25, డిసెంబర్ 2020, శుక్రవారం

సమస్య - 3585

26-12-2020 (శనివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“గానుగపై నెక్కి యేగఁగా నగుఁ గ్రోసుల్”

(లేదా…)

“గానుగ నెక్కి యేగవలెఁగా శతయోజనముల్ రయంబునన్”

90 కామెంట్‌లు: 1. మానవలెను మా గప్పాల్
  గానుగపై నెక్కి యేగఁగా నగుఁ గ్రోసుల్,
  యేనుగు నెక్కి తిరుగవలె
  సోనాక్షి సమేతముగ వసుధనేలవలెన్ !  జిలేబి

  రిప్లయితొలగించండి


 2. గనుడు బతుకు నడకను! చు
  వ్వన గానుగ నెక్కి యేగవలెఁగా శతయో
  జనముల్ రయంబునన్, పా
  వనమై గడుప సతితోడు వసతిగ నిలలో!  జిలేబి

  రిప్లయితొలగించండి
 3. కానగశాస్త్రపులోతులు
  పూనికవిజ్ఞతమనిషియుభూరిగతెలిసెన్
  మానుగకన్వేయరుగని
  గానుగపైనెక్కియేగగానగుక్రోసుల్

  రిప్లయితొలగించండి
 4. పూని విమాన మార్గము ముముక్షువు కోటికి యోగమొక్కటే
  మానిత రాజ మార్గమని మాన్య మనీషులు యోగి పుంగవుల్
  మానస కశ్మలంబు బరిమార్చగ నేర్చిన చిత్తశుద్ధియన్
  *“గానుగ నెక్కి యేగవలెఁగా శతయోజనముల్ రయంబునన్”*

  రిప్లయితొలగించండి
 5. మ్రానుగమారెజీవనముమారుతిజూపినమార్గమందునన్
  వీనులవిందుముందుగనవీనులుదూరపుదేశమేగగా
  ప్రాణులుయోగమార్గమునెభవ్యమటంచువచించ ధ్యానమన్
  *“గానుగ నెక్కి యేగవలెఁగా శతయోజనముల్ రయంబునన్”*

  రిప్లయితొలగించండి
 6. వానల కాలము వచ్చెను
  నూనెను దీయంగనుకొని నూరుయు డబ్బాల్
  మానుచు నిదురను, దిరుగుచు
  గానుగపై నెక్కి యేగఁగా నగుఁ గ్రోసుల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'తీయంగనుకొని'? 'నూరును/నూరగు' అనండి.

   తొలగించండి
 7. రిప్లయిలు
  1. శ్రీమతి సీతాదేవి దేవి గారి సూచనను మన్నించి సవరించిన పూరణ :

   ఆదాయం చాలదని కోపంతో ఓ భార్య భర్తతో...

   కందం
   మాని కుటుంబ నియంత్రణ
   నీనితి శునకంబువోలె నిందరి! నెటులీ
   జానెడు రాబడి రాల్చెడు
   గానుగపై నెక్కి యేగఁగా నగుఁ గ్రోసుల్?

   ఉత్పలమాల
   మానసమందు మూర్ఖతను మాని కుటుంబ నియంత్రణన్ ప్రభో!
   యీనితి కుక్క చందమున నిందరి బిడ్డల బాధ్యతల్ గనన్
   మ్రానెడు! లింగులింగుమని రాబడి జానెడుఁ గూర్చు బోడిదౌ
   గానుగ నెక్కి యేగవలెఁగా శతయోజనముల్ రయంబునన్! !

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 8. పేనిరిగాలిమేడలనుభేషజమోప్పగభూరిసంపదన్
  ఆనకమేడనెక్కుటకునావిరియయ్యెనుశక్తివారికిన్
  కానగలిప్టులంచునటగానుగపద్ధతికూర్చిరేనరుల్
  గానుఁగనెక్కియేఁగవలెగాశతయోజనముల్రయంబునన్

  రిప్లయితొలగించండి
 9. తేనెను సేకరించవలె తేటుల గూళ్ళకు
  నిప్పుపెట్టుచున్
  నూనెను తీయగావలెను నువ్వుల బిండుచు నెద్దులాగెడిన్
  గానుగనెక్కి; యేగవలెగా శతయోజనముల్ రయంబునన్
  మానుగ రైలుబండినను మామను జూడగ రాజధానినిన్

  రిప్లయితొలగించండి
 10. మ్రానులపై తిరుగాడెడు
  వానరులము కామె మనము పావనియౌ యా
  జానకిదరి జేరగలమె
  గానుగపై నెక్కి యేగఁగా నగుఁ గ్రోసుల్ ?

