24, ఫిబ్రవరి 2022, గురువారం

సమస్య - 4002

25-2-2022 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“జారులే మార్గదర్శకుల్ జాతి కెపుడు”
(లేదా...)
“జారుల్ జాతికి మార్గదర్శకులు వ్యాసప్రోక్త మీ వాక్యమే”

44 కామెంట్‌లు:

  1. నిర్వికారుడుగాగనునియతిగలిగి
    భౌతికానందమెంచకభయమువీడి
    నిత్యసద్వర్తనంబుననిర్గుణమున
    జారులేమార్గదర్శకుల్జాతికెపుడు

    రిప్లయితొలగించండి

  2. జారభరవలె చరియించు తారలె గన
    నెన్నికలఁ గెల్చి శాసనాధీశులగుట
    గాంచి బాధతో పలికె సంస్కారిటుల బ
    జారులే మార్గదర్శకుల్ జాతి కెపుడు.

    రిప్లయితొలగించండి
  3. తేటగీతి
    గుడులు బడులుగన్ విలసిల్లఁ గూర్మి నాడు
    భక్తి తత్వమ్ముతో విద్య బడయఁ జేసి
    దూరదృష్టిని గూర్చు పూజారులుండ,
    జారు లే మార్గదర్శకుల్ జాతికెపుడు?

    శార్దూలవిక్రీడితము
    ఊరూరన్ గుడులుండుచున్ బడులుగా నొప్పంగ నా నాడు సే
    కూరెన్ భక్తియుతంబుగన్ జదువులున్ గుత్తమ్ముగా జాతికిన్
    సారాచార విశారదుల్ గుదురుచున్ సంస్కారమున్ నేర్ప పూ
    జారుల్ జాతికి మార్గదర్శకులు వ్యాసప్రోక్త మీ వాక్యమే!

    రిప్లయితొలగించండి
  4. భక్తి భావన బెంచెడు వార లగుచు
    శుభము జేకూర్ప తపియించు సుజను లగుచు
    సతము మేల్గోరు పూజారుల్ సౌమ్యు లుండ
    జారులే మార్గ దర్శకుల్ జాతి కెపుడు?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణభంగం. సవరించండి.

      తొలగించండి
    2. మూడవ పాదంలో సతము మేల్గోరు నర్చకుల్ అని సవరణ చేయడమైనది

      తొలగించండి
  5. చోరాగ్రేసరునాత్మలోదలచుచున్శోధించుసద్బుద్ధితో
    వీరావేశముతోడుగానటవిలోవిల్లందితాపంబునన్
    ఘోరంబైనదిదృష్టితోపరమునేఘోషించుమౌనుల్సదా
    జారుల్జాతికిమార్గదర్శకులువ్యాసప్రోక్తమీవాక్యమే

    రిప్లయితొలగించండి

  6. పౌరోభాగ్యమదేల వాజజముఁ సంపాదింపగా నిత్యమున్

    బోరాటమ్మిక మానుమోయినరుడా మోక్షంబునే పొందగా

    నారాటమ్మది మేలుగూర్చునని తానామార్గమున్ జూపు పూ

    జారుల్ జాతికి మార్గదర్శకులు వ్యాసప్రోక్తమీ వాక్యమే.

    రిప్లయితొలగించండి
  7. దేవదేవుని కన్నులై దీప్తులిడుచు
    సమయ పాలనలోఁదమ సాటివారు
    కుంభినిని లేరు లేరను కుముద నీర
    జారులే మార్గదర్శకుల్ జాతికెపుడు.

    రిప్లయితొలగించండి


  8. ఈ రాజ్యంబుననెందు గాంచినను నీకెన్నెన్నొ
    కన్పించు శృం
    గారమ్మొప్పెడి దేవళంబులు మహా గాంభీర్య
    శిల్పంబులున్
    పారుల్ వాటికి పూజజేయుదురు దివ్యానం
    దులౌ పూజ్య పూ
    జారుల్ జాతికి మర్గ దర్శకులు వ్యాసప్రోక్త
    మీ వాక్యమే

    రిప్లయితొలగించండి
  9. చేరి నగర ప్రతిష్ఠను జెరపువారు
    జారులే ; మార్గదర్శకుల్ జాతి కెపుడు
    బోధకులె , వారు తమతమ పురజనులకు
    చిన్న నాటనె సూక్తులు జెప్పుచుండి

    రిప్లయితొలగించండి
  10. భక్తి తత్త్వము బోధించి ముక్తిపథము
    చూపు భాగవతోత్తముల్ క్షోణియందు
    పూజనీయులు వారలు భువిని భావ
    జారులే మార్గదర్శకుల్ జాతి కెపుడు

    రిప్లయితొలగించండి
  11. శ్రీరాజిల్లెడు దేవదేవు కనులై చెన్నారుచున్ నింగిపై
    నౌరా!కాలవిభాగ నిర్ణయములో నత్యంత శ్రద్ధాళులై
    హోరాహోరిగ తిర్గుచుందురు గదా!యూహింప నీలోత్పలా
    బ్జారుల్ జాతికి మార్గదర్శకులు వ్యాసప్రోక్త మీవాక్యమే.

    రిప్లయితొలగించండి
  12. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

    తీరౌభక్తినిగూడి వాలయమునన్ దేవాలయమ్మందునన్
    పారమ్యంబగు రీతి నీశ్వరుని నవ్యాజమ్మునౌ డెందమున్
    ఆరాధించగ మోక్షమార్గమునకున్ అధ్వమ్మునే జూపు పూ
    జారుల్ జాతికి మార్గదర్శకులు వ్యాసప్రోక్తమీ వాక్యమే!

