12, డిసెంబర్ 2020, శనివారం

సమస్య - 3572

13-12-2020 (ఆదివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“చిన్ని చీమ కన్ను చేరెఁడంత”

(లేదా…)

“చిన్నది చీమ లోచనము చేరెఁడు నోరు సురంగమార్గమే”

77 కామెంట్‌లు:


 1. "శ్రీ రాముని దయ చేతను..."

  సరదా పూరణ:

  కవయిత్రి సీతాదేవికి అంకితం:

  కన్నులు పెద్దగా తెరచి గాభర నొందక కైపదమ్ములన్
  చిన్నది నాదు చెల్లియహ చెన్నుగ పూరణలిచ్చి నవ్వుచున్
  పన్నుగ శంకరాభరణ ప్రాంగణ మందున చేరి వ్రాయగా
  చిన్నది చీమ లోచనము చేరెఁడు నోరు సురంగమార్గమే...

  రిప్లయితొలగించండి
 2. ఉ||
  విన్నున సూర్యబింబమగు పెద్దది, జూచిన చిన్నగా గనున్
  నిన్నటి రాత్రి చిన్నదగు నృత్యగతుల్ గను ప్రేమజంటకున్,
  భిన్నము దృష్టికోణములభీష్టములన్ గని పోవు! నట్లగున్
  చిన్నది చీమ లోచనము చేరెడు నోరు సురంగమార్గమే

  ఆదిపూడి రోహిత్ శర్మ
  🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'చిన్నగా గనున్'? "పెద్దది, చిన్నగ జూడ తోచెడిన్" అంటే ఎలా ఉంటుంది?

   తొలగించండి
 3. అండపిండమందునతిసూక్ష్మమైయుండు
  తన్నుగానకుండదాగియుండు
  దివ్యమైనయట్టితిరువేంగడాతండు
  చిన్నిచీమకన్నుచేరెడంత

  రిప్లయితొలగించండి

 4. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  చెన్నుగ టీవినందు భళి చేరుచు కోడలి రూపునందునన్
  మున్నెపుడున్ గనంగవిధి పూర్తిగ వీడుచు నాటపాటలన్
  తన్నగ రాజుగారినహ దారుణ రీతిన మేఠినందునన్
  చిన్నది చీమ లోచనము చేరెఁడు నోరు సురంగమార్గమే...

  రిప్లయితొలగించండి
 5. ఆటవెలది
  చిక్కఁ బోకుమయ్య చింతకెన్నడు నీవు
  తిన్నఁగానె దాని దృష్టిఁ బెంచి
  త్రుంచు! మేల్కొనుమయ! తొల్దొల్తఁ గుట్టు నా
  చిన్ని చీమ కన్ను చేరెఁడంత! !

  ఉత్పలమాల
  చిన్నఁగ బుట్టి లోన నిను చింతయె గూల్చఁగ జూచు భూతమై
  యెన్నడు లొంగ బోకుమయ యింగితమందున మూలకారణం
  బెన్నుచు వీడుమా విజయ వీటికిఁ జేరఁగఁ, దొల్త చింతయే
  చిన్నది! చీమ! లోచనము చేరెఁడు నోరు సురంగ మార్గమే!

  రిప్లయితొలగించండి
 6. ఎక్కడెక్కడిదియొ నేరి తెచ్చుకొనుచు
  నొక్కదాని వెనుక నొక్కటిగనె
  బారు దీరి నడచు , వరుస తప్పదెపుడు
  చిన్ని చీమ కన్ను చేరెఁడంత

  రిప్లయితొలగించండి

 7. బోనసు సరదా పూరణ:

  దున్నుచు చిన్న కాళ్ళుగొని దూరుచు చిన్నగ నేలనుండి భల్
  పన్నుగ చేరి మిత్రులను బారులు బారుల రీతి జొచ్చుచున్
  మిన్నగ దూరి స్తంభముల మ్రింగుచు మెక్కెడు తెల్ల తోలుదౌ
  చిన్నది చీమ లోచనము చేరెఁడు నోరు సురంగమార్గమే...

