25, ఆగస్టు 2025, సోమవారం

సమస్య - 5224

26-8-2025 (మంగళవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“వ్యాఘ్రంబొక జింకనుఁ గని పాఱె భయమునన్”

(లేదా...)

“వ్యాఘ్రమొకండు జింకఁ గని పాఱె భయంబునఁ దా వడంకుచున్”

14 కామెంట్‌లు:

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

కందం
శీఘ్రమె వనంబు దాటగ
జిఘ్రుడు పరుగున నడచుచు చేరి, మలుపు నం
దాఘ్రాణించుచు దూకఁగ
వ్యాఘ్రంబొక జింకనుఁ గని, పాఱె భయమునన్

ఉత్పలమాల
వ్యాఘ్రభయంబునన్ జనుఁడు బాటను దప్పక జాగరూకతన్
శీఘ్రమె దాట నయ్యడవిఁ జేరుచు సాగెడు వేళ మల్పునన్
జిఘ్రుడు భీతితో నిలచి చేష్టలు మాని క్షణంబు, దూకగన్
వ్యాఘ్రమొకండు జింకఁ గని, పాఱె భయంబునఁ దా వడంకుచున్

Sitharamayya Solasa చెప్పారు...

శీఘ్రముగ నడచు చుండగ
అంఘ్రికడ నొక శిలినిగని యడుగు తడబడన్
శీఘ్రముగ గెంటుట గనగ
వ్యాఘ్రంబొక జింకనుఁ గని పాఱె భయమునన్

విరించి చెప్పారు...



వ్యాఘ్రాసనమే వ్యాఘ్రము
వ్యాఘ్రమనగ పిల్లి యనుచు భావన తోడన్
వ్యాఘ్రేయము గ్రోలి పలికె
వ్యాఘ్రంబొక జింకనుఁ గని పాఱె భయమునన్.


వ్యాఘ్రము గాంచినన్ సకల ప్రాణులు భీతిలి పారు గాదుటే
శీఘ్రగతిన్ నిజమ్మిదియె శీనుడు మాత్రమె పల్కు నిట్టులన్
వ్యాఘ్రమనన్ బిడాలకమటంచు దలంచి వచించె నివ్విధిన్
వ్యాఘ్రమొకండు జింకఁ గని పాఱె భయంబునఁ దా వడంకుచున్.

M.B.G.TILAK చెప్పారు...

వ్యాఘ్రమెదురైన తరుణము
శీఘ్రమె పరువెత్తునల్ప జీవులు, మెడలో
వ్యాఘ్రనఖము గల పురుష
వ్యాఘ్రంబొక జింకనుఁ గని పాఱె భయమునన్

వ్యాఘ్రము క్రూరజంతువని భద్రతకై తపియించు చుందురే
శీఘ్రమె పర్వుదీయుదురు క్షేమముగాతమ యిల్లు జేరగా
వ్యాఘ్రనఖంబు కంఠమున భాసిల భీరుకమందు పూరుష
వ్యాఘ్రమొకండు జింకఁ గని పాఱె భయంబునఁ దా వడంకుచున్

శేషాద్రి సోమయాజులు చెప్పారు...

వ్యాఘ్రము‌ జింకగ‌ ,జింకను
వ్యాఘ్రంబుగ‌మార్చె‌మునులు‌ వైచిత్ర్యముగా‌
వ్యాఘ్రము‌‌ గతమెట్లు‌మరచు‌?
వ్యాఘ్రంబొక జింకనుఁ గని పాఱె భయమునన్”

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

వ్యాఘ్రమును గనిన హరిణము
శీఘ్రముగా కర్దమమునఁ జిందాడుచు తా
నుగ్రఁపు రూపముఁ దాల్చఁగ
వ్యాఘ్రంబొక జింకనుఁ గని పాఱె భయమునన్

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

ఉగ్రఁపు రూపు దాల్చెనొక యుబ్బలిలో పడి యేణమత్తరిన్
వ్యాఘ్రమరణ్యమందు నడయాడుచు దానిని గాంచి నంతనే
వ్యగ్రతనొందె క్రూరమృగమంచు మదిన్దలబోసి, చెచ్చెరన్
వ్యాఘ్రమొకండు జింకఁ గని పాఱె భయంబునఁ దా వడంకుచున్

Dhanikonda Ravi Prasad చెప్పారు...

కం:శీఘ్రముగ వెంబడించగ
వ్యాఘ్రంబొక జింకనుఁ గని , పాఱె భయమునన్
వ్యాఘ్రము తినునని యన్నియు
వ్యాఘ్ర మ్మొక జింక తోనే యాకలి బాసెన్

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

కం॥ వ్యాఘ్రము హరిణమునుఁ గనఁగ
శీఘ్రమె చేరెను దునిమి భుజించఁగ నంతే
శీఘ్రముగఁ చేర మందయె
వ్యాఘ్రంబొక జింకనుఁ గని పాఱె భయమునన్

ఉ॥ వ్యాఘ్రము మాంసమున్ దినెడి ప్రాణియె శాకములన్ భుజించదే
వ్యాఘ్రము, జింక కన్పడఁగ భవ్యమటంచును దల్చుఁ జంపగన్
శీఘ్రము మంద చేరఁగను జింకకు సాయముఁ గాంచ నెంచుచున్
వ్యాఘ్రమొకండు జింకఁ గని పాఱె భయంబున దా వడంకుచున్

(మొదట ఒక జింకనే చూచిందండి, దానిని వెంబడించే లోపే చాల వచ్చి చేరినాయని అండి)

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

వ్యాఘ్రము మెస వియు కలుషిత
మా ఘ్రా ణి o ప o గ దగని యాహా రంబు న్
వ్యా ఘ్ర ము మతి చలి యింపగ
వ్యాఘ్రo బొక జింకను గని పారె భయము నన్

విన్నకోట విజయసాగర్ చెప్పారు...

ఈ ఘ్ర మతిఘ్నప్రాస నొక పృచ్ఛకుఁ డీయ, వధాని యొండు తా
జిఘ్రదవార్యకావ్యవిదుషీపరిహాసపరాజితుండుగాన్
శీఘ్రత వీడె నా సభను చిన్నసమస్యను ౙూచి తత్కవి
వ్యాఘ్ర మొకండు జింకఁ గని పారె భయంబునఁ దా వడంకుౘున్ !

ఈ ఘ్ర ప్రాస తోడి సమస్య యే జింక. కవివ్యాఘ్రము అనుట ఎద్దేవ.

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

మోఘమ్ములు గాఁగ నుపా
యౌఘమ్ములు నెల్ల నంత నభ్రము నందున్
మేఘములు గ్రమ్మఁగ శశ
వ్యాఘ్రం బొక జింకనుఁ గని పాఱె భయమునన్


శీఘ్రముగాఁ జరించి నరసింహుఁ డరణ్య తటమ్ము నందు వై
యాఘ్ర విహార తత్పరత నారసి యచ్చట నొక్క మృత్తికో
జ్జిఘ్ర మృగమ్మునుం జిఱుత చెన్ను దలంపఁగ నంత గోముఖ
వ్యాఘ్ర మొకండు జింకఁ గని పాఱె భయంబునఁ దా వడంకుచున్

పిన్నక నాగేశ్వరరావు. చెప్పారు...


పిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.

వ్యాఘ్రము గని హరిణమ్మును
శీఘ్రముగా దుముక దాని చెంతకు నంతే
శీఘ్రముగ చేరె మందను
వ్యాఘ్రంబొక జింకనుఁ గని పాఱె
భయమునన్.