10, డిసెంబర్ 2020, గురువారం

సమస్య - 3570

11-12-2020 (శుక్రవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“నందనుల దహించిరంట నాటి పురంధ్రుల్”

(లేదా…)

“నందనులన్ దహించిరఁట నాటి పురంధ్రులు శీలరక్షకై”

(నేటి పట్వర్ధన్ గారి అష్టావధానంలో అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారిచ్చిన సమస్య)

66 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    అందరు స్త్రీలు సందడిగ హ్లాదము నొందుచు తర్ల పూజకై
    కొందరు మూర్ఖులాదటను కొట్టుచు నీలలు వెంబడించగా
    గందర గోళమున్ సయిచి గాడిద లయ్యెడి రోడులందు నా
    నందనులన్ దహించిరఁట నాటి పురంధ్రులు శీలరక్షకై...

    నందనుడు = సంతోషించు వాడు
    (శబ్దరత్నాకరము)

    రిప్లయితొలగించండి
  2. అందనిభోగమునందగ
    విందునుసేయగముదితలవీక్షణతోడన్
    మందగమసలెడిమన్మధ
    నందనులదహించిరంటనాటిపురంధ్రుల్

    రిప్లయితొలగించండి

  3. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    She Police Hyderabad:
    040-23202355

    సందడి లేని వీధినిట జంకుచు కన్నియ పోవుచుండగా
    తొందర జేయుచున్ తనరి దున్నల మీరుచు త్రాగుబోతులై
    ముందర రాగ కేకలిడి పూర్వపు రీతుల గార్దభమ్ములన్
    నందనులన్ దహించిరఁట నాటి పురంధ్రులు శీలరక్షకై...

    గార్దభమ్ములన్ నందనులు = రాసభ సూనులు

    రిప్లయితొలగించండి
  4. కందుమువీరకాముకులగమ్యమునాకముగాకయుండగన్
    విందుగభూతప్రేతములువీరినిచీల్చుచుచెండులాడగన్
    సందులదూరుభావములషండులవోలెనుతిర్గునాధరా
    నందనులన్దహించిరటనాటిపురంధ్రులుశీలరక్షకై

    రిప్లయితొలగించండి

  5. బోనసు సరదా పూరణ:

    హుందగ జూమునందుభళి హుంకృతి జేయుచు కైపదమ్మునున్
    గందర గోళమున్ సలుప కయ్యపు రీతి వధానమందునన్
    నందము నొంది పల్కిరిట నారణ సత్యపు రెడ్డిగారహో:
    “నందనులన్ దహించిరఁట నాటి పురంధ్రులు శీలరక్షకై”

    రిప్లయితొలగించండి
  6. సమస్య :
    నందనులన్ దహించిరట
    నాటి పురంధ్రులు శీలరక్షకై

    నందుల వంటి సజ్జనులు
    నైతికబుద్ధులు తోడనుండి మా
    కందము వోలె నీడలను
    కాంతలకెంతయొ నిచ్చుచుండ ; గా
    మాంధత దున్నలట్టుల న
    మాంతము పీడన జేయు దుర్మదా
    నందనులన్ దహించిరట !
    నాటి పురంధ్రులు శీలరక్షకై .
    ( మాకందము - మామిడి చెట్టు )

    రిప్లయితొలగించండి
  7. సుందరులగు రాజసుతులు
    బందెల మారులు నిరతము భామల వారే
    క్రిందపఱచు చుండగ నా
    నందనుల దహించిరంట నాటి పురంధ్రుల్

    రిప్లయితొలగించండి
  8. బందెలమారులై చెలగు భానువు పుత్రులు భోగలాలసుల్
    సుందరులైనకాంతలను జూచిన చాలును మత్తికారులై
    పొందును గోరునట్టి కడు మూఢులటంచు నెఱంగి రుట్టు నా
    నందనులన్ దహించిరఁట నాటి పురంధ్రులు శీలరక్షకై

    రిప్లయితొలగించండి


  9. ఈ కతేమిటో నాకు తెలియదండీ! వందనాలు!


