6, డిసెంబర్ 2020, ఆదివారం

సమస్య - 3566

7-12-2020 (సోమవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“దొరికె లంకెబిందెలటంచు దుఃఖపడెను”

(లేదా…)

“దొరికెను లంకెబిందెలని దుఃఖపడెన్ మిగులన్ దరిద్రుఁడే”

74 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    మరుగున మాటలన్ వినుచు మందును గొట్టగ మైకమందునన్
    మురియుచు నెత్తి మీసములు ముచ్చట మీరగ లుంగిలెత్తుచున్
    పరువులు పెట్ట శత్రునకు పండుగ పూటను ముత్తుకూరునన్
    దొరికెను లంకెబిందెలని దుఃఖపడెన్ మిగులన్ దరిద్రుఁడే..

    రిప్లయితొలగించండి
  2. వరుసగ నాలుగేడులుగ వానలు లేక పొలమ్ము లెండి ము
    ప్పిరి గొని కష్టముల్ తనకు వేదననే మిగులంగఁ జేయ నా
    కరువు దినమ్ములందున నొకానొకఁ డా పొరుగింటివానికిన్
    దొరికెను లంకెబిందెలని దుఃఖపడెన్ మిగులన్ దరిద్రుఁడే.

    రిప్లయితొలగించండి
  3. రిప్లయిలు

    1. ఆటవిడుపు సరదా పూరణ:
      (జిలేబి గారికి అంకితం)

      "...హేమంబు గూడబెట్టిన
      భూమీశుల పాలజేరు భువిలో సుమతీ "

      మరుగున వార్తనున్ వినుచు మబ్బుల రాత్రిని చీకటందునన్
      తిరిగెను నాదు భాగ్యమని తియ్యగ త్రవ్వుచు పైకితీయగా
      మురియుచు రాజుగారు వడి ముద్దుగ లాగుచు జప్తుచేయగా...
      దొరికెను లంకెబిందెలని దుఃఖపడెన్ మిగులన్ దరిద్రుఁడే...

      తొలగించండి
    2. మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి


  4. సంతసమ్మాయె మదిలోన శతము పైన
    దొరికె లంకెబిందెలటంచు; దుఃఖపడెను
    కొట్టు కొనిబోవ పోలీసు కుటిల మైన
    బుద్ధి చూపి; గోవిందా ప్రభుత్వమాయె!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. అభాగ్యుని కన్నీటి గాథ...

    తేటగీతి
    సిరులు నవసరార్థము దక్క మురిపెమగును
    కఱచి కోవిడు వారసుల్ మరణమొంద
    కూల్చ వర్షములింటిని గోడలందు
    దొరికె లంకె బిందెలటంచు దుఃఖ పడెను

    చంపకమాల
    అరయఁగ సంపదల్ అవసరార్థము జిక్కిన సంతసంబగున్
    కఱచి కరోన వారసులు కాలము చేసిన మీద వర్షముల్
    గురిసి గృహంబు నాని పడి గోడల పూర్వులు దాచినట్టివై
    దొరికెను లంకెబిందెలని దుఃఖపడెన్ మిగులన్ దరిద్రుఁడే!

    రిప్లయితొలగించండి
  6. ముక్తిసంపదవెదకెడిమునియునతఁడు
    చలితమనమునఁజేరఁడుచాననెపుఁడు
    కామ్యసంపదలెదురైనగాసినందు
    దోరికెలంకెబిందెలటంచుదుఖపడెను

    రిప్లయితొలగించండి
  7. మనమున న సూయ రగులగా మంచి మరచి
    పొరుగు వారిని ద్వేషించు బుద్ధి పొడమె
    తెలిసె నొక రోజు వారికి దివ్య మైన
    దొరికె లంక బిందె లటంచు దుఃఖ పడెను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'దివ్యముగను దొరికె..' అంటే అన్వయం బాగుంటుందేమో?