  రిప్లయితొలగించండి
 11. కానలలోన సాగవలె కష్టమటంచు దలంచకుండగా
  హీనుల దుష్ట పన్నకమదెంతటి ముప్పును దెచ్చె సోదరా!
  కానగ పూర్వవైభవము కల్లయటంచును దోచు చుండెనే
  గానుగ నెక్కి యేగవలెఁగా శతయోజనముల్ రయంబునన్

  రిప్లయితొలగించండి
 12. మాననమందునలెక్కలు
  ఈనక ముందే కల గని వేసిన పాదుల్
  కానక జీవన రీతులు
  గానుగపై నెక్కి యేగఁగా నగుఁ గ్రోసుల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదంలో యతి తప్పింది. సవరించండి.

   తొలగించండి
  2. 🙏 ధన్యవాదాలు, గురువర్యా
   రెండవ పాదం సవరించి:
   ఈనక ముందే కల గన యే విధి దీరున్

   తొలగించండి
 13. మానవుడు జాన పొట్టకు
  గానుగపై నెక్కి యేగఁగా- నగుఁ గ్రోసుల్
  బానెడు కడుపుకు వృషభము
  దీనగ గంతన నెపుడును దిరుగుచు నుండున్

  రిప్లయితొలగించండి
 14. నూనెల దీయుట కొఱకై
  గానుగ పై నెక్కి యేగగా నగు :: గ్రోసుల్
  యానము విమాన మెక్కిన
  మానుగ చేరంగ వచ్ఛు మహిలో సుకవీ !

  రిప్లయితొలగించండి
 15. నూనెను దీయగ నొప్పును
  గానుగపై నెక్కి ; యేగఁగా నగుఁ గ్రోసుల్
  యానము నెక్కి త్రోలుచు
  గానుగలాడు నెలవునకు , గామన దీరన్

  రిప్లయితొలగించండి
 16. ఉ:

  కానుక లందుకొండనుచు కాయడ మేర్పడ జేయ జూదమున్
  లోనగు నట్లు దెల్వ పలు లోకువ టక్కుల నెంచి వంచనన్
  వేనకువేలు లాగుకొన వేదన చెందిన లోకులిట్లనన్
  గానుగ నెక్కి నేగ వలెగా శతయోజనముల్ రయంబునన్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 17. సమస్య :
  గానుగనెక్కి యేగవలె
  గా శతయోజనముల్ రయంబునన్

  (వినాయకునివలె వినయాదరాలతో జననీజనకులను సేవిస్తే సర్వకార్యాలలో బాలబాలికలకు విజయమే )
  మానుగ బాలలందరును
  మాన్యులు దివ్యులు దల్లిదండ్రులన్
  మానసమందు నిల్పి ముద
  మారగ వందన మాచరించుచున్
  బూన గజాస్యు మార్గమును ;
  బొందెద రన్ని జయంబులెప్పుడున్ ;
  గానుగనెక్కి యేగవలె
  గా ! శతయోజనముల్ రయంబునన్ .

  రిప్లయితొలగించండి
 18. మానసరోవరంబు తటిపై జపమున్ తనరించవచ్చు, నీ
  మేను నహర్నిశం బనుగమించును గుండెను తాకవచ్చు, యీ
  కానుక లందు నిక్కడయె, కాల్పనికమ్మగు వాస్తవంబునన్
  గానుగ నెక్కి యేగవలెఁగా శతయోజనముల్ రయంబునన్౹౹
  (కాల్పనిక వాస్తవం = virtual reality)

  రిప్లయితొలగించండి
 19. నూనము దంపతుల్ బరగి నూనియఁ దీసెడు గానుగెద్దులౌ
  యాన మగమ్యగోచరనిరంతరకార్యము దూరలక్ష్యమై
  యూనిక లేనిదయ్యెను ప్రయోజన
  మెంతయొ? తోచదెట్లొ?యీ
  గానుగ నెక్కి యేగవలెఁగా శతయోజనముల్ రయంబునన్.

