తే.గీ:అన్ని మతముల సార మై యలరు హిందు మతము దెగ నాడి,యా బాల్య మతము బట్టి కల్కిరూపుని నిందించి,గండి గొట్టి తిరుమలకు, "మార్గ మిది" యని తెలుప నఘము” (వివెకానందుదు చెప్పినట్టు అన్ని మతాల సార మైన హిందూమతం ఉండగా ఏదో విదేశీ మతాన్ని తెచ్చి "ఇదే మార్గం" అంటూ తిరుమలకు గండి కొట్టే ప్రయత్నం ఒక పాపం.ఆ విదేశీ మతాన్ని కూదా నేను అవమానించ లేదు.అది చిన్న పిల్లల మతం అన్నాను.ఎలిమెంటరీ రెలిజియన్.)
చం:పరము,నిహమ్ము దెల్పు మన భారతధర్మము వీడి, యేదియో పరమతపుస్తక మ్మొకటి బట్టి విదేశమతంపు పెంపు కై పరుషపు రీతి వ్యాఖ్యలను బల్కుచు ,"పాపము నిచ్చు నయ్య మీ తిరుమల", మార్గ మిద్దియని తెల్పినవారల కబ్బుఁ బాపముల్ (తిరుమల మొదలైన చోట్ల విగ్రహారాథనలు పాపం అంటూ ఏదో పుస్తకం పట్టుకొని ఎవరు మాట్లాడతారో వారికీ పాపం చుట్టుకొంటుంది.)
తేటగీతి
రిప్లయితొలగించండినడక దారిని భక్తులు నమ్ముకొనుచు
శ్రీనివాసుని దర్శింప చేరినంత
చిరుత సంచారమున్ గూర్చి చెప్పకుండ
తిరుమలకు మార్గ మిది యని తెలుప నఘము!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిచంపకమాల
తొలగించండివరదుని నమ్మి మ్రొక్కులను భక్తియుతంబుగఁ దీర్చు నిష్ఠతో
తరలఁగ వేంకటేశ్వరుని దర్శనమెంచుచు కాలి బాటలో
గురుతులుఁ జెప్పుచున్ చిరుత గూర్చిన వార్తలఁ బూసగ్రుచ్చకే
తిరుమల మార్గ మిద్దియని తెల్పినవారల కబ్బుఁ బాపముల్!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచ.
రిప్లయితొలగించండిసురవర సంఘ నిర్భర విశుద్ధ మహత్సుకృత ప్రదంబునై
పరగెడిదా ధరాధరము, పాడొనరించెడి దుష్ట కోటికిన్,
దొరలని హెచ్చి సంపదల దోచి పవిత్రత ద్రుంచు వారికిం
దిరుమల మార్గమిద్దియని తెల్పిన వారల కబ్బు బాపముల్ !
తే॥ కాలి బాటను చనుచుండఁ గష్ట మనక
రిప్లయితొలగించండిమార్గ మధ్యమందున దారి మరచి యడుగఁ
దప్పు పథమును గొప్పగ మెప్పుఁ బడయఁ
దిరుమలకు మార్గ మిదియని తెలుప నఘము
చం॥ అరుగుచు నుండ భక్తిఁ గని యార్ద్రత మీరఁగఁ గాలి బాటలన్
ద్వరపడి మార్గమధ్యమున దారినిఁ దప్పఁగ భీతి నొందుచున్
గరములఁ జోడ్చి చూపుమన గమ్యముఁ జేర్చు పథమ్ముఁ దప్పుగన్
దిరుమల మార్గ మిద్దియని తెల్పిన వారల కబ్బుఁ బాపముల్
రిప్లయితొలగించండిధారుణి సమస్తము తమమతమ్ము నికను
వ్యాప్తి జేయదలంచెడి వారలడగ
నేమి ధర్మ రక్షణ కయి యిల నిలిచిన
తిరుమలకు మార్గ మిది యని తెలుప నఘము.