      తొలగించండి
  8. కరువు వచ్చెనటంచట కర్షకుండు
    పంట పొలముననీటికై బావి త్రవ్వు
    పట్టు తనకు కాక పరాయి వాడికచట
    దొరికె లంకబిందెలటంచు దుఃఖపడెను

    రిప్లయితొలగించండి
  9. కలిమి నిచ్చెడి యిందిర కరుణ వలన
    తాను ధనికున కమ్మిన తావు నందు
    దొరికె లంకెబిందె లటంచు దు:ఖ పడెను
    బీదతనమున జీవించు పేదవాడు.

    రిప్లయితొలగించండి
  10. తామిరువురు నొ కే మూరుతమున
    నిండ్ల
    నిర్మితి మొదలిడిన గూడ నివ్వెరపడ
    దన యెదుటివాడు బావిని తవ్వుచుండ
    దొరికె లంకెబిందెలటంచు దుఃఖపడెను

    రిప్లయితొలగించండి
  11. పనికిరాని నివేశము పంచెయన్న
    మాయ మర్మము లెరుగని మనుజు డైన
    అనుజుఁడు పునాదులుత్రవ్వ యందులోన
    ఖంగు ఖంగుమనిమ్రోగ కనులు మెరయ-
    దొరికె లంకెబిందెలటంచు దుఃఖపడెను

    రిప్లయితొలగించండి
  12. క్రొవ్విడి వెంకట రాజారావు:

    నెమ్మి నొందెను నిధనుడు నిధిని జూప
    దొరికె లంకెబిందె లటంచు; దు:ఖ పడెను
    జాలి చూపక ప్రభుతయే చట్ట మనుచు
    వాటినే గుంజుకొనుచు జవ్వాడినంత.

    రిప్లయితొలగించండి
  13. కరువది కాటు వేయగను కాలువ లెండుకు పోవ గాంచి తా
    శరమును గోరి బావినట శాకినమందలి పైరుకోసమై
    కరణము త్రవ్వగా తనకు కాక పరాయికి భూమి యందునన్
    దొరికెను లంకెబిందెలని దుఃఖపడెన్ మిగులన్ దరిద్రుఁడే

    రిప్లయితొలగించండి
  14. భవన నిర్మాణమునకని ప్లాటునందు
    త్రవ్వగా నందు గట్టిగా తగిలె నొకటి
    కంచుబోలిన చప్పుడు ఖంగు మనగ
    దొరికె లంకెబిందెలటంచు దుఃఖపడెను
    భువిన నున్నట్టి దేదైన భోక్త ప్రభుత!!

    రిప్లయితొలగించండి
  15. నిన్నటి పూరణ

    సహజ కవీశుడు నూతన
    సహకారపు వృత్తకర్త సన్మతి వరుడే
    సహజాతగ నెంచి తనకు
    సహదేవుడు సీతనుగని సంతోషించెన్

    చాల రోజులక్రితం శ్రీసహదేవుడు గారు నన్ను బ్లాగులో అక్కయ్యగారూ అని సంబోధించారు! అది గుర్తుకువచ్చి చేసిన పూరణ! 🙏🙏🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వరుసగ వర్షలేమినట పంటలు పండక భూమినమ్మగా
      పొరుగుననున్న రైతునకు పోవుచు పట్నముపాధి కోసమై
      తిరుగగ భాగ్యమాతనికి దీరుగ దున్నగ
      భూమినచ్చటన్
      దొరికెను లంకెబిందెలని దుఃఖపడెన్
      మిగులన్ దరిద్రుడే

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. ఆహా! సంబోధనలు కూడా పద్యము వ్రాయుటకు స్ఫూర్తినిచ్చునని అవగతమైంది. ధన్యవాదములు. 🙏

      తొలగించండి
    4. మీసద్యస్స్ఫూర్తి పూరణ మమోఘము డా. సీతా దేవి గారు.

      తొలగించండి
  16. విరివిగ పూజొనర్చి మరి,వేడెను భక్తినగొల్చువాడెయై
    పరుగున వచ్చినా పరమ పావన మూర్తియె తెల్యగోరగా
    వరమును గోరెనా తడట పాతరలోనివి సంపదల్ గదా
    దొరికెను లంకెబిందెలని దుఃఖపడెన్ మిగులన్ దరిద్రుఁడే!!

