కం:గెలు పీయగ నీ కొండల ఎలుకకు జన్మించె నొక్క యేనుం గౌరా! అలసితిమి దీని తోడనె పలాయనమె మంచి దంచు బరుగిడిరి రిపుల్ (శివాజీ మహారాజుకి కొండ ఎలుక అనే బిరుదు ఉంది. ఆయనకి గెలుపు ఇవ్వటానికే ఈ ఏనుగు జన్మించింది అని శివాజీ యొక్క ఏనుగును చూసి శత్రువులు భయపడ్డారు.)
చిలువలుఁబలువలు రేపుచు
రిప్లయితొలగించండిబలువురువిద్రోహులిచటఁబబ్బముగడుపన్,
చెలగుచుఁజెప్పిరిటులఁ"జి
ట్టెలుకకు జన్మించె నొక్క యేనుం గౌరా"
కొరుప్రోలు రాధాకృష్ణ రావు
చిలుకపలుకులిడు జిన్నను
రిప్లయితొలగించండినలుగురు విని యచ్చెరువున నవ్వెడి రీతిన్
పలుకుమనగ నుడివె నిటుల ,
యెలుకకు జన్మించె నొక్క యేనుం గౌరా !
చ.
రిప్లయితొలగించండికలిమిని పొందఁ గోరుచు ప్రకాశ మయాంచిత బుద్ధి నిల్పి నే
నెలిమిగ కష్టమొందెడి పనిం బొనరించు నిశీథి కాలముం
గలిగిన నిద్రలో మునిగి కల్లల స్వప్నమునందుఁ గంటి చి
ట్టెలుకకుఁ బుట్టె నేనుగు జనించెను జింకకు వ్యాఘ్రమక్కటా !
కం॥ వలచఁగ బాలలు హాస్యము
రిప్లయితొలగించండిచెలఁగ చలనచిత్ర మటుల చిత్రముల పరిన్
బొలుపుగ పిల్లలు మెచ్చఁగ
నెలుకకు జన్మించె నొక్క యేనుం గౌరా
చం॥ వలచఁగ బాలలందరును భవ్యమటుంచును హాస్య మెంతయో
చెలఁగ విచిత్ర రీతులను చిత్రము, వింతగు జంతు జాలముం
దలఁచుట వైనమంచుఁ దగు నమ్మక ముంచి సృజించ నందులో
నెలుకకుఁ బుట్టె నేనుఁగు జనించెను జింకకు వ్యాఘ్రమక్కటా
వైనము ఉపాయము (నిఘంటువు సహాయమండి)
Animated cartoon movies రమారమి ఇలాగే ఉంటాయండి
రిప్లయితొలగించండిలలన చరవాణి యందున
పలు వింతల గాంచె నందు పరికింపంగన్
పులిగుహలో వసియించెడి
యెలుకకు జన్మించె నొక్క యేనుం గౌరా.
పలు విధ వింతలన్ గనగ వచ్చునటంచును పాఠశాలలో
చెలిమరి చెప్పెనంచు నిలు చేరిన వెంటనె తండ్రి నడ్గగన్
వెలగన నెక్కువైన కడు పేర్మి గొనివ్వగ నందు గాంచగా
యెలుకకుఁ బుట్టె నేనుఁగు జనించెను జింకకు వ్యాఘ్రమక్కటా.
[వేద జ్యోతిష్యంలో 27 నక్షత్రాలను కొన్ని జంతు లక్షణాల ఆధారంగా 14 యోనులుగా విభజించారు]
రిప్లయితొలగించండితెలుపగ నడిగిరి వానిని
వలచిన జంటలకు యోని వర్గము తగునా
తిలకించిన జ్యోతిషుడనె
నెలుకకు జన్మించె నొక్క యేనుం గౌరా
వలచిన వారి జాతకపు వర్గము లెంచగ సాటివచ్చునా
తెలుపుము వాస్తవమ్మనుచు తెచ్చిరి సర్వుల జాతకంబులన్
పలువురి జాతకంబులను బాగుగ చూచి వచించె జోస్యుడే
'ఎలుకకుఁ బుట్టె నేనుఁగు జనించెను జింకకు వ్యాఘ్రమక్కటా'
చిలుకల రీతి పల్కునని చెంతకు బిల్చుకొనంగ , వానితో
రిప్లయితొలగించండినలుగురి మెప్పునొందుటకు నాలుగు మాటలు జెప్ప గోరగా
పలికెనతండు భీతిలక వాక్యమునొక్కటి వింత గొల్పుచున్
"యెలుకకుఁ బుట్టె నేనుఁగు జనించెను జింకకు వ్యాఘ్రమక్కటా
ద్రుతాంతం తరువాత యడాగమం రాదు మహోదయ. "గొల్పుచున్ యెలుకకు" అనేది తప్పు
తొలగించండి🙏
తొలగించండిబలహీన మైన తల్లికి
రిప్లయితొలగించండిబలవంతుడు సుతుడు బుట్ట పలికిరి మహిళల్
కిల కిల నవ్వుచు వింత గ
నెలుకకు జన్మించె నొక్క యెనుo గౌ రా!
