ఉ:బారుగ నుండి మద్యములు పారిన యా భవనమ్ము నందు నా బారును మూసి వేసి, రట భారత సంస్కృతి నిల్చె, మాయమౌ బారున నృత్యమున్ సలిపె భారతి సత్కవులెల్ల మెచ్చఁగన్ "దీరగు కూచిపూడి"దని,తీర్చుచు సత్కవి గోష్టు లెన్నియోన్. (ఒకప్పుడు డది బార్.దాన్ని మూసేశారు.అక్కడ భారతి అనే అమ్మాయి కూచిపూడి నృత్యం చేసింది.కవులు మెచ్చారు.కవితా గోష్టులు చేసారు.)
సమస్య: బారున నృత్యమున్ సలిపె భారతి సత్కవులెల్ల మెచ్చఁగన్ భారతి అంటే సరస్వతి అనే అర్ధం వుంది. సరస్వతి పద్యము లాగ నా మదిలో పారింది అని నా పూరణాప్రయత్నం. కోరిక గల్గ ఇడ్లివడ కూటమి నింపుగ మేలిమైన సాం బారున నృత్యమున్ సలిపె భారతి సత్కవులెల్ల మెచ్చఁగన్ నే రుచి చూడగన్ అమరెనే మృదు పద్యపు రూపమై రసా ధారిత మానసంబునకు ధాత్రిన సర్వము కావ్యవస్తువే!
కందం
రిప్లయితొలగించండితీరిరి కవులున్ గంగా
తీరమ్మున విశ్వనాథ తీర్థమునందున్
భూరిగ వారల కవనపు
బారున నృత్యమును సలిపె భారతి వేడ్కన్!
ఉత్పలమాల
తొలగించండితీరిరి కోవిదుల్ శివుని తీర్థమనంగను కాశికాపురిన్
భూరిగ సాహితీ పచన భోజ్యము గైకొని పద్యవిద్యలో
వారల పాటవమ్ములను పంచెడు సత్కవనంపువేడ్కలన్
బారున నృత్యమున్ సలిపె భారతి సత్కవులెల్ల మెచ్చఁగన్
ఉ.
రిప్లయితొలగించండిభూరి మహా ప్రతాపుడయి పూర్ణ శశాంకుని పోలు కీర్తితో
మీఱెడి కృష్ణరాయలట మేల్కవితల్ వినిపింప చక్కనౌ
తీరున వాక్స్వురూపమున తెల్లని కాంతులు నింపి యింపు ద
ర్బారున నృత్యమున్ సలిపె భారతి, సత్కవులెల్ల మెచ్చగన్ !
తీరుగ భువనవిజయమున
రిప్లయితొలగించండిజేరిరి కవివరులు కొలువు సేయఁగ విభుఁడే
వారల నలరింపఁగ ద
ర్బారున నృత్యమును సలిపె భారతి వేడ్కన్
రిప్లయితొలగించండివారష్టదిగ్గజ కవులు
జోరుగ పాండిత్య ప్రతిభ జూపుచు నచటన్
భూరిగ జెప్పెడి కవనపు
బారున నృత్యమును సలిపె భారతి వేడ్కన్.
చేరికవీంద్రులెల్ల నట శ్రేష్ఠుని మెప్పును పొందనెంచుచున్
వారలు సత్కవిత్వమును పాటవమొప్పగ చెప్పుచుండ స
త్సారుల గానమాధురికి దండుడు తన్మయు డయ్యె గాంచ ద
ర్బారున నృత్యమున్ సలిపె భారతి సత్కవులెల్ల మెచ్చఁగన్.
నీరజజన్ముని కొలువున
రిప్లయితొలగించండితారసపడు భక్తుల గని తన్మయమొందన్
నేరుగ నచ్చట జేరిన
బారున నృత్యమును సలిపె భారతి వేడ్కన్
తీరుగ కృష్ణరాయని నుతించుచు రాజసభాస్థలమ్మునన్
రిప్లయితొలగించండిజేరిరి కావ్యగానమును సేయఁగ సత్కవివర్యులత్తరిన్
వారి మనోవికాసమును వావిరి గూర్చఁగనెంచి రాజద
ర్బారున నృత్యమున్ సలిపె భారతి సత్కవులెల్ల మెచ్చఁగన్
జోరుగ నుత్పల మాలిక
రిప్లయితొలగించండిధీరుడు పెద్దన వచింప దిగ్గజ వరుడై
భూరిగ కృష్ణ నృపతి ద
ర్బారున నృత్యమును సలిపె భారతి వేడ్కన్
కోరగ కృష్ణ భూవరుడు కోవిదులే కొలువైన తావునన్
హోరున సత్వరంబునొక యుత్పల మాలిక సంస్కృతాంధ్రముల్
చేరిక తోడ పెద్దన వచింపగ భూపతి కృష్ణ రాయ ద
ర్బారున నృత్యమున్ సలిపె భారతి సత్కవులెల్ల మెచ్చఁగన్
బారున నాట్యము సేయగ
రిప్లయితొలగించండిభారతి వేతనము గొనుచు పరగుచు నుండ న్
జేరియు ప్రతి రాత్రియు నా
బారున నృత్యమును సలి పె భారతి వేడ్కన్
మేరు నగంబు సన్నిభుడు మిక్కిలి శూరుడు కృష్ణ రాయుడే
రిప్లయితొలగించండిహారతి పట్టుచున్ కవుల హ్లాదము తోడుత గౌరవించగన్
పేరిమి జూపుచున్ దిశల వెల్గులు చిమ్ముచు మేటి రాజ ద
ర్బారున నృత్యమున్ సలిపె భారతి సత్కువు లెల్ల మెచ్చగన్
కం:తీ రగు పాటలు వ్రాయగ
రిప్లయితొలగించండినా రసికుం డైన కవికి నవసరమంచున్
బీ రొసగగ నిర్మాతలు
బారున నృత్యమును సలిపె భారతి వేడ్కన్”
ఉ:బారుగ నుండి మద్యములు పారిన యా భవనమ్ము నందు నా
రిప్లయితొలగించండిబారును మూసి వేసి, రట భారత సంస్కృతి నిల్చె, మాయమౌ
బారున నృత్యమున్ సలిపె భారతి సత్కవులెల్ల మెచ్చఁగన్
"దీరగు కూచిపూడి"దని,తీర్చుచు సత్కవి గోష్టు లెన్నియోన్.
