2, ఆగస్టు 2025, శనివారం

సమస్య - 5201

3-8-2025 (ఆదివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“రాతిరి సూర్యుండు నిప్పు రవ్వలఁ గురిసెన్”

(లేదా...)

“రాతిరి వేళ భాస్కరుఁడు రాల్చెను పెక్కుగ నిప్పురవ్వలన్”

(రావిపాటి లక్ష్మినారాయణ గారి 'సమస్యాపూరణ' గ్రంథం నుండి)

11 కామెంట్‌లు:

  1. ఉ.
    ద్యోతక కౌముదీ కిరణ తోష మహోత్సవ కామ్య ధారియై
    చేతమునందు నాతురతఁ జెన్నగు రీతిని నిల్పి వేసవిన్
    వాతముఁ దాళపత్ర భర వాతద యష్టులచేతఁ బొందెనీ
    రాతిరి వేళ, భాస్కరుడు రాల్చెను పెక్కుగ నిప్పురవ్వలన్ !

    రిప్లయితొలగించండి

  2. శీతము వెడలె నటంచును
    కాతాళము నందుచు నుడుగణవీధిని ఖ
    ద్యోతుడు క్రుంగిన నేమిర
    రాతిరి , సూర్యుండు నిప్పు రవ్వలఁ గురిసెన్.


    ఖ్యాతిగడించినట్టి తపనాంశుడజంభుడు లోకబాంధవుం
    డాతడు ఘర్మదీధితి యహర్మణి చీకటిగొంగ వాడటన్
    శీతము చేయిజారెనని చిందర నందుచు, క్రుంగనేమిరా
    రాతిరి వేళ, భాస్కరుఁడు రాల్చెను పెక్కుగ నిప్పురవ్వలన్.

    రిప్లయితొలగించండి
  3. శీతలుడు వెన్నెలనొసగె
    రాతిరి ; సూర్యుండు నిప్పు రవ్వలఁ గురిసెన్ 
    చేతనులపయిన , వారా
    యాతపము భరించలేక నలజడి నొందెన్

    రిప్లయితొలగించండి
  4. చేతము చల్లబరచి చనె
    శీతరుచుడు రాతిరి విరజిమ్మి వెలుగులన్
    నూతన దివసము, ముగియగ
    రాతిరి, సూర్యుండు నిప్పు రవ్వలఁ గురిసెన్

    చేతము చల్లజేయునని చేరితి పున్నమి వెల్గులందునన్
    శీతమయూఖ రేఖల వశీకరణంబున సేదదీరితిన్
    రాతిరి వేళ; భాస్కరుఁడు రాల్చెను పెక్కుగ నిప్పురవ్వలన్
    రాతిరి పూర్తియైనతరి రమ్యముగా క్రమమైన రీతినిన్

    రిప్లయితొలగించండి
  5. కం:ఆ తరి నట్లాంటా లో
    రాతిరి, సూర్యుండు నిప్పు రవ్వలఁ గురిసెన్
    మా తావున, చరవాణిన్
    నా తనయుడు తెలిసి కొనెను నా క్షేమమ్మున్

    రిప్లయితొలగించండి
  6. ఉ:రాతిరి యయ్యె నంచు కురు రాజును,సైంధవుడున్ హసించ గా
    నా తమ మెల్ల మిథ్య యయి యాశల జంపుచు దీప్తి జూప నా
    రాతిరి వేళ భాస్కరుఁడు, రాల్చెను పెక్కుగ నిప్పురవ్వలన్
    జేతగ నిల్పి చక్రి దరి జేరుచు చక్రము రౌద్ర రూప యై.
    (సైంధవ వధలో కృష్ణుడు సూర్యునికి చక్రం అడ్డు వేస్తే ఆ రాత్రి నిజమనుకున్నారు కానీ ఆ రాత్రి ఐ పోయి సూర్యుడు రాగా శ్రీకృష్ణుని చక్రము నిప్పురవ్వలు చిమ్ముకుంటూ విజయం అందించిన గర్వం తో శ్రీకృష్ణుణ్ని చేరుకొన్నది.)

    రిప్లయితొలగించండి
  7. ద్యోతక మయ్యె ను జంద్రుడు
    రాతిరి :: సూర్యుండు నిప్పు రవ్వలు గురి సెన్
    భీతిని గొలిపె డి వేసవి
    వాతావరణమున మార్పు వంతలు గూర్చె న్

    రిప్లయితొలగించండి
  8. కం॥ కోఁతలు కోసెడి స్పర్ధను
    చేతనులై మిత్రులటులఁ జేరి వరలఁగన్
    బ్రీతిగఁ బలికె నొకఁడిటుల
    రాతిరి సూర్యుండు నిప్పు రవ్వలఁ గురిసెన్

    ఉ॥ కోఁతలు కోయు స్పర్ధఁగనఁ గొందరు మిత్రులు హాస్యమొందఁగన్
    బ్రీతిగ పల్కెనొక్కఁడిటు పేరిచి కూరిచి సత్యదూరమున్
    ఘాతము నొందఁగన్ బ్రళయ కాలము నందునఁ జండ రూపుఁడై
    రాతిరి వేళ భాస్కరుఁడు రాల్చెను నిప్పురవ్వలన్

    రిప్లయితొలగించండి
  9. ఆ తలలు మొలచు చుండం
    జేతం గొని బమ్మ యమ్ముఁ జిమ్ము మనంగన్
    మాతలి ప్రొద్దు తెగ కడలి
    రాతిరి సూర్యుండు నిప్పు రవ్వలఁ గురిసెన్

    [ప్రొద్దు తెగ కడలి రాతిరి సూర్యుండు = రవికులాబ్ధి చంద్రుఁడు]


    ఆ తఱి నేఁగు చేఁగుచును నంబర రత్నము వేగ వేగ సం
    పాతము గాఁగ నస్త గిరి మల్లెలు తీఁగలఁ బూయు నట్టి యా
    రీతిని నీయఁ జూపఱకుఁ బ్రీతిని నింగిని రిక్క చుక్కలన్
    రాతిరి వేళ భాస్కరుఁడు రాల్చెను బెక్కుగ నిప్పు రవ్వలన్

    రిప్లయితొలగించండి
  10. కందం
    చేతల విదేశములకున్
    భీతిని సుంకాలువేయ వెర్రి 'ట్రముపు' కున్
    వాతలు బెట్టగ రగులుచు
    రాతిరి, సూర్యుండు నిప్పు రవ్వలఁ గురిసెన్!

    ఉత్పలమాల
    చేతల వేసి సుంకముల జేయ విదేశములల్లలాడగన్
    భీతిని గొల్పెడున్ బగిది వెర్రిగ 'ట్రంప' ట, క్రోధమొందుచున్
    వాతలు బెట్టగన్ రగిలి వానికి శాస్తినొసంగఁ గ్రుద్ధుఁడై
    రాతిరి వేళ! భాస్కరుఁడు రాల్చెను పెక్కుగ నిప్పురవ్వలన్!

    రిప్లయితొలగించండి