కలు ద్రావిన మైకములో
రిప్లయితొలగించండిపలికెనొకఁడు మతిచలించి పాలసునివలెన్
భళిరా కలికాలము! చి
ట్టెలుకకు జన్మించె నొక్క యేనుం గౌరా
కలుషఁపు మద్యముంగొనిన కల్లరియొక్కఁడు మైకమందునన్
రిప్లయితొలగించండిపలికె బిడాలకమ్మునకు పన్నుగ బుట్టెను వానరమ్ము యిం
పలరగ గ్రామసింగమొక భారికి బుట్టినదక్కజమ్ముగా
నెలుకకుఁ బుట్టె నేనుఁగు జనించెను జింకకు వ్యాఘ్రమక్కటా
(భారి=సింహము)
కలిగిన సుతుడును వింతగ
రిప్లయితొలగించండిపలికెను తన కుంతితోడ వలపుగ నగవున్
తిలకించి వాయు దేవుడు
ఎలుకకు జన్మించె నొక్క యేనుం గౌరా
కుల మరయ నంట రానిది
రిప్లయితొలగించండివెలిఁగెను గీర్తి శిఖరాన భీమ్రావ్ రామ్జీ
చెలువపు టంబేద్క రవని
నెలుకకు జన్మించె నొక్క యేనుం గౌరా
వెలసెనె యేకలవ్యుఁ డిల వింటికి నెక్కుడు నై చరించుచుం
గులము గణింప నల్ప మఁట గుట్టుగ నేర్చెను మించ నర్జునిం
జెలఁగును సృష్టి లోను గడు చిత్రము లెన్నియొ యెంచి చూడఁగా
నెలుకకుఁ బుట్టె నేనుఁగు జనించెను జింకకు వ్యాఘ్ర మక్కటా
కం:గెలు పీయగ నీ కొండల
రిప్లయితొలగించండిఎలుకకు జన్మించె నొక్క యేనుం గౌరా!
అలసితిమి దీని తోడనె
పలాయనమె మంచి దంచు బరుగిడిరి రిపుల్
(శివాజీ మహారాజుకి కొండ ఎలుక అనే బిరుదు ఉంది. ఆయనకి గెలుపు ఇవ్వటానికే ఈ ఏనుగు జన్మించింది అని శివాజీ యొక్క ఏనుగును చూసి శత్రువులు భయపడ్డారు.)
చం:కలుగుల నన్నిటిన్ దనదు కాలిన ద్రొక్కుచు మృత్యురూపమై
రిప్లయితొలగించండిఎలుకకుఁ బుట్టె నేనుఁగు, జనించెను జింకకు వ్యాఘ్రమక్కటా”
బల మగు శత్రువై, తమదు బ్రాణము నిల్వగ నన్యజాతులన్
బలమగు జాతి చంపుటయె వన్యవిధానము కాదె చూడగన్?
(ఎలుకలకు మృత్యువుగా ఏనుగు,జింకకు శత్రువు గా వ్యాఘ్రము పుట్టాయి.)
కందం
రిప్లయితొలగించండికలిగిన బంట్రోతు కొలువు
వెలయింపగ తండ్రి సుతుఁడు విద్యాధికుఁడై
నిలచెను జిల్లానేలుచు
నెలుకకు జన్మించె నొక్క యేనుం గౌరా!
చంపకమాల
కొలువున భృత్యులై సఖులు కూరిమి విద్యల నేర్ప పుత్రులున్
దెలివిగ వారలున్ జదివి తేలఁగ రాబడి రక్షణంబునన్
బలమగు శాఖలన్! ప్రజలు వారలగాంచుచు నిట్లు పల్కిరే!,
"యెలుకకుఁ బుట్టె నేనుఁగు! జనించెను జింకకు వ్యాఘ్రమక్కటా!"
సమస్య:
రిప్లయితొలగించండియెలుకకుఁ బుట్టె నేనుఁగు జనించెను జింకకు వ్యాఘ్రమక్కటా !
చంపకమాల:
కలి పదమెట్టె గాంచుమయ కాయలు పండ్లును వింతఁజూపెనే
పలికెను ముందుకాలమున పాదప జంతువు వింత లెన్నియో
కలుగును వైపరీత్యములు గానగ లేమని పోతులూరియే
యెలుకకుఁ బుట్టె నేనుఁగు జనించెను జింకకు వ్యాఘ్రమక్కటా !
సమస్య:
రిప్లయితొలగించండిఎలుకకు బుట్టె నేనుగు, జనించెను జింకకు వ్యాఘ్రమక్కటా!!
చంపకమాల:
తలచిరి శాస్త్రవేత్తలు విధాతను మించి సృజించ జీవులన్
మలచగ నెంచి జన్యువుల మార్పిడి సేయగ సాధ్యమేయనిన్
సలుపగ జీవజాలముల జన్యు పరీక్షల మార్పుతో భళా !
ఎలుకకు బుట్టె నేనుగు, జనించెను జింకకు వ్యాఘ్రమక్కటా!!
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
నిలిచె గుమాస్తాగ పితయు
విలసిల్లగ సుతుడు మిగుల విద్యాధికుడై
తెలివిగ నయ్యె కలెక్టరు
నెలుకకు జన్మించె నొక్క యేనుంగౌరా!