(ఒకప్పుడు డది బార్.దాన్ని మూసేశారు.అక్కడ భారతి అనే అమ్మాయి కూచిపూడి నృత్యం చేసింది.కవులు మెచ్చారు.కవితా గోష్టులు చేసారు.)
కం॥ ధారణ తోడ వధానము
రిప్లయితొలగించండితీరుగ సంపూర్ణమైనఁ దృప్తిఁ బడయఁగన్
జేరిన కవులెల్లరు ద
ర్బారున నృత్యమును సలిపె భారతి వేడ్కన్
ఉ॥ ధారణతో వధానమటు ధన్యతఁ గాంచుచుఁ బూర్తి గాఁగ నో
రార కవీశ్వరుండచట రమ్యత మీరఁగఁ బాడఁ బద్యముల్
తీరగు వేడ్కనొందఁగను దృప్తిగ నాట్య మయూరి తాను ద
ర్బారున నృత్యమున్ సలిపె భారతి సత్కవులెల్ల మెచ్చఁగన్
భారతి నర్తకి పేరండి
కం॥
రిప్లయితొలగించండిచారు కవితా సమీరము
సారమరంద రసనంపు సమ్మదమీయన్
సౌరగు భువన విజయ ద
ర్బారున నృత్యమును సలిపె భారతి వేడ్కన్!!
గారాబు పట్టి యా కల
రిప్లయితొలగించండివారి కొమరిత ముదము కొలుపంగ నిలువగా
మూరి జను లెల్లరు నచట
బారున నృత్యమును జలిపె భారతి వేడ్కన్
[బారు = వరుస]
వారిజ నేత్ర వారిజ నిభద్యుతి లబ్ధ నిజాస్య ప్రీతిమైఁ
దీరుగ సత్కళా ప్రతిభ తేటపడంగ సభాస్థలమ్మునన్
భారతి పేరు పెట్టుకొని పండిత పామరు లున్న యట్టి యా
బారున నృత్యమున్జలిపె భారతి సత్కవు లెల్ల మెచ్చఁగన్
[బారు = సమూహము]
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసమస్య: బారున నృత్యమున్ సలిపె భారతి సత్కవులెల్ల మెచ్చఁగన్
రిప్లయితొలగించండిభారతి అంటే సరస్వతి అనే అర్ధం వుంది. సరస్వతి పద్యము లాగ నా మదిలో పారింది అని నా పూరణాప్రయత్నం.
కోరిక గల్గ ఇడ్లివడ కూటమి నింపుగ మేలిమైన సాం
బారున నృత్యమున్ సలిపె భారతి సత్కవులెల్ల మెచ్చఁగన్
నే రుచి చూడగన్ అమరెనే మృదు పద్యపు రూపమై రసా
ధారిత మానసంబునకు ధాత్రిన సర్వము కావ్యవస్తువే!
సమస్య
రిప్లయితొలగించండిబారున నృత్మమున్ సలిపె భారతి సత్కవులెల్ల మెచ్చగన్!!
ఉ.మా :
కూరిమి దేవరాయలును గూర్చెను మేటి కవీంద్రులం సభన్
తీరుగ సాలభంజికల తీరున నిల్పెను భోజరాజునే
గారవ భక్తినిన్ గొలిచి గాథల నిల్చిన వారి క్షేత్ర యం
బారున నృత్మమున్ సలిపె భారతి సత్కవులెల్ల మెచ్చగన్!!
(క్షేత్రము= పొలము, అంబారు= ధాన్యపురాశి)
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
చేరిరి దిగ్గజ కవులున్
వారల పాండిత్య ప్రతిభ వ్యక్తము చేయన్
పారగ కవితా ఝరి ద
ర్బారున నృత్యమును సలిపె భారతి వేడ్కన్.
తీరుగ విరించి చెంతను
రిప్లయితొలగించండిచేరుచు కవితలనుగనుచు సేసల నిడుచున్
కూరిమి తోడను నాద
*"ర్బారున నృత్యమును సలిపె భారతి వేడ్కన్”*
ధారణతోవధానితన దక్షత చాటగ గాంచుపండితుల్
తీరుగ మెచ్చుచుండగను దేవత లెల్లరు ప్రస్తుతించగన్
జేరుచు జెంతకున్ దనదు చేతను నున్న విపంచి మీటి ద
ర్బారున నృత్య మున్ సలిపె భారతి సత్కవు లెల్లమెచ్చగన్