  రిప్లయితొలగించండి
 8. అందరికీ నమస్సులు🙏
  ఉ.మా

  కన్నుల జూడ లేని క్రిమి కంటక మయ్యెను మట్టు పెట్టగా
  పిన్నలు బెద్దలన్ విడక భీతిని గొల్పగ ముట్ట నంటుచున్
  భిన్నము దీని వేషములు భీకర రూపము గాదె చూడగన్
  *“చిన్నది చీమ లోచనము చేరెఁడు నోరు సురంగమార్గమే”*

  *వాణిశ్రీ నైనాల, విజయవాడ*

  రిప్లయితొలగించండి
 9. ఆధునిక ము నందు అత్యంత విజ్ఞాన
  పరి కరంబు వలన వస్తువులను
  పెద్ద గాను దోచు వింత గా నయ్యెడ
  చిన్ని చీమ కన్ను చేరె దంత

  రిప్లయితొలగించండి
 10. శ్రీమాత్రేనమః/శ్రీగురుభ్యోనమః

  పంచదారపలుకు వదల పూజనుచేసి
  మందిరమ్ము మూయ మరు నిముషమె
  చేర చోటులేదు చేరెనెటులొ!యరెరె!
  చిన్న చీమ!కన్ను చేరెఁడంత

  మీ ఆచార్య లక్ష్మణ పెద్దింటి యానాం.

  రిప్లయితొలగించండి
 11. ఉ:

  మన్నిక మీర గోపికల మాటలు తోడుత మార్చనెంచనై
  వెన్నుడి జూచి నేరుగను వేరిమి గూర్చగ మన్నటంచనన్
  తిన్నగ నోరు దెర్వ మన తేరగ తల్లికి జూపె విశ్వమున్
  చిన్నది చీమ లోచనము చేరెడు నోరు సురంగ మార్గమే

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 12. పన్నుగకాంతిరేఖయదిభాసిలఁజేయునుజీవకోటినిన్
  ఉన్నదిలేనియట్టులనునుండునుమాయయెకప్పియుండగా
  మన్ననఁజేయకున్ననదిమార్కోనునెంతటివానినైనఁదా
  చిన్నదిచీమలోచనముచేరెడునోరుసురంగమార్గమే

  రిప్లయితొలగించండి
 13. పంచదార పలుకు పడినంతనె నిముస
  మాలసించ కుండ యడుగుబెట్టు
  మనిషి కన్ను కనని మైక్రానుల గనెడి
  చిన్నచీమ కన్ను చేరెడంత

  బలవంతమైన సర్పము చలిచీమల చేతజిక్కి చావదె సుమతీ

  మన్నును నోటితోకఱచి మానుగ గట్టగ మేడలెన్నియో
  తిన్నగ పాములేయచట తీరుగజేరుచు
  బుస్సుబుస్సనన్
  దన్నును గోలుపోవకయె దండుగ నేర్పడి గూల్చసర్పమున్
  చిన్నది చీమ, లోచనము చేరెడు, నోరు సురంగ మార్గమే

  రిప్లయితొలగించండి
 14. చిన్ని చీమ కన్ను చేరెఁడంతగజేసి
  కుట్టగానె బాధ కునుకు వేళ,
  ప్రణయ కాల మందు పట్టె మంచము మీద
  నరుని చేయి తగిలి నలిగి పోగ

  రిప్లయితొలగించండి
 15. వంటయింటిలోని కంటికి కనరాని
  మారుమూల పంచదార భరిణ
  చీమకంటికెటుల చిక్కెనో దైవమా
  చిన్ని చీమ కన్ను చేరెఁడంత

  రిప్లయితొలగించండి
 16. వెంగళప్ప తోడ విజ్ఞత వీడుచు
  నతిశయోక్తులెన్నొ యతడు చెప్పె
  నక్కతోక జూడ నలుబది మూరలు
  చిన్నచీమకన్ను చేరెఁడంత

  రిప్లయితొలగించండి
 17. అన్నము కూడదంచు తిననంచును పిల్లడు బెట్టు సేయగా
  పిన్నియె చెప్పసాగె నొక వింతకథన్ పసివాడికీ విధిన్
  వెన్నెల రాత్రి కుంజరము విందుకు పిల్వగ వచ్చె మిత్రుడే
  చిన్నది చీమ, లోచనము చేరెడు నోరు సురంగ మార్గమే.

