8, అక్టోబర్ 2025, బుధవారం

సమస్య - 5268

9-10-2025 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అపకారులకే లభించు నభినందనముల్”
(లేదా...)
“అపకార మ్మొనరించు వారలకె లభ్యంబౌను సన్మానముల్”

16 కామెంట్‌లు:

  1. ఉపకారము జేసినపుడు
    నెపమెన్నెదరు పొ సగదని నేటి చయమునన్
    ఇపుడెంచిజూడ మగ దెలియు
    నపకారులకే లభించు నభినందనముల్

    రిప్లయితొలగించండి

  2. విపరీతము కాదు వినర
    కపటపు బుద్ధిని గలిగిన గడసరులు కనన్
    నృపతిగ గల ప్రాంతమ్మున
    యపకారులకే లభించు నభినందనముల్.


    అపరాదమ్ములు జేయు దుర్మతుల సాయంబందగా
    గెల్చెడిన్
    కపటుల్ హీన మనస్కులీ ధరణికిన్ క్ష్మాభృత్తు గానుండినన్
    విపరీతమ్ములె కాంచగా విరివి నీపృథ్విన్ కనంగన్ సదా
    యపకార మ్మొనరించు వారలకె లభ్యంబౌను సన్మానముల్.

    రిప్లయితొలగించండి
  3. మ.
    ఉపకారమ్ములు సల్పు, ధర్మ గతి నిత్యోత్కర్ష సంరూఢిచే
    రిపులై మూగెడి కష్ట సంతతుల నర్చిం బోలు కాల్చున్ జుమీ
    విపరీతమ్ములు మీఱి లోకమున నెవ్విద్దెల్ విధిన్ నేర్వనా
    యపకార మ్మొనరించు వారలకె లభ్యంబౌను సన్మానముల్ !

    రిప్లయితొలగించండి
  4. కం॥ ఉపకారము నొదివి పిదప
    నపకారముఁ జేయ నెంచు నధములఁ గనఁగన్
    గపటులనటు హతమార్చెడి
    అపకారులకే లభించు నభినందనముల్

    మ॥ ఉపకారమ్మును సఖ్యతా ధృతియె ముఖ్యోద్దేశమై చేయఁగా
    నెపుడున్ వర్ధిలు భారతమ్మున సదా హీనత్వ మేపారఁగన్
    విపరీతమ్ముగ నుగ్రవాదము నిటుల్ ప్రేరేఁచు దుష్టాళికే
    అపకారమ్మొనరించు వారలకె లభ్యంబౌను సన్మానముల్

    రిప్లయితొలగించండి
  5. ఉపకారమనెడి ముసుగున
    నపకారముసేయువారు హాసింత్రుగదా
    విపరీతపు నటనముతో
    నపకారులకే లభించు నభినందనముల్

    అపకారమ్మొనరించు వారు సతతమ్మార్భాటముల్ సల్పుచున్
    రపణంబుప్పతిలన్ నటించి నుపకా రమ్మంచు నమ్మించగా
    నపకారమ్మొనరించు వారలకె లభ్యంబౌను సన్మానముల్
    విపరీతంబగు వింతపోకడలివే వీక్షింపగా స్పష్టమౌ

    రిప్లయితొలగించండి
  6. రిప్లయిలు
    1. విపరీతంబుగ కల్గు డెప్పరికముల్ విశ్వంబునన్ నీచులై
      అపకార మ్మొనరించు వారలకె ,లభ్యంబౌను సన్మానముల్
      ఉపకారంబులు చేయు వారికి సదా యుత్సాహమందించగన్
      విపడెల్లప్పుడు మేలొనర్చి ప్రజకున్ విఖ్యాతి తానొందుగా

      తొలగించండి
  7. కపటపు వలపు నటించుచు
    నుప యో గము జేయు న ట్టు లుర్వీ జనులన్
    విపరీత ము నమ్మించె డి
    యప కారు ల కే లభించు నభి నందన ముల్

    రిప్లయితొలగించండి
  8. ఉపకారమొనర్చగ ప్ర
    త్యుపకారము సేయఁగనది యుక్తంబయినన్
    ఉపకారులకన్న భువిని
    యపకారులకే లభించు నభినందనముల్

    రిప్లయితొలగించండి
  9. ఉపకారమ్మొనరించు వారలకునౌ యుక్తమ్ము సేయంగ ప్ర
    త్యుపకారమ్ము కృతజ్ఞతన్దెలుపుచున్ తుల్యమ్ముగా నెప్పుఁడున్
    కపటంబేమియు లేని సద్గుణునకున్ కాదంచు నేరీతిగా
    నపకారమ్మొనరించు వారలకె లభ్యంబౌను సన్మానముల్?

