మ.కో: ఏమి దేశము హిందు దేశ !మిదేమి యీ పురుషోత్తముం డేమి చేయక వీడె నన్ను ధరించు రాఖిని జూచి హా! ఈ మహాత్ముడు నీచమౌ నని నెంచె గెల్వడొ! యిట్టి సం గ్రామసింహముగాఁ జరించిన రాజు సన్నుతులందఁడా?” ("ఆహా! ఈ హిందూదేశం ఎంత గొప్ప దేశం. నేను తన చేతికి చిక్కినా పురుషోత్తముడు తన చేతికి ఉన్న రాఖీని చూసి వదిలేసాడు.ఈ మహాత్ముడు సంగ్రామసింహుడు.అధర్మ యుద్ధం చెయ్యడు" అని అలెగ్జాండర్ పురుషోత్తముణ్ని,హిందూ దేశాన్ని ప్రశంసించాడు.అలెగ్జాండర్ ని ప్రేమించిన రుక్సానా పురుషోత్తముని చేతికి రాఖీ కట్టింది.అలెగ్జాండర్ ని చంప బోయిన పురుషోత్తముడు ఆ రాఖీని ఛూచి అతన్ని చంపకుండా వదిలేశాడు.)
నిత్య సత్య వచన నిష్ఠాపరుఁడు విమ లాంతరంగ కేశ వాది నామ చింత నాభిరతుఁడు సంత తోద్దండ సం గ్రామ సింహ మగుచు రాజు నెగడె
గ్రామ పట్టణ పౌర సంచయ రక్షకుండు లసద్గుణ గ్రామ శోభిత పూరుషుండు విరాజ మాన యశస్వియున్ సామ దాన ముఖాద్యుపాయ విశార దారి మదావళ గ్రామ సింహముగాఁ జరించిన రాజు సన్నుతు లందఁడా?
ఆటవెలది
రిప్లయితొలగించండిశత్రుదేశమెగసి సమరమ్ముబూనగన్
సాహసానమేటి వ్యూహమెంచి
యప్రతిహతరోషుఁడనఁ జెలరేఁగి సం
గ్రామసింహ మగుచు రాజు నెగడె!
మత్తకోకిల
తొలగించండిసేమ మన్నది వీసమెంచక చేవలేకయె వైరులున్
గామితమ్ములు దీర్చు దేశము గ్రమ్మినంతట దూకఁగన్
ధీమసమ్మగు వ్యూహమెంచియుఁ దేజమొప్పెడు రీతి సం
గ్రామసింహముగాఁ జరించిన రాజు సన్నుతులందఁడా!
తేజరిల్లు సాహితీసమరాంగణ
రిప్లయితొలగించండిసార్వభౌముడనుచు సన్నుతింత్రు
కృష్ణరాయవిభుడు కృతకృత్యుడుగద సం
గ్రామసింహ మగుచు రాజు నెగడె
నామమాత్రపు శక్తిఁ జూపగ నాశమేగద శత్రువుల్
తొలగించండిరామ రాజ్యముఁ బోలురీతిన రాజ్యమేలెను రాయలే
సామరస్యము తోడఁ గాంచెను సత్కవీంద్రులనెల్ల సం
గ్రామసింహముగాఁ జరించిన రాజు సన్నుతులందఁడా?
మత్తకోకిల.
రిప్లయితొలగించండిసేమమందగ జేయ పూనెను క్షిప్రమౌ గతి చూడగా
నేమముం జని శత్రువీరుల, నీచ యూధము చంపి యీ
భూమి కావ జనాళి మెచ్చిన భూరి కీర్తిని గొన్న సం
గ్రామ సింహముగా జరించిన రాజు సన్నుతులందడా ?
రిప్లయితొలగించండిజనుల క్షేమమంచు శాంతిగోరిననేమి
శత్రు వొప్పకున్న స్వాతి దాల్చి
మొగ్గరమున గొంగ మూకల ద్రుంచ, సం
గ్రామసింహ మగుచు రాజు నెగడె.
రామరాజ్యము వోలె తానును రాజ్యపాలన చేయుచున్
ప్రేమతోజన బాధలన్నియు విన్నవెంటనె తీర్చుచున్
భీమరమ్మున శత్రుమూకల విత్తుమాల్చెడి జవ్రి సం
గ్రామసింహముగాఁ జరించిన రాజు, సన్నుతులందఁడా?.
