18, ఫిబ్రవరి 2022, శుక్రవారం

సమస్య - 3996

19-2-2022 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మానవతికి పరుని వలపు మాన్యతఁ గూర్చెన్”
(లేదా...)
“మానవతీ శిరోమణికి మాన్యతఁ గూర్చెఁ బరాభిమానమే”

18 కామెంట్‌లు:


  1. దానవుని వినాశనమును
    జానకి, కీచకునిచావు క్షణియించెనుగా
    మానిని ద్రౌపది మఱియే
    మానవతికి పరుని వలపు మాన్యత గూర్చెన్?

    రిప్లయితొలగించండి
  2. మానుగపతియాభరణము
    మానవతికి,పరునివలపుమాన్యతగూర్చెన్
    కానగపండితవరునకు
    ఆనగశోభయనతనికిహాయనజనులున్

    రిప్లయితొలగించండి
  3. మానక నెళ్ళవేలలను మామను సజ్జన
    యత్త గూర్చియున్
    దానవ చిత్తి వృత్తిగల ధర్మ విచక్షణ లేని
    కోడలున్
    బూనికతోడ దూరు కడు మూర్ఖపు దుర్గుణ
    శాలియైన దు
    ర్మానవతీ శిరోమణికి మాన్యత గూర్చె
    పరాభిమానమే 19/2

    రిప్లయితొలగించండి

  4. దానవుడా స్మరాంకుశుడు ధాత్రజఁ గోరుచు బంధిసేసినన్

    బ్రాణసఖుండు రాఘవుని ప్రశ్రయమందు దలంచుటే కదా

    మానవతీ శిరోమణికి మాన్యతగూర్చె, బరాభిమానమే

    ప్రాణము తీసె గామయిత రావణు శత్రుభయంకరున్ ఖజన్.

    రిప్లయితొలగించండి
  5. కందం
    మౌనివరమ్మున, భర్తయు
    తానుగ వంశాభివృద్ధి దాల్చఁగఁ దగడన్
    బూనిక నొప్పగ, కుంతికి
    మానవతికి పరుని వలపు మాన్యత గూర్చెన్!

    ఉత్పలమాల
    కానగ పాండురాజు తన కారణమందున వంశవృద్ధికిన్
    హానిగలుంగుటల్ ,సతికి నద్భుత మౌనివరమ్ము దీర్చునన్
    బూనిక నొప్పినంత కడుముచ్చట దైవ ప్రసాదమంచనన్
    మానవతీ శిరోమణికి మాన్యతఁ గూర్చెఁ బరాభిమానమే!

    రిప్లయితొలగించండి
  6. తేటగీతి

    కులసతికి,శీలవతికనుకూలవతికి
    పతియె దైవమౌనభి//మానవతికి, పరుని
    వలపు మాన్యతఁగూర్చెన్//గద!లలనకు,చ
    పలమతి,తనపతి విడువ పాట్లు తప్పి.

    రిప్లయితొలగించండి
  7. మానమె తన ప్రాణమగును
    మానవతికి, పరుని వలపు మాన్యతఁ గూర్చెన్
    తానిడుమలకును వెరువక
    మానము కాపాడుకొనుచు మసలుటవలనన్

    రిప్లయితొలగించండి
  8. కానగ మీరాబాయికి
    మానస చోరుడు పరుడని మనమెరిగినదే
    నేనికనేమని చెప్పుదు
    మానవతికి పరుని వలపు మాన్యతఁ గూర్చెన్


    పరుడు = పరమాత్ముఁడు

    రిప్లయితొలగించండి
  9. దానవనాథు రావణుని దర్పము శౌర్యము లెక్కసేయకే
    జానకి గడ్డిపోచ సరిసాటి దలంచియు మాటలాడుటల్
    మానవతీ శిరోమణికి మాన్యతఁగూర్చె,పరాభిమానమే
    న్యూనత కల్గజేయుగద! నూనము మెచ్చరు సాధ్వులీక్రియల్.

    రిప్లయితొలగించండి
  10. ఏ నాడును కూడని పని
    మానవతికి పరుని వలపు ; మాన్యతఁ గూర్చెన్
    జానెడు పొట్టను నింపగ
    కాని పనులు జేయకుండ గడపెడు జెలికిన్

    రిప్లయితొలగించండి
  11. మానిత పతియే దైవము
    మానవతికి : పరుని వలపు మాన్యత గూర్చున్
    దీనుల బ్రతుకులు సాగగ
    మేనుల నమ్ముట యె దారి మేదిని యందున్

    రిప్లయితొలగించండి
  12. ప్రాణమునిచ్చి నిత్యమును భర్తకు సేవలు చేసి మించుచున్
    స్నానము లాడుచున్ నదుల సన్నుతి చేయుచు పద్మనాభునిన్
    దానవులైన శత్రువుల దౌష్ట్యములన్ గ్రమియించ యుక్తితో
    మానవతీ శిరోమణికి మాన్యతఁ గూర్చెఁ బరాభిమానమే
    పర : స్వర్గము

    రిప్లయితొలగించండి
  13. మానిని! మానక దేవునిఁ
    గానక నీ వున్నఁ బ్రేమ ఖండిత మైనన్
    మానస మిత్తువు నీ వభి
    మాన వతికి పరుని వలపు మాన్యతఁ గూర్చెన్

    [అభిమానవు + అతికి = అభిమాన వతికి; పరుఁడు = పరమాత్ముఁడు]


    మానిని రాక్షసీ గణము మాటలతో వధియించు చుండఁగా
    దీనను రావ ణాపహృత దేవిని నారసి జానకీ సతిన్
    దానవ కాంత యా త్రిజట ధైర్య మొసంగ నశోక వాటికన్
    మానవతీ శిరోమణికి మాన్యతఁ గూర్చెఁ బరాభిమానమే

    రిప్లయితొలగించండి
  14. కానగ రానిది యీయది
    మానవతికి పరుని వలపు మాన్యత గూర్చెన్
    మానవతి కెల్లవేళల
    బ్రాణసఖున్ వలపె యీయు బ్రాపును ముదమున్

    రిప్లయితొలగించండి
  15. కందం
    మానము ముఖ్యము నిజముగ
    మానవతికి, పరుని వలపు మాన్యత గూర్చెన్
    సానికి ,ప్రవృత్తి వృత్తియు
    మానసిక స్థితియు దలచిన మాటవరుసకున్
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  16. దీనజనావళిన్ మనుపు ధ్యేయము తోడను నెల్లవేళలన్
    మానక దాయధావిధిగ మంచిని జేయుచు నుంటచేతనే
    మానవతీ శిరోమణికి మాన్యతగూర్చె ,బరాభిమానమే
    మానవతీలలామగను మాన్యత నొందెను లోకమంతటన్

    రిప్లయితొలగించండి
  17. కానగ పతియేదైవము
    మానవతికి,పరుని వలపు మాన్యతగూర్చె
    న్నానెలతుకకటమురళీ
    గానమువినినంతనెమమకారము హెచ్చెన్.

    రిప్లయితొలగించండి