8, డిసెంబర్ 2020, మంగళవారం

సమస్య - 3568

9-12-2020 (బుధవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“బాసఁ జెఱచు పండితులకె వందనములు”

(లేదా…)

బాసకుఁ గీడుఁ జేయఁగల పండితులన్ గని మ్రొక్కఁగాఁ దగున్”

88 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    స్వీయ ప్రశంస:

    వాసిగ శంకరాభరణ ప్రాంగణ మందున జొచ్చి వేడుకన్
    తీసియు వేయుచున్ మురిసి తెన్గున ఛందపు సూత్రముల్ సదా
    యాసలు వాడుచున్ తరచు హ్లాదము నొందుచు నాంధ్రపద్యపుం
    బాసకుఁ గీడుఁ జేయఁగల పండితులన్ గని మ్రొక్కఁగాఁ దగున్...

    రిప్లయితొలగించండి

  2. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    స్వీయ ప్రశంస (2):

    వ్రాసియు వేనవేలుగను రచ్చను జేయుచు నాంగ్లమందునన్
    కూసి యసత్యమౌ కథలు గుట్టుగ నుండక ముత్తుకూరుపై
    కోసియు కోతలన్ మురిసి కొండొక బ్లాగున మ్లేచ్ఛమైనదౌ
    బాసకుఁ గీడుఁ జేయఁగల పండితులన్ గని మ్రొక్కఁగాఁ దగున్...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
      మీరు మీ బ్లాగులో ఆంగ్లంలో వ్రాసిన వ్రాతల్లో అసత్యాలు ఎక్కడా ఉన్నట్టు తోచలేదు.
      I think more of your friends and students are missing your intellectual, humourous and classical English writings due to SHANKARABHARANAM.

      తొలగించండి
    2. "Do you tell lies?"

      "All the time"

      "When?"

      "Every night when I blog. This is my blog # 1620 and I must have repeated each of my KGP stories dozens of times...every time with a new lie...Pratik says that each of my stale stories is a new edition and that's why he doesn't mind re-reading them"

      తొలగించండి

  3. "ఎగస్పార్టీ" వారి ఆరోపణలు :)

    సత్యమిదియె కంద జిలేబి సదనమందు
    వాసి లేని పద్యమ్ముల వ్రాసి వ్రాసి
    బాసఁ జెఱచు; పండితులకె వందనములు
    వీటిని భరించిరే దారి వేరు లేక!



    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'శంకరాభరణం'లో అన్ని నమూనాలు ఉన్నాయి. అందర్నీ భరిస్తూ, అందరితో సమానంగా వ్యవహరించే స్థితప్రజ్ఞుడు శంకరయ్య! :-)

      తొలగించండి
  4. నియతిభాషకునిచ్చునునిండుఁదనము
    కానికాలంబునెవరునుఁగావలేరు
    కోతఁబెట్టుచుపలుకునుకోవిదుండు
    భాషచెఱచుపండితులకెవందనములు

    రిప్లయితొలగించండి
  5. కుకవి నిందను జేయంగ సుకవి యొకడు
    ధార లేనట్టి పద్యంపు వరుస లన్ని
    వ్యాజ నిందను సేయుచు వ్యక్త పరిచె
    బాసఁ జెఱచు పండితులకె వందనములు”

    రిప్లయితొలగించండి

  6. బోనసు సరదా పూరణ:

    స్వీయ ప్రశంస (3):

    కోసుల వేలనున్ జనుచు కొండొక శాస్త్రియె వంగభూమినిన్
    వీసపు శ్రద్ధనున్ గొనక వేడుక మీరగ శబ్దశాస్త్రమున్
    త్రోసియు వేయుచున్ సతము తొందర నందున రామకృష్ణుదౌ
    బాసకుఁ గీడుఁ జేయఁగల పండితులన్ గని మ్రొక్కఁగాఁ దగున్...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వంగభాషకు మీరు చేసిన కీడేమిటో ?
      మీ బోనసు పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. 🙏

      తెలుగు యాసతో మాటలాడుట. అక్కడే పుట్టి పెరిగిన మా సుపుత్రుడు బెంగాలీని బెంగాలీల వలె మాట్లాడగలడు...