ధరణిని స్వార్థ చిత్తమున ద్రవ్యము పంచుచు హిందు ధాత్రిలో
పరమత వ్యాప్తి కోసమయి పంతము బూనుచు పట్టణమ్ములున్
పురములవెన్నియో తిరిగి మోసపు మాటలు చెప్పు వారికిన్
తిరుమల మార్గ మిద్దియని తెల్పినవారల కబ్బుఁ బాపముల్.
ముఖము గనబడకుండగ మూర్ధజమును
రిప్లయితొలగించండిబెంచిన యువనుగని , నేటి విధమదియని
దెలియకుండి వానికి మొక్కు దీర్చుగొనగ
దిరుమలకు మార్గ మిది యని తెలుప నఘము
ధార్మిక పరిపాలనమున తనివి తీర
రిప్లయితొలగించండిధర్మ కర్తల మండలి ధన్యమనగ
పరమతావలంబులఁదెచ్చి పదవినొసగి
తిరుమలకు మార్గ మిది యని తెలుప నఘము
స్మరణను ధర్మకర్తలను మండలి కెంపిక చేయ నెంచుచున్
బరమత సంప్రసాదమున భాసిలి హైందవ శాస్త్ర ధర్మమున్
మరచిన వారలంబిలిచి మండలిలోనియమించి వారికిన్
దిరుమల మార్గ మిద్దియని తెల్పినవారల కబ్బుఁ బాపముల్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినిరతము పాపపుంపనులు నీతిని వీడి యొనర్చువారికిన్
తొలగించండిపరమము లేడు లేడనచు వాదములాడుచు నుండువారికిన్
నరులను నూలుకొల్పుచును నాస్తిక వాదము పెంచు వారికిన్
తిరుమల మార్గమిద్దియని తెల్పిన వారల కబ్బు బాపముల్
తెలిసి తెలియని వానిని తెరువు నడుగ
రిప్లయితొలగించండివక్ర మార్గము తెలుప గ వ్యథ లు చెంది
నడచి బడలియు నడు గగ నవ్వు చనియె
' తిరుమల కు మార్గమిది యని తెలుప నఘము '"
రిప్లయితొలగించండితిరుమల వేంకటేశ్వరుని దివ్యనివాసము పుణ్యధామమే
పరమతమున్ ప్రసర్పణము పన్నుగ సల్పగ వేంకటాద్రిపై
దొరఁకొనిపోవు తెంపరులతో జతగూడి దురాగతమ్ముగా
తిరుమల మార్గ మిద్దియని తెల్పినవారల కబ్బుఁ బాపముల్
కోరి కుమతులు తిరుమల కొండపైన
రిప్లయితొలగించండిపరమతమ్మును పచరించు తలపుతోడ
దారి తెన్నులు తెలుపఁగ గోరినంత
తిరుమలకు మార్గ మిది యని తెలుప నఘము
తే.గీ:అన్ని మతముల సార మై యలరు హిందు
రిప్లయితొలగించండిమతము దెగ నాడి,యా బాల్య మతము బట్టి
కల్కిరూపుని నిందించి,గండి గొట్టి
తిరుమలకు, "మార్గ మిది" యని తెలుప నఘము”
(వివెకానందుదు చెప్పినట్టు అన్ని మతాల సార మైన హిందూమతం ఉండగా ఏదో విదేశీ మతాన్ని తెచ్చి "ఇదే మార్గం" అంటూ తిరుమలకు గండి కొట్టే ప్రయత్నం ఒక పాపం.ఆ విదేశీ మతాన్ని కూదా నేను అవమానించ లేదు.అది చిన్న పిల్లల మతం అన్నాను.ఎలిమెంటరీ రెలిజియన్.)
