11-10-2025 (శనివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“పరులకు భీముండు బెదరువాఁడు రణమునన్”(లేదా...)“పరులకుఁ బెద్దగా బెదరువాఁడు గదా రణమందు భీముఁడే”
కందంనిరతము కుంతీ సుతులకుమురళీధరుడండనుండి ముప్పులు దప్పన్సరిచూడఁగ నట్టి పరాత్పరులకు భీముండు బెదరువాఁడు రణమునన్చంపకమాలనిరతము పాండునందనుల నీరజనేత్రుఁడు కృష్ణమూర్తి క్షేమ రతుడు కాచువాడనఁగ మర్మములేర్పడ జెప్పువాడనన్గురునిగ నాప్తబంధువుగ కూరిమిఁ జూపఁగ నట్టి ధర్మతత్పరులకుఁ బెద్దగా బెదరువాఁడు గదా రణమందు భీముఁడే!
చ.అరులను గెల్చి గర్వమున కంతము తెచ్చెదనంచు బల్కె రా జ్యరమను భూమనోరమణు జల్లని చేతికి నిత్తునంచు నేగె రయము బేల సైనికుడు, గేలుల గత్తులు వట్టి వెల్గు కాపరులకు బెద్దగా బెడగు వాడు గదా రణమందు భీముడే ?
మరిమరి చెప్పుచు నుంటి వి నర బల్లిదుడాతడంటి నరునకతడు సో దరుడు పిరికియా? కాడుర పరులకు భీముండు బెదరువాఁడు రణమునన్.మరచితివా వృకోదరుడు మారుతి పుత్రుడు ప్రత్య మిత్రులేభరపడి పారిపోదురది వాస్తవ మందురు జ్ఞాను లెల్లరున్ దురదమెరుంగనట్టి కడు ధైర్యము గల్గిన వాడు, కాడు రా పరులకుఁ బెద్దగా బెదరువాఁడు గదా రణమందు భీముఁడే.
పరిఘము దోడ కలియనగ పరితోషమునొందు చుండు బల్లిదు డగుటన్ విరిబోడిలందు కడు తత్పరులకు భీముండు బెదరువాఁడు రణమునన్
హరిహర మల్లుండనగాపరులకు భీముండు బెదరు, వాఁడు రణమునన్మరిమసగునను యశముతోహరిహర రాయలు కొలువున హాయిగ నుండెన్ హరిహర బుక్కసోదరులు హాయినమర్చిన రాజ్యమేగదా మరిమరి వృద్దినొంది పరమాద్భుత మైనది వారి కొల్వులోహరిహర వీరమల్లుడట హస్తముతో గద పట్టినంతనేపరులకుఁ బెద్దగా బెదరు; వాఁడు గదారణమందు భీముఁడే
నరునకు సోదరుండు కఠినంబగు దేహము గల్గువాడు భీకరముగ చివ్వయందునను కందళ మాడెడు ధైర్యవంతుడున్గురులను మంచువాడు రణకోవిదుడా బక వైరి కాడు తెంపరులకు బెద్దగా బెదరువాడు,గదా రణమందు భీముడే
ఎరుగడు రణమున బెదరుట పరులకు భీముడు :: బెదరు వాడు రణము నన్ పరులకు దాసోహ మనుచు బిరబిర తా లొంగి పోయి బేరము లాడున్
దురమున నరివీర భయంకరుఁడై చెలరేగు నట్టిగండరగండండరయగ ధర్మమునకు కాపరులకు భీముండు బెదరువాఁడు రణమునన్
తరగని బల్మితోడ పగదాయల పాలిట కర్కశుండునైదురమున శత్రువీరులకు దుస్సహుడై చెలరేగునట్టివాడరయగ ధర్మరక్షణము నందనురక్తిని గల్గియుండుకాపరులకుఁ బెద్దగా బెదరువాఁడు గదా రణమందు భీముఁడే
కం:మరణము బకునకె తథ్యముపరులకు భీముండు బెదరువాఁడు, రణమునన్బరుగిడు వాడున్ గాదనిగరువమ్మున బల్కె కుంతి కాంచుచు విప్రున్(మీరు భయ పడకండి.నా కొడు కైన భీముడు భయస్తుదు కాదు.వాడే బకాసురుణ్ని చంపుతాడు అని తనకు ఆశ్రయ మిచ్చిన విప్రునికి ధైర్య మిచ్చింది కుంతి. )
చం:నరు డనె గృష్ణు తో నిటుల,నా యభిమన్యుని మృత్యుకారణమ్మరయగ సైంధవుండె!యత డంతటి వీరుడె?యుద్ధభూమిలోబరులకుఁ బెద్దగా బెదరువాఁడు గదా !రణమందు భీముఁడేమరణ మొసంగ కాతనికి మన్నన జేసెనె ?యెంత చిత్రమౌ !(సైంధవుడు వట్టి భీరువు.అభిమన్యుని మరణానికి అతదు కారణమా? భీముడే ఎదిరించ లేక పోయాడా? అని అర్జునుడు కృష్ణుణ్ని అడిగాడు.)
