11, అక్టోబర్ 2025, శనివారం

సమస్య - 5271

12-10-2025 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పాతివ్రత్యమును రమణి పాటింపకుమా”
(లేదా...)
“పాతివ్రత్యము పాటి గాదు రమణీ పాటింపరాదెన్నఁడున్”
(ఆముదాల మురళి గారి పాలమూరు శతావధాన సమస్య)

10 కామెంట్‌లు:

  1. (రావణుడు సీతమ్మతో పలికే మాటలు)

    శా.
    సీతా నాదు మహత్త్వ కాంతి తతి దిగ్శ్రేణిం బరివ్యాప్తమై
    వాతూలాహి ధర ప్రకామ వర సంపద్ధారచే మీఱె బె
    న్హేతుల్ వోలె జ్వలించుచుండె విరహంబీనాడు గేల్పట్టు నీ
    పాతివ్రత్యము పాటి గాదు రమణీ పాటింపరాదెన్నడున్ !

    రిప్లయితొలగించండి

  2. నీతిని వీడిన పతిపై
    ప్రీతి యదేలనె చెలిమరి విడువుము వానిన్
    తాతల కాలము కాదిది
    పాతివ్రత్యమును రమణి పాటింపకుమా.


    చేతన్ గాసులె యున్న చాలునిక నీచిత్తేశుడే మూర్ఖుడై
    ప్రీతిన్ గ్రోలి పరిశ్రుతిన్ జనను గా వేశ్యాంగనా వాసమున్
    నీతిన్వీడిన భర్త యున్న సతికిన్ నేచెప్పుమాటియ్య దే
    పాతివ్రత్యము పాటి గాదు రమణీ పాటింపరాదెన్నఁడున్.

    రిప్లయితొలగించండి
  3. రిప్లయిలు
    1. రాతిన్ బోలిన గుండె యుండవలె మేల్దాపర్ల కెల్లప్పుడున్
      నీతుల్ గీతులవన్నియున్ విడుచుచున్ నిత్యంబు వేశ్యంబునన్
      ఏతీరైనను నాటలాడవలె రోయిన్ గెబ్బుచున్ వారికిన్
      పాతివ్రత్యము పాటిగాదు రమణీ పాటింపరాదెన్నడున్
      మేల్దాపరి= వేశ్య

      తొలగించండి
  4. [రావణుడు సీతతో....]

    సీతా! నీ సోయగమే
    చేతమునలరించుచుండె చింతింపకుమా
    నాతోజతకూడుము చెలి
    పాతివ్రత్యమును రమణి పాటింపకుమా

    నాతోపొందన నర్తనమ్ము సలిపే నాంచారులన్ గాంచితిన్
    సీతా! నీదు విలాసమే విజినమై చిత్తయ్యె నాస్వాంతమే
    నాతోడన్ జతకూడి నీవు మహదానందమ్మునే పొందవే
    పాతివ్రత్యము పాటి గాదు రమణీ పాటింపరాదెన్నఁడున్

    రిప్లయితొలగించండి
  5. వాల్మీకి మహర్షి సీతమ్మతో.....

    కందం
    నాతియొకతె! మాటయొకటె!
    చేత వదలు బాణమొకటె! శ్రీరఘురామున్
    చేతన సందేహించెడు
    పాతివ్రత్యమును రమణి పాటింపకుమా!

    శార్దూలవిక్రీడితము
    చైతన్యమ్మున నాడుమాటయొకటే! సంధించు నమ్మొక్కటే!
    పూతాత్ముండన నందె భార్యనొకతే! పొందంగ రామయ్యకున్
    సీతామాతగ లోకపావని సదా! శ్రీరాము శంకించెడున్
    పాతివ్రత్యము పాటి గాదు రమణీ పాటింపరాదెన్నఁడున్!

    రిప్లయితొలగించండి
  6. నీతి నియమాల యందు న
    ప్రీతి గ నుండి తన భర్త ప్రేమకు దూర మౌ
    నాతిని గని పతి యి ట్ల నె
    "" పాతి వ్రత్య మును రమణి పాటింప కు మా ""

    రిప్లయితొలగించండి
  7. కం:సీత వలె దా వహించెను
    పాతివ్రత్యమును రమణి, పాటింపకుమా
    నీ తెలివి జూపి రాముని
    నీతిన్ బరి పరి బరీక్ష నిలుపుచు నాలిన్.
    (నీ భార్య సీత లాంటి పతివ్రత.నువ్వు రాముని లాగా ఆమెకి పరీక్షలు పెట్టకు.)

    రిప్లయితొలగించండి
  8. కం॥ ప్రీతిగ సాధ్వులు గెలువఁగ
    నీతినిఁ బాయక వరలుచు నిర్గుణునైనన్
    జేతనులై పలుకఁ దగునె
    ”పాతివ్రత్యమును రమణి పాటింకుమా”

    శా॥ ఖ్యాతిన్ బొందిరి సాధ్వులీ ధరను నిక్కంబయ్య శాసించిరే
    భ్రాతిన్ దాల్చి పరీక్షకోర్చుచునటుల్ ప్రార్థించి దైవంబులన్
    నీతిన్ వీడిన వారు పల్కిరి గదా నిర్లజ్జగన్ ధూర్తులై
    ”పాతివ్రత్యము పాటి గాదు రమణీ పాటింప రాదెన్నడున్”

    (అనసూయ త్రిమూర్తలను శాసించారు)

    రిప్లయితొలగించండి
  9. శా: స్త్రీ తోడన్ చల మిట్లు బల్కె స్మృతులన్ జెండాడి " శాస్త్రాళి వౌ
    నీతుల్ నమ్మకు,మెల్లవేళ వేళలను నిన్ నిందించు,నిన్ గొట్టు,వా
    డా తాళిన్ బిగియిచ దైవ మగునే, ఆ త్రాగు దైవమ్ము కై
    పాతివ్రత్యము పాటి గాదు రమణీ పాటింపరాదెన్నఁడున్”
    (స్త్రీ అనే వ్యాససంపుటిలో చలం-"ఈ తిట్టే దేవుళ్లని,తిరిగే దేవుళ్లని,తన్నే దేవుళ్లని, తాగే దేవుళ్లని ఎన్నాళ్లు భరిస్తారు?" అంటాడు.)

    రిప్లయితొలగించండి