చం:పరము,నిహమ్ము దెల్పు మన భారతధర్మము వీడి, యేదియో
రిప్లయితొలగించండిపరమతపుస్తక మ్మొకటి బట్టి విదేశమతంపు పెంపు కై
పరుషపు రీతి వ్యాఖ్యలను బల్కుచు ,"పాపము నిచ్చు నయ్య మీ
తిరుమల", మార్గ మిద్దియని తెల్పినవారల కబ్బుఁ బాపముల్
(తిరుమల మొదలైన చోట్ల విగ్రహారాథనలు పాపం అంటూ ఏదో పుస్తకం పట్టుకొని ఎవరు మాట్లాడతారో వారికీ పాపం చుట్టుకొంటుంది.)
ఏడు కొండల నెక్కంగ నెంచి మదిని
రిప్లయితొలగించండిసాగుభక్తజనాళికి చక్కగా ను
తిరుమలకు మార్గ మిది యని తెలుప నఘము”*
లెల్ల తొలగుటనిజమందురిలనుబుధులు
పరమ పవిత్ర క్షేత్రమిదిభక్తులు బాట నుతప్పగావడిన్
కరుణను చూపి వారలను గమ్యము వైపు మరల్చి నంతనిన్
మరువక దల్చుచుందురిల,మద్యము గ్రోలుచు సాగువారికిన్
*“తిరుమల మార్గ మిద్దియని తెల్పినవారల కబ్బుఁ బాపముల్”*
తేటగీతి:
రిప్లయితొలగించండినిగరపు మతమార్పిడులకై నిరతముయెడ
తెగని రీతి వితతిఁజేసి తెలివిఁదిరువు
ముష్కరులకు దుర్మతులకు మూఢ తతికి
తిరుమలకు మార్గమిదియని తెలుప నఘము!!
మానవత్వము సూపింప మానకుండఁ
రిప్లయితొలగించండిబరుల కుపకార మొనరింపఁ బాతకమ్మె
యెఱుక లేక తన్నడిగిన నేల కల్గుఁ
దిరుమలకు మార్గ మిది యని తెలుప నఘము
గిరలు నిజమ్ము లివ్వి పరికింప నొసంగును బెక్కు బాధలం
బరులకుఁ దల్ప హాని హరి వారికిఁ జూపుచు నన్య దిక్కునుం
గరుణను వీడి దర్శన విఘాత మొనర్పఁగ వక్ర బుద్ధితోఁ
దిరుమల మార్గ మిద్ది యని తెల్పిన వారల కబ్బుఁ బాపముల్
3)తే గీ:దారి దప్పితి మయ్య! నీ దయను జూపు
రిప్లయితొలగించండిహాస్య మాడుట న్యాయమా!అజ్ఞులమని
"తిరుమలకు మార్గ మిది" యని తెలుప నఘము
బొంద వయ్య చూపిన నబ్బు బుణ్య మయ్య!
(ప్రయాణసౌకర్యాలు లేని రోజులు.కొందరు తిరుపతికి దారి తప్పి అదుగుతుంటే ఎవడో హాస్య మాడుతుంటే వీళ్లు వాడిని దారి చూపి పుణ్యం కట్టుకో మని అర్థిస్తున్నారు.)
సమస్య:
రిప్లయితొలగించండితిరుమల మార్గమిద్దియని తెల్పినవారల కబ్బుఁ బాపముల్ "
చం .మా :
తిరమగు బుద్ధి లేదు, మరి, తీరగు యోచన, లేదు లేదులే
కరముల మోడ్చి మ్రొక్కుటయ, కాని పనంచును, తప్పు తప్పనున్
తరగని పాపముల్, మితిని దాటిన ద్రవ్యపు కాంక్ష, వానికిన్
తిరుమల మార్గమిద్దియని, తెల్పినవారల, కబ్బుఁ బాపముల్ "
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
నడక దారేది చూపుమనంగ వారు
కొంత దూరము వారితో కూడి నడచి
తిరుమలకు మార్గమిదియని తెలుప నఘము
తొలగు దేవుని దీవెనల్ గలుగునయ్య.