయలేని పని దెల్పగ సాధ్యమె? కార్యకారణ
    ప్రవరులు వారు., సాధకులు., వార్థి సృజింపగ శక్తిమంతులౌ,
    కవులిల క్రాంతదర్శులన గాంచి రచించిరి, వింత యౌనొకో?
    కవుల మనోజ్ఞకల్పనలె కాక., పయోదధి ద్రచ్చ సాధ్యమే.

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  11. సుధను గోరుచు నలనాడు సురలసురులు
    మందరగిరియె కవ్వము కాగ మర్కమదియె
    తాడుగను జేసికొనుట సత్యమదియేను
    కవుల కల్పన కాదె, సాగరమథనము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణభంగం."మందరిగిరి కవ్వము గాగ మర్క మదియె..." అనండి.

      తొలగించండి
  12. వ్యాసునకెవరు జెప్పిరి భాగవతము
    రామభద్రుడు( బలికించె రమ్యముగను
    కావ్య రచనలు వెలువడు కలము నుండి
    కవుల కల్పన కాదె! సాగరమథనము

    రిప్లయితొలగించండి
  13. యువతను మార్చివేసెద మహోన్నత మూర్తులు గానటంచు నీ
    నవయుగ మందు కావలయు నాస్తిక వాదమటంచు చెప్పెడిన్
    వివరిణు డొక్కడాతని యభీష్టను చేరి వచించె నిట్టులన్
    కవుల మనోజ్ఞకల్పనయె కాక పయోదధిఁ ద్రచ్చ సాధ్యమే

    రిప్లయితొలగించండి
  14. లవణపు సంద్రమేతెలియు లావుగ భూమి వసించువారికిన్
    దివిజులు దానవాళితమ ధ్యేయము
    పీయుష పానమేయనన్
    చవిగొని మంధరమ్ము నహి సాధనముల్ గొనిచిల్కజూచెనన్
    కవుల మనోజ్ఞకల్పనయె కాక పయోదధి ద్రచ్చసాధ్యమే ?
    చెవులను పూలుబెట్టుటయె చెల్లవు
    నేడు పురాణపాఠముల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సవనముగా దలంచి భవసాగర మీదను యోగివర్యులే
      పవనము నిగ్రహించి వెనుబామును
      కవ్వముగాగ్రహించుచున్
      అవనత కుండలిన్ గదిపి యారు
      కులంబులదాటి యావలన్
      దివిజుల యన్నమున్ గొనెడి తీరును
      దెల్పెడి కార్యమేయనన్
      కవుల మనోజ్ఞకల్పన కాక పయోదధి ద్రచ్చసాధ్యమే?

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. ధన్యవాదములు గురువర్యా! నమస్సులు! 🙏🙏🙏

      తొలగించండి
  15. రవియునుచూడడేవిధినిరాగలకల్పనకావ్యమందునన్
    చవియునుపుట్టదెవ్వరికిచాలగవర్ణనచేయఁజాలమిన్
    నివురునుఁగప్పునిప్పువలెనేర్పుగనూహనునింపగానటన్
    కవులమనోజ్ఞకల్పయెగాకపయోదధిఁద్రచ్చసాధ్యమే

    రిప్లయితొలగించండి
  16. చెవులకు, మానసంబునకు జేరు విధంబుగ మంచి నెప్పుడున్
    కవివరు లివ్విధంబున యుగాలకు పూర్వము సాగినట్టి వా
    స్తవమును దెల్పినారనుట సందియమేలయ? క్రాంత దర్శులా
    కవుల మనోజ్ఞకల్పనయె కాక, పయోదధిఁ ద్రచ్చ సాధ్యమే.

    రిప్లయితొలగించండి
  17. చం:

    కవనము గాదె భాగవత కావ్యము నెంచ నభూతమంచనన్
    నవరస మైన ఘట్టమది నచ్చెరుపాటున వ్యాప్తిబొంద గా
    నవసరమున్న వేళ తవు నాట రచించి తరించి నట్లుగా
    కవుల మనోఙ్ఞ కల్పనయె, కాక పయోదధి ద్రచ్చ సాధ్యమే

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  18. కవులన నెవ్వరోయి యిల కల్పనజేసెడు వారలేగదా
    రవియును గాంచకుండు నది రాజస మందున వ్రాయ నెంచుచున్
    పవలును రాత్రిగాను సరిభావన గల్గువిధంబు బల్కుచున్
    వివరము జెప్పుటందు కడు ప్రీతిగ మెప్పుగ దెల్పు వింతలన్
    కవుల మనోజ్ఞకల్పనయె కాక పయోదధిఁ ద్రచ్చ సాధ్యమే!!