    ఇందున్నట్టి కథ తెలియ
    దందువలన పూరణయు కుదరలేదండీ!
    వందారులివె సమస్యకు
    "నందనుల దహించిరంట నాటి పురంధ్రుల్"



    జిలేబి

    రిప్లయితొలగించండి
  10. అందమయిన యమరావతి
    నందరు ముఖ్య పురమనుచు నభివర్ణించన్
    ముంధుగ ముంఫు నెలవనుచు
    నందనుల దహించిరంట నాటి పురంధ్రుల్

    నందనుడు = సంతోషించువాఁడు

    రిప్లయితొలగించండి
  11. అందము చందము గలిగిన
    సుందర వనితలను బొంద జూచు దురితులన్
    నిందల తో శపి యించుచు
    నందనులను దహించి రంట నాటి పురంధ్రు ల్

    రిప్లయితొలగించండి
  12. *నా విరుపు* : దితీనందనులు

    ఉ||
    అందములొల్కునా పడతులన్ గని గైకొనుయత్నమందునన్
    వందల యేండ్లుగన్ పరమభండనవిద్యల నేర్చు వంశజుల్
    విందుగ దల్చి దైత్యులను వేగమునన్ తెగటార్చుటన్ దితీ
    నందనులన్ దహించిరట నాటి పురంధ్రులు శీలరక్షకై

    ఆదిపూడి రోహిత్ 🙏🏻🙏🏻🙏🏻

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో యతి తప్పింది. "అందములొల్కు నా పడతు లందఱ గైకొను..." అందామా?

      తొలగించండి
  13. కందం
    కుందుచుఁ గృష్ణ పిలువ గో
    విందుడె సభ వల్వలొసఁగె, వృద్ధులుఁ బతుల
    య్యందరి మౌనమ్మున నే
    నందనుల దహించిరంట నాటి పురంధ్రుల్?

    ఉత్పలమాల
    కుందఁగఁ బాండవుల్ సభనుఁ గోమలి ద్రౌపది వల్వలూడ్చ గో
    విందుడె చీరలిచ్చెఁ, గురువృద్ధులుఁ బెద్దలు వాల్చ శీర్షముల్!
    దుందుడుకైన కౌరవుల దూరెనె తల్లి? యవాస్తవమ్ము నే
    నందనులన్ దహించిరఁట నాటి పురంధ్రులు శీలరక్షకై?


    రిప్లయితొలగించండి
  14. మైలవరపు వారి పూరణ

    సుందరభారతమ్ము గుణశోభితమాత్మమనోహరత్వమే
    సుందరమంచునెంచు., గుణసుందరులీ యువతీలలామలౌ!
    పందులవోలె దుర్మతులు పాడొనరింతురటన్నభీతిచే
    నందనలన్ దహించిరట నాటిపురంధ్రులు శీలరక్షకై!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  15. ఎందరు జెప్పిన వినకను
    కొందరు పోకిరితనమున కోమలులందున్
    అందము గ్రోలగ నెంచగ
    నందనుల దహించిరంట నాటి పురంధ్రుల్!!

    రిప్లయితొలగించండి
  16. అందరు జూచుచుండగనె హాస్యము పేరిట స్త్రీలజెన్కగా
    కందువ లాఠిబట్టుచును కారగృహమ్మున కీడ్చి దుష్టులౌ
    నందనులన్ దహించిరట ; నాటి పురంధ్రులు శీలరక్షకై
    కుందుచు నగ్నికీలలకు గూల్చిరి దేహము యుద్ధవేళలన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పతివ్రతలు చూపుతోనే కాల్చేయగలరు
      🙏🙏🙏🙏

      మందాకినీ సమ సతుల
      కొందరు వేధింపబూన క్రోధపుదృక్కున్
      చిందుచు నగ్నిని రాక్షస
      నందనుల దహించిరంట నాటి పురంధ్రుల్

      తొలగించండి
    2. ధన్యవాదములు గురుదేవా! నమస్సులు! 🙏🙏🙏🙏

      తొలగించండి
    3. మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    4. ధన్యాస్మి గురుదేవా! నమోనమః! 🙏🙏🙏

      తొలగించండి
  17. అందముగలయువతులయెడ
    కొందఱు దురుసుగ బలుకగ గోమలులంతన్
    గుందుచుజెప్పగ దమతమ
    నందనుల దహించిరంట నాటిపురంధ్రుల్

    రిప్లయితొలగించండి
  18. సుందరమగు తరుణుల గని
    పందుల వలె వెంటబడెడు పందుల గనుచున్
    చిందులు త్రొక్కుచు నాదితి
    నందనుల దహించి రంట నాటి పురంధ్రుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో 'పందుల' శబ్దం ద్విరుక్తమయింది.

