1-9-2025 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సడలె దంతముల్ నమలెఁ బాషాణములను”
(లేదా...)
“దంతము లూడినన్ నమలె దార్ఢ్య కరాళ కఠోర మృణ్మరుల్”
(మృణ్మరుల్ = రాళ్ళు, పాషాణాలు)
(బ్రహ్మశ్రీ వద్దిపర్తి వారి కాశీ శతావధానంలో క్రొవ్విడి వెంకట రాజారావు గారి సమస్య)
తేటగీతి
రిప్లయితొలగించండిభీముఁడుఁజెలఁగి రారాజు పీఁచమడఁచ
నాగ్రహించిన ధృతరాష్ట్రుడమర బొమ్మ
నుక్కు కౌగిట బంధించి తుక్కుఁజేయ
సడలె దంతముల్ నమలెఁ బాషాణములను
ఉత్పలమాల
పంతముఁ బట్టి యూరువుల వ్రయ్యలు జేయఁగ రాజరాజుకున్
బొంతన లేని రాగమున బొమ్మను బట్టియు కౌగిలించుచున్
స్వాంతము నందునన్ రగిలి వాతసుతుండని యాంబికేయుడున్
దంతము లూడినన్ నమలె దార్ఢ్య కరాళ కఠోర మృణ్మరుల్
ఉ.
రిప్లయితొలగించండిపంతము సేతఁ బ్రజ్ఞల నవారిత శక్తిఁ బ్రదర్శనంబులో
స్వాంతమునందుఁ బూనికను వర్ధిల జేయుచుఁ గీర్తికాంక్షతోఁ
జెంతఁ బ్రదర్శకుండు సని జెచ్చర వింతగఁ గాంచుచుండఁ దా
దంతములూడినన్ నమిలె దార్ఢ్య కరాళ కఠోర మృణ్మరుల్ !
సమస్య:
రిప్లయితొలగించండి“దంతము లూడినన్ నమలె దార్ఢ్య కరాళ కఠోర మృణ్మరుల్”
ఉత్పలమాల:
అంతములేని కోరికల నాకలి మీరును పెండ్లి విందులన్
సుంతయు దంత బాధ నిక సూక్ష్మము కట్టుడు దంతమేర్పడన్
సంతసమంది భక్ష్యముల సంబర మంచు భుజించెనే, స్వయం
“దంతము లూడినన్ నమలె దార్ఢ్య కరాళ కఠోర మృణ్మరుల్”
పనికి మాలిన మాటలు పలికి నంత
రిప్లయితొలగించండినిన్ను మడియడ వందురు నిజము సుమ్ము
నెవ్విధిని చెప్పగలవోయి నెవ్వనికట
సడలె దంతముల్ నమలెఁ బాషాణములను.
వింతయదేమి కాంచగను విశ్వమునన్ గన వైద్యశాస్త్రమే
యెంతయొ వృద్ధి జెందెనన నెవ్వరు కాదన లేని సత్యమే
కాంతవయస్సు మీరగను కట్టుడు జంభములన్ భిగింపగా
దంతము లూడినన్ నమలె దార్ఢ్య కరాళ కఠోర మృణ్మరుల్.
2.
పొంతన లేనిమాటలవి మూఢుని వోలె వచింప బోకుమా
దంతములున్న వారలకె దార్ఢ్యపు వస్తువు బాధ పెట్టునే
వింతగ మాటలాడితివి వెఱ్ఱిని కాను కనంగ నెవ్విధిన్
దంతము లూడినన్ నమలె దార్ఢ్య కరాళ కఠోర మృణ్మరుల్.
తెలిపిననుకూడ వినకుండ తినిన గతన
రిప్లయితొలగించండిసడలె దంతముల్ ; నమలెఁ బాషాణములను
తియ్యనగు లడ్డులనుకొని తృప్తితీర ,
తెలుసుకొని తినకుండిన తీట తీరె
వెర్రి పలురకంబులుగద వీక్షసేయ
రిప్లయితొలగించండిచిత్రమౌ చరిత నమోదు చేయ నెంచి
వింత పనులను తలపెట్టె వెర్రియొకడు
సడలె దంతముల్ నమలెఁ బాషాణములను
వింతలు వేనవేలుగద విశ్వమునే పరికించి చూడగా
పంతము పట్టి తానట ప్రపంచ చరిత్ర నమోదు చేయగా
సుంతయు జంకులేని హరి చూపె ప్రసారపు మాధ్యమాలకే
దంతము లూడినన్ నమలె దార్ఢ్య కరాళ కఠోర మృణ్మరుల్
[హరి = మనుష్యుడు]
యుద్ధమందున సమసిరి యోధులెల్ల
రిప్లయితొలగించండినొంటరిగఁ దాను మిగిలి సుయోధనుండు
సిద్ధపడినాడు భీముతో యుద్ధమునకు
సడలె దంతముల్ నమలెఁ బాషాణములను
పంతముతో సుయోధనుఁడు పాండుకుమారులతోడ పోరులో
రిప్లయితొలగించండినంతముగాఁగ బంధుజనులందరు డాఁగె సరోవరమ్ములో
నంతట ద్వంద్వయుద్ధమున నాతని భీముఁడు నేలఁగూల్చె హా!
