27, ఫిబ్రవరి 2022, ఆదివారం

సమస్య - 4005

28-2-2022 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“భక్తులు మ్రొక్కంగ రారు భద్రగిరీశున్”
(లేదా...)
“భక్తుల్ మ్రొక్కుట కిచ్చగింపరు గదా భద్రాద్రి రామయ్యకున్”

21 కామెంట్‌లు:

  1. సక్తతలౌక్యంబునునను
    రక్తినిసంపదగనగనురాజిలుజనులున్
    ముక్తినిగోరకమనసున
    భక్తులుమ్రొక్కంగరారుభద్రగిరీశున్

    రిప్లయితొలగించండి

  2. ముక్తిని గోరెడు వారికి
    వ్యక్తిత్వమ్ముండదనుచు వచియించెడి యా
    వ్యక్తులు కారల్ మార్కుకు
    భక్తులు మ్రొక్కంగ రారు భద్రగిరీశున్.

    రిప్లయితొలగించండి
  3. భక్తిని శివరాత్రిని యో
    శక్తీశా!శంభు!శూలి!శంకర!యనుచున్
    ముక్తినిఁగోరు మహాశివ
    భక్తులు మ్రొక్కంగరారు భద్రగిరీశున్.

    రిప్లయితొలగించండి
  4. సక్తుల్గాగనులోకసంపదలతాసాంగత్యదోషంబునన్
    రక్తుల్నైరిగకామవాంఛలవిమారాముజేయన్మదిన్
    వక్తల్నైరిగరాజకీయముననాభావంబురేకెత్తగా
    భక్తుల్మ్మ్రొక్కుటకిచ్చగింపరుగదాభద్రాద్రిరామయ్యకున్

    రిప్లయితొలగించండి
  5. కందం
    వక్తలు చార్వాక జనులు
    భక్తియు ముక్తియు నిజముగ భావము లనుచున్
    యుక్తముగ బల్క కొందరు
    భక్తులు మ్రొక్కంగ రారు భద్రగిరీశున్.
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  6. భుక్తికి మార్గము వెదుక క
    శక్తిని వ్యర్థమ్ము సేయు చవట లటంచున్
    రక్తిని మాత్రమె కోరు కు
    భక్తులు మ్రొక్కంగ రారు భద్ర గిరీశున్

    రిప్లయితొలగించండి
  7. భక్తులు శైవారాధన
    సక్తులు మదితలపరన్య సంపర్కములన్
    రక్తిగ నీశుని గొలిచెడు
    భక్తులు మ్రొక్కంగ రారు భద్రగిరీశున్

    రిప్లయితొలగించండి
  8. కందం
    ముక్తిప్రదాయకమ్మన
    వక్తలు కల్యాణమున్, నవమి పర్వమునన్
    శక్తికొలది కాన్కలిడక
    భక్తులు మ్రొక్కంగ రారు భద్రగిరీశున్!

    శార్దూలవిక్రీడితము
    ముక్తిన్ బొందఁగ నెంచిరేని జనులున్ మోదంపు కల్యాణమా
    సక్తిన్గాంచినఁ గల్గునంచు మిగులన్ సద్బోధగావింపఁగన్
    వక్తల్, నిష్ఠగ చైత్రశుద్ధనవమిన్ బాటించి నిష్కాన్కలన్
    భక్తుల్ మ్రొక్కుట కిచ్చగింపరు గదా భద్రాద్రి రామయ్యకున్!

    రిప్లయితొలగించండి
  9. ముక్తి కొ రకు శివరాత్రిని
    భక్తులు మ్రొక్కంగ రారు భద్రగిరీశున్ ,
    భుక్తిని విడిచి శివుని పై
    రక్తిగ భజన నలిపెదరు రాతిరి పూర్తిన్

    రిప్లయితొలగించండి
  10. రిప్లయిలు
    1. భక్తికి రక్తికి ముక్తికి
      భక్తులు దర్శింతురెపుడు భద్రాచలమున్
      భుక్తికి వలసలు పోయిన
      భక్తులు మ్రొక్కంగ రారు భద్రగిరీశున్

      తొలగించండి

  11. వ్యక్తిత్వమ్మును వీడి సంపదలఁ సంపాదించుటే ధ్యేయమై
    ముక్తిన్ గోరక భక్తిమార్గమనుచున్ మూఢాత్ము లీ ధాత్రి నా
    శక్తిన్ జూపుచు స్వార్థచిత్తు లగుచున్ సంకల్పమే లేనిదే
    భక్తుల్ మ్రొక్కుటకిచ్చగింపరుగదా భద్రాద్రి రామయ్యకున్.