  రిప్లయితొలగించండి
 18. చిన్నది రూపమందుగన చీమ యమాయక జీవికాదు యే
  చిన్న పదార్థమైన సడిచేయక కన్గొని ముచ్చిలించుచున్
  కన్నమునందు దాచుకొను కష్టము సైచుచు పట్టువీడకన్
  చిన్నది చీమ లోచనము చేరెఁడు నోరు సురంగమార్గమే

  రిప్లయితొలగించండి
 19. సమస్య :
  చిన్నది చీమ లోచనము
  చేరెడు నోరు సురంగమార్గమే

  ( అల్పబుద్ధి మంథర అనల్పబుద్ధి కైకను ప్రభావితం చేసినతీరు )

  ఉత్పలమాల
  ...................

  అన్నులమిన్న కేకయ కు
  లాంగన చెంతకు చేరుకొన్నదే !
  గున్నది దాసి యైన ఒక
  గూనిది మంథర క్రుళ్లుమోతుదై ;
  మున్ను వరమ్ములన్ మగని
  ముచ్చట మీరగ గోరుమంచనెన్ ;
  జిన్నది చీమ ; లోచనము
  చేరెడు ; నోరు సురంగమార్గమే .

  రిప్లయితొలగించండి
 20. ఈనాటి శంకరాభరణం వారిచ్చిన సమస్య

  *“చిన్ని చీమ కన్ను చేరెఁడంత”*
  (లేదా…)
  *“చిన్నది చీమ లోచనము చేరెఁడు నోరు సురంగమార్గమే”*

  నా పూరణ

  ఆటవెలది

  చీమ బొమ్మ గీయఁ జెప్పగా టీచరు
  చెట్టుఁ బుట్టఁ దిరిగి చీమఁ దెచ్చి
  భూత యద్ద మందుఁ బోడిమిఁ జూడగా
  చిన్ని చీమ కన్ను చేర డంత

  ఉత్పలమాల

  అన్నను వేడియుండెనొక యన్నుల మిన్న కుతూహలం బునన్

  పున్నెముగల్గు నీకు నొక బొమ్మను గీయుము! చీమ చిత్రమే!

  అన్నయు భూతయద్దమున నచ్చటి చీమను చూచినంతనే

  చిన్నది చీమలోచనము చేరెడు నోరు సురంగమార్గమే

  ఆదిభట్ల సత్యనారాయణ

  రిప్లయితొలగించండి


 21. చిన్ని చీమ కుట్టె చిమచిమ మంటాయె
  చిన్ని చీమ కన్ను చేరెఁడంత
  చిన్ని చీమ వింత చెప్ప నెవ్వారి త
  రమగు శంకరాభరణ కవీశ!


  జిలేబి

  రిప్లయితొలగించండి


 22. కిసుమీసు పైన దాని మ
  నసు! చిన్నది చీమ! లోచనము చేరెఁడు! నో
  రు సురంగమార్గమే! వెస
  ముసురుకొనుచు పైన తిరిగె మోహము తోడై!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 23. ఎన్నగ మేటి జ్ఞానమది యేమని చెప్పఁ దరమ్ము మానవుం
  డున్నది భూమిపై కను నధోజగదూర్ధ్వజగద్రహస్యముల్
  దిన్నను తూమెడోగిరముఁ దీరవు తత్క్షుధ లేమి చోద్యమో!
  చిన్నది చీమ లోచనము చేరెఁడు నోరు సురంగమార్గమే.

  కంజర్ల రామాచార్య

  రిప్లయితొలగించండి
 24. చీమయెంచిజూడచిన్నదైతోచును
  పెద్ద బరువుమోయు పదిలముగను
  సూక్ష్మబుద్ధితోడ సురసముగనిపెట్టు
  చిన్ని చీమ కన్ను చేరెఁడంత

  చిన్నికృష్ణుడపుడు పిన్నవాడేగదా
  ప్రేమతోడజేసెపెద్దపనులు
  సూక్ష్మబుద్ధియున్న సుఖములరయవచ్చు
  చిన్ని చీమ కన్ను చేరెఁడంత

  రిప్లయితొలగించండి
 25. మన్నుమిన్నునేలు మహితుని సేవించు
  నాంజనేయుడంత యగుచుకుఱుచ
  సీతజాడవెదకె శ్రీలంకయందున
  చిన్నిచీమకన్ను చేరెడంత

  రిప్లయితొలగించండి


 26. శ్యామలీయం వారి కా మింటు -


  "చేరెడంత అనరాదండీ. చేరు క్రియాపదం. ఎడు మానార్ధకం. సరైన ప్రయోగం చారెడంత అన్నది.ఇక్కడ చార అన్నది అరచేతి కొలత. చారెడు అంటే అరచేతిలో పట్టెడునంత అని."