      తొలగించండి
  7. తేటగీతి
    వేష భాషలు సాత్విక విలువలంద
    నిత్యమున్ పద్యమును నేర్పు నియతిఁ బరగి
    కృషిని దిద్దుచు మద్గురుల్ గీర్తిఁ బెంచ
    బాసఁ జెఱచు పండితులకు, వందనములు

    ఉత్పలమాల
    వేసము సాత్వికమ్ము విన ప్రేమనుఁ బంచెడు భాషణమ్ములున్
    ధ్యాస గనంగ శిష్యులకు ధాటిగ పద్యము నేర్ప, 'మద్గురున్' ,
    దోసము దొర్లెనా రయమె తోడ్పడి తీర్చఁగ మేటివారిగన్
    భాషకుఁ గీడుఁ జేయఁగల పండితులన్, 'గని మ్రొక్కఁగాఁ దగున్'


    రిప్లయితొలగించండి
  8. 08.12.2020
    అందరికీ నమస్సులు🙏

    *“బాసకుఁ గీడుఁ జేయఁగల పండితులన్ గని మ్రొక్కఁగాఁ దగున్”*

    నా పూరణ ప్రయత్నం..

    *ఉ*

    మీసము ద్రిప్పుచున్ సతము మిక్కిలి గొప్పగ తప్పు జెప్పుచున్
    వాసికి నెక్కగా దలచి పద్యములిష్టము వచ్చినట్టుగా
    వ్రాసెడి వారలన్ భువిని పద్యము వీడగ కోరుచున్ తథా
    *“బాసకుఁ గీడుఁ జేయఁగల పండితులన్ గని మ్రొక్కఁగాఁ దగున్”*

    *కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
    🙏😊

    రిప్లయితొలగించండి
  9. క్రొవ్విడి వెంకట రాజారావు:

    దూఱునట్టి భాషయె నేర్చి దొరలు చుండు
    నర్భకులను చేరగదీసి ననునయమున
    కూర్పుజేసి వారెంచెడి కుత్సనమగు
    బాస జెఱచు పండితులకె వందనములు.

    రిప్లయితొలగించండి


  10. అనఘా! తరమండి వెసన్
    గన బాసకుఁ గీడుఁ జేయఁగల పండితులన్ ;
    గని మ్రొక్కఁగాఁ దగున్ బ
    త్తిని చేర్చి మన సదనపు బుధిలురకు సుదతీ!



    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'బుధిలుడు'... ఎక్కడ దొరుకుతాయండీ ఈ పదాలు ?

      తొలగించండి



    2. బుధిలుడు - పండితుడని ఆంధ్రభారతి ఉవాచ.

      బధిరుడు - చెవిటి వాడని ఆంధ్రభారతి ఉవాచ.


      స్పెల్లింగ్ మిస్టేక్ అయ్యుంటే వాయగొట్టి వుండేవారేమో :)



      జిలేబి

      తొలగించండి
  11. తీయతేనియ లొలికెడు తెలుగు భాష
    కీర్తి బెంచెడు విధమున కృషిని సల్పి
    ముదమగు తెనుగు కపకారమొసగ జేయు
    బాసఁ జెఱచు పండితులకె వందనములు

    రిప్లయితొలగించండి
  12. అధర కాగితం, మధుర సంతకం 😊

    భాగవతమైన చదవని పండితుండు,
    ప్రాస యతులను పాటించ పాట్లు బడక
    నధర కాగిత, మధుర నామాక్షరముల
    బాసఁ జెఱచు పండితులకె వందనములు.

    రిప్లయితొలగించండి
  13. మంచి నుడి కార ముల తోడ మాన్య వరుల
    మెప్పు నొందెడు రచన తో మేటి యగుచు
    కుకవి జాలము సృష్టించు కొంటె వక్ర
    బాస జెఱచు పండితుల కె వందనములు

    రిప్లయితొలగించండి
  14. కాసుల కోసమై సతము కాకవు లౌచును మాతృభాషకున్
    మోసము చేయువారలగు ముష్కరులన్ వెలివేయగా దగున్
    బాసకుఁ గీడుఁ జేయగల యండితులన్, గని మ్రొక్కఁ గాఁ దగున్
    భాసురమానమౌ తెనుగు భాషకు కీర్తిని పెంచువారలన్.