    రిప్లయితొలగించండి
  13. మానవత్వము నశియించి మానభంగ
    మునకు తగుసమయంబెంచి ముక్కుపచ్చ
    లారనిముదితలన్ జంపు వారికన్న
    జారులే మార్గదర్శకుల్ జాతి కెపుడు

    రిప్లయితొలగించండి
  14. కె.వి.యస్. లక్ష్మి, ఉడ్బర్రీ, అమెరికా:

    వావి వరుసలెరుంగని వారు భువిని
    జారులే; మార్గదర్శకుల్ జాతికెపుడు
    నీతి నియమమ్ముల నెఱిగి రీతిగాను
    ధరణి ధర్మము నించుచు తరలు వారు.

    రిప్లయితొలగించండి
  15. శంకరాభరణము వారి సమస్య



    జారులే మార్గ దర్ధకుల్ జాతికెపుడు

    ఇచ్చిన పాదము తేటగీతి

    నా పూరణ మహాక్కర. లో

    ధరణి లో విద్యుతునుకను గొనెగా మొదట బెంజ మిన్ ప్రాంక్లిను ఘనుడే,

    కరములో నిమిడెడు చరవాణిని కనిపెట్టె మార్టిను కూపరుండే,

    సరస గతిని కనుగొనెగా దూర దర్శనమునిచట ఫిలోపార్న్స్ వర్తుండు,

    ధాత్రి లో నవ్య కంజారులే మార్గ దర్శకుల్ జాతికెపుడు తలచన్

    రిప్లయితొలగించండి
  16. తీరౌరీతి దినమ్మునన్ చెదలపై దీపించుచున్ రశ్మినిన్
    బారన్ జేయును పంటలియ్యభువిపై భానుండు, నక్తమ్ము వి
    స్తారమ్మౌవెలుగొంది చల్లదనమున్ చంద్రుండిడున్ సూర్య కం
    జారుల్ జాతికి మార్గదర్శకులు వ్యాసప్రోక్త మీ వాక్యమే
    కంజార: [క+జృ+అణ్, కం జలం జారయతి అపహరతి] జలమును హరించువాడు. సూర్యుడు; బ్రహ్మ; ఉదరము.
    (ముదిగొండ గోపాల రెడ్డి గారి విశ్లేషణ)
    నేను కంజ + అరి : కంజారి(పద్మముల శత్రువు) : చంద్రుడు అనే అర్థంలో వాడాను.

    రిప్లయితొలగించండి
  17. శా.
    కారాగారమునున్న భావనలతో గాలమ్ము దోయంగ నీ
    పోరాటమ్ముల జీవితమ్మునను సద్బోధంబులన్జేయుచున్
    ప్రేరేపించగ భక్తి మార్గములనే విశ్రాంతి లేనట్టి పూ
    జారుల్ జాతికి మార్గదర్శకులు వ్యాసప్రోక్త మీ వాక్యమే

    రిప్లయితొలగించండి
  18. గుంటనక్కల తలపించు కుమతులెల్ల
    రాజకీయదుర్నీతిని రాజ్యమేల
    దుష్ట జంబూక గణము కెదురునిలుచు గ
    జారులే మార్గదర్శకుల్ జాతి కెపుడు

    గజారి = సింహము

    రిప్లయితొలగించండి
  19. మంచి వారుగ బాగుండ్రు మారునెడల
    జారులే,మార్గదర్శకుల్ జాతికెపుడు
    శీలవంతులే యరయగ చెప్పదగిన
    జాతి రత్నాలు వారలు జగమునకును

    రిప్లయితొలగించండి
  20. చారులె గణింపఁ జక్కని చక్షువు లట
    రాజునకుఁ బాలనమున ధరాతలమున
    దుర్గ రక్షణమున భద్ర మార్గములకుఁ
    జారులే మార్గదర్శకుల్ జాతి కెపుడు


    రారా జైనను ధర్మ బద్ధుఁ డగుచున్ రాజ్యమ్ముఁ బాలింపఁ దా
    నారాధ్యుం డగు స్వీయ పౌరులకు నత్యంతమ్ముగా ధాత్రి ధ
    ర్మారాతి వ్రజ రక్షణైక రత పౌరానర్థకక్రూర రా
    జారుల్ జాతికి మార్గదర్శకులు వ్యాసప్రోక్త మీ వాక్యమే

    [రాజ+అరి = రాజారి,రాజునకు శత్రువు]

    రిప్లయితొలగించండి
  21. కారా చెప్పుము బండి రాఘవ!మఱిన్ గాషాయ వస్త్రంపు పూ
    జారుల్ జాతికి మార్గదర్శకులు,వ్యాసప్రోక్తమీవాక్యమే
    మీరంబోకుడు సత్యమున్నెపుడు నేమీయంగ నెవ్వారునున్
    నీరాత్రింగలవచ్చె నీవిధముగానేమాయె నేమో కదా

    రిప్లయితొలగించండి
  22. వారల్ భక్తిపథానుగాములయి సేవాభావ సంతృప్తులై
    యారామంబులనుండి బోధన లనాయాసంబుగా సల్పుచున్
    పారావార పరీతభూవలయమున్ పాలించు వాత్సల్య కం
    జారుల్ జాతికి మార్గదర్శకులు వ్యాసప్రోక్త మీ వాక్యమే

    రిప్లయితొలగించండి
  23. సత్యమార్గమువిడి చను జనములెల్ల
    జారులే, మార్గదర్శకుల్ జాతి కెపుడు
    నెవ్వరననీతినియమములెపుడు విడక
    నాచరించెడివారలేనండ్రుబుధులు


    రిప్లయితొలగించండి