31, జనవరి 2022, సోమవారం

సమస్య - 3979

1-2-2022 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తఱిగిన యందముఁ గని సతి దద్దయుఁ దనిసెన్”
(లేదా...)
“తఱిగిన యందముం గని ముదంబునఁ దృప్తిఁ గనెన్ లతాంగియే”

44 కామెంట్‌లు:

  1. కరిగినకాలమువెంటను
    పరుగునుబెట్టగమనుజుడుపరువముపోగా
    అరిగెనహంకారమునని
    తఱిగినయందముగనిసతిదద్దయుదనిసెన్

    రిప్లయితొలగించండి
  2. రిప్లయిలు
    1. కందం
      పరిణయమునఁ బతి మరుఁడన
      నరయఁ బిదప నూబకాయమమరన్ దిగులై
      దొరకొని యోగాసనములఁ
      దఱిగిన, నందముఁ గని సతి దద్దయుఁ దనిసెన్!

      చంపకమాల
      మురిపెము మీర మన్మథుని పోలిక ముచ్చట పెళ్లియాడియున్
      మరుగుచు నింటి నుంచి పని, మంచిగ మెక్కగ నూబకాయమై
      దొరకొని యోగవిద్యఁ బతి తుష్టిని నా పరిమాణమెంతయో
      తఱిగిన, యందముం గని ముదంబునఁ దృప్తిఁ గనెన్ లతాంగియే!

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  3. అరసినజీవితార్ధమదియందుటెపారమునిశ్చయంబుగా
    పురిగొనిపొందిసౌఖ్యములపోవలెకానలకంచుదెల్పిరే
    తఱిగనిశాంతిబొందుటకుదంభమువీడుగృహస్థుడంచునున్
    తఱిగినయందముంగనిముదంబునదృప్తిగనెన్లతాంగియే

    రిప్లయితొలగించండి

  4. తరుణీ నినుమించితి నే
    హరువున యని పరిహసించెడతివయె యెండన్
    దిరుగాడగ నా యన్నువు
    తఱిగిన యందముఁ గని సతి దద్దయు దనిసెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "హరువున నని పరిహసించి యతివయె..." అనండి.

      తొలగించండి
  5. విరిసిన నవ్వును గనుచును
    పరిపరి విధముల మురియుచు పరవశ మగుచున్
    మ రులు గ తన బతి గాంచియు
    తఱిగిన యందము గని సతి దద్దయు దని సెన్

    రిప్లయితొలగించండి
  6. అరెరే!యెంత విచిత్రము
    విరియగనే మొగ్గ యెంత వింతగఁదోచున్
    సరసుడ! బాల్యము మేనన్
    తఱిగిన,యందముఁగని సతి తద్దయు తనిసెన్.

    రిప్లయితొలగించండి
  7. పెఱరేచునటులదోచెడి
    తఱగని యందముఁ గని పతి తానేమురిసెన్
    పెఱుగుచు నుండిన వయసుకు
    తఱిగిన యందముఁ గని సతి దద్దయుఁ దనిసెన్

    రిప్లయితొలగించండి

  8. హరువున నిన్ను మించితినటంచును పల్కెడు పల్లవోష్ఠికిన్

    దరణియె రుద్రరూపిగ ప్రతాపము జూపెడు పాళమందునన్

    విరివిగ సంచరించెడొక వృత్తిలభింపగ ఘర్మమందునన్

    దఱిగిన యందమున్ గని ముదంబునఁ దృప్తిగనెన్ లతాంగియే.

    రిప్లయితొలగించండి
  9. పెరిగెను మేను లావుగను విర్విగ హోటలు
    భోజనంబుచే
    దరిగెను సోయగంబు ,కడు తాపముతో
    వనజాక్షి నిత్యమున్
    బూనెను జేయ వ్యాయమము పొందుగ
    పెర్గిన స్థూలకాయమున్
    దరిగిన, యందముంగని ముదంబున
    దృప్తిగనెన్ లతాంగియే

    రిప్లయితొలగించండి
  10. అరెరె!యహల్య, శాపమున నవ్విపినంబున బండఱాయిగా
    స్థిరముగ నుండి పోయెగద!శ్రీరఘురాముని పాదధూళి,చె
    చ్చెరపడమీదనబ్బురముఁజెందిరియందఱు,ఘోరశాపమం
    తఱిగిన యందముంగని ముదంబునఁదృప్తిగనెన్ లతాంగియే.

    రిప్లయితొలగించండి
  11. కురులు నరసెనని భయపడె
    తఱిగిన యందముఁ గని సతి ; దద్దయుఁ దనిసెన్
    వరుడు సమాధాన బరచ ,
    తెరకువ పెరిగిన గురుతుగ తెలుపగుననుచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చక్కని పూరణ. అభినందనలు.
      'నెరసెనని' అని ఉండాలి కదా?