    రిప్లయితొలగించండి
  19. కాశి గాంచకున్న గవులు గాంచ గలరు
    లేనిదాన్ని జూపించి యూరించ గలరు
    జరుప శక్యము గానిది జరుప గలరు
    కవుల కల్పన కాదె సాగరమథనము

    రిప్లయితొలగించండి
  20. సమస్య :
    కవుల మనోజ్ఞకల్పనయె
    కాక పయోదధి ద్రచ్చ శక్యమే

    ( రంగనాయకమ్మ తన మనుమనితో )

    దివియును లేదు ; లేరు మరి
    దేవత లెచ్చట ; లేరు రాక్షసుల్ ;
    భువియును మానవుల్ నిజము ;
    ముక్తియు భక్తియు వట్టిమాట ; భా
    గవతము భారతాదులను
    గాలిని ప్రోగులు బోసినారురా !
    కవుల మనోజ్ఞకల్పనయె
    కాక పయోదధి ద్రచ్చ సాధ్యమే ??

    రిప్లయితొలగించండి
  21. ఈనాటి శంకరాభరణం వారిచ్చిన

    సమస్య

    *“కవుల కల్పన కాదె సాగరమథనము”*
    (లేదా…)
    *“కవుల మనోజ్ఞకల్పనయె కాక పయోదధిఁ ద్రచ్చ సాధ్యమే”*

    తేటగీతి

    సాహితీలోక మానస సైకతమున
    కవన నర్తనా పరవశ కౌశలమున
    భావ పరికల్పిత స్వేచ్ఛ పరిఢవిల్ల
    కవుల కల్పన గాదె సాగర మథనము

    చంపకమాల

    రవి గనలేని సూక్ష్మములు రాజిత రీతిని గాంచుగా వినన్
    గవివరుడే ; రచించుచును కమ్మని కావ్య సుధారసంబులన్
    భవతర సాహితీ ప్రియుల భవ్యమనమ్ముల నింపునట్లుగన్
    కవుల మనోజ్ఞ కల్పనమె కాక పయోదధి ద్రచ్చ సాధ్యమే

    ఆదిభట్ల సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
      'నర్తన పరవశ..' అనండి.

      తొలగించండి


  22. అనఘా! కొండను దింపిర
    ట నడుమ! కవ్వము చిలికిరటన్న!‌ కవుల క
    ల్పన కాదె సాగరమథన
    ము? నమ్మదగిన కథయకొ? నమోవాకమ్ముల్!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  23. అధకిమ్! చూడ విచిత్ర వ
    నధి! కవుల మనోజ్ఞకల్పనయె కాక పయో
    దధిఁ ద్రచ్చ సాధ్యమేనా ?
    సుధారసము లొల్కెడు మది సువచనములెగా!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  24. కవికమనీయకల్పనలు కావ్యము లందున నుండు నంత నా
    కవితలు కల్లలౌనె? గిరిఁ గేల వహించడె? కృష్ణు, డబ్ధినిన్
    పవను సుతుండు దాటడె?, సుపర్వులు వీరులు గారొ?, వారిచే,
    కవుల మనోజ్ఞకల్పనయె కాక, పయోదధిఁ ద్రచ్చ సాధ్యమే.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  25. మనసుకడలిలో సాగెడు మథనమునకు
    సాటితానౌనె మథనమ్ము సాగరమున
    మనసునొకసాగరమ్ముగా ననువదించు
    కవుల కల్పన కాదె సాగరమథనము

    రిప్లయితొలగించండి
  26. నవరస భావనల్ కవి మనంబున నుద్భవ మొంది గావ్యమై
    భువికి ప్రతీక వాదముల మోదము గూర్చి జనాళి శ్రేయమున్
    రవి గనలేని ఠావులను ప్రాణుని యన్నము మార్మికంబిదే
    *“కవుల మనోజ్ఞకల్పనయె కాక పయోదధిఁ ద్రచ్చ సాధ్యమే”*

    రిప్లయితొలగించండి
  27. శివుడును కేశవుండును శచీ పతి సూర్యుడు చంద్రు సాక్షిగా

    భువినను నీతి న్యాయములు పూనిక చూడగ లేవు మానవా
    నెవరికి సాధ్యమౌ చిలికి నేర్పుగ తీయగ నీతి , చూడగా
    కవుల మనోజ్ఞకల్పనయె కాక పయోదధిఁ ద్రచ్చ సాధ్యమే

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి....