      తొలగించండి
  19. కొందరు మద్యపానమున కొందరహో సహజీవనమ్మునన్
    చిందులు వేయుచుండిరి విచింత్యతృణీకృతశీలభిన్నలై
    యెందరొ నేటి సంస్కృతివిహీనులు,.... కాంచుము పిండరూపత
    న్నందనులన్ దహించిరఁట నాటి పురంధ్రులు శీలరక్షకై.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  20. అందలమెక్కనెంచిప్రజలందునభీతినిపాదుగొల్పిసం
    బంధముద్రెంపనెంచినరవానరనైజముజాటనెంచిమి
    మ్మందరగుందజేయుపురమందుజరించవినీతినాయకీ
    *“నందనులన్ దహించిరఁట నాటి పురంధ్రులు శీలరక్షకై”*

    రిప్లయితొలగించండి
  21. ఉ:

    నిందలు వేయుచున్ తనరి నీచపు మార్గము లెంచి దిర్గుటన్
    ముందుగ వీడుమన్న గడు మూర్ఖుల గూడియు తూలనాడుచున్
    చిందులు వేయుచుండ నిక శీఘ్రమె శిక్ష విధింప దొంగ నా
    నందనులన్ దహించిరట నాటి పురంధ్రులు శీల రక్షకై

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  22. కొందఱుదుండగుల్ భువినిక్రూరతనొందుచు నింతిమానముల్
    బొందగజూడగానపుడు పోడిమికిచ్చక తాముగానెయా
    నందనులన్ దహించిరట నాటిపురంధ్రులుశీలరక్షకై
    యందముకొంతమందికిడుహర్షముబాటుగ మానహానియున్

    రిప్లయితొలగించండి
  23. అందఱు నట్లొనరింతురె
    యుందురె వారిప్డు కాంచి యొప్పునె యన నీ
    చందము గంగాదేవిని
    నందనుల దహించిరంట నాటి పురంధ్రుల్


    డెందము లెల్లఁ దల్లడిల ఠీవిగఁ గాష్ఠ గతాగ్ని నంత వే
    గం దమ నాథులం గలయఁ గాంతలు సేరరె మున్ను వింతయే
    పందలు కాక యాజి నిజ భర్తలు గూలఁ దలంచ కించుకై
    నం దనులన్ దహించిరఁట నాటి పురంధ్రులు శీలరక్షకై

    [తనులు = దేహములు]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. అద్భుతమైన పూరణలార్యా! నమోనమః! 🙏🙏🙏

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

      ధన్యవాదములు డా. సీతా దేవిగారు. మీ వృత్త పూరణమును బోలియే నా పూరణ ముండుట ముదావహము.

      తొలగించండి
  24. ఎందరు యోధులుమడసిరి!
    యెందరికులసతుల బ్రతుకులేవిధి ముగిసెన్ !
    కుందుచు మనమున కౌరవ
    నందనుల దహించిరంట నాటి పురంధ్రుల్

    రిప్లయితొలగించండి
  25. వందలవేల సైనికులు భండనమందున నేలకూల నా
    క్రందన జేయుమానినుల కన్నుల నిప్పులు నింగినంటె నా
    నందమురూపుమాసిదహనంబొనరించి తమంత తాముగా
    నందనులన్ దహించిరఁట నాటి పురంధ్రులు శీలరక్షకై

    రిప్లయితొలగించండి
  26. అందరి భర్తలున్ మడియ నాహవమందున, రాణివాసపున్
    బంధములన్ తలంచి, తమ భర్తల గూడగ స్వర్గమందునన్,
    బందిగమందు వైరులిడు బాధల నన్నియు తల్చియగ్నిలో
    నం, దనులన్ దహించిరట నాటి పురంధ్రులు శీలరక్షకై
    అసనారె

    రిప్లయితొలగించండి