    రిప్లయితొలగించండి
  17. పరులసొమ్ములకోరుచు పంచుమనిన
    రౌడిమూకలనాగడమాపలేక
    దేశకాలమ్ములీవిధి నాశమైన
    దొరికె లంకెబిందెలటంచు దుఃఖపడెను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పెళ్ళి కుదరక కుములుచు కుళ్ళువేళ
      పక్కవాడికి కళ్యాణ గడియరాగ
      తనకు జరగదు మనువని తలచిరోసి
      దొరికె లంకెబిందెలటంచు దుఃఖపడెను

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  18. చం:

    సరియగు దాపులేక కొనసాగిన శోధన మందు వేగమే,
    మురిపెము దక్కకుండగను, ముప్పును దెల్పుచు జప్తు చేయగన్
    కరిగిన యాశ లెంచుచును కాలము తీరుగ నంగలార్చుచున్
    దొరికెను లంకె బిందెలని దుఃఖపడెన్ మిగులన్ దరిద్రుడే


    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  19. క్రొవ్విడి వెంకట రాజారావు:

    అరయగ తాను శ్రీలునకు నమ్మిన తావున జూడ నిప్పుడున్
    సిరులనుగూర్చు విష్ఞుసతి సింధుజ ప్రీతిజూపి నంతటన్
    దొరికెను లంకెబిందెలని దు:ఖపడెన్ మిగులన్ దరిద్రుడే
    కరిగినదై తనన్ కసగు కాసులరేఖ నెంచి జూచుచున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "ప్రీతిని జూపినంతటన్... రేఖల నెంచి చూచుచున్" అనండి.

      తొలగించండి
    2. గురువుగారికి నమస్కారములు.

      అరయగ తాను శ్రీలునకు నమ్మిన తావున జూడ నిప్పుడున్
      సిరులనుగూర్చు విష్ఞుసతి సింధుజ ప్రీతిని జూపినంతటన్
      దొరికెను లంకెబిందెలని దు:ఖపడెన్ మిగులన్ దరిద్రుడే
      కరిగినవై తనన్ కసగు కాసులరేఖల నెంచి జూచుచున్.

      తొలగించండి

  20. బోనసు సరదా పూరణ:

    అరచుచు మైకులందునను హ్లాదము నొందుచు కేకలేయుచున్
    మురియుచు వీధులందు కడు ముద్దుగ పంచగ బీరు, రూకలన్
    పరువులు పెట్టి గెల్వగను భాగ్యపురమ్మున తమ్మిగుర్తుకున్
    దొరికెను లంకెబిందెలని దుఃఖపడెన్ మిగులన్ దరిద్రుఁడే...

    రిప్లయితొలగించండి


  21. కదా చంప్స్ !

    జిగిదేరె సంతసమ్ము చె
    లగె దొరికెను లంకెబిందెలని; దుఃఖపడెన్
    మిగులన్ దరిద్రుఁడేను తొ
    లగబాఱగ కలయు చతికిలబడి జిలేబీ


    జిలేబి

    రిప్లయితొలగించండి
  22. సమస్య :
    దొరికెను లంకెబిందెలని
    దు:ఖపడెన్ మిగులన్ దరిద్రుడే

    (ఒక దరిద్రుడు మరొక దరిద్రునితో )
    చంపకమాల
    .....................
    " అరిగితి నెంతొ నమ్మకము
    గా మరుభూములకున్ బదమ్ములే
    యరుగగ ; మోసపోతి నక
    టా ! తుద కెట్టులొ త్రవ్వి యాశతో
    దెరచితి ; గుండెయాగె ; నట
    దెప్పల దెప్పల దమ్మిడీలతో
    దొరికెను లంకెబిందె " లని
    దు:ఖపడెన్ మిగులన్ దరిద్రుడే !!
    ( మరుభూమి - ఎడారినేల ; దమ్మిడీలు - రాగిపైసలు )

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      మొదటి పాదంలో యతి విషయంలో సందేహం. అలాంటి యతిని ప్లుతయతిగా భావించి నేను ప్రయోగిస్తే పెద్దలు కుదరదన్నారు.
      "అరిగితి నెంతొ నమ్మికను నా మరుభూములకున్.." అనవచ్చు కదా?