    రిప్లయితొలగించండి
  15. అమ్మభారతి దన్నుగ సూక్ష్మమెరిగి
    వేరుబాసలవాసన కోరదగునె
    యాసనేరిచిమనతెన్గు మరచినట్టి
    బాసఁ జెఱచు పండితులకె వందనములు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కం.
      బాసలు చిదుమగ వేరే
      యాసల నేరిచి మరచెనె నాంధ్రము నయ్యో !
      దోసమునెంచక మనదౌ
      బాసఁ జెఱచు పండితులకె వందన శతముల్ !!

      తొలగించండి
    2. మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పద్యంలో మొదటి, మూడవ పాదాలలో యతి తప్పింది.
      రెండవ పద్యంలో 'మరచెనె యాంధ్రము..' అనండి.

      తొలగించండి
    3. ధన్యవాదాలు గురువర్యా🙏
      సవరించి:

      అమ్మభారతి దన్నుగ యన్నియెరిగి
      వేరుబాసలవాసన కోరదగునె
      యాసనేరిచిమనతెన్గు నంతమరచి
      బాసఁ జెఱచు పండితులకె వందనములు

      బాసలు చిదుమగ వేరే
      యాసల నేరిచి మరచెనె యాంధ్రము నయ్యో !
      దోసమునెంచక మనదౌ
      బాసఁ జెఱచు పండితులకె వందన శతముల్ !!

      తొలగించండి
  16. క్రొవ్విడి వెంకట రాజారావు:

    గోసగు భాషయే పలుకు కొయ్యన గానిని చేరదీయుచున్
    వాసిగ వాని మాటలను పాటన జేయుచు మంచితీరునన్
    యాసనుగూడు దెప్పరపు నాలపనమ్మును తీర్చి కుత్సమౌ
    బాసకుఁ గీడుఁ జేయఁగల పండితులన్ గని మ్రొక్కఁగాఁ దగున్.

    రిప్లయితొలగించండి
  17. ౧.
    ఎందరెన్ని జెప్పిననుగానెవరిమాట
    వినక వ్రాసెపద్య మొకటి వేగిరమున
    వ్యావహారికముల వ్రాసి వాసియనగ
    బాసఁ జెఱచు పండితులకె వందనములు !!

    ౨.
    యాసలసోకులందు బడి భాసురమౌయగు భావసంపదల్
    త్రోసిరి తీరుగున్న పద రూపములన్నిటి మార్చివేయగా
    వ్రాసిరి పట్టులేని నిటు వాసిలి గానని భాష మారగా
    బాసకుఁ గీడుఁ జేయఁగల పండితులన్ గని మ్రొక్కఁగాఁ దగున్!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      "...జెప్పిన గాని యెవరిమాట.."
      "భాసురమై తగు భావసంపదల్.., పట్టు లేని గతి.." అనండి.

      తొలగించండి
  18. ఓర్పుగానుఛందస్సును నేర్పుచున్న
    బాసఁ జెఱచు పండితులకె, వందనములు
    శంకరాభరణము పూజ్య శంకరయ్య
    పండిత గురువులకు కోటి వందనములు!

    రిప్లయితొలగించండి
  19. పాసిన భాషగాదలచి వ్యాకరణాంచిత
    శబ్దజాలమున్
    కూసములిర్గగొట్టదము కూడగరండని
    చేరబిల్చుచున్
    పేశలమైన నాంధ్రమును పెక్కగు యాసల మిశ్రమంబుగా
    బాసకు కీడుజేయగల పండితులన్ గని మ్రొక్కగాదగున్

    కూసము = ఇంటికి ఉపయోగించు కొయ్య స్తంభము

    రిప్లయితొలగించండి
  20. ఊసు లాడ నేర్వక మాతృ భాష లోన
    వచ్చి రాని యాంగ్ల మునకై పరితపించి
    బాస జెఱచు పండితులకె వందనము లొ
    సంగ నది పాడి కాదని చాట వలయు!

