19, ఫిబ్రవరి 2022, శనివారం

సమస్య - 3997

20-2-2022 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దండమ్మే కౌరవుల మదం బడఁచెఁ గదా”
(లేదా...)
“దండము ధార్తరాష్ట్రుల మదం బడఁచెన్ గద యుద్ధభూమిలో”

37 కామెంట్‌లు:

  1. అండగవృద్ధులునుండగ
    చెండాడగశత్రుసేనచే టునుదెచ్చెన్
    కుండననుండినబిడ్డకు
    దండమ్మేకౌరవులమదంబడచెగదా

    రిప్లయితొలగించండి
  2. పండినమేథలన్నియునుపంచగధర్మముచాలలేదులే
    గండముదాటలేదుగదకర్తయబోధలజేసినన్తుదిన్
    కండలబాహుదర్పమదికావగజాలదుదారిదప్పినన్
    దండముధార్తరాష్ట్రులమదంబడచెన్గదయుద్ధభూమిలో

    రిప్లయితొలగించండి

  3. భండన మందున గాంచగ
    జండాపై కపి, నియంత శకటారియు నా
    గాండీవము కవ్వడి కో
    దండమ్మే కౌరవుల మదంబడఁచెఁ గదా.

    రిప్లయితొలగించండి
  4. చండ తర పరాక్ర ముడగు
    భండన భీముండు మిగుల పౌరుష యుతుడై
    చెండె డు సమయాన గదా
    దండ మ్మే కౌరవుల మదం బడచె గదా !

    రిప్లయితొలగించండి
  5. భండనముమాని మడుగం
    దుండగ రప్పించి పైకి దుర్యోధనునే
    చెండాడిన భీమ గదా
    దండమ్మే కౌరవుల మదంబడచెఁగదా

    రిప్లయితొలగించండి
  6. రిప్లయిలు
    1. కందం
      దుండగపు జూదమాడియు
      పాండవ సతి వల్వలూడ్చి వనములకంపన్
      బండుచు వాలి యఘ తులా
      దండమ్మే కౌరవుల మదం బడఁచెఁ గదా!

      ఉత్పలమాల
      దుండగమైన జూదమున దోచియు సర్వము దానవత్వమై
      పాండవ పత్నికిన్ సభను వల్వలనూడ్చి పరాభవించియున్
      గొండల పాలు సేయనహొ! కూడిన పాపము వాల్చఁగన్ దులా
      దండము ధార్తరాష్ట్రుల మదం బడఁచెన్ గద యుద్ధభూమిలో!

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి

  7. శండ శిఖండి, సారథిగ శైలధరుండును, కేతనమ్మునన్

    గండరగండడైన కపి, కర్ణునకున్ గల గాలనమ్ములున్

    గాండివ మా యఖండలుడు కవ్వడి కప్పన సేసినట్టి కో

    దండము దార్తరాష్ట్రుల మదంబడఁచెన్ గద యుద్ధభూమిలో.

    రిప్లయితొలగించండి
  8. రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అతి+అద్భుత=అత్యద్భుత' అవుతుంది కదా... 'ఉన్నడు' అన్నది వ్యావహారికం. సవరించండి.

      తొలగించండి
  9. దండము కత్తి డాలు విలుఁదాల్చిన సేనలుఁగ్రమ్మ మత్త వే
    దండములుందురంగసముదాయముఁద్రొక్కగ,సవ్యసాచి కో
    దండము చీల్చుచుండగ,గదాయుధ మొప్పెడు భీమసేను దో
    ర్దండము ధార్త్రరాష్ట్రుల మదంబడచెన్ గద యుద్ధభూ
    మిలో.

    రిప్లయితొలగించండి
  10. మెండుగ మద్యందిన మా
    ర్తాండునివలె పార్థుడచట తాండవ మాడన్
    గాండీవమై పరగు కో
    దండమ్మే కౌరవుల మదం బడఁచెఁ గదా

    రిప్లయితొలగించండి
  11. భండనమున సతి భ్రాత శి
    ఖండి నెలకొనగ గిరీటి గాంగేయునిపై
    చండునిగ నెక్కిడిన గో
    దండమ్మే కౌరవుల మదం బడఁచెఁ గదా

    రిప్లయితొలగించండి
  12. చెండును కర్ణుడే రిపువు సేననటంచును నమ్మకమ్ముతో
    భండనకున్ సుయోధనుడు వాహిని సిద్ధము చేసి దూకగా
    నండనొసంగ కృష్ణుడని నర్జును డేపును జూప వాని దో
    ర్దండము ధార్తరాష్ట్రుల మదం బడఁచెన్ గద యుద్ధభూమిలో

    రిప్లయితొలగించండి
  13. కందం
    గండర గండడు రణమున
    పాండవ మధ్యముడు కౌరవాదుల దునిమెన్
    భండన బీభత్సుని కో
    దండమ్మే కౌరవుల మదం బడచె గదా.
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  14. జండాపై గపియాడుచు
    గాండీవము జేతబూని కవ్వడి చెలగన్
    భండనమున నర్జును గో
    దండమ్మే కౌరవుల మదంబడచె గదా

    రిప్లయితొలగించండి
  15. ఖండిత నిజ పక్ష చమూ
    దండంబై దుఃఖద మయి దారుణ సమరో
    ద్దండ రిపు గణ భయంకర
    దండమ్మే కౌరవుల మదం బడఁచెఁ గదా


    మండిత మారుతిధ్వజ విమర్దిత శాత్రవ పక్ష రాట్ఛిరో
    మండల భాసి తాంతక సమాన పరాక్రమ దుస్సహప్రభా
    భండన దుర్నిరీక్ష్య నర ఫల్గున భీమగదా ద్వితీయ కో
    దండము ధార్తరాష్ట్రుల మదం బడఁచెన్ గద యుద్ధభూమిలో

    రిప్లయితొలగించండి
  16. అండగ బాణవిద్యల కడద్భుత మొప్పగ
    నేర్చినట్టి యు
    దండుడు కర్ణు మిత్రుడిడు దైర్యముతోడ
    సుయోధనుండు తా
    బండనమున్ ఘటించ దన బట్టును
    బట్టెను గాని వాని యా
    దండము దార్తరాష్ట్రుల మదంబడచెన్
    గద యుద్ధభూమిలో.

    రిప్లయితొలగించండి
  17. అండగ గృష్ణుడుండగను నర్జునుడయ్యెడ పౌరుషంబుతో
    భండన భీమువోలె నట బర్వులబెట్టుచు శత్రుసైన్యమున్
    దండి పరాక్రమంబుననని దాచరియించుచు వేయవాడికో
    దండము,ధార్తరాష్ట్రుల మదంబడచెన్ గద యుద్ధభూమిలో

    రిప్లయితొలగించండి
  18. కండయుకావరమందున
    దుండగులై దుష్టచేష్ట దోషంబనకన్
    మెండుగజేయగ పాండవ
    దండమ్మేకౌరవుల మదంబడచెగదా

    రిప్లయితొలగించండి
  19. అండగ వెన్నుం డుండగ
    భండన మున పాండు సుతులు బలమును చూపన్
    మెండగుననిలజునిగదా
    దండమ్మే కౌరవులు మదంబణచెగదా

    రిప్లయితొలగించండి