    రిప్లయితొలగించండి
  28. ప్రవరుని పాదలేపనముఁబాఱగ జేరెను దేశదేశముల్,
    కువలయనాధుడావిధముఁగోఱఁగ నిచ్చెను నాయువున్భళీ!
    శివునకుకన్నులిచ్చెననిశిల్పముఁజెక్కగ
    భక్తిభావస
    త్కవుల మనోజ్ఞకల్పనయె కాక పయోదధిఁ ద్రచ్చ సాధ్యమే

    కొరుప్రోలు రాధాకృష్ణ రావు

    రిప్లయితొలగించండి


  29. వేదములయందు దెల్పినన్ వినక యిటుల
    *కవుల కల్పన గాదె సాగరమథనము*
    లనెడి నాస్తికులపలుకు లాలకించు
    టొప్పు గాదటండ్రు బుధులు పుడమి యందు.

    మరొక పూరణ

    .పవలును రేయియున్ విడక వాసుకి సాయము నందుచబ్ధియున్
    దివిజులుదైత్యులున్ కలిసి ధ్యేయమునూని మధించ రంచనన్
    *కవుల మనోజ్ఞ కల్పనయెకాక పయోదధి త్రచ్ఛ సాధ్యమే*
    చెవిని టుపూవి డంగని లచెప్పు టయొప్ప నుగాద దెప్పుడున్

    రిప్లయితొలగించండి
  30. దేవ దానవ గుణముల తెలియ జేయ
    భారతైతిహాసములను పామరులకు
    కవులెపుడు క్రాంతి దర్శనుల్ గావున, మన
    కవుల కల్పన కాదె, సాగరమథనము.

    రిప్లయితొలగించండి
  31. కవులకల్పనకాదెసాగరమథనము
    సాగరమథనమయ్యది సత్యమార్య!
    కాదుకల్పనముమ్మాటికదియ సుమ్ము
    యమృతముకొఱకు చిలికిరి యసురగణము
    పాలసంద్రమునయ్యెడ వాసిగాను

    రిప్లయితొలగించండి
  32. హాలహాలమ్ము వుట్టిన హరుఁడు మ్రింగి
    లోకములఁ గావ నెఱుఁగమె! లోకమాత
    లక్ష్మి వుట్టిన హరియె దారగఁ గొనండె!
    కవుల కల్పన కాదె! సాగరమథనము


    రవి నభ మందు శూన్యమున రాజిల నాస్పద మెద్ది తల్చఁగన్
    భువి రవి చుట్టు సంతతము మూరుచు నాగక తిర్గఁ గాంచమే
    వివరము నేర కున్న ధర వింతగఁ బల్కుట పాడియే యిటుల్
    కవుల మనోజ్ఞకల్పనయె కాక పయోదధిఁ ద్రచ్చ సాధ్యమే

    రిప్లయితొలగించండి
  33. ఒక భార్యాబాధితుని ఉవాచ 😊
    చంపక మాలిక

    ఉవిదల మానసంబులవి యుచ్ఛల
    వార్ధు లగాధముల్ గనన్
    అవునన గాదనంద్రు తమ యాజ్ఞలె చెల్లగ పట్టుబట్టుచున్
    అవసరమైనచో గురియు నశ్రువులన్
    వడి నేకధారగా
    అవధులులేని రాగమును నంతట కౌగిలి నిత్తురే భళా!
    చివురుల బోలువారనుచు స్త్రీలను సున్నిత మైనవారుగా
    కవుల మనోజ్ఞవర్ణనయె కాక పయోదధి ద్రచ్చ సాధ్యమే ?

    రిప్లయితొలగించండి
  34. కవులమనోఙ్ఞకల్పనయెకాక పయోదధిద్రచ్చసాధ్యమే
    దివిజులుమొత్తమందఱునుదైత్యులునేకములౌచుద్రచ్చగా
    దవిషమునుండిపుట్టెనుగదద్దయురుచ్యపుపేయుషంబునే
    కవియనునాతడెప్పుడునుగచ్చితమౌనగువ్రాతవ్రాయుసూ

    రిప్లయితొలగించండి
  35. కవన కుతూహలంబె నదిగాక మరేమిటి యెచ్చటేనియున్
    తవిషమునందు మందరము ద్రచ్చుట పామును రజ్జు జేసి సం
    భవమగునేయటంచుయనుభావముగానొక నాస్తికుండనెన్
    కవుల మనోజ్ఞకల్పనయె కాక పయోదధిఁ ద్రచ్చ సాధ్యమే

    రిప్లయితొలగించండి
  36. కవులు సముద్రతుల్యమగు
    ఖ్యాతిని గొన్న వచోవిలాసులౌ!
    కవులు నియోజన క్రమత
    గన్నుల నిల్పెడి వారలౌటనే!
    కవులు నిరంతర ప్రసర
    కల్పనలన్ సృజియించు వారలే!
    కవుల మనోజ్ఞకల్పనయె
    కాక పయోదధిఁ ద్రచ్చ సాధ్యమే!

    రిప్లయితొలగించండి