మ:చదువున్,సభ్యత లేని వారి వలె నీ చాణక్యునిన్,రాజ్యసం పద చే మత్తిలి గెంటి వేసెదరె? మీ పాపాల రాజ్యమ్ములో మదిరాపానవిశేషమత్తులకె సన్మానంబు దక్కున్ గదా! యిదె నా జేయు ప్రతిజ్ఞ మీ క్షతమె నా కీ జన్మ లో గమ్యమౌ. (అవమానించ బడిన చాణక్యుడు నందుల సభ లో ఇలా ప్రతిజ్ఞ చేసాడు.)
జనుల చీత్కరింపు దొరకు శాశ్వతముగ
రిప్లయితొలగించండిమదిరఁ గ్రోలు వారలకె ; సన్మానమబ్బు
తాను త్రాగెడు నీటినె దప్పి గొనిన
వారి దాహము దొలగించ వలనుగనిడ
మ.
రిప్లయితొలగించండివిదితంబైన విధానముల్ విడువ క్రొవ్వెర్రుల్ తలల్ వీచు న
ప్డు దశల్ ధోరణి మారు సంఘమున వ్యామోహంబు వ్యాపించు, నీ
మద మాత్సర్య గుణాన్విత ప్రకట దుర్మార్గాఢ్య లోకంబులో
మదిరాపాన విశేష మత్తులకె సన్మానంబు దక్కుం గదా !
రిప్లయితొలగించండిఅదియె మధురమైనదనుచు నమృత తుల్య
మనుచు విశ్వసించి సతము మనము నందు
రామ యని స్మరియింప నా నామమనెడి
మదిరఁ గ్రోలు వారలకె సన్మానమబ్బు
హృదయంబందున రామనామమునె ప్రత్యేకమ్ముగా దాల్చి య
య్యదె మోక్షార్థికి దివ్యమంత్రమని నిత్యంబయ్యదే ధ్యానమై
వదలన్ లేని జపానురక్తులగుచున్ భక్తాళి రామమ్మనే
మదిరాపానవిశేషమత్తులకె సన్మానంబు దక్కున్ గదా.
వలలుడు సైరంధ్రితో....
రిప్లయితొలగించండితేటగీతి
మదిరఁ గోరఁగ రాణియె, బెదరకుండ
కీచకుని కడకేగి కన్గీటి బిలిచి
నర్తనంపు శాలకుఁ జేర్చ, నా పిడికిట
మదిరఁ గ్రోలు వారలకె సన్మానమబ్బు!
మత్తేభవిక్రీడితము
సుదతీ! రాణియె కోరగన్ మదిరకై సొంపారగన్ జేరియున్
మదనోద్రేకమునందుఁ దేలు పగతున్ మారాముగన్ బిల్చియున్
గుదరన్ నర్తనశాలఁజేర్చఁ గనుమా! కోరన్ బరస్త్రీఁ గుతిన్
మదిరాపానవిశేషమత్తులకె సన్మానంబు దక్కున్ గదా!
ఆంధ్ర గీర్వాణ భాషల నభ్యసించి
రిప్లయితొలగించండిధారణయు,ధాటి,ధారయు,ధైర్యమబ్బ
పృధ్వి నవధానులగుచు కవిత్వమనెడు
మదిర గ్రోలు వారలకె సన్మానమబ్బు.
మదిలో నిత్యము భారతింగొలుచుచున్ మాన్యుల్ సదా మెచ్చ,సం
సదులందున్ మధురంపు పద్యకవితా సౌందర్యముంజూపగా
పదముల్, భావము,రీతి,శయ్యలు తగన్ వర్తిల్ల తత్ సాహితీ
మదిరా పాన విశేష మత్తులకె సన్మానంబు దక్కున్ గదా!
మధుర భావనా సాహిత్య మనగ నొప్పు
రిప్లయితొలగించండిపద్య రచనకై నిరతము పాటు పడుచు
రచనలు వెలువరించి సారస్వతమను
మదిరఁ గ్రోలు వారలకె సన్మానమబ్బు
మది సాహిత్యము పైన నిల్పి సతతంబాలోచనల్ చేయుచున్
మృదుభావాన్విత కావ్య సృష్టి సలుపన్ మేధావులే మెచ్చగా
విదితంబౌ కవి చాకచక్యము భళా! విజ్ఞాన సారస్వతా
మదిరాపానవిశేషమత్తులకె సన్మానంబు దక్కున్ గదా
మదిలో రాముఁ బ్రతిష్ఠచేసి నిరతంబా దైవమున్ భక్తితో
రిప్లయితొలగించండిమదమాత్సర్యములన్ త్యజించి గొలువన్ మండ్రాటముల్ బాపున
య్యదియే మోక్ష కవాటముల్దెరచు భవ్యంబైన నామంబునా
మదిరాపానవిశేషమత్తులకె సన్మానంబు దక్కున్ గదా
రామనామము జపియింప రక్షనిడును
రిప్లయితొలగించండిభక్తిముక్తిదాయకమతి పావనమ్ము
నవ్యమైనదౌ శ్రీరామ నామమనెడు
మదిరఁ గ్రోలు వారలకె సన్మానమబ్బు
తే.గీ:ప్రభువు పండితు డైన చో పండితులకు,
రిప్లయితొలగించండినతడె రసికుడైనంత వేశ్యాంగనలకు,
నతడె త్రాగుబోతైనచో ననుదినమ్ము
మదిరఁ గ్రోలు వారలకె సన్మానమబ్బు
(సింపుల్ గా ఇంతే.)
మ:చదువున్,సభ్యత లేని వారి వలె నీ చాణక్యునిన్,రాజ్యసం
రిప్లయితొలగించండిపద చే మత్తిలి గెంటి వేసెదరె? మీ పాపాల రాజ్యమ్ములో
మదిరాపానవిశేషమత్తులకె సన్మానంబు దక్కున్ గదా!
యిదె నా జేయు ప్రతిజ్ఞ మీ క్షతమె నా కీ జన్మ లో గమ్యమౌ.
(అవమానించ బడిన చాణక్యుడు నందుల సభ లో ఇలా ప్రతిజ్ఞ చేసాడు.)
సంఘ హితమును గోరెడు సామ్య వాది
రిప్లయితొలగించండికవన ముల నల్లు చక్కని కవి వరుండు
మధుర మైనట్టి సాహిత్య మత్తు నొసగు
మధిర గ్రోలు వారల కె సన్మాన మబ్బు
పంచ తారాన్న శాలలోఁ బంచ వలెను
రిప్లయితొలగించండిజలన చిత్ర వీరుల కవశ్యమ్ము సుమ్ము
రాజకీయ నేతల కిల భాజనంబు
మదిరఁ గ్రోలు వారలకె సన్మాన మబ్బు
మద మాత్సర్య గుణోత్కరమ్ము లిల సంప్రాప్తింప నే నాఁటికిన్
మదిరోత్కోచ ధనప్రమోదులకు సంసారఘ్న కాలుష్య వ
న్మదిరా విక్రయ మానవేంద్రులకు నమ్మా చేటు వాటిల్లదే
మదిరా పాన విశేష మత్తులకె సన్మానంబు దక్కున్గదా
[ఇక్కడ సన్మానము నిందార్థమ్మున]