      తొలగించండి
    2. 🙏🏽
      నమస్కారములు
      అవును అలాగే వ్రాశా , కాని check చేస్తే శబ్దరత్నాకరం ( ఆం.భా ) లో
      “ నెరయు “ అన్న పదానికి ఆ అర్థం లేదు . “ నరయు “ అంటే
      ముదిమిచే వెండ్రుకలు తెలుపగు.
      అని ఉంది

      తొలగించండి
  12. దురమునగూల్చి రావణుని దోర్బల మేర్పడ రామమూర్తి, దా
    సరసిజనేత్రి జానకిని సాదర మొప్పగ జేరదీయఁ నొం
    టరియగు రామచంద్రుని గటాక్షము తోడ విదేహపుత్రియే
    తఱిగిన యందముం గని ముదంబునఁ దృప్తిఁ గనెన్ లతాంగియే.

    ఒంటరి -అసహాయశూరుడు
    కటాక్షము-ఓరచూపు

    రిప్లయితొలగించండి
  13. పరిణయమప్పుడు కోమలి
    తరుణిమ మించిన పెరిగిన తనదేహంబే
    దఱిగొని వ్యాయామముతో
    తఱిగిన, యందముఁ గని సతి దద్దయుఁ దనిసెన్

    రిప్లయితొలగించండి
  14. కందం
    పరువము రూపము స్థిరమని
    మెరమెర బెట్టెను పెనిమిటి మితిమీరి సతిన్
    దొరలిన ప్రమాదమున పతి
    తరిగిన యందము గని, సతి దద్దయు దనిసెన్
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  15. తరుణవయస్సునందునలతాంగి తటిల్లతవంటి మేనితో
    మరులనుగూర్చె చూపరులమారుని మార్గణమో యనంగ తా
    నిరతము నిర్విరామముగ నెక్కొని సల్పు పరిశ్రమంబుతో
    దరిగొని జేయు కృత్యములు తద్దయు దేహమునందు క్రొవ్వునున్
    తఱిగిన, యందముం గని ముదంబునఁ దృప్తిఁ గనెన్ లతాంగియే

    రిప్లయితొలగించండి
  16. "వరలితినగ్రనాయికగ వాసి గడించితి సుందరాంగినై
    కరిగెను యవ్వనంబిటుల కాల గమంబు"నటంచు నొచ్చినన్
    తఱిగిన యందముం గని, ముదంబునఁ దృప్తిఁ గనెన్ లతాంగియే
    తరగని కీర్తి దక్కెనని తారగ ప్రేక్షకలోకమందునన్

    రిప్లయితొలగించండి
  17. చిఱు చుక్క లుండ ముఖమునఁ
    దెఱవకుఁ దన నెచ్చెలి కటఁ దెల్లం బగుచున్
    మఱి తనకు సాటియే యని
    తఱిఁగిన యందముఁ గని సతి దద్దయుఁ దనిసెన్‌


    వెఱపును వీడి డెందమున వేరుల మందును రుబ్బి రుబ్బి తాఁ
    దఱచుగఁ బూసి పూసి మఱి తత్ఫలమే వికటింప నత్తఱిన్
    మఱవఁగఁ జాల నట్టి చిఱు మచ్చల తోడ సపత్ని దైన యా
    దఱిఁగిన యంద ముంగని ముదంబునఁ దృప్తిఁ గనెన్ లతాంగియే

    రిప్లయితొలగించండి
  18. అరమరిక లేని బరువును
    గరమును బోగొట్టదలచి గజముల కొలదిన్
    జరజర నడచిన తదుపరి
    తఱిగిన యందముగని సతి దద్దయు దనిసెన్

    రిప్లయితొలగించండి
  19. అరమరికంబు లేక బరువాయత రీతిని బెర్గగా దమిన్
    నిరువది వేలుగన్ నడుగు లీశుని నాలయ ప్రాంగణంబునున్
    బరిధిగ జేసి పోవగను భారము తగ్గుచు మేను తేలికౌ
    తఱిగిన యందముంగని ముదంబున దృప్తిగనెన్ లతాంగియే

    రిప్లయితొలగించండి
  20. పెరిగెను క్రొవ్వది మేనున
    కరిగించక యున్నహాని కలుగునటంచున్
    పరుగులు దీయగ క్రొవ్వది
    తరిగిన,యందముగనిసతిదద్దయు దనిసెన్

    బరువది .హెచ్చుచుండగనుభారిగ క్రొవ్వది చేరి మేనులో
    తరుణియుమానసమ్ముననుతల్లడమందుచుయోగచేయగన్
    తరుగగ క్రొవ్వు వేగమట తాపము తగ్గ గ సంతసమ్ముతో
    తఱిగిన యందముం గని ముదంబునఁ దృప్తిఁ గనెన్ లతాంగియే”*

    రిప్లయితొలగించండి