క్షేమమెంచియు నెల్లవేళల జేర
రిప్లయితొలగించండిదీసియు పౌరులన్
రామరాజ్యము తీరునేలుచు
రక్ష చేసెడు రాజు తా
క్షామమందున పేదవారల
కష్ట మార్పగ జూడ సం
గ్రామ సింహముగా చరించిన
రాజు సన్నుతులందడా
రాజ్య ప్రజల కెపుడు రక్షణ నొసగుచు
రిప్లయితొలగించండివారి నెపుడు బరుల బారి నుండి
కాపు కాయు చున్న కతన దే శమునకు
గ్రామసింహ మగుచు రాజు నెగడె
రాజ్య ప్రజల నెల్ల రక్షించు కొఱకు నై
రిప్లయితొలగించండియరి భయంకరు డు గ నలరు చుండి
యుద్ధ మందు గొప్ప యో ధు డై మి o చి సం
గ్రామ సింహమగుచు రాజు నెగడె
దుష్ట శక్తులడరి దుండగమ్ము దలప
రిప్లయితొలగించండిపగతుర బరిమార్చు వ్రతముఁ బూని
కదనరంగమందు కత్తిని దూసి సం
గ్రామసింహ మగుచు రాజు నెగడె
సౌమనస్యముఁ జూప మెచ్చని శత్రు దేశఁపుటుద్ధతిన్
రిప్లయితొలగించండిసామరస్యముతో నడంచగ శక్యమౌ గతి గానకన్
దీమసమ్ముగ నాజిలో రణధీరుడై యరిగట్ట సం
గ్రామసింహముగాఁ జరించిన రాజు సన్నుతులందఁడా?
ఆ.వె:గ్రామసింహ మటుల కాయరు డై యంభి
రిప్లయితొలగించండిగ్రీకు రాజు జూచి తోక నూప
పౌరుషమ్ము జూపె పౌరసు,గొప్ప సం
గ్రామసింహ మగుచు రాజు నెగడె”
(అంభి గ్రామసింహం. పురుషోత్తముడు సంగ్రామ సింహం.)
మ.కో: ఏమి దేశము హిందు దేశ !మిదేమి యీ పురుషోత్తముం
రిప్లయితొలగించండిడేమి చేయక వీడె నన్ను ధరించు రాఖిని జూచి హా!
ఈ మహాత్ముడు నీచమౌ నని నెంచె గెల్వడొ! యిట్టి సం
గ్రామసింహముగాఁ జరించిన రాజు సన్నుతులందఁడా?”
("ఆహా! ఈ హిందూదేశం ఎంత గొప్ప దేశం. నేను తన చేతికి చిక్కినా పురుషోత్తముడు తన చేతికి ఉన్న రాఖీని చూసి వదిలేసాడు.ఈ మహాత్ముడు సంగ్రామసింహుడు.అధర్మ యుద్ధం చెయ్యడు" అని అలెగ్జాండర్ పురుషోత్తముణ్ని,హిందూ దేశాన్ని ప్రశంసించాడు.అలెగ్జాండర్ ని ప్రేమించిన రుక్సానా పురుషోత్తముని చేతికి రాఖీ కట్టింది.అలెగ్జాండర్ ని చంప బోయిన పురుషోత్తముడు ఆ రాఖీని ఛూచి అతన్ని చంపకుండా వదిలేశాడు.)
నిత్య సత్య వచన నిష్ఠాపరుఁడు విమ
రిప్లయితొలగించండిలాంతరంగ కేశ వాది నామ
చింత నాభిరతుఁడు సంత తోద్దండ సం
గ్రామ సింహ మగుచు రాజు నెగడె
గ్రామ పట్టణ పౌర సంచయ రక్షకుండు లసద్గుణ
గ్రామ శోభిత పూరుషుండు విరాజ మాన యశస్వియున్
సామ దాన ముఖాద్యుపాయ విశార దారి మదావళ
గ్రామ సింహముగాఁ జరించిన రాజు సన్నుతు లందఁడా?
రామరాజ్యము సేయ నెంచెడి రమ్య పాలకుఁడీతడే
రిప్లయితొలగించండిసామబేధపు దండనమ్మున సాగు శిక్షలు న్యాయమున్
నీమపాలనసేయ వేగుగ నీతితో ప్రజ కాపుగా
గ్రామసింహముగాఁ జరించిన రాజు సన్నుతులందఁడా?
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
పొరుగు రాజు వచ్చి పోరు సలుప బూన
వ్యూహరచన చేసి యుద్ధమందు
చావు దెబ్బ కొట్టి జయమును పొంద సం
గ్రామ సింహమగుచు రాజు నెగడె!