21, ఫిబ్రవరి 2022, సోమవారం

సమస్య - 3999

22-2-2022 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వృద్ధనారిని బాలుఁడు పెండ్లియాడె”
(లేదా...)
“వలచిన వృద్ధనారి నొక బాలుఁడు పెండిలియాడెఁ బ్రీతితోన్”

38 కామెంట్‌లు:


  1. నలుబదేండ్లకు పూర్వమీ నారిజూడ
    మిగుల సుందరాంగి యనుచు మెచ్చి యిట్టి
    వృద్ధ నారిని బాలుఁడు పెండ్లియాడె
    నాడు, బంధువుల్ మెచ్చ నానందమందు.

    రిప్లయితొలగించండి
  2. బొక్కి నోటిదానవనుచు వెక్కిరించె
    వృద్ధనారిని బాలుఁడు , పెండ్లియాడె
    నెటుల మాతామహుడు దీని నెరిగికూడ ,
    వింత గొలిపె ననుచు శంక వెలువరించె

    రిప్లయితొలగించండి
  3. వలిపపు కుంతలా లవయవమ్ములు శక్తివిహీనమై సదా

    వలిగొనుచుండు, నోటగన వక్త్రజమొక్కటి యైనలేని యా

    చెలువను గాంచిబాలకుడు చేయ సహాయము మూర్ఖుడిట్లనెన్

    వలచిన వృద్ధనారి నొక బాలుఁడు పెండిలియాడెఁ బ్రీతితోన్.

    రిప్లయితొలగించండి
  4. తేటగీతి
    వలపుకత్తె యొకతె తన వయసు మరచి
    లేత యవ్వన దశలోని లేత బుగ్గ
    ల చినవానికి వలపు వలవిసరగనె
    వృద్ధనారిని బాలుడు బెండ్లియాడె

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  5. తేటగీతి
    బాలసుందరమ్మనకుండ బాలుఁడనెడు
    పేర పిలుచుటె తెలిసిన నూరి వారు
    వాని షష్టి పూర్తికి వింతఁ బలికిరిటుల
    "వృద్ధనారిని బాలుఁడు పెండ్లియాడె"

    చంపకమాల
    పిలుతురు బాలసుందరుని వేడుక బాలుఁడటంచు నూరిలోఁ
    దెలిసిన వారలందరిని తృప్తిగఁ బిల్వఁగ షష్టి పూర్తికిన్
    గలకలలాడు మండపము నాడట చేరినవారు పల్కిరే
    "వలచిన వృద్ధనారి నొక బాలుఁడు పెండిలియాడెఁ బ్రీతితోన్”

    రిప్లయితొలగించండి
  6. ఎన్నిజన్మల బంధమో యేమొగాని
    చెలిని జన్మాంతరమునందు కలుసుకొనెను
    యేళ్ళుపూళ్ళుగ తనరాక కెదురుచూచు
    వృద్ధనారిని బాలుఁడు పెండ్లియాడె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కలుసుకొనెను+ఏళ్ళు' అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి
  7. లేతవయసున్న రాజ్యాధినేత చూపె
    నతిపురాతనసామ్రాజ్యమాక్రమించి
    రాజ్యలక్ష్మినిచేబూని రాజసమ్ము
    వృద్దనారినిబాలుడు పెండ్లి యాడె

    రిప్లయితొలగించండి
  8. ఆమె పేరున నున్నట్టి యాస్తు లన్ని
    దక్కు మను వాడు వానికి తప్పకనుచు
    పెద్ద లందరు బలవంత పెట్టుచుండ
    వృద్ధ నారిని బాలుడు పెండ్లి యాడె

    రిప్లయితొలగించండి
  9. ఆటవెలది

    ఔర!యనియె//వృద్ధనారిని బాలుడు
    “పెండ్లి యాడె//దఁగడు ప్రేమ తోడ
    నేఁబెనిమిటి నౌదు నీదు పౌత్త్రికకును
    నీవె యిపుడు మాకు దీవెనిమ్ము”

    రిప్లయితొలగించండి
  10. బళిబళి!పెండ్లియాడెనొక పందిరిలో వరుఁడైన వృద్ధుడున్
    వలచిన వృద్ధనారి,నొక బాలుడు పెండిలి యాడెఁబ్రీతితో
    కళకళలాడు బాలికను కన్నుల పండువయయ్యెఁజూడగా
    ఫెళఫెళ మ్రోగె దుందుభులు వీరి వివాహముహూర్త వేళలో.