    రిప్లయితొలగించండి
  10. కం:అపకారికి నుపకారము
    నెప మెన్నక సేయు మనుచు నేర్పిన సుకవీ!
    ఉపయోగించిన నీ విధ
    మపకారులకే లభించు నభినందనముల్”
    (సుమతీశతకకర్త పై చిన్న చమత్కారం.అపకారులకి ఉపకారం చేస్తూ పోతే అభినందనలు కూడా అపకారులకే దక్కుతూ ఉంటాయి.)

    రిప్లయితొలగించండి
  11. మ:క్షిపణిన్ బట్టుక వీరనేత యనియెన్ సేనన్ విలోకించి" మా
    యుపకారమ్ముల,వీరచక్రముల మీ రూహించిరే!,సుంతయున్
    గృప జూపింపక శత్రు సేన బలముల్ క్షీణింప గా దిట్టమౌ
    నపకార మ్మొనరించు వారలకె లభ్యంబౌను సన్మానముల్”
    (ఒక సైనికాధికారి ఒక క్షిపణి పై చెయ్యి కూదా వేసి "మా ఉపకారాలు,వీరచక్ర బిరుదులు మీరు ఊహిస్తే శత్రువులకి బాగా నష్టం కలిగించండి.అలాంటి వారికే ఉపకారాలు,అనగా ఇన్సెంటివ్స్,ప్రమోషన్స్, వీరచక్ర బిరుదులూ లభిస్తాయి అన్నాడు.)

    రిప్లయితొలగించండి
  12. కందం
    ఉపకారులకొనరించెడు
    నుపకారము గొప్ప కాదు యుర్విని సఖుడా!
    యుపకారములొనరింపగ
    నపకారులకే! లభించు నభినందనముల్

    మత్తేభవిక్రీడితము
    ఉపకారంబుపకారికిన్ సలుపగా నొప్పౌను గొప్పౌనొకో!
    విపరీతంబును గాదుకాదు గనఁగన్, విశ్వంబునందోర్మితో
    నెపముల్ మోపక సౌమ్యులై నెఱపగన్ నిత్యోపకారంబులే
    నపకారమ్మొనరించు వారలకె! లభ్యంబౌను సన్మానముల్!

    రిప్లయితొలగించండి
  13. నృపవర్యుఁడు మేకలఁ బో
    లు పులుల గుర్తించని యెడ లోకం బందున్
    విపరీత గతి ననవరత
    మపకారులకే లభించు నభినందనముల్


    ఉపకారం బొనరించు వారి కిలలో యుక్తంబు గా నట్టులే
    విపరీతమ్మన రాదు దీని నిజమున్ వీక్షింప దుర్వార ద
    ర్ప పరీతోగ్ర నిజాంతరంగ జన దుర్మా ర్గాపకా రాలికే
    యపకార మ్మొనరించు వారలకె లభ్యం బౌను సన్మానముల్

    రిప్లయితొలగించండి
  14. సమస్య:
    అపకారమ్మొనరించు వారలకె లభ్యంబౌను సన్మానముల్

    మత్తేభవిక్రీడితము:

    తపమే సేసియు భర్గ్యునిన్ గిరిజ పొందన్నగ్నులన్ నిల్వగా
    ఉపకారంబును సేయగా రతిపతే యుత్సాహియై తూపులన్
    కుపితుండై హర బేసిగన్ మరునినే కూల్చంగగా న్యాయమే !
    అపకారమ్మొనరించు వారలకె లభ్యంబౌను సన్మానముల్

    రిప్లయితొలగించండి

  15. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    అపజయమే సతము కలుగు
    నపకారులకే; లభించు నభినందనముల్
    అపకారులకైనను సదా
    నుపకారము చేయువారి కుర్విని కనగా!

    రిప్లయితొలగించండి