30, సెప్టెంబర్ 2024, సోమవారం

సమస్య - 4898

1-10-2024 (మంగళవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“ఉత్తరాంధ్రలోనఁ బ్రగతి యుత్తదయ్యె”

(లేదా...)

“ఉత్తరాంధ్రలోనఁ బ్రగతి యుత్తదయ్యెఁ బ్రభుతచే”

(కూరపాటి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలతో...)

26 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. క్రొత్త దైనప్రణాళిక గొప్ప దనుచు
      చెత్త మాటలేల పొలుపు రిత్తగాదె
      మత్తు వదలిన తదుపరి మనలకెఱుకె
      ఉత్తరాంధ్రలోనఁ బ్రగతి యుత్తదయ్యె

      చెత్తమాటలేల సచివ చెప్పకున్న నయముగా
      క్రొత్తవౌ ప్రణాళికలని కూడబల్క తగదుగా
      రిత్తదైనవృద్ధి మనకు రేపు తెచ్చు దగరమే
      ఉత్తరాంధ్రలోనఁ బ్రగతి యుత్తదయ్యెఁ బ్రభుతచే

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  2. పంచదారపలుకులవియువైనమేది
    పాలకుండునుజెప్పుగా భార మనియు
    వెనుకబడినారుప్రజలును విషయమందు
    ఉత్తరాంధ్రలోనప్రగతియుత్తదయ్యె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణభంగం. 'యు' తొలగిస్తే సరి.

      తొలగించండి
    2. పొరపాటుగా పడింది చూసుకోలేదు
      క్షమించండి

      తొలగించండి

  3. దోచుకొనుటయె యెఱగిన దొంగలెల్ల
    ప్రజల యోటుతో గెలుచుచు పాలకులయి
    యసుర పాలననందింప నాదినమున
    ఉత్తరాంధ్రలోనఁ బ్రగతి యుత్తదయ్యె.


    కుత్తికలను గోసి శవము కొంప జేర్చి నట్టి యా
    చెత్త పనుల జేయు ప్రభువు చేష్టలవియె గాదె నిన్
    మత్తులోన ముంచి పలుక మనిరొ నాడు గాంచ నీ
    యుత్తరాంధ్రలోనఁ బ్రగతి యుత్తదయ్యెఁ బ్రభుతచే.

    రిప్లయితొలగించండి
  4. పదవి కొఱ కు పె క్కు విధా ల పలుకు లె న్నొ
    చెప్పి పిదప మరచి రేమొ తప్పి రే మొ
    పనులు సాగ లే ద చ్చ ట కనుక జూడ
    యుత్త రాంధ్ర లోన ప్రగతి యుత్త ద య్యె

    రిప్లయితొలగించండి
  5. తే॥ జనులు ప్రభుత నెన్ను కొనఁగ స్వార్థ పరుల
    మాయ మాటలు నమ్ముచు మరకువఁ గని
    ప్రగతి యెటుల రాష్ట్రమునందుఁ బరఁగు నయ్య
    యుత్తరాంధ్ర లోనఁ బ్రగతి యుత్త దయ్యె


    ఉత్సా॥ ఉత్తి బాసలకు జనులటులొప్పి యెన్ను కొనినచో
    చెత్త పాలకుల పగిదినిఁ జెప్పనేలను సఖుఁడా
    మొత్తమాంధ్ర దేశమంత మునుఁగుఁ బ్రగతి హీనమై
    యుత్తరాంధ్రలోనఁ బ్రగతి యుత్తదయ్యెఁ బ్రభుతచే!

    మరకువ అజ్ఞానము నిఘంటువు సహాయమండి

    చాలా రోజుల క్రితము 2సం॥ పైబడి అనుకుంటాను సుగంధి ఇచ్చినారండి. ఇప్పుడు ఉత్సాహమిచ్చారండి.