    రిప్లయితొలగించండి
  11. పిలచిన పల్కుచున్ సతము పేరిమి తోడ నొసంగి సాయమున్
    చెలగుచు నున్న బాలకుని చెన్నును కన్గొని పౌత్రి నియ్యగా
    వలచిన వృద్ధనారి, నొక బాలుఁడు పెండిలియాడెఁ బ్రీతితోన్
    తలచి సమున్నతిన్ బుధులు తద్దయు ప్రీతిని స్వాగతింపగా

    రిప్లయితొలగించండి
  12. తే.గీ:కాలమున మార్పు గమనించకయె ఘనముగ
    బామ్మ చెప్పిన దని గౌరవమున జూచి
    వృద్ధనారిని,బాలుడు పెండ్లి యాడె
    బాలికన్ మేన మరదలన్ వరుస నెంచి.

    రిప్లయితొలగించండి
  13. చం:కులమును వీడి ప్రాయమున గొప్పగ నన్యకులస్థు నొక్కనిన్
    వలచిన వృద్ధురాలి గని ,బాలుడు పెండిలి యాడె బ్రీతితో
    వలచిన యామె పౌత్రిని వివాహము జూచిన వార లెల్లరున్
    భళియని మెచ్చగా,కులపు భావము దాను దిరస్కరించుచున్.
    (ఆ వృద్ధురాలు తన యౌవనం లో కులాంతరవివాహం చేసుకొన్నది.ఆమెని చూసిన అబ్బాయి ఆమె మనుమరాలిని కులాంతరవివాహమే చేసుకొన్నాడు.)

    రిప్లయితొలగించండి
  14. రోడ్డు దాటించె భక్తిని గెడ్డము రవి
    వృద్ధనారిని,బాలుడు పెండ్లి యాడె
    జూడ జక్కని గీతను జూడగానె
    మనసు మనసులు గలువగ గనులు కూడ

    రిప్లయితొలగించండి
  15. తలపున దానె నుండగను దానకిశోరుడు పెండ్లి యాడెనే
    వలచిన వృద్ధనారిని. నొకబాలుడు పెండిలియాడె బ్రీతితోన్
    కళకళలాడు మోముగల కైటభమర్దను భక్తురాలినిన్
    లలనల యందునన్మిగుల లాలిత రూపము గల్గునామెనున్

    రిప్లయితొలగించండి
  16. వీస మైనను జెందక భీతి నెడఁదఁ
    జెలఁగి కాదన్న వారిని నిలిపి బయట
    బాస సేసిన కన్యను ద్రోసి పుచ్చి
    వృద్ధనారిని బాలుఁడు పెండ్లియాడె


    కలుగఁగఁ బ్రేమ చిత్రముగఁ గాంచిన యంతటనే యెడంద లో
    పల వడి నుద్యమించి కడు పంతము నూని యెదిర్చి యెల్ల వా
    రల నృప కన్యకా మణిని రాచ కుటుంబపుఁ గొట్టి నమ్మ లే
    వల చిన వృద్ధనారి నొక బాలుఁడు పెండిలియాడెఁ బ్రీతితోన్

    రిప్లయితొలగించండి
  17. తలపునకైన నొప్పవలె
    తప్పు వచింపగ నేల మిత్రమా!
    కలవరమీయు నిట్టివగు
    కల్పనలల్లిన మాట లెప్పుడున్
    తలచకుమోయి చిత్రమిది
    ధర్మమునొప్పక చెప్పనోపునే-
    "వలచిన వృద్ధనారి నొక బాలుఁడు పెండిలియాడెఁ బ్రీతితోన్"!

    రిప్లయితొలగించండి
  18. కంటి మంట కాహుతియైన కాయజుండు
    మరల పుట్టిపెరిగెతాను మాయ చెంత
    పెద్దవాడయినపిదపపెంచినట్టి
    వృద్ధనారిని బాలుఁడు పెండ్లి యాడె”*

    రిప్లయితొలగించండి