    రిప్లయితొలగించండి
  21. సమస్య :
    బాసకు గీడు జేయగల
    పండితులన్ గని మ్రొక్కగా దగున్

    (మొదట్లో పద్యాలు బాగా వ్రాసి తరవాత తప్పుడు ఆలోచనతో ఇచ్చవచ్చిన పదాలతో పంక్తికి రెండక్షరాలు పెట్టి అదే కవిత అనుకొనే కొందరి గురించి )
    ఉత్పలమాల
    ..................

    దోసము లేని శబ్దముల
    దోరపు బద్యములెన్నొ వ్రాసియున్
    వాసిని పొందగా వచన
    వాక్యము , గేయము ముఖ్యమంచెదన్
    మోసపు భావమున్ గలిగి
    మూర్ఖపు వ్రాతల నేదొ వాగుచున్
    బాసకు గీడు జేయగల
    పండితులన్ గని మ్రొక్కగా దగున్ .

    రిప్లయితొలగించండి
  22. వేసము మోసపూరితము;విద్యలు శూన్యము;యీసడించుమా!
    బాసకుఁగీడు చేయగల పండితులన్ గని;మ్రొక్కగాఁదగున్
    చూసియు సర్వ శాస్త్ర్రములు,సొంపును పెంపునుఁగూర్చు నేర్పునన్
    ధీ సముపేత వాక్చతుర ధీర వరేణ్యత నొప్పు వారికిన్.

    రిప్లయితొలగించండి


  23. మనకు వలదు తరుమవలెను
    గన బాసకుఁ గీడుఁ జేయఁగల పండితులన్;
    గని మ్రొక్కఁగాఁ దగున్ విదు
    లను, మన సదనపు కవివరుల భళి జిలేబీ


    జాల్రా
    జిలేబి

    రిప్లయితొలగించండి
  24. ఇంగ్లీషు కలిసిన తెలుగు వాక్కును గూర్చి

    ఉ||
    బాసిన మిశ్రమంబు గను భాష తెలుంగను పేరుగాంచె నే
    డే సరియౌ ముహూర్తమననీ పరభాష పదంబులన్ మహో
    శ్వాసము సాగజేసి పదసంపద గావగ మిశ్రభాషలో
    బాసకు కీడుజేయగల పండితులన్ గని మ్రొక్కగాదగున్

    రోహిత్🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    రిప్లయితొలగించండి
  25. రిప్లయిలు
    1. తెనుగుబాసమధురిమలు తెలియకెపుడు
      పరుల బాసలో నెన్నడు పలుకు వారి
      దెలివిగా తెలుగు విలువ తెలిపి వెడగు
      బాసఁ జెఱచు పండితులకె వందనములు

      తొలగించండి
  26. రాసియె మిన్నయంచు దగ
    లాక్షణికమ్ముల నందలేక పే
    రాసకు బోయి కల్పనల
    వ్రాసిన భావన పొందు లేకయున్
    నాసిరకంపు కైతనిడి
    నప్పగ జెప్పని వారినెట్టు లా
    బాసకుఁ 'గీడుఁ జేయఁగల
    పండితులన్' గని మ్రొక్కఁగాఁ దగున్?!

    రిప్లయితొలగించండి
  27. సమస్య :-
    “బాసఁ జెఱచు పండితులకె వందనములు"

    *కందం**

    కాసుల కొరకై నాంగ్లపు
    బాసయు రాకున్న నాకు వచ్చే ననుచున్
    దోసపు బోధన జేయుచు
    బాసఁ జెఱచు పండితులకె వందనములు రా
    .....................✍️చక్రి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "...కొరకై యాంగ్లపు... వచ్చునటంచున్.." అనండి.

