9, డిసెంబర్ 2020, బుధవారం

సమస్య - 3569

10-12-2020 (గురువారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“గార్దభాండమ్ము ఛేదించి కాకి పుట్టె”

(లేదా…)

“గాడిద గ్రుడ్డునుండి యొక కాకి జనించియు నీఁదె నీటిలోన్”

77 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    తోడుగ చెట్టుమీద భళి తొందర చేయుచు ప్రేమమీరగా
    కూడి మగండునున్ మురిసి గ్రుడ్డును పెట్టగ నాడకాకియే
    పోడిమి మీరుచున్ పడగ పున్నమి రాత్రి తటాకమందునన్
    గాడిద! గ్రుడ్డునుండి యొక కాకి జనించియు యీఁదె నీటిలోన్...

    రిప్లయితొలగించండి
  2. ఒక గాడిద తల్లి, ఒక గుడ్డు మాత్రం కలియుగాంతములో బ్రతికాయి.. అవి జలప్రళయములో ఉండగా ఒక గాడిద పిల్ల, గుడ్డులోంచి ఒక కాకీ పుట్టి ఈదుతున్నాయి. వటపత్రం మీద చిన్ని కృష్ణుదు వాటిని రక్షించుగాక

    ఉ||
    గండమునీయుగాంతమున కల్కి భువిన్ తెగటార్చుటన్ ధరా
    భాండము వైపరీత్యమున పార జలప్రళయంబునందులో
    నండము, గాడిదీనుచునునంతముగాక సజీవమై గనన్
    గాడిద గ్రుడ్డునుండియొక కాకి జనించియునీదె నీట్లోన్

    రోహిత్

    రిప్లయితొలగించండి
  3. ఉదయకాలమందు వివరమొకటి దెల్సె
    గార్దభాండమ్ము ఛేదించి కాకి పుట్టె
    ననుచు వార్తలందునజెప్పిరనగ, నిట్టి
    వింతలెన్నియో జరుగగ వినగ లేమె!!

    రిప్లయితొలగించండి
  4. దానమీయగనండమ్ముతరుణియోకతె
    తల్లియయ్యెనుగోడ్రాలుతరుణమెంచి
    నలువస్రుష్టినివింతయౌమార్పులెన్నో
    గార్ధబాండమ్ముఛేధించికాకిపుట్టె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "యొకతె..సృష్టిని ...లెన్నొ.." టైపాట్లు.

      తొలగించండి

  5. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    చూడగ నాయనమ్మ వలె చూపుల కందని పొంకమంచు నా
    చేడియ మోమునున్ గనుచు చెంపలు నొక్కుచు ముష్టి తోడనున్
    వేడగ ప్రీతినిన్ ప్రజలు వేడుక మీరగ భారతమ్మునన్
    గాడిద గ్రుడ్డునుండి యొక కాకి జనించియు యీఁదె నీటిలోన్...

    రిప్లయితొలగించండి
  6. వీడెవడండిబాబు నిట వింతగ బల్కె నదేలనో యికన్
    కూడక యాదవున్నొకడి కోరికదీరగ గర్భమందగా
    మూడెను యాదవంశమది పూర్తి వినాశము చెందినట్లుగన్
    గాడిద గ్రుడ్డునుండి యొక కాకి జనించియు నీఁదె నీటిలోన్!!

    రిప్లయితొలగించండి


  7. ప్రియమైన నేస్తమా! అ
    య్యొయొ! గాడిద గ్రుడ్డునుండి యొక కాకి జనిం
    చియు నీఁదె నీటిలోన్! దుమి
    కి యురికి వెనువెంట తల్లి కిమ్మనక చనెన్!



    జిలేబి

    రిప్లయితొలగించండి


  8. నేస్తమా శకార కథను నేర్పు మయ్య!
    గార్దభాండమ్ము ఛేదించి కాకి పుట్టె
    వ్రాసు కొనుజిలేబి, వెనుక వాని తల్లి
    చనెను పరుగులిడుచు వెస చక్కగాను!



    జిలేబి

    రిప్లయితొలగించండి
  9. కలి యుగంబున వింతలు గానుపించె
    గార్ద భాండము ఛేదించి కాకి పుట్టె
    గండు పిల్లికి జనియించె గజము నొకట
    జాజి మొక్కకు కాసెను జామ కాయ

    రిప్లయితొలగించండి
  10. ఇంద్ర జాలికు డొకడు మహేంద్రపురిన
    నిచ్చెను ప్రదర్శన జనులు మెచ్చురీతి
    యందు గాడిద పెట్టగ నండ మొకటి
    గార్ధభాండమ్ము ఛేదించి కాకి పుట్టె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "మహేంద్రపురిని.. రీతి నందు.." అనండి.