కృష్ణుని రాయబార సందర్భంలో దుర్యోధనుని ప్రవర్తనకం॥ కురుపతి కృష్ణుని దూరుచుగరువమొదవి పాండవులను గఠిన పదములన్మరిమరి నిందించి పలికెఁ”బరులకు భీముండు బెదరు వాఁడు రణమునన్”చం॥ కురుపతి పాండు పుత్రులటు కోరిన రీతిని రాజ్యభాగమున్గరువమహమ్ముఁ గ్రమ్మగ వికారపు చేష్టల ధిక్కరించుచున్విరసముఁ జూపి కృష్ణునకు వీరులు కారని పల్కె నిట్టులన్బరులకుఁ బెద్దగా బెదరు వాఁడు గదా రణమందు భీముఁడేకురుపతి దుర్యోధనుడు
అరివీర భయంకరుఁడై నిరతము దోర్బలము నందు నిష్ణాతుండై పరఁగిన ధర్మాధిక తత్పరులకు భీముండు బెదరు వాఁడు రణమునన్ పరులకు నాజిలో బెదరు వాఁ డన భీముఁడు సత్య దూరమౌ దురమున నైన గాయములఁ దూర్ణము మూలము నుండి మాపుటన్ నిరయముఁ జూపు బాధ లిడ నేర్పరులై చరియించు మందు కూర్పరులకుఁ బెద్దగా బెదరు వాఁడు గదా రణ మందు భీముఁడే [రణము = ధ్వని]
శ్రీకృష్ణుడు భీమునితో హాస్యమాడుట:-ఉరమును చీల్చిదన్ మిగుల నూరువులన్ విరగంగఁ జేసెదన్తరుణిని నిట్లు జేసిరని దాయలఁ జంపెదనంచు పల్కి, యీపిరికితనంబు జూప ననిపించదె పాండవులందు జూడగన్పరులకుఁ బెద్దగా బెదరువాఁడు గదా రణమందు భీముఁడే!!
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.నిరతము పాండు తనయులనుసరగున కాపాడు కృష్ణ సంకటమందున్పరికించగ నట్టి పరాత్పరులకు భీముండు బెదరువాడు రణమునన్.
కందం
రిప్లయితొలగించండినిరతము కుంతీ సుతులకు
మురళీధరుడండనుండి ముప్పులు దప్పన్
సరిచూడఁగ నట్టి పరా
త్పరులకు భీముండు బెదరువాఁడు రణమునన్
చంపకమాల
నిరతము పాండునందనుల నీరజనేత్రుఁడు కృష్ణమూర్తి క్షే
మ రతుడు కాచువాడనఁగ మర్మములేర్పడ జెప్పువాడనన్
గురునిగ నాప్తబంధువుగ కూరిమిఁ జూపఁగ నట్టి ధర్మత
త్పరులకుఁ బెద్దగా బెదరువాఁడు గదా రణమందు భీముఁడే!
చ.
రిప్లయితొలగించండిఅరులను గెల్చి గర్వమున కంతము తెచ్చెదనంచు బల్కె రా
జ్యరమను భూమనోరమణు జల్లని చేతికి నిత్తునంచు నే
గె రయము బేల సైనికుడు, గేలుల గత్తులు వట్టి వెల్గు కా
పరులకు బెద్దగా బెడగు వాడు గదా రణమందు భీముడే ?
రిప్లయితొలగించండిమరిమరి చెప్పుచు నుంటి వి
నర బల్లిదుడాతడంటి నరునకతడు సో
దరుడు పిరికియా? కాడుర
పరులకు భీముండు బెదరువాఁడు రణమునన్.
మరచితివా వృకోదరుడు మారుతి పుత్రుడు ప్రత్య మిత్రులే
భరపడి పారిపోదురది వాస్తవ మందురు జ్ఞాను లెల్లరున్
దురదమెరుంగనట్టి కడు ధైర్యము గల్గిన వాడు, కాడు రా
పరులకుఁ బెద్దగా బెదరువాఁడు గదా రణమందు భీముఁడే.