      తొలగించండి
  28. బాసలు వేరు వేరెవరి బాసలు వారికె ముద్దు గొల్పు నా
    భాసముఁ చేయ రాదు దలపన్ బరిహాసవచోవిషోక్తివి
    న్న్యాసవినోదమంచు నటనార్థమ టంచును దూలనాడుచున్
    బాసకుఁ గీడుఁ జేయఁగల పండితులన్ గని మ్రొక్కఁగాఁ దగున్.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  29. ఈరోజు పూరింపవలసిన సమస్య

    *“బాసఁ జెఱచు పండితులకె వందనములు”*
    (లేదా…)
    *“బాసకుఁ గీడుఁ జేయఁగల పండితులన్ గని మ్రొక్కఁగాఁ దగున్”*

    తే.గీ

    నేర్వకుండ చదువు చెప్ప నేరమగును
    భవిత చెఱచును విద్యార్ధి బతుకు చెఱచు
    విద్య నేర్పెడు గురువుకో వినతిఁజేతు
    బాస చెఱచు పండితులకో వందనమ్ము

    ఉత్పలమాల

    శ్వాసయనంగగన్ జెలగు సారస పద్యపు సోయగంబులన్

    ప్రాసలు వృత్తముల్ యతులు ప్రాభవమిచ్చెడు శబ్దజాలముల్

    వ్రాసిరి పూర్వపుం గవులు వైభవమొప్పెడు కావ్యసంపదల్

    బాసకుఁ గీడుఁ జేయఁగల
    పండితులన్ గని మ్రొక్కఁగాఁ దగున్

    ఆదిభట్ల సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  30. మీసమురెండుబాసలకుమేమెకవీంద్రులమంచుబల్కిస
    న్నాసులవేసబాసలకునంతమటంచుతెలుంగునేలలో
    వేసముగట్టిమోసమునువీధికినీడ్చియుపద్దెరూపమౌ
    *“బాసకుఁ గీడుఁ జేయఁగల పండితులన్ గని మ్రొక్కఁగాఁ దగున్”*

    రిప్లయితొలగించండి
  31. ఈరోజు పూరింపవలసిన సమస్య

    *“బాసఁ జెఱచు పండితులకె వందనములు”*
    (లేదా…)
    *“బాసకుఁ గీడుఁ జేయఁగల పండితులన్ గని మ్రొక్కఁగాఁ దగున్”*

    తే.గీ

    నేర్వకుండ చదువు చెప్ప నేరమగును
    భవిత చెఱచును విద్యార్ధి బతుకు చెఱచు
    విద్య నేర్పెడు గురువుకో వినతిఁజేతు
    బాస చెఱచు పండితులకో వందనమ్ము

    ఉత్పలమాల

    శ్వాసయనన్ గనన్ జెలగు సారస పద్యపు సోయగంబులన్

    ప్రాసలు వృత్తముల్ యతులు ప్రాభవమిచ్చెడు శబ్దజాలముల్

    వ్రాసిరి పూర్వపుం గవులు వైభవమొప్పెడు కావ్యసంపదల్

    బాసకుఁ గీడుఁ జేయఁగల
    పండితులన్ గని మ్రొక్కఁగాఁ దగున్

    ఆదిభట్ల సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  32. మైలవరపు వారి పూరణ

    నీ సరి యెవ్వరయ్య? ఘననీలమనోహరదేహ! యూరకే
    బాసలు సేసి వత్తునని పల్కెదు., చూడగ రానెరావు! నీ
    యూసులు నమ్మజాలనిక నోపిక లేదిటు మాయ జేయుచున్
    బాసకు కీడుఁ జేయగలఁ బండితులన్ గని మ్రొక్కగాఁ దగున్!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  33. వినుటకింపుగ లేకుండబెడిదమైన
    బాసజెఱచు పండితులకెవందనములు
    సంస్కరించిన భాషనేచదువునెడల
    నెల్లవారలుముదముతో నిలనునుండ్రు

    రిప్లయితొలగించండి
  34. ౧.
    ఎందరెన్ని జెప్పిన గాని యెవరిమాట
    వినక వ్రాసెపద్య మొకటి వేగిరమున
    వ్యావహారికముల వ్రాసి వాసియనగ
    బాసఁ జెఱచు పండితులకె వందనములు !!

    ౨.
    యాసలసోకులందు బడి భాసురమై తగు భావసంపదల్
    త్రోసిరి తీరుగున్న పద రూపములన్నిటి మార్చివేయగా
    వ్రాసిరి పట్టులేని గతి వాసిలి గానని భాష మారగా
    బాసకుఁ గీడుఁ జేయఁగల పండితులన్ గని మ్రొక్కఁగాఁ దగున్!!