  ఇట్లు
  అక్కడిదిక్కడదిక్కడిదక్కడ
  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నిఘంటు శోధనలో మానార్థంలో చేర శబ్దమే ఉన్నది. చార శబ్దానికి వేరే అర్థాలిచ్చారు. కనుక చేరెడు అనడం సాధువే.
   "చిచ్చున వెచ్చి పొట్ట కొక చేరెఁడు గంజియు లేక యాఁకటం జచ్చియుఁ జావ మించుక విషంబయినం గొని" (కొఱవి గోపరాజు సింహాసన ద్వాత్రింశిక)
   'చారెడంత' అన్నది వ్యావహారికం.

   తొలగించండి
  2. సోదరుడు - సోదరి అన్నట్లు నారదుడు - నారది అనవచ్చునేమో?

   తొలగించండి
 27. రిప్లయిలు
  1. చేర ఎఁడు = చేరెఁడు. సాధువే. చేర = ఇంచుక వంచఁబడినచేయి, ఎఁడు = పరిమాణార్థకము.
   ఇక్కడ సంధి నిత్యము.
   11.
   అంద్వవగాగమంబులం దప్ప నపదాదిస్వరంబు పరంబగునపు డచ్చునకు సంధి యగు.
   మూర + ఎఁడు = మూరెఁడు
   వీసె + ఎఁడు = వీసెఁడు
   అర్థ + ఇంచు = అర్థించు
   నిర్జి + ఇంచు = నిర్జించు
   అంద్వవగాగమంబులు పరంబగునపుడు యథాసంభవముగా గ్రహించునది.
   రాములందు - రాములయందు, హరియందు, ఎనిమిదవది - ఎనిమిదియవది.

   చేరు కాదని గ్రహించఁ దగును.

   తొలగించండి
 28. అవ్వ లోక మెల్ల వ్యాపించె వీక్షించి
  వింత కీటకమ్ము పంత మూని
  ప్రజలఁ దాకి వేగ భక్షించె దయ వీడి
  చిన్ని చీమ కన్ను చేరెఁడంత


  కన్న! తలంచు మింక మదిఁ గమ్మిఁక బుద్ధి గలట్టి వానిగాఁ
  దన్నిన రాల దొక్కటియు దమ్మిడి వింతగఁ గాంచఁ జేతి లో
  నున్నది చిన్నినాణె మట యూహలు మాత్రము దాటు కోటలం
  జిన్నది చీమ లోచనము చేరెఁడు నోరు సురంగమార్గమే

  రిప్లయితొలగించండి
 29. మిన్నగురూపముంగలిగి మేదినినంతను నాక్రమించునై
  బన్నుగరామచంద్రునకు బంటుగనుండుచు సీతజాడకై
  మిన్నునబోవుచున్ నడుమ మీరినలంకిణినోటచిన్నగౌన్
  చిన్నదిచీమ,లోచనముచారెడు,నోరుసురంగ మార్గమే

  రిప్లయితొలగించండి
 30. ఎన్నడునైనవిన్నదియునెన్నడునైననురెండుకళ్లతో
  గన్నదికాదుబ్రహ్మమనగాగడుబెద్దదిజీవులందునన్
  *“జిన్నది చీమ ,లోచనము చేరెఁడు నోరు సురంగమార్గమే”*
  యెన్న సదాశయాక్షి మఱి యెన్నగ నాశయె యాస్యమౌ గదా

  రిప్లయితొలగించండి
 31. కన్న కొడుకు చూడ చిన్నవాడే యౌను
  తండ్రి దుర్గుణములు తనకు లేవు
  భయము లేక నిలిచె భక్తియె రక్షగా
  చిన్న చీమ కన్ను చేరెడంత

  రిప్లయితొలగించండి
 32. శ్రీమాత్రేనమః /శ్రీగురుభ్యోనమః

  మిన్నగ కట్టినాడొకడు మేడను నేదియు దూరనట్లుగన్

  చెన్నలరార,చెంత గలచీమల పుట్టను
  చూడకుండగన్!

  చిన్నది చీమ!లోచనము చేరెఁడు!నోరు
  సురంగమార్గమే!

  దున్నుచు మేడమూలనది దూరెను
  మొత్తము మేడగూల్చెనే!!!

  మీ ఆచార్య లక్ష్మణ పెద్దింటి యానాం.

  రిప్లయితొలగించండి