పరిఘము దోడ కలియనగ
రిప్లయితొలగించండిపరితోషమునొందు చుండు బల్లిదు డగుటన్
విరిబోడిలందు కడు త
త్పరులకు భీముండు బెదరువాఁడు రణమునన్
హరిహర మల్లుండనగా
రిప్లయితొలగించండిపరులకు భీముండు బెదరు, వాఁడు రణమునన్
మరిమసగునను యశముతో
హరిహర రాయలు కొలువున హాయిగ నుండెన్
హరిహర బుక్కసోదరులు హాయినమర్చిన రాజ్యమేగదా
మరిమరి వృద్దినొంది పరమాద్భుత మైనది వారి కొల్వులో
హరిహర వీరమల్లుడట హస్తముతో గద పట్టినంతనే
పరులకుఁ బెద్దగా బెదరు; వాఁడు గదారణమందు భీముఁడే
నరునకు సోదరుండు కఠినంబగు దేహము గల్గువాడు భీ
రిప్లయితొలగించండికరముగ చివ్వయందునను కందళ మాడెడు ధైర్యవంతుడున్
గురులను మంచువాడు రణకోవిదుడా బక వైరి కాడు తెం
పరులకు బెద్దగా బెదరువాడు,గదా రణమందు భీముడే
ఎరుగడు రణమున బెదరుట
రిప్లయితొలగించండిపరులకు భీముడు :: బెదరు వాడు రణము నన్
పరులకు దాసోహ మనుచు
బిరబిర తా లొంగి పోయి బేరము లాడున్
దురమున నరివీర భయం
రిప్లయితొలగించండికరుఁడై చెలరేగు నట్టిగండరగండం
డరయగ ధర్మమునకు కా
పరులకు భీముండు బెదరువాఁడు రణమునన్
తరగని బల్మితోడ పగదాయల పాలిట కర్కశుండునై
రిప్లయితొలగించండిదురమున శత్రువీరులకు దుస్సహుడై చెలరేగునట్టివా
డరయగ ధర్మరక్షణము నందనురక్తిని గల్గియుండుకా
పరులకుఁ బెద్దగా బెదరువాఁడు గదా రణమందు భీముఁడే
కం:మరణము బకునకె తథ్యము
రిప్లయితొలగించండిపరులకు భీముండు బెదరువాఁడు, రణమునన్
బరుగిడు వాడున్ గాదని
గరువమ్మున బల్కె కుంతి కాంచుచు విప్రున్
(మీరు భయ పడకండి.నా కొడు కైన భీముడు భయస్తుదు కాదు.వాడే బకాసురుణ్ని చంపుతాడు అని తనకు ఆశ్రయ మిచ్చిన విప్రునికి ధైర్య మిచ్చింది కుంతి. )
చం:నరు డనె గృష్ణు తో నిటుల,నా యభిమన్యుని మృత్యుకారణ
రిప్లయితొలగించండిమ్మరయగ సైంధవుండె!యత డంతటి వీరుడె?యుద్ధభూమిలో
బరులకుఁ బెద్దగా బెదరువాఁడు గదా !రణమందు భీముఁడే
మరణ మొసంగ కాతనికి మన్నన జేసెనె ?యెంత చిత్రమౌ !
(సైంధవుడు వట్టి భీరువు.అభిమన్యుని మరణానికి అతదు కారణమా? భీముడే ఎదిరించ లేక పోయాడా? అని అర్జునుడు కృష్ణుణ్ని అడిగాడు.)
కృష్ణుని రాయబార సందర్భంలో దుర్యోధనుని ప్రవర్తన
రిప్లయితొలగించండికం॥ కురుపతి కృష్ణుని దూరుచు
గరువమొదవి పాండవులను గఠిన పదములన్
మరిమరి నిందించి పలికెఁ
”బరులకు భీముండు బెదరు వాఁడు రణమునన్”
చం॥ కురుపతి పాండు పుత్రులటు కోరిన రీతిని రాజ్యభాగమున్
గరువమహమ్ముఁ గ్రమ్మగ వికారపు చేష్టల ధిక్కరించుచున్
విరసముఁ జూపి కృష్ణునకు వీరులు కారని పల్కె నిట్టులన్
బరులకుఁ బెద్దగా బెదరు వాఁడు గదా రణమందు భీముఁడే
కురుపతి దుర్యోధనుడు
అరివీర భయంకరుఁడై
రిప్లయితొలగించండినిరతము దోర్బలము నందు నిష్ణాతుండై
పరఁగిన ధర్మాధిక త
త్పరులకు భీముండు బెదరు వాఁడు రణమునన్
పరులకు నాజిలో బెదరు వాఁ డన భీముఁడు సత్య దూరమౌ
దురమున నైన గాయములఁ దూర్ణము మూలము నుండి మాపుటన్
నిరయముఁ జూపు బాధ లిడ నేర్పరులై చరియించు మందు కూ
ర్పరులకుఁ బెద్దగా బెదరు వాఁడు గదా రణ మందు భీముఁడే
[రణము = ధ్వని]
శ్రీకృష్ణుడు భీమునితో హాస్యమాడుట:-
రిప్లయితొలగించండిఉరమును చీల్చిదన్ మిగుల నూరువులన్ విరగంగఁ జేసెదన్
తరుణిని నిట్లు జేసిరని దాయలఁ జంపెదనంచు పల్కి, యీ
పిరికితనంబు జూప ననిపించదె పాండవులందు జూడగన్
పరులకుఁ బెద్దగా బెదరువాఁడు గదా రణమందు భీముఁడే!!
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
నిరతము పాండు తనయులను
సరగున కాపాడు కృష్ణ సంకటమందున్
పరికించగ నట్టి పరా
త్పరులకు భీముండు బెదరువాడు
రణమునన్.