    రిప్లయితొలగించండి
  12. రక్తిన్ క్రీస్తును క్రైస్తవుల్ గొలుతురారాధ్యుండు మాకంచు,స
    ద్భక్తిన్ బౌద్ధులు బుద్ధునే గొలువగా ,ధ్యానింతురల్లాను,స
    న్ముక్తింగోరియు మహ్మదీయు లిటులెన్నో యన్యదైవంబు లా
    భక్తుల్ మ్రొక్కుట కిచ్చగింపరు గదా భద్రాద్రి రామయ్యకున్.

    రిప్లయితొలగించండి

  13. ముక్తిన్ గోరడు నేటి మానవులిలన్ భోగాలపై భూరి యా

    శక్తిన్ జూపుచు కొల్చుచుంద్రుకదరా! సంకల్పమున్ దీర్చెడిన్

    శక్తిన్ గల్గిన వాడు దేవుడను విశ్వాసంబదే లేనిచో

    భక్తుల్ మ్రొక్కుట కిచ్చగింపరు గదా భద్రాద్రి రామయ్యకున్.

    రిప్లయితొలగించండి
  14. శక్తిసుదర్శనచక్రము
    ముక్తికిమార్గంబుగాగ,పుణ్యంబుననా
    సక్తులునదిలోమున్గక
    భక్తులు ,మ్రొక్కంగ రారు భద్రగిరీశున్
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  15. రక్తిన్గొల్చెద రెల్లవేళల పురారాతిన్ మనంబందు నా
    సక్తిన్జూపరు వేరుదైవముల నీశానున్వినా గొల్వ నా
    వ్యక్తిత్వంబు విచిత్రమైదనరు నవ్యాజంపు నున్మాదతన్
    భక్తుల్ మ్రొక్కుట కిచ్చగింపరు గదా భద్రాద్రి రామయ్యకున్

    రిప్లయితొలగించండి
  16. భుక్తిన్ బొందుతలంపునన్యమతమున్ బోధించుచున్, నిత్యమా
    సక్తిన్ చూపుచు సొమ్ముపై దురితముల్ సాగించుచున్ స్వార్థమై
    ముక్తిన్ గూర్చితలంచకుండ చెడుఁ బెంపొందించుచున్ మ్లేచ్ఛులౌ
    భక్తుల్ మ్రొక్కుట కిచ్చగింపరు గదా భద్రాద్రి రామయ్యకున్

    రిప్లయితొలగించండి
  17. సూక్తమ్ము నాలకింపుమ
    భోక్తవ్యము లందు నింక భోగములం దా
    సక్తియె మది లేకున్నన్
    భక్తులు మ్రొక్కంగ రారు భద్రగిరీశున్


    యుక్తాయుక్త విచక్షణుల్ మనమునం దూహిం త్రభేదమ్మునున్
    ముక్తిం గోరుచు మ్రొక్కు చుండుదురు శంభుం గొంద ఱిద్ధాత్రినిన్
    రక్తిన్ నిల్పి యెడంద రుద్రు పయి నౌరా వీరశైవాఖ్య స
    ద్భక్తుల్ మ్రొక్కుట కిచ్చగింపరు గదా భద్రాద్రి రామయ్యకున్

    రిప్లయితొలగించండి
  18. రక్తులె యైనను శంభుని
    భక్తులు మ్రొక్కంగరారు భద్రగిరీశున్
    రక్తిని గూడుచు వారలు
    భక్తిని బూజింత్రు శివుని బహువిధములుగా

    రిప్లయితొలగించండి
  19. ముక్తిన్ గోరియు నెవ్వరైనను ముక్కంటి సేవించు నా
    భక్తుల్ మ్రొక్కుట కిచ్చరింపరుగనఋభద్రాద్రి రామయ్యకున్
    భక్తిన్ దోడుత శైవభక్తులు భువిన్ భవ్యుండుగానెంచియున్
    శక్తిన్ గూడిన నాపరాత్ముని భవున్ సాకారు బూజింత్రు రే

    రిప్లయితొలగించండి
  20. డా బల్లూరి ఉమాదేవి
    వ్యక్తము చేయగ బలమును
    భక్తులు మ్రొక్కంగరారు భద్రగిరీశున్
    భక్తిని పూనుచు మదిలో
    ముక్తిని కోరుచు సతతము ముని జనులెల్లన్

    రిప్లయితొలగించండి