1, డిసెంబర్ 2021, బుధవారం

సమస్య - 3918

2-12-2021 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పతనముఁ గని తండ్రి తనయు వర్ధిల్లుమనెన్”
(లేదా...)
“పతనంబుం గని పొంగెఁ దండ్రి దనయున్ వర్ధిల్ల దీవించుచున్”
(అన్నపరెడ్డి వారికి ధన్యవాదాలతో...)

23 కామెంట్‌లు:

 1. ప్రతిభాభ్యాసము కల్గియు
  నతి కష్టములౌ పరీక్ష లన్ని గెలిచి,యు
  న్నత పదవిఁగొన్న సుతు గొ
  ప్పతనముఁగని తండ్రి తనయు వర్ధిల్లు మనెన్ .

  రిప్లయితొలగించండి
 2. సతతానందముతోడను
  మతిలోమాధవుదలచుచుమాననిభక్తిన్
  అతులితుడగుప్రహ్లాదుని
  పతనముగనితండ్రితనయువర్ధిల్లుమనెన్

  రిప్లయితొలగించండి

 3. అతులిత ప్రతిభను గాంచుచు
  మతిమంతుడటంచు జనులు మన్నింపగ ధీ
  మతిగా నటజూపిన యా
  పతనముఁ గని తండ్రి తనయు వర్ధిల్లు మనెన్.

  రిప్లయితొలగించండి
 4. వెతలవి తొలగగ, గతమౌ
  పతనముఁ గని, తండ్రి తనయు వర్ధిల్లుమనెన్.
  మతిగలవాడై మసలిన
  సతతము వ్యాపార మందు జయమని జెప్పెన్  రిప్లయితొలగించండి
 5. జత గూడిన సవయస్కుల
  గతము తెలియ , వారితోడి కదలిక విడువన్
  మతలబు నెరిగి పరిచయపు
  పతనముఁ గని తండ్రి తనయు వర్ధిల్లుమనెన్

  రిప్లయితొలగించండి

 6. ప్రతియంశంబున జూపె పాటవమునా బాలుండటంచున్ నమ్ముచున్
  బ్రతిభావంతుడతండటంచు జనులే వందించు చున్ గొప్పగా
  స్తుతియింపన్ గనినంతనే గురువు సంతోషమ్ముతో నట్టి యా
  పతనంబుంగని పొంగెఁ దండ్రి దనయున్ వర్ధిల్ల దీవించుచున్.

  రిప్లయితొలగించండి
 7. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

  సతతము లెక్కల చిక్కులు
  వితముగ సరిజేయుచుండి పెద్దల మెప్పున్
  సుత పొందుచుండ నామె య
  పతనము గని తండ్రి తనయు వర్థిల్లు మనెన్.
  (అపతనము = జ్ఞానము)

  రిప్లయితొలగించండి
 8. కందం
  హితమొనరింపఁ గిరీటికి
  కుతుకమున హరి గొని కవచ కుండలములనే
  వెతలఁ బడఁ ద్రోసి కర్ణుని
  పతనముఁ గని, తండ్రి తనయు వర్ధిల్లుమనెన్

  మత్తేభవిక్రీడితము
  హితమున్ బార్థునకెంచుచున్, హరియెతా హీనాతిహీనమ్ముగన్
  గుతుకమ్మై కవచమ్ము కుండలములన్గొన్పోవఁజేజాపఁగన్
  వెతలన్ గానక దానకర్ణుడహొ! నిర్భీతిన్ బ్రసాదింపఁ ద
  త్పతనంబుం గని, పొంగెఁ దండ్రి దనయున్ వర్ధిల్ల దీవించుచున్

  రిప్లయితొలగించండి
 9. కె.వి.యస్. లక్ష్మి, ఉడ్బర్రీ, అమెరికా:

  వితముగ పొంగెను సుత గొ
  ప్పతనము గని తండ్రి; తనయు వర్థిల్లు మనెన్
  సతతము విభవము తోడను
  ప్రతిభను సాగుచు నెలమిని బంచుము ననుచున్.

  రిప్లయితొలగించండి
 10. అతులితముగనొప్పు ప్రతిభ
  సతతము తనయుండు జూప సంబరపడుచున్
  సుతుడమ్మిన సంపద ధర
  పతనముఁ గని తండ్రి తనయు వర్ధిల్లుమనెన్

  రిప్లయితొలగించండి
 11. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

  సతతంబున్ తన మేధతో తనయయే శస్తంబునౌ పద్ధతిన్
  వెతలన్ బెట్టుచు నుండు లెక్కలను ప్రావీణ్యంబుగా జేయుచున్
  ప్రతిభావంతుల మన్ననల్ చవిగొనన్ వాత్సల్యమున్ యామె గొ
  ప్పతనంబుంగని పొంగె దండ్రి తనయున్ వర్థిల్ల దీవించుచున్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సతతంబున్ తన మేధతో కొమరుడే శస్తంబునౌ పద్ధతిన్
   వెతలన్ బెట్టుచు నుండు లెక్కలను ప్రావీణ్యంబుగా జేయుచున్
   ప్రతిభావంతుల మన్ననల్ చవిగొనన్ వాత్సల్యముతో సుతు గొ
   ప్పతనంబుంగని పొంగె దండ్రి తనయున్ వర్థిల్ల దీవించుచున్.