      తొలగించండి
  11. వాడొక యింద్ర జాలికుడు వాసి ప్రదర్శన నిచ్చెనంట యు
    ద్గాఢముగా జనాళి యట గాంచుచు నుండగ, సంచినుండి యో
    గాడిదఁ సృష్టిజేయ నది గడ్డిని మేయుచు గ్రుడ్డు పెట్టగా
    గాడిద గ్రుడ్డునుండి యొక కాకి జనించియు యీఁదె నీటిలోన్

    రిప్లయితొలగించండి
  12. వీడక వ్రాయుపూరణలు వేచిరి ముందర యర్ధరాత్రికిన్
    వాడెను మోములన్నియును వాచెగ వీడని నిద్రలేమితో
    పాడియు గాదనెంచి కడు పార తినంగనె
    చూడవాట్సపున్
    వేడుక తోడసత్కవులు వేచుచు నుండిరనెంచినాడయో
    నేడిక తొమ్మిదవ్వగనె నిక్కమునివ్వ సమస్యనిట్లుగా
    గాడిద గ్రుడ్డునుండి యొక కాకి జనించియు నీఁదె నీటిలోన్!!

    రిప్లయితొలగించండి
  13. పోడిమిమీర చెట్టుపయి ముద్దుగ గూడును కట్టికాకమే
    వేడుక యండమున్నిడగ వెచ్చగ
    కొమ్మల మధ్యగాచుచున్
    పీడిత తీటనున్ గదిసి వీపును రాయగ చెట్టుబోదెకున్
    గాడిద, గుడ్డునుండి యొక కాకిజనించియు నీదెనీటిలో

    అది నీటికాకి 😊😎

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రొత్త సృష్టినిజేయగ గోర్కెబుట్టి
      శాస్త్ర విజ్ఞానమంతయు సంగ్రహించి
      కాక వీర్యమ్ము జొప్పించ గాడిదందు
      గార్దభాండమ్ము ఛేదించి కాకిపుట్టె

      తొలగించండి
    2. మూడవ పాదమున చివర గార్దభమున గా చదువ ప్రార్ధన!

      తొలగించండి
    3. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    4. సవరించిన ఉత్పలమాల

      పోడిమిమీర చెట్టుపయి ముద్దుగ గూడును కట్టికాకమే
      వేడుకతోడ గ్రుడ్డునిడి వెచ్చగ
      కొమ్మల మధ్యగాచుచున్
      పీడిత కండువున్ గదిసి వీపును రాయగ చెట్టుబోదెకున్
      గాడిద, గుడ్డునుండి యొక కాకిజనించియు నీదెనీటిలో

      అది నీటికాకి 😊😎

      తొలగించండి
  14. గార్దభాండమ్ము ఛేదించి కాకి పుట్టె
    వెంపలితరువు నిచ్చెన వేసి నెక్కు
    పురుష గర్భంబు దాల్చునూ పురుడు బోయ
    కలియుగములొన వింతలు కాంచగలరు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "...దాల్చును.. యుగములోన.." టైపాటు.

      తొలగించండి
  15. తేటగీతి
    వలువలన్ గాకి గ్రుడ్డును వదిలెనేమొ?
    మూట మోసెడు గాడిద మూల్గఁ గ్రిందఁ
    బడి పగిలి పిల్ల యెగురంగ పలికిరిటుల
    "గార్ద భాండమ్ము ఛేదించి కాకి పుట్టె!"

    ఉత్పలమాల
    వీడెనొ కాకి గ్రుడ్డొకటి పేర్చిన మాసిన గుడ్డలందునన్
    గాడిద మోయుచున్ జెఱువు గట్టుకు జేర్చుచు నోండ్ర పెట్టగన్
    జూడఁగఁ బోకిరుల్, దొరలి నుజ్జయి పిల్లయె పుట్టఁ, బల్కిరే
    "గాడిద గ్రుడ్డునుండి యొక కాకి జనించియు నీఁదె నీటిలోన్"