    రిప్లయితొలగించండి
  6. విశాఖ పట్టణ వాసులు విశ్వ సించి
    రచట రాజధాని గ నగర మమరు ననుచు
    నేండ్లు గడచిన తదుపరి యెంచి చూడ
    ఉత్తరాంధ్రలోనఁ బ్రగతి యుత్తదయ్యె

    రిప్లయితొలగించండి
  7. ప్రజల క్షేమము నరయక పాలకుండు
    స్వార్థబుద్ధితో సలుపఁగ పాలనమ్ము
    యేళ్ళుపూళ్ళును గడచిన నేమి ఫలము
    ఉత్తరాంధ్రలోనఁ బ్రగతి యుత్తదయ్యె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పాలనమ్ము + ఏళ్ళు' అన్నయడాగమం రాదు. "పాలనమ్ము నేళ్ళు" అనండి.

      తొలగించండి
  8. చెత్త రాజకీయములను చేసి యుత్తరాంధ్రకున్
    రిత్తవోవ జేసిరయ్యొ వృద్ధి తావసమ్మునన్
    క్రొత్త పథకములను ప్రజల కొరకు నమలు చేయకన్
    ఉత్తరాంధ్రలోనఁ బ్రగతి యుత్తదయ్యెఁ బ్రభుతచే

    రిప్లయితొలగించండి
  9. తేటగీతి గర్భితోత్సాహ వృత్తము:

    ఉత్సాహము:
    సత్త సాటఁ బౌరుల కట శక్తి కలదు మిథ్యయై
    జిత్తు లందు నేత లెపుడు సిక్క రెందు నేరికిన్
    మత్తు నందు ముంతు రనెడు మాట కల్ల కాదు సూ
    యుత్తరాంధ్ర లోనఁ బ్రగతి యుత్త దయ్యెఁ బ్రభుతచే

    తేటగీతి:
    సత్త సాటఁ బౌరుల కట శక్తి కలదు
    జిత్తు లందు నేత లెపుడు సిక్క రెందు
    మత్తు నందు ముంతు రనెడు మాట కల్ల
    యుత్తరాంధ్ర లోనఁ బ్రగతి యుత్త దయ్యె

    [అయినను నుత్తదయ్యె!]

    రిప్లయితొలగించండి
  10. ఉత్తమాటలెపుడు నాడు నొక్క పనియు కాకయున్
    ఉత్తరాంధ్రలోని ప్రగతి యుత్త దయ్య ప్రభుతచే
    రిత్త మాట లాప మంచు రేగనాప్ర జాళి యున్
    చిత్త శుద్ధి లేనివారిచెయ్దములవియింతెగా

    వరుణుడాగ్రహ మునుజూప వరదలగుచు
    నాటి నట్టి విత్తుల వెల్ల నాశమవగ
    నిలువగాజనులకెచట నీడలేక
    ఉత్తరాంధ్రలోన ప్రగతి ఉత్తదయ్యె




    రిప్లయితొలగించండి
  11. మొన్నటి ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష ప్రచారము...


    తేటగీతి
    వంశధార నాగావళి ప్రక్కనుంచి
    మద్దువలస యిత్యాదుల మఱచిపోయి
    తోటపల్లికి నిధులిడు మాటవీడ
    ఉత్తరాంధ్రలోనఁ బ్రగతి యుత్తదయ్యె!

    ఉత్సాహము
    విత్తనంపుగింజలకగు విత్తమావిరాయెనే!
    బత్తెమిచ్చి కడుపునింపు వంశధార యెప్పుడో?
    దుత్తకైన నీరుగనమె! తోటపల్లిమానిరో?
    యుత్తరాంధ్రలోనఁ బ్రగతి యుత్తదయ్యెఁ బ్రభుతచే!

    రిప్లయితొలగించండి
  12. ఓట్ల కొఱకునై గొప్పగ మాట నిచ్చి
    మొండి చేతిని జూపించు మూర్ఖ ప్రభుల
    కార ణంబుచే రాష్ట్రము కాక కొంత
    యుత్తరాంధ్రలోనఁ బ్రగతి యుత్తదయ్యె

    రిప్లయితొలగించండి

  13. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    ఓటు కొఱకెన్నియో మాయ మాటలాడి
    ప్రజలచేత నెన్నికయిన పాలకులును
    ప్రజల సొమ్ము దోచుకొనుటె పనియటంచు
    నొక్క యభివృద్ధి పనికైన నుద్యతిడక
    నుత్తరాంధ్ర లోనఁ బ్రగతి యుత్తదయ్యె.
    (ఉద్యతి= యత్నము)

    రిప్లయితొలగించండి