    ****సవరణతో...🙏

    రిప్లయితొలగించండి
  35. వీసముగూడ గారవము,బేర్మియు,వందనమీయకుండుడో
    బాసకుగీడుజేయగలపండితులన్గని,మ్రొక్కగాదగున్
    బాసనుసంస్కరించు,కవివర్యులపాదములెల్లవేళలన్
    బాసయనంగబ్రాణము,సమాజపువృద్ధికిగాదెతెల్పుమా

    రిప్లయితొలగించండి
  36. బాసలు చేయుదు రెన్నియొ
    వాసవులై కోరువారి వరదాతలునై
    మోసము చేయగ జంకరు
    బాస చెరచు పండితులకు వందనమిడుదున్

    రిప్లయితొలగించండి
  37. శ్రావ్యమయి చెలఁగ వలయుఁ జదువరులకుఁ
    బలుకు తీపి నీయ వలయుఁ బామరులకు
    విన్న నేవగింపు కలుగు వికట మైన
    బాసఁ జెఱచు పండితులకె వందనములు


    కాసులు పోసి కొందు రన గ్రంథము లివ్విధముల్ లభించునే
    గ్రాసము వెక్కసం బగును గావ్యము నింపుఁ బఠించ నేరికిం
    జేసిన సేవ లన్నియును జిత్రములే విర మించుఁ డింక నా
    బాసకుఁ గీడుఁ జేయఁగల పండితులన్ గని మ్రొక్కఁగాఁ దగున్

    రిప్లయితొలగించండి
  38. బాసను సేయగావలెను పండితులందరు గట్టి బూనికన్
    బాసకుఁ మేలు సేయుటకు బాధ్యత గైకొని విద్య నేర్పగా
    బాసట గాను నిల్తుమను వారల మెత్తురు గాని యెవ్విధిన్
    బాసకుఁ గీడుఁ జేయఁగల పండితులన్ గని మ్రొక్కఁగాఁ దగున్

    రిప్లయితొలగించండి
  39. ఉ:

    వీసము మారకుండె తెగ వేడిన తప్పులు కూడదంచనన్
    మీసము త్రిప్పుచుండు కడు మెప్పుగ నెప్పుడు గొప్పలెంచుచున్
    యాసను మార్చి కూర్చు నిక యచ్చదెనుంగను, సమ్మతమ్మనున్
    బాసకుగీడుజేయగలపండితులన్ గని మ్రొక్కగాదగున్

    వీసము =రూకలో భాగమైనప్పటికీ "కొంచెము కూడా" అనే అతిశయోక్తి గా రాశాను.


    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  40. వేసము వేసి విద్యల ప్రవేశము లేకనె డాంబికంబుగా
    మోసముజేయబూనుదరు ముష్కరులీభువి నట్టి వారి యా
    దోసమునొంచి దామసముఁదూలగజేయుచు వారి వక్రపుం
    బాసకుఁ గీడుఁ జేయఁగల పండితులన్ గని మ్రొక్కఁగాఁ దగున్

    రిప్లయితొలగించండి
  41. వేసము వేసి బొట్టునిడి వీడియమున్ గొని, ముల్లెకోసమై
    దోసపు కైతలన్ నుడువు ధూర్తుడజస్రము, దూరముంచు డా
    బాసకుఁ గీడుఁ జేయఁగల పండితులన్ గని, మ్రొక్కఁగాఁ దగున్
    కాసులు కోరకుండ కడు కమ్మని కైతల మించు వారలన్

    రిప్లయితొలగించండి
  42. కోశము నింపుకోదలచి ,కోవిడురోజుల వైద్యులందరున్
    బాసనుమార్చివేసితిరి,భావమువంచన బెంచు రీతిగా
    ధ్యాసనదంతయేమికను,దానముధర్మము బూడ్చివేసి, స
    ద్బాసకు గీడుజేయగల ,పండితులన్ గని మ్రొక్కగాదగున్
    +++++++++++++++++++++++++++
    రావెల పురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి