6, అక్టోబర్ 2025, సోమవారం

సమస్య - 5266

7-10-2025 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తిట్టుటయె మేలు సభలఁ బ్రతిష్ఠఁ గొనఁగ”
(లేదా...)
“తిట్టి ప్రతిష్ఠఁ గైకొన మదిం దలపోసెడివాఁడె విజ్ఞుఁడౌ”

9 కామెంట్‌లు:

  1. తేటగీతి
    రాజకీయమునందున రచ్చకెక్కి
    వార్తలందున నిత్యము వరలనెంచ
    వైరిపక్షము వారల చోరులంచు
    తిట్టుటయె మేలు సభలఁ బ్రతిష్ఠఁ గొనఁగ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సమకాలీన రాజకీయ రంగంలో నడిచే సరళి:

      ఉత్పలమాల
      రట్టొనరించి సర్వమును రాణకు నెక్కుటె రాజకీయమై
      గిట్టని వైరిపక్షమును గిల్లుచు గీరుచు వార్తలందునన్
      దిట్టగ నిత్యమున్ వరలు ధ్యేయమె స్ఫూర్తిగ నేరగాళ్లుగన్
      తిట్టి ప్రతిష్ఠఁ గైకొన మదిం దలపోసెడివాఁడె విజ్ఞుఁడౌ

      ✍️ *గుండా వేంకట సుబ్బ సహదేవుడు*

      తొలగించండి
  2. ఎన్నిక ల యందు వ్యతిరేక మున్న వారి
    లోటు పాట్లను చెప్పుచు ఘాటు గాగ
    సల్పు విమర్శ యోట్లకు సహ క రింప
    తిట్టుట యె మేలు సభల ప్రతి ష్ట గొన గ

    రిప్లయితొలగించండి
  3. మట్టిని నమ్మి బీజములు మాటుగ నేలన నాటినంతటన్
    పొట్టను చీల్చి పైరుగను భూమి ఫలంబును జూపు కాపుకున్
    పొట్టలు నింపు వాడుగద భూతలమందున సాగు జేయు రై
    తిట్టి ప్రతిష్ఠఁ గైకొన మదిం దలపోసెడివాఁడె విజ్ఞుఁడౌ!!


    రైతు + ఇట్టి = రైతిట్టి

    రిప్లయితొలగించండి
  4. ఉ.
    ఎట్టి క్షణంబు నిశ్చలత నెన్నడు వీడని వాడు ధీరుడౌ
    బిట్టు మదోద్ధతిం జనుచు బేరిమి నెంచని వాడు ధూర్తుడై
    గిట్టును, దుష్ట బుద్ధులను గెంటిన పాపము సేరదూరిలో
    దిట్టి, ప్రతిష్ఠ గైకొన మదిం దలపోసెడి వాడు విజ్ఞుడౌ !

    రిప్లయితొలగించండి
  5. దూరదర్శుల సభలోన దుష్ట కవుల
    దిట్టుటయె మేలు ; సభలఁ బ్రతిష్ఠఁ గొనఁగ
    నట్టివారిని దొలగించ ననుగుణమగు
    చీడనెన్నడు దాపుకు జేర్చదగదు

    రిప్లయితొలగించండి

  6. తీవ్ర వాదము పేరుతో దేశ మందు
    రక్త పాతమ్ము సృజియించు రక్కసులను
    అవఘలించగ లేనట్టి అధిపతులను
    తిట్టుటయె మేలు సభలఁ బ్రతిష్ఠఁ గొనఁగ


    ముట్టడి జేసి చంపుటయె మోదమటంచును దల్చు వారలే
    పిట్టల గాల్చి నట్టు నిల బేలల జంపెడి తీవ్రవాదులన్
    కట్టడి సేయలేని యధికారులదౌ యసమర్థతన్ సదా
    తిట్టి ప్రతిష్ఠఁ గైకొన మదిం దలపోసెడివాఁడె విజ్ఞుఁడౌ

    రిప్లయితొలగించండి
  7. చట్టముననుసరింపక సాగు జనులఁ
    గట్టడింపగ ప్రవచన కర్త యగుచు
    దుష్ట కార్యాలను తెగడి దుండగీలఁ
    దిట్టుటయె మేలు సభలఁ బ్రతిష్ఠఁ గొనఁగ

    చట్టముఁ గౌరవింపక విచక్షణ చూపని వెర్రివారలన్
    గట్టడి చేయనెంచి పరికల్పన చేతురు పండితోత్తముల్
    తొట్టరులైనవారి పలుదుష్కృతముల్ పరిమార్చి దుష్టులన్
    దిట్టి ప్రతిష్ఠఁ గైకొన మదిం దలపోసెడివాఁడె విజ్ఞుఁడౌ

    రిప్లయితొలగించండి
  8. చట్టము నాదరించకను స్వార్థపరత్వము తోడ నేతలున్
    గుట్టుగ దోచి విత్తమును గొబ్బున పెట్టెల దాచుచుండ యా
    తొట్టరి నీచ మానవులు దోచిన దంతయు గుంజి గట్టిగన్
    తిట్టి ప్రతిష్ట గైకొన మదిందలపోసెడి వాడె విజ్ఞుడౌ

    రిప్లయితొలగించండి