      తొలగించండి
    2. నమ్మకముగా (న్) గా లో ద్రుత లోపము గాన ప్లుతముగాఁ బరిగణించ లేమని నా యభిప్రాయ మండి.

      తొలగించండి
  23. కటికదారిద్ర్యబాధకు క్రందియతఁడు
    పొరుగువానికితనకున్నపొలమునమ్మె
    కొన్నవానికి పొలమును దున్నునపుడు
    దొరికె లంకెబిందెలటంచు దుఃఖపడెను

    రిప్లయితొలగించండి
  24. నావి నావని బిందెలు నావి యనుచు
    ఇరుగు పొరుగు వారును కలహించు గొనగ
    పిల్లియున్ దీర్చి నట్లుగా పిట్ట పోరు
    రక్షక భటులు వచ్చెనే! రామ రామ
    దొరికె లంకెబిందెలటంచు దుఃఖపడెను

    రిప్లయితొలగించండి
  25. రిప్లయిలు
    1. మురిపెము మూడు నాళ్ళు నయి ముచ్చట దీరె విమోహమడంగె, నామెతో
      పరిణయమైన నేమి మురిపమ్మది వమ్మె పరాయివానితో
      మురిసితి పోదు నంచనుచు మ్రొక్క నిరుత్తరుడయ్యె నక్కటా!
      దొరికెను లంకెబిందెలని దుఃఖపడెన్ మిగులన్ దరిద్రుఁడే.

      కంజర్ల రామాచార్య

      తొలగించండి
  26. మురిసెను భాగ్యశాలి గడు మోదము నొందగ బంధుమిత్రులున్
    దొరికెను లంకెబిందెలని; దుఃఖపడెన్ మిగులన్ దరిద్రుఁడే
    పెరపెరలాడినన్ దనకు పెంకులు మాత్రమె దక్కెనే యనిన్
    యెరుగ వశంబె యేరికిని యెవ్వరి కెయ్యది ప్రాప్తమీ భువిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురువు గారి సూచనలతో సవరింవిన పాఠం

      మురిసెను భాగ్యశాలి గడు మోదము నొందగ బంధుమిత్రులున్
      దొరికెను లంకెబిందెలని; దుఃఖపడెన్ మిగులన్ దరిద్రుఁడే
      పెరపెరలాడినన్ దనకు పెంకులు మాత్రమె దక్కెనక్కటా
      ఎరుగ వశంబె యేరికిని యెవ్వరి కెయ్యది ప్రాప్తమీ భువిన్

      తొలగించండి
  27. ఈనాటి శంకరాభరణం వారిచ్చిన సమస్య

    దొరికె లంకె బిందెలటంచు దుఃఖ పడియె
    (లేదా)
    దొరికెను లంకెబిందెలని దుఃఖపడెన్ మిగులన్ దరిద్రుడే

    నా పూరణ

    తే.గీ.

    గుట్టుచప్పుడు లేకుండ గుంభనముగ
    లంకె బిందెలఁ ద్రవ్వగా రాత్రిపూట
    రవ్వ చడిలేక వచ్చిరి రాజ భటులు
    దొరికె లంకె బిందెలటంచు దుఃఖ పడెను


    చంపక మాల

    వరుసకు బావ యౌటన వివాహముఁ జేసుకొనంగ జాలితో,
    తరుణికి నమ్మనాన్నలు గతంబగుటన్ యిరువుండ్రు సోదరీ
    వరులనుగూడ బాధ్యతఁ వివాహముఁ జేసుకొనంగ భారమై
    దొరికెను లంకె బిందెలని దుఃఖపడెన్ మిగులన్ దరిద్రుడే

    ఆదిభట్ల సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  28. [12/7, 06:39] shankargdabbikar: హరినిస్మరించిసన్నిధినియాశమదిన్వివరించనించుచున్
    వరమిడెనీకుదక్కునిధివైభవమొందుమటంచుస్వప్నమం
    దరయగలేచిచూచిననునంతయుశూన్యమెయాదురాశయే
    *“దొరికెను లంకెబిందెలని దుఃఖపడెన్ మిగులన్ దరిద్రుఁడే”*
    [12/7, 06:50] shankargdabbikar: పరువిడుదెంతదాకభువిస్వంతమునౌననిపల్కయాశతో
    నరవరునానతిన్యొకడున్యాయమిదేయనిదుష్టబుద్ధితో
    బరువిడియూపిరాగిననుబల్కిరిబొమ్మలిఖించినంతయే
    *“దొరికెను లంకెబిందెలని దుఃఖపడెన్ మిగులన్ దరిద్రుఁడే”*