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
 20. ఏనిక భారమైన భవమీదగ నేవిధి నుండ బోవునో!!
  మౌనముఁ దాల్చు నాల రయఁ బల్వురు సంతతి కొద్ది రాబడుల్
  పూని యగమ్యలక్ష్యము నపూర్వఫలమ్మది తోచ దైన నీ
  గానుగ నెక్కి యేగ వలెఁగా శతయోజనముల్ రయంబునన్.

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
 21. దానము ధర్మమునెరుగని

  మానిషి సాధించిగ తరమా మోక్షమ్మున్

  కానుల వేటన జీవన

  గానుగపై నెక్కి యేగఁగా నగుఁ గ్రోసుల్

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  ( “కాని” అనగా అణాలో పావు భాగము .. 16 అణాలు చేరితే ఒక రూప్యము)

  రిప్లయితొలగించండి
 22. పూనిక ధరణిన్ జూడగ
  నూనికతో సాగుమోయి యుత్సాహమునన్
  దైనిక చక్రము బోలెడి
  గానుగపై నెక్కి యేగఁగా నగుఁ గ్రోసుల్!
  రిప్లయితొలగించండి
 23. ఈనాటి శంకరాభరణం వారిచ్చిన సమస్య

  గానుగనెక్కి యేగవలెగా శతయోజనముల్ రయంబుగన్

  నాపూరణ

  నూనెను దీయగాఁ దివిరి నువ్వులఁ బోయుచు గానుగందునన్

  పూనిక నాడగావలయు పూర్తిగఁదైలము వచ్చుదాకయున్

  మానిత మార్గమౌనుగద మౌనపు దీక్షయె మోక్షగామికిన్

  గానుగనెక్కి యేగవలెగా శతయోజనముల్ రయంబుగన్

  ఆదిభట్ల సత్యనారాయణ

  రిప్లయితొలగించండి
 24. కం//
  చీనాంబరములు గొనుటకు
  భానూదయ వేళయందు భార్యను దోడ్కొన్ !
  తానొక గ్రామంబడుగిడి
  గానుగపై నెక్కి యేగఁగా నగుఁ గ్రోసుల్ !!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'తోడ్కోన్'? "భార్యాయుతుడై" అనండి.

   తొలగించండి
 25. మైలవరపు వారి పూరణ

  మానుగ దీని లింగమని, మంత్రము తంత్రము నేర్వకుండియున్
  దీనత దిర్గుచుంటినిట దీనికి చుట్టు ప్రదక్షిణంబనన్
  హే నగజావరా! యనెడి యెద్దొక నంది, శివున్ స్మరించి యా
  గానుగ నెక్కి యేగవలెఁగా శతయోజనముల్ రయంబునన్.!!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు


  1. మైలవరపు వారిది వచ్చె
   జీపీయెస్ వారి సరదా పూరణలు రాలేదేమిటి ఇంకా ఇవ్వాళ ?

   దీదీ గానుగ నెక్కి యేగవలెగా తిండాడ భాజ్పా జనుల్ :)


   జిలేబి

   తొలగించండి
  2. జీపీయెస్ వారు మరొక ముఖ్యమైన పనిలో వ్యస్తులై ఉన్నారు. సస్పెన్స్!

   తొలగించండి
 26. చేనును బండిన నువ్వుల
  నూనెను దీయగనుకాపు నేర్పుగగట్టన్
  దీనత దలంచె వృషభము
  గానుగపై నెక్కి యేగగావలె గ్రోసుల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. తూనిక వృద్ధిరేటుయన దొల్తగణింప
   పురోభివృద్ధికిన్
   మానుగ మానినీమణుల, మానవహక్కుల రక్షణాదులే
   బోనసు మార్కులౌననగ బోల్చగ భారతదేశ సూచికల్
   గానుగనెక్కి యేగవలెగా శతయోజనముల్ రయంబునన్

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'రేట+అన' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు.