దంతము లూడినన్ నమలె దార్ఢ్య కరాళ కఠోర మృణ్మరుల్
తే॥ వడలిన సడలినను నేఁడు భయముఁ గనము
రిప్లయితొలగించండిశాస్త్ర శోధనల ఫలము చక్కఁబెట్టె
కొరతలన్ని కట్టుడు పండ్లు కూర్చు కొనెను
సడలె దంతముల్ నమిలె బాషాణములను
ఉ॥ ఎంతయొ మారె జీవితము నిచ్ఛలఁ దీర్చఁగ శాస్త్ర శోధనల్
కొంతయు లేదు లేమి యిట గుండెనె కూర్చఁగ జబ్బు చేసినన్
వింతగఁ జెప్పనేలనొకొ ప్రీతిగ కట్టుడు పండ్ల శక్తితో
దంతము లూడినన్ నమలె దార్ఢ్య కరాళ కఠోర మృణ్మరుల్
నేడు శాస్త్ర శోధనల సౌలభ్యము వలన అన్నీ సాధ్యమేనండి. కానీ శాస్త్రాన్ని అవహేళన చేస్తారు. మంతెన గారి విధానము సంగతి నాకు తెలియదు డా॥ ఖాదర్ వలీ విధానము ఉపయుక్తమే నండి.
క్రమాలాంకారంలో ---
రిప్లయితొలగించండివయసు మీరగ జరుగు న వ స్థ యేది?
మంచి పరువాన నున్నట్టి మనుజు డిలను
జేయు నేమిటి నోటితో చెప్పు కొనుడు?
సడలె దంత ము ల్ :: నమిలె బాషాణ ములను
తే.గీ:ముసలి తనమున నెలుకకు ముదము లేదు
రిప్లయితొలగించండిభుక్తియే లేక విలవిల బోవుచుండె
సడలె దంతముల్, నమలెఁ బాషాణములను
చిన్న తనమున బలము తో చెలగి పోయి.
ఉ:"దంతము లూడ మంత్రములు తప్పును 'చేతబడుల్ ఫలించ "వం
రిప్లయితొలగించండిచెంతయు హింస వెట్టి సడలింపగ నాతని దంతముల్" కటా!
"దంతము లూడినన్ నమలె దార్ఢ్య కరాళ కఠోర మృణ్మరుల్,
వింత" యటంచు బోల్చ చదివెన్ కఠినమ్మగు క్షుద్రమంత్రముల్.
(చేత బదులు చేసే వాళ్లకి పళ్లు ఊడ గొడితే మంత్రాలు తప్పి విఫల మౌతా యని పూర్వ కాలం లో అలాంటి వాళ్లని పళ్లు ఊడగొట్టే వాళ్లు.అలా ఒకడికి ఊడగొట్టినా వాడు రాళ్లు నమిలిన పోలిక గా కష్ట మైన మంత్రాలు చదువుతూనే ఉన్నాడు.)
తమకుఁ దోఁచదు చెప్ప నితరులు వినరు
రిప్లయితొలగించండిమూర్ఖ జనుల రంజింప లేము ధర లోన
వల దనుచు నెంత చెప్పినఁ జలము తోడ
సడలె దంతముల్ నమలెఁ బాషాణములను
పంతము నూని చంపె రిపు పక్ష విరాజిత వీర వర్యులన్
వంత యెఱుంగ కింద్ర వర పౌత్రుఁ డహో కపటంపు టాజిలో
నంతము సేయ వాజులఁ బరాలి స సారథి తేరు తోడుతన్
దంతము లూడినన్ నమలె దార్ఢ్య కరాళ కఠోర మృణ్మరుల్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
ఊరువుల గొట్టి భీముడు నుక్కడంచ
రాజరాజును, విని ధృతరాష్ట్రుడంత
నాగ్రహమున భీముని బొమ్మ నచట నుక్కు
కౌగిలి బిగించి నుసి నుసిగ యొనరించ
సడలె దంతముల్ నమలెఁ బాషాణములను.