2, అక్టోబర్ 2025, గురువారం

సమస్య - 5262

3-10-2025 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“యత్నమ్మొనరింప ఫలిత మందదు సుమ్మీ”
(లేదా...)
“యత్నముఁ జేసినన్ ఫలితమంద దటంచు వచింత్రు సజ్జనుల్”

20 కామెంట్‌లు:

  1. ఉ.
    రత్న చయంబు లంబుధిని లాలిత రీతిని దాగు పోలు నీ
    నూత్న మహత్తర ప్రతిభ, నోదము గూర్చెడి శక్తి గుండెలో
    రత్నములై యథేచ్ఛగ విరాజిలు గెల్పును జేరు, చిన్నదౌ
    యత్నము జేసినన్ ఫలితమంద దటంచు వచింత్రు సజ్జనుల్ !

    రిప్లయితొలగించండి
  2. రత్నములన మక్కువగల
    రత్నావతి భర్తతోడ రణమును సలుపన్
    రత్నములిడి వేడుకొనెడి
    యత్నమ్మొనరింప ఫలిత మందదు సుమ్మీ

    రిప్లయితొలగించండి
  3. హత్నువు తో బాధపడుచు
    రత్నము లను బోలు మాటలను తెలిపెను తా
    పత్నికి యిష్టము లేక ప్ర
    యత్నమ్మొనరింప ఫలిత మందదు సుమ్మీ.


    హత్నువు తోడబాధపడు నాతడు మంద స్వరమ్ము తోడ తా
    రత్నము లంటి మాటలను శ్రద్ధగ నూకొను మంచు చెప్పెనే
    పత్నికి చిత్తశుద్ధియును బాధ్యత లేకనె నామ మాత్రమున్
    యత్నముఁ జేసినన్ ఫలితమంద దటంచు వచింత్రు సజ్జనుల్.

    రిప్లయితొలగించండి
  4. కందం
    అత్నమునఁ గృష్ణుఁ జూడా
    రత్నము గొన పాండు సుతుల ప్రాభవమొప్పెన్!
    నూత్నమె? దైవముఁ బడయక
    యత్నమ్మొనరింప ఫలిత మందదు సుమ్మీ!

    ఉత్పలమాల
    అత్నమనంగ నర్జునుడు నార్తిని యాదవ వంశజాతమౌ
    రత్నమనంగ కృష్ణుఁగొని రంజిలఁ గెల్చెను గీత బోధలన్
    నూత్నము లేదు లేదు కద? నోచిన దైవమనుగ్రహింపకే
    యత్నముఁ జేసినన్ ఫలితమంద దటంచు వచింత్రు సజ్జనుల్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సమస్య - 5262
      3-10-2025 (శుక్రవారం)
      కవిమిత్రులారా,
      ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
      *“యత్నమ్మొనరింప ఫలిత మందదు సుమ్మీ”*
      (లేదా...)
      *“యత్నముఁ జేసినన్ ఫలితమంద దటంచు వచింత్రు సజ్జనుల్”*


      కందం
      అత్నమునఁ గృష్ణుఁ జూడా
      రత్నము గొన పాండు సుతుల ప్రాభవమొప్పెన్!
      నూత్నమె? దైవముఁ బడయక
      యత్నమ్మొనరింప ఫలిత మందదు సుమ్మీ!

      ఉత్పలమాల
      అత్నమనంగ నర్జునుడు నార్తిని యాదవ వంశజాతమౌ
      రత్నమనంగ కృష్ణుఁగొని రంజిల గెల్చెను గీత బోధలన్
      నూత్నము లేదు లేదు కద? నోచిన దైవమనుగ్రహింపకే
      యత్నముఁ జేసినన్ ఫలితమంద దటంచు వచింత్రు సజ్జనుల్!