    రిప్లయితొలగించండి
  29. మురిసెను పేదవాడొకడు, ముచ్చట జెందగ కొన్నభూమిలో
    వరిమడిజేయగానచట ,వాలుగ త్రవ్వెను నీటికోసమై
    పరువునునిల్పగానికను పారకనిచ్చుచు ,బిందెలన్నిటిన్
    దొరికెను లంకెబిందెలని,దు:ఖపడెన్ మిగులన్ దరిద్రుడే
    ++++++++++====+++
    రావెల పురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి
  30. మైలవరపు వారి పూరణ

    భరమగుచుండె జీవనము., భార్యయు గర్భిణి., పొట్టకూటికే
    సరిపడదాయెఁ గూలి యని శ్రామికుడొక్కడు చింతనుండగా
    నిరువురునాడపిల్లలుదయించిరటంచునెరింగినంతనే
    దొరికెను లంకెబిందెలని దు:ఖపడెన్ మిగులన్ దరిద్రుడే!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  31. త్రవ్వు చుండగ యిల్లు సంతసమునందె
    దొరికె లంకె బిందె లటంచు, దుఃఖపడెను
    పంచ వలసొచ్చె దీనిని భ్రాతలకును
    తానె పొందంగ వీలుకా దయ్యెననుచు

    రిప్లయితొలగించండి
  32. సంతసంబొందెనుమిగుల సరితతనకు
    దొరికెలంకెబిందెలటంచు, దుఃఖపడెను
    బిందెలన్నియు దెఱువగనందుకనగ
    రాళ్ళురప్పలెయుండుటకళ్ళుచెదిరి

    రిప్లయితొలగించండి
  33. నిత్య దుఃఖితున కకట సత్య మెంచ
    సుఖమునకుఁ జిత్తమం దింత చోటు కలదె
    దాఁచ నెవ్విధి నగు నంచుఁ దోఁచకుండ
    దొరికె లంకెబిందె లటంచు దుఃఖపడెను


    పరు వది యున్నవానికి నపారము పట్టు గలట్టి వానికిన్
    నరగణ సేవి తాగ్రతమ నాయక ముఖ్యున కున్నయట్టి తో
    ట రయుతు దున్నుచుండగను డబ్బులు మిన్నఁగ నున్నవానికే
    దొరికెను లంకెబిందె లని దుఃఖపడెన్ మిగులన్ దరిద్రుఁడే

    రిప్లయితొలగించండి
  34. వెరవునదీయగోతినట వేమరుగొల్పెడులంకెబిందెలున్
    బరువుగగన్పడయ్యెడనుబారులుదీర్చుచురాగలోకులున్
    సరగునరాజసేవకులుసాయుధులెైగొనిపోవబిందెలన్
    దొరికెనులంకెబిందెలనిదుఃఖపడెన్ మిగులన్దరిద్రుడే

    రిప్లయితొలగించండి
  35. దొరువును త్రవ్వగా పొలము తూరుపుదిక్కున నీటికోసమై
    స్థిరమగు నిచ్చతోడుతను చేయగ సేద్యము పూర్తికాలమున్
    హరుసము కల్గెకుండలు బయల్పడ, పూర్వపు రాగినాణెముల్
    దొరికెను లంకెబిందెలని దుఃఖపడెన్ మిగులన్ దరిద్రుఁడే

    రిప్లయితొలగించండి
  36. కరుణయొకింతలేకవిధి కష్టములందునకృంగదీయనా
    తరుణమునందునమ్మెతనతాతలనాటి గృహంబు కొన్నవా
    డరమరికేమిలేకతనయాప్తునిగాతలబోసిచెప్పగా
    దొరికెను లంకెబిందెలని, దుఃఖపడెన్ మిగులన్ దరిద్రుఁడే

    రిప్లయితొలగించండి