   తొలగించండి
  3. ధన్యవాదములు గురుదేవా సవరిస్తాను! 🙏🙏🙏

   తొలగించండి
  4. తూనిక వృద్ధిరేటు తొలుదొల్తగణింప
   పురోభివృద్ధికిన్
   మానుగ మానినీమణుల, మానవహక్కుల రక్షణాదులే
   బోనసు మార్కులైనపుడు బోల్చగ భారతదేశ సూచికల్
   గానుగనెక్కి యేగవలెగా శతయోజనముల్ రయంబునన్

   తొలగించండి
 27. కానగ బేదల యున్నతి
  దానమ్ములనెట్టులొదవు తగురీతిగనా
  ప్రాణులకొక భృతిలేకనె
  గానుగపై నెక్కి యేగఁగా నగుఁ గ్రోసుల్?

  రిప్లయితొలగించండి


 28. ఈ సమస్య బాగుందాండి ?  ముని ధరణిజను వెతుక వనమున విడిసెనయా  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాగుంది. దీనికి వృత్తపాదాన్ని తయారు చేయాలి కదా?

   తొలగించండి


  2. సరియేనాండీ ?


   ముని వాసమ్మయె కాననమ్ము వెతుకన్ ముప్పొద్దులా జాయనే!   జిలేబి

   తొలగించండి
 29. గానుగను ద్రిప్పగిరగిర
  మౌనముగా గూరుచుండి ముదితయొ కతెయపు
  డానన మందిట్లనుకొనె
  గానుగపైనెక్కియేగగానగు గ్రోసుల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   కందం రెండవ పాదం చివర గురువుండాలి కదా?

   తొలగించండి
 30. జానెడు పొట్టను నింపగ
  గానుగ పైనెక్కినేగగానగు గ్రోసుల్
  యీనాబ్రతుకున తిప్పలు
  యేనాటికి తప్పవనుచు నేడ్చెన్ దున్నల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'క్రోసుల్+ఈ' అన్నపుడు యడాగమం రాదు.

   తొలగించండి
 31. కానము వెదకిన భూమిని
  దీనిని వీడంగ నొప్పు దిట్టతనముతో
  నీ నీ శకటము కన్నను
  గానుఁగపై నెక్కి యేఁగఁగా నగుఁ గోసుల్


  మానవ యోర్పు ముఖ్య మిల మానుగఁ బొందఁ దలంచఁ గోర్కులన్
  మే నలయంగఁ బాక నిఁక మీఱక యెప్పటి కైన నీ వహో
  నూనెను బొందఁ గోరినను నూఱకు పండ్లను జుట్టు తిర్గుచున్
  గానుఁగ నెక్కి యేఁగ వలెఁగా శతయోజనముల్ రయంబునన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
   'మానవ!' అని సంబోధనా చిహ్నం లేకపోయేసరికి 'మానవ యోర్పు' అనే దుష్టసమాసం అని పొరబడ్డాను సుమా! రెండవ పాదంలో 'పాకన్'?

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
   పాకను మీఱకుండ: పాకలోనే యుండి. గానుఁగ కదలక యక్కడే యుండును కదా.

   తొలగించండి
 32. నూనెనుదీయనోపునికనువ్వులనుండియుదామమేకమై
  గానుగనెక్కియేగవలెగాశతయోజనముల్రయంబునన్
  యానపుసాధనంబయినయాకసతేరునునాశ్రయించియున్
  గానుగమాయమాయెనికగంతలులేవుగనెద్దుకిప్పుడున్

  రిప్లయితొలగించండి
 33. కానుకలంచు పేదలకు కాసులు పంచగ దీరిపోవునా
  దానములిచ్చి వారిదగు దైన్యమునేవిధి గాళుచేతురో
  మానుడు, వారికేదయిన మంచియుపాధిని జూప మేలగున్
  గానుగ నెక్కి యేగవలెఁగా శతయోజనముల్ రయంబునన్?

  రిప్లయితొలగించండి
 34. జానెడు పొట్టను నింపగ
  గానుగ పైనెక్కినేగగానగు గ్రోసుల్
  యీనాబ్రతుకున తిప్పలు
  యేనాటికి తప్పవనుచు నేడ్చెన్ దున్నల్.

  రిప్లయితొలగించండి