      తొలగించండి
  5. కం॥ పత్ని కరపంగ పథమును
    గృత్నుని వోలె పరఁగఁ దగు కిటుకు తెలియకన్
    నూత్న విధమ్ముల నరయక
    యత్నమ్మొనరింప ఫలిత మందదు సుమ్మీ

    ఉ॥ పత్ని యొసంగ సూచనలు పాటవ మొప్పఁగ సిద్ధిఁ గోరుచున్
    నూత్న విధమ్ము లెన్నుచును నమ్మి శ్రమమ్మును నెల్లవేళలన్
    గృత్నుని వోలె సాగఁ గనుఁ గీర్తినిఁ బద్ధతిఁ గానకున్నచో
    యత్నముఁ జేసినన్ ఫలితముండ దటంచు వచింత్రు సజ్జనుల్

    కృత్ను నైపుణ్యంగా పనిచేయువాడు

    రిప్లయితొలగించండి
  6. అత్నము గెల్చుట కై తగు
    యత్నము సల్పంగ ఫలిత మందును గదరా
    హత్నువు పై శ్రద్ధ విడిచి
    యత్నమ్మొనరింప ఫలిత మందదు సుమ్మీ

    అత్నము గెల్వనెంచి తగు యత్నమొనర్చుటపేక్షనీయమే
    హత్నువు లేక సల్పిన ప్రయత్నము తెచ్చునె కార్యసిద్ధినే
    రత్నము వంటి బంటు రణ రంగము నందున శ్రద్ధ శూన్యమౌ
    యత్నముఁ జేసినన్ ఫలితమంద దటంచు వచింత్రు సజ్జనుల్

    [అత్నము = యుద్ధము; హత్నువు - ఆయుధము]

    రిప్లయితొలగించండి
  7. హత్నము పుట్టి పెద్దకును హానిని చేయగ తగ్గరానిదై
    నూత్నపు మందులిచ్చినను నోముల వెన్ని గృహంబు నందునన్
    పత్నియు నోముకున్న భగవంతు కటాక్షము లేక తీవ్రమౌ
    యత్నము జేసినన్ ఫలితమందదటంచు వచింత్రు సజ్జనుల్

    రిప్లయితొలగించండి
  8. కం:రత్నమ్మో!బొగ్గో!ఒక
    పత్ని లభించినది యామె భావము లందున్
    నూత్నము నేదో తెచ్చెడు
    యత్నమ్మొనరింప ఫలిత మందదు సుమ్మీ”
    (ఒక సారి కట్టుకున్నాక అనుభవించాలి కానీ మార్చా లనే ప్రయత్నం ఫలించదు.)

    రిప్లయితొలగించండి
  9. యత్నము జేయుట మంచి దె
    యత్నము వలనను సఫ లత లందును జగతిన్
    యత్నము సరి కాని యెడ ల
    యత్నమ్మొ నరిo ప ఫలితమందదు సుమ్మీ!

    రిప్లయితొలగించండి
  10. (2)ఉ:"రత్నము లెన్నియో కలిగి రాజిలు సంస్కృతి చెంద భ్రష్టతన్
    యత్నము జేయ నిల్పుటకు నా పని నచ్చని వార లెవ్వరో
    "యత్నముఁ జేసినన్ ఫలితమంద" దటంచు వచింత్రు, సజ్జనుల్
    యత్నము మాన రెన్నడు గృతార్థత జెందిన,జెందకుండినన్.
    (మన సంస్కృతి నాశన మైంది,బాగు చెయ్యాలని ప్రయత్నిస్తే అది సాధ్యం కాదని కొందరన్నప్పటికీ సజ్జనులు యత్నాన్ని మానరు.అది ఫలించినా,ఫలించకున్నా చేస్తూనే ఉంటారు.)

