22-7-2025 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వెజ్జును నారాయణుఁ డని పిల్వఁగఁ దగునా”
(లేదా...)
“న్యాయంబౌనొకొ వైద్యునిన్ బిలువఁగా నారాయణుండం చిసీ”
పజ్జన గలడని వచ్చినసజ్జనులను మోసగించి సంపాదించన్బొజ్జను పెంచిన వాడగు వెజ్జును నారాయణుఁ డని పిల్వఁగఁ దగునా;
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కందంసజ్జన సాంగత్యము విడియిజ్జగతిని గాయమందు నింపగు భాగాల్బెజ్జము వేయుచు దొంగిలువెజ్జును నారాయణుఁ డని పిల్వఁగఁ దగునా? శార్దూలవిక్రీడితముగాయంబుల్, రుజమానెడున్ సరళిలోఁ గారుణ్యతత్థ్వాత్ముఁడైశ్రేయంబందగ వైద్యమున్ సలుపగన్ శ్రీవిష్ణువంచెంచరే!కాయంబందున దూరి చోరునివలెన్ గాఁజేయ భాగమ్ములన్న్యాయంబౌనొకొ వైద్యునిన్ బిలువఁగా నారాయణుండం చిసీ?
సజ్జనుఁడయి నిరుపేదలపజ్జకు తానేగి సేయ వైద్యము వానిన్వెజ్జనదగు నన్యుండగువెజ్జును నారాయణుఁ డని పిల్వఁగఁ దగునా
లజ్జ యిసుమంత లేకనుసజ్జన సేవను మరచుచు స్వార్థ పరుండై యిజ్జగతిని గల కపటపు వెజ్జును నారాయణుఁ డని పిల్వఁగఁ దగునా.ధ్యేయంబొక్కటె యర్థసాధనమదే యింపంచు తా మెంచుచున్ శ్రేయంబున్ దలపోయకన్ జగతిలో శ్రీయున్న చాలంచు తాహేయంబౌ పథమందునన్ చెలగెడిన్ హీనాత్ము లౌ వారైనచో న్యాయంబౌనొకొ వైద్యునిన్ బిలువఁగా నారాయణుండం చిసీ.
మజ్జు గ మసలుచు నిరత ము లజ్జను విడనాడి పేద లను నేడ్పి ంచే వెజ్జును పోల్చుచు పలుకుచువెజ్జును నారాయణు డని పిలువగ దగునా?
న్యాయాన్యాయ విచారణన్ విడిచి యన్యాయంబుగా పేదలన్కాయంబందలి రక్తముం గుడుచునా కాఠిన్య చిత్తుండెటుల్శ్రేయమ్ముం బొనరించు దీనజన సంక్షేమంబు పాటించకన్న్యాయంబౌనొకొ వైద్యునిన్ బిలువఁగా నారాయణుండం చిసీ
సజ్జనులరుదై కనబడుజజ్జరకార్లే బెడిదము జగతినరయ నిర్లజ్జగ జనులను దోచెడివెజ్జును నారాయణుఁ డని పిల్వఁగఁ దగునాచేయంజాలరు సేవ వారి కెపుడున్ జింతాయె సంపాదనేహేయంబౌ పనులే సదా సలుపరే హీనాతిహీనంబుగాన్యాయాన్యాయములన్ దలంచి నపుడే నాకొచ్చె సందేహమేన్యాయంబౌనొకొ వైద్యునిన్ బిలువఁగా నారాయణుండం చిసీ
కం॥ వెజ్జుగఁ బట్టముఁ బొందఁగ లజ్జను వీడుచు ధనమును రయముగఁ గనఁగానిజ్జగమందున వర్తిలవెజ్జుని నారాయణుఁ డని పిల్వఁగఁ దగునాశా॥ ప్రాయంబంతయు విద్యఁ గూర్చుకొని యుధ్భాసిల్ల వెచ్చమ్ము నెంతో యాచించుచుఁ జేసి విత్తమును సంతోషమ్ముతోఁ బొందనన్యాయంబంచును దెల్సి యార్జననె సన్మానించి వర్తిల్లఁగన్న్యాయంబౌనొకొ వైద్యనిన్ బిలువఁగా నారాయణుండం చిసీ
కం:ముజ్జగముల రక్షించుచుసజ్జనులన్ గాచు వేల్పు చక్రి , బతుకుకున్బెజ్జము పెట్టు హరుం డీవెజ్జును నారాయణుఁ డని పిల్వఁగఁ దగునా”(ఈ అసమర్థపు వైద్యుడు నస్రాయణుడు కాదు.లయకారి ఐన హరుడు.)