   తొలగించండి
 12. వెతలను గుందుచు సాగెడు
  పతనము గని తండ్రి తనయు వర్ధిల్లు మనెన్
  గతులను మార్చియు ప్రగతికి
  సతతము యత్నించ నీకు సమకూరు గదా !

  రిప్లయితొలగించండి
 13. మతిమంతుండను కీర్తి గాంచి జనసమ్మానార్హశీలుండు స
  మ్మతకర్మశ్రమసక్తుడై ధనము సంపాదించ నర్హుండు సం
  తతదైవార్యవిధేయుడున్ మహితసద్ధర్మార్తుడై యొప్ప ను
  త్పతనంబుం గని పొంగెఁ దండ్రి దనయున్ వర్ధిల్ల దీవించుచున్

  ఉత్పతనము - పైకి ఎగురుట, ఎదుగుదల

  కంజర్లరామాచార్య

  రిప్లయితొలగించండి
 14. సతతంబున్ సుతు సజ్జనత్వమును
  సుజ్ఞానంబు వీక్షించుచున్
  మతిమంతుండని పండితోత్తములు
  సన్మానించుటన్ గాంచియు
  న్నతి సంతోషము బొందియున్ దన
  మదిన్నానంద మేపార గొ
  ప్పతనంబుంగని పొంగె తండ్రి తన
  యున్ వర్ధిల్ల దీవించుచున్

  రిప్లయితొలగించండి
 15. హితబోధల నొనరించుచు
  మతి మంతుల స్నేహమందు మసలుమ యనుచుం
  గతిపయ దినముల నగపడు
  పతనముఁ గని తండ్రి తనయు వర్ధిల్లు మనెన్


  అతి రోషత్వమునం జరించు చనునిత్యమ్మున్ విరోధమ్ములన్
  మతి సంధించి మెలంగు వాఁడు కడు సంభ్రాంతాత్ముఁ డత్యుగ్రుఁడున్
  సత తావేశ మనస్కుఁ డబ్బురముగా శాంతుండు గాఁ దద్రుషా
  పతనంబుం గని పొంగెఁ దండ్రి తనయున్ వర్ధిల్ల దీవించుచున్

  రిప్లయితొలగించండి
 16. జతనము దృప్తిగ లేదనె
  పతనము గనితండ్రితనయు,వర్ధిలుమనెన్
  సతతము సుఖసంతోషము
  లువడగ జీవించుచుండి లోహితశర్మా!

  రిప్లయితొలగించండి
 17. సతతంబొప్పగు రీతినిన్ మిగుల నాసాయందివా రాత్రులు
  త్పతనంబున్ గని పొంగె దండ్రి తనయును వర్ధిల్ల జీవించుచున్
  పతనంబయ్యది రాదుగాభువిని నెవ్వారింమదిన్ దిట్టడో
  యతడే సౌఖ్యము గల్గి దాదనరు జన్మాంతంబు సౌఖ్యంబుగా

  రిప్లయితొలగించండి
 18. కందం
  సతతము ఎదిగిన పుత్రుని
  పతనము గని తండ్రి, తనయు వర్దిల్లుమనెన్
  ప్రతిభ గల విద్యను గఱచి
  గతము మరచి జీవయాత్ర గతి జూపించెన్

  ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
  ఉండవల్లి సెంటర్

  రిప్లయితొలగించండి
 19. అతిగా పెరిగిన బరువును
  వితతపు యోగాసనముల వేసికుదింపన్
  సుతుని శ్రమముఫలితముగా
  పతనముఁ గని తండ్రి తనయు వర్ధిల్లుమనెన్

  రిప్లయితొలగించండి
 20. సుతుడై పుట్టి నిరంతరమ్ము చదువున్ శోభించి సేద్యమ్ముతో
  యతనమ్ముల్ గడు నిష్ఠతో సలుపుచున్, యత్యంత వైదగ్ధితో
  నతిహృద్యంపు వధానముల్ సలుపగా నాప్తుల్ ప్రశంసింప, గొ
  ప్పతనంబున్ గని పొంగె తండ్రి తనయున్ వర్థిల్ల దీవించుచున్

  రిప్లయితొలగించండి
 21. హితమునుతెల్పగ వినుచును
  సతతమువిద్యలను నేర్చి సత్కార్యములన్
  మతితోచేయనతనిగొ
  ప్పతనముగనితండ్రితనయువర్ధిల్లుమనెన్

  రిప్లయితొలగించండి