    రిప్లయితొలగించండి
  11. రత్నమును సానవెట్టు ప్ర
    యత్నమ్మున ఫలముగలుగు వ్యర్థమ్మౌగా
    రత్నమ్మనుకొని ఱాయిని
    యత్నమ్మొనరింప ఫలితమందదు సుమ్మీ

    రిప్లయితొలగించండి
  12. రత్నము సానబెట్టనది రాజిలు రంగుల కాంతులీనుచున్
    యత్నముచేయ ఱాయిగొని యాతతనిష్ఠను సానబెట్టగన్
    రత్నముగా నొనర్చ విఫలమ్ము, వృధాశ్రమగాన నవ్విధిన్
    యత్నముఁ జేసినన్ ఫలితమంద దటంచు వచింత్రు సజ్జనుల్

    రిప్లయితొలగించండి
  13. కం॥
    యత్నము బలితము గావలె
    రత్నాంబుధినైననీది రహినేబడయన్
    హత్నువు సోకనెద వడికి,
    యత్నమ్మొనరింప ఫలిత మందదు సుమ్మీ!!

    (హత్నువు: రోగము
    వడి: బలిమి)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. "రత్నాకరమైన నీది రహినే బడయన్" అని రెండవ పాదాన్ని చదువ ప్రార్థన

      తొలగించండి
  14. కృత్ను వడరి చండస్తన
    యిత్ను నిభ ముఱుముచుఁ జేయ నెంచిన మదినిన్
    హత్ను వయినఁ దా నెంతటి
    యత్నమ్మొనరింప ఫలిత మందదు సుమ్మీ

    [కృత్నువు = నేర్పరి; స్తనయిత్నువు = ఉఱుము; హత్నువు = హంత]


    రత్న నిభమ్ము యోచనల రమ్యతరం బిది యంచు నెంచుచుం
    బత్ని విచార సంచయము భగ్న మొనర్చి యగౌరవమ్ముగన్
    నూత్న విధాన హీనము మనో వనజమ్మునఁ దాండవింపఁగా
    యత్నముఁ జేసినన్ ఫలిత మంద దటంచు వచింత్రు సజ్జనుల్

    రిప్లయితొలగించండి

  15. కృత్రిమ మేధ ప్రాముఖ్యము, వాటి పరిశోధనలు పెరుగుతున్న నేపథ్యం తీసుకుని పూరించాలనే పట్టుదలతో నా ఈ ప్రయత్నము.
    "త్న" ప్రాస చాలా ఇబ్బంది పెట్టింది. "హత్నువు" అనగ చంపువాడు అని అర్ధం.

    ఉత్పలమాల.
    రత్నపు మేలిరాయి పెను రక్కసి బండగ మారినట్లుగన్
    హత్నువు అవ్వునే కృతకమైన సుమేధయు జాగరూకతన్
    నూత్నపు శోధనల్ సలుప నుండనవశ్యము నట్లుగానిచో
    యత్నముఁ జేసినన్ ఫలితమంద దటంచు వచింత్రు సజ్జనుల్!

    రిప్లయితొలగించండి

  16. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    యత్నము వలయును పనికిన్
    యత్నమ్మున్ననె ఫలితము నందగ వచ్చున్
    నూత్న విధానము నరయక
    యత్నమ్మొనరింప ఫలిత మందదు సుమ్మీ!

    రిప్లయితొలగించండి
  17. రత్నము వలయునటంచును
    నూత్నంబౌ బాటపట్ట నొప్పి తె మిగులున్
    పత్నియు కోరెననివిఫల
    *“యత్నమ్మొనరింప ఫలిత మందదు సుమ్మీ”*



    రత్నము వంటికొల్వుయును రాగము పంచెడి జీతమున్ ధరన్
    యత్నము చేసినన్ ఫలిత మంద దటంచు వచింత్రుసజ్జనుల్
    యత్నమువీడకన్ మరల యత్యధికంబగు శ్రద్ధతోడుతన్
    యత్నముచేయచున్ననిక యందును సత్ఫల మందురే బుధుల్


    రిప్లయితొలగించండి