శా:న్యాయమ్మౌ గతి నాడి జూసి,తన పై నన్ నమ్మకమ్ముంచు వాడేయే పథ్యము జేయుచుండ వలెనో యేర్పాటు గా జెప్పి దీర్ఘాయున్ జేయుట జెల్లు,సొమ్ము కొరకే యా మందులన్ గుప్పగాన్యాయంబౌనొకొ వైద్యునిన్ బిలువఁగా నారాయణుండం చిసీ!
బొజ్జను బెంచి ఘనమ్ముగ లజ్జ విడిచి యీక యున్న లావుగ దుడ్డుంబజ్జ కయిన రా నీయని వెజ్జును నారాయణుఁ డని పిల్వఁగఁ దగునా ఆయా వేళల రక్షణం బొసఁగు నవ్యక్తుండు వైకుంఠుఁడే రోయన్ బాధల నోర్వఁ జాల కవనిన్ రోగార్త కోటిన్ మృతిచ్ఛాయా గ్రస్తులఁ గాచు భేషజములన్ సత్యమ్ము వీక్షింప నన్యాయంబౌ నొకొ వైద్యునిన్బిలువఁగా నారాయణుండం చిసీ
లజ్జనువీడుచుసతతము బొజ్జను నింపుకొననెంచుమోసమనస్కుల్నిజ్జగమునసుజనులవరు*“వెజ్జును నారాయణుఁ డని పిల్వఁగఁ దగునా”*న్యాయాన్యాయములెంచకుండగను ద్రవ్యంబేయిలన్ సర్వమైకాయంబందునరోగమున్ననిక పైకమ్మందకన్చూడనన్హేయంబౌపనులాచరించుచును తాహింసించనా కూళులన్*"న్యాయంబౌనొకొ వైద్యునిన్ బిలువఁగా నారాయణుండం చిసీ”*
పజ్జన గలడని వచ్చిన
రిప్లయితొలగించండిసజ్జనులను మోసగించి సంపాదించన్
బొజ్జను పెంచిన వాడగు
వెజ్జును నారాయణుఁ డని పిల్వఁగఁ దగునా;
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికందం
తొలగించండిసజ్జన సాంగత్యము విడి
యిజ్జగతిని గాయమందు నింపగు భాగాల్
బెజ్జము వేయుచు దొంగిలు
వెజ్జును నారాయణుఁ డని పిల్వఁగఁ దగునా?
శార్దూలవిక్రీడితము
గాయంబుల్, రుజమానెడున్ సరళిలోఁ గారుణ్యతత్థ్వాత్ముఁడై
శ్రేయంబందగ వైద్యమున్ సలుపగన్ శ్రీవిష్ణువంచెంచరే!
కాయంబందున దూరి చోరునివలెన్ గాఁజేయ భాగమ్ములన్
న్యాయంబౌనొకొ వైద్యునిన్ బిలువఁగా నారాయణుండం చిసీ?
సజ్జనుఁడయి నిరుపేదల
రిప్లయితొలగించండిపజ్జకు తానేగి సేయ వైద్యము వానిన్
వెజ్జనదగు నన్యుండగు
వెజ్జును నారాయణుఁ డని పిల్వఁగఁ దగునా
రిప్లయితొలగించండిలజ్జ యిసుమంత లేకను
సజ్జన సేవను మరచుచు స్వార్థ పరుండై
యిజ్జగతిని గల కపటపు
వెజ్జును నారాయణుఁ డని పిల్వఁగఁ దగునా.
ధ్యేయంబొక్కటె యర్థసాధనమదే యింపంచు తా మెంచుచున్
శ్రేయంబున్ దలపోయకన్ జగతిలో శ్రీయున్న చాలంచు తా
హేయంబౌ పథమందునన్ చెలగెడిన్ హీనాత్ము లౌ వారైనచో
న్యాయంబౌనొకొ వైద్యునిన్ బిలువఁగా నారాయణుండం చిసీ.
మజ్జు గ మసలుచు నిరత ము
రిప్లయితొలగించండిలజ్జను విడనాడి పేద లను నేడ్పి ంచే
వెజ్జును పోల్చుచు పలుకుచు
వెజ్జును నారాయణు డని పిలువగ దగునా?