    రిప్లయితొలగించండి
  16. అందరికీ నమస్సులు🙏

    పోడిమి గూర్చగన్ తరలిపోయిన సంపద ప్రోగుచేయగా
    వేడిరి నేతలున్ జనుల వీడగ నోట్లను రద్దుచేయుచున్
    వాడని నల్లడబ్బులిక వచ్చుట యన్నది తల్చనివ్విధిన్
    *“గాడిద గ్రుడ్డునుండి యొక కాకి జనించియు నీఁదె నీటిలోన్*

    *వాణిశ్రీ నైనాల, విజయవాడ*

    రిప్లయితొలగించండి
  17. ఉ:

    వేడుక మీర బుఱ్ఱకథ విన్కలి కేగగ నుల్లసించనై
    సోలుచు నున్న ప్రేక్షకుల చోద్యము మీరగ సావధానతన్
    తోడుగ బొందగోరియట తోచిన నానుడి జెప్పె నిట్లుగన్
    గాడిద గ్రుడ్డు నుండి యొక కాకి జనించియు నీదె నీటిలోన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  18. కలియుగంబునవింతలకానదగును
    వీర బ్రహ్మము జెప్పెను వినుడొయన్న
    వింతవింతలుజూతురునంతమందు
    గార్దభాండమ్ము ఛేదించి కాకి పుట్టె


    ప్రశ్నలందుననల్పము పాడిగాదు
    మంచిమాటలుజెప్పినమరువరాదు
    గార్దభాండమ్ము ఛేదించి కాకి పుట్టె
    చెపుమనేరీతి గాడిదౌ కృష్ణశకుని

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "...వింతల జూచెద రంతమందు.."
      "చెపుమ యేరీతి.."

      తొలగించండి
  19. సమస్య :
    గాడిదగ్రుడ్డు నుండి యొక
    కాకి జనించియు నీదె నీటిలో

    (అక్కయ్య అడుగుతున్నది - తమ్ముళ్లు చెబుతున్నారు )

    ఉత్పలమాల
    ....................
    " చూడు డదేది మోయు మన
    చుట్టల ? నెట్టుల వచ్చు కోడియున్ ?
    దోడుగ రామునిన్ గొలుచు
    దొయ్యలి సీతను గీరి రెవ్వరో ?
    యోడక పుట్టి పుట్టగనె
    యొద్దిక నేమొనరించు చేపయే ? "
    " గాడిద " " గ్రుడ్డు నుండి " " యొక
    కాకి " " జనించియు నీదె నీటిలోన్ . “
    ( క్రమాలంకారము )

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ క్రమాలంకార పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      "...ఏమొనరించె చేపయే" అంటేనే "ఈదె" అన్నదానికి అన్వయిస్తుంది కదా..!

      తొలగించండి
  20. వసతినందు రవి పొడిచె పశ్చిమమున
    గార్దభాండమ్ము ఛేదించి కాకి పుట్టె
    గుల్మిని మొలచె మిన్నున గుడ్డునుండి
    వింతలన్నియు పైనున్న విభునిమాయ

    రిప్లయితొలగించండి
  21. నిన్నటి పూరణ


    హాసమ! గర్హణీయపరిహాసమ! వత్తునటంచుఁ జేసితే
    బాసను, నే వరాంగన సుబాహులతాయుగబద్ధువైతివో?
    నీ సము డెవ్వరయ్య? కడు నేర్పు నసత్యము లాడ, నచ్యుతా!
    బాసకుఁ గీడుఁ జేయఁగల పండితులన్ గని మ్రొక్కఁగాఁ దగున్.

    నేటి పూరణ

    కూడదు జానకీ! యిటులఁ కోరగఁ జోద్యమ సంగతమ్ములన్
    పైడి మెకమ్ము లీ పుడమి వర్తిలునే? వలదట్లు దానిపై
    వేడుకఁ జూపదేల? సఖి! వింత వచించితి విట్లు నెయ్యెడేన్
    గాడిద గ్రుడ్డునుండి యొక కాకి జనించియు నీఁదె నీటిలోన్?

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి


  22. పోడిమి మీ ప్రభుత్వమున భూరిగ కాన్పడు బిల్లు బిల్లులోన్!
    మోడి గవర్నమెంటిది! ప్రమోదము చేర్చుచు పార్లమెంటులో
    గాడిద గ్రుడ్డునుండి యొక కాకి జనించియు నీఁదె నీటిలోన్!
    వేడిని చేర్చె యందరికి వెంచరు కేపిట లిస్టు లవ్వగా!



    జిలేబి

    రిప్లయితొలగించండి

  23. బోనసు సరదా పూరణ:

    ఆడుచు పాడుచున్ మురిసి హ్లాదము నొందుచు చెట్టుమీదనున్
    వేడుక మీరగా తనర, వెంటను రాగను గ్రద్ద కేకతో
    కీడొనరింపగా, జడిసి క్రిందకు రాలను పెన్నలోనయో!
    God the Good! నుండి యొక కాకి జనించియు యీఁదె నీటిలోన్

    రిప్లయితొలగించండి
  24. గార్దభాండమ్ము ఛేదించికాకిపుట్టె
    యిట్టివింతలు జరుగునీమట్టిమీద
    సందియంబును విడువుముసరళ!నీవు
    వీరబ్రహ్మము చెప్పెనువింతలెన్నొ

    రిప్లయితొలగించండి
  25. ' గాడిదగుడ్డ' టంచుపలుకన్ పలుమారులు తండ్రి బిడ్డతో
    గాడిద గ్రుడ్లుపెట్టునని గాటముగా మది నమ్మియున్న నా
    మూఢుఁడునీటజూచియనుమోదముజెందుచు పల్కెనివ్విధిన్
    గాడిద గ్రుడ్డునుండి యొక కాకి జనించియు నీఁదె నీటిలోన్

    రిప్లయితొలగించండి
  26. గాడిదగుడ్డునుండి యొకకాకిజనించియు నీదెనీటిలోన్
    గాడిదపెట్టునేచెపుమ గాదిలికోడల!గుడ్డునెచ్చటన్
    చూడుమయొక్కసారియిటుసూనృతవాక్యముబల్కగాదగున్
    బాడియెయిట్టికల్పనలు భావితరాలను మోసగించుటే

    రిప్లయితొలగించండి
  27. బాలుఁడాతఁడుబుద్ధిలో బడుగువాఁడు
    తండ్రి'గాడిదగుడ్డం'చు తరచు పలుక
    కాకిపిల్లను పెరటిలో గాంచి తలచె
    గార్దభాండమ్ము ఛేదించి కాకి పుట్టె

    రిప్లయితొలగించండి
  28. గార్దభము చేత నక్కట కాకి యొకటి
    యర్దితం బయి యెగురంగ నంద మైన
    గర్దభముపైఁ బడఁగ గ్రుడ్డు కాకి దపుడు
    గార్దభాండమ్ము ఛేదించి కాకి పుట్టె

    [గార్దభము = 1. గాడిద; 2. గర్దభమునకు సంబంధించినది, తెల్లగలువ నాళి; గర్దభము = తెల్లకలువ]


    వేడుక తోడ నే నడరి బ్రీతినిఁ బాడఁ గరంగు ఱాల్లిలం
    జూడుఁడు నిక్క మియ్యదని చోద్యము కాదిది యంచు నంతటం
    బాడఁగ గాయకుం డొకఁడు పాఱఁగ లోకులు భ్రాంత చిత్తులై
    గాడిద గ్రుడ్డునుండి యొక కాకి జనించియు నీఁదె నీటిలోన్

    రిప్లయితొలగించండి

  29. మైలవరపు వారి పూరణ

    వేడుక భోగి భోగమ., టుపిమ్మట సంక్రమణమ్మెఱుంగురా!
    మూడవనాడనన్ కనుమ., ప్రొద్దున నిద్దురలేచి., యెల్లరున్
    జూడగ స్నానమాడుదురు., చోద్యము కాకులు గూడ చేయురా!
    గాడిద! గ్రుడ్డునుండి యొక కాకి జనించియునీదె నీటిలో!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  30. రాతి చెట్టుకు పూచెను మేత గడ్డి
    లేత చిగురుల మాగెను చూతఫలము
    గార్దభాండమ్ము ఛేదించి కాకి పుట్టె
    నిట్టి వింతలు జగతిలో వట్టి మాట!

    రిప్లయితొలగించండి
  31. వాడికి తోడులేదు మనువాడె పడంతిని నంధురాలినిన్
    బోడులు గేలిసేయుచు నపూర్వ మమోఘ మచింత్య బంధమున్
    వాడొనరించె వీరికి ప్రభాసుడె బుట్టని వల్కిరివ్విధిన్
    *“గాడిద గ్రుడ్డునుండి యొక కాకి జనించియు యీఁదె నీటిలోన్”*

    రిప్లయితొలగించండి