న్యాయాన్యాయ విచారణన్ విడిచి యన్యాయంబుగా పేదలన్
రిప్లయితొలగించండికాయంబందలి రక్తముం గుడుచునా కాఠిన్య చిత్తుండెటుల్
శ్రేయమ్ముం బొనరించు దీనజన సంక్షేమంబు పాటించకన్
న్యాయంబౌనొకొ వైద్యునిన్ బిలువఁగా నారాయణుండం చిసీ
సజ్జనులరుదై కనబడు
రిప్లయితొలగించండిజజ్జరకార్లే బెడిదము జగతినరయ ని
ర్లజ్జగ జనులను దోచెడి
వెజ్జును నారాయణుఁ డని పిల్వఁగఁ దగునా
చేయంజాలరు సేవ వారి కెపుడున్ జింతాయె సంపాదనే
హేయంబౌ పనులే సదా సలుపరే హీనాతిహీనంబుగా
న్యాయాన్యాయములన్ దలంచి నపుడే నాకొచ్చె సందేహమే
న్యాయంబౌనొకొ వైద్యునిన్ బిలువఁగా నారాయణుండం చిసీ
కం॥ వెజ్జుగఁ బట్టముఁ బొందఁగ
రిప్లయితొలగించండిలజ్జను వీడుచు ధనమును రయముగఁ గనఁగా
నిజ్జగమందున వర్తిల
వెజ్జుని నారాయణుఁ డని పిల్వఁగఁ దగునా
శా॥ ప్రాయంబంతయు విద్యఁ గూర్చుకొని యుధ్భాసిల్ల వెచ్చమ్ము నెం
తో యాచించుచుఁ జేసి విత్తమును సంతోషమ్ముతోఁ బొందన
న్యాయంబంచును దెల్సి యార్జననె సన్మానించి వర్తిల్లఁగన్
న్యాయంబౌనొకొ వైద్యనిన్ బిలువఁగా నారాయణుండం చిసీ
కం:ముజ్జగముల రక్షించుచు
రిప్లయితొలగించండిసజ్జనులన్ గాచు వేల్పు చక్రి , బతుకుకున్
బెజ్జము పెట్టు హరుం డీ
వెజ్జును నారాయణుఁ డని పిల్వఁగఁ దగునా”
(ఈ అసమర్థపు వైద్యుడు నస్రాయణుడు కాదు.లయకారి ఐన హరుడు.)
శా:న్యాయమ్మౌ గతి నాడి జూసి,తన పై నన్ నమ్మకమ్ముంచు వా
రిప్లయితొలగించండిడేయే పథ్యము జేయుచుండ వలెనో యేర్పాటు గా జెప్పి దీ
ర్ఘాయున్ జేయుట జెల్లు,సొమ్ము కొరకే యా మందులన్ గుప్పగా
న్యాయంబౌనొకొ వైద్యునిన్ బిలువఁగా నారాయణుండం చిసీ!
బొజ్జను బెంచి ఘనమ్ముగ
రిప్లయితొలగించండిలజ్జ విడిచి యీక యున్న లావుగ దుడ్డుం
బజ్జ కయిన రా నీయని
వెజ్జును నారాయణుఁ డని పిల్వఁగఁ దగునా
ఆయా వేళల రక్షణం బొసఁగు నవ్యక్తుండు వైకుంఠుఁడే
రోయన్ బాధల నోర్వఁ జాల కవనిన్ రోగార్త కోటిన్ మృతి
చ్ఛాయా గ్రస్తులఁ గాచు భేషజములన్ సత్యమ్ము వీక్షింప న
న్యాయంబౌ నొకొ వైద్యునిన్బిలువఁగా నారాయణుండం చిసీ
లజ్జనువీడుచుసతతము
రిప్లయితొలగించండిబొజ్జను నింపుకొననెంచుమోసమనస్కుల్
నిజ్జగమునసుజనులవరు
*“వెజ్జును నారాయణుఁ డని పిల్వఁగఁ దగునా”*
న్యాయాన్యాయములెంచకుండగను ద్రవ్యంబేయిలన్ సర్వమై
కాయంబందునరోగమున్ననిక పైకమ్మందకన్చూడనన్
హేయంబౌపనులాచరించుచును తాహింసించనా కూళులన్
*"న్యాయంబౌనొకొ వైద్యునిన్ బిలువఁగా నారాయణుండం చిసీ”*