15-10-2025 (బుధవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“మృష్టాన్నము పగిదిఁ జక్రి మ్రింగెను చేఁదున్”(లేదా...)“మృష్టాన్నమ్ముగ నెంచి చక్రధరుఁడే మ్రింగెన్ గదా చేఁదునున్”(ఆముదాల మురళి గారి పాలమూరు శతావధాన సమస్య)
శా.కష్టంబొందుచు విష్ణు పాదములు హృత్కంజాత పీఠంబుపై నిష్టార్థమ్ముల సిద్ధికై నిలిపె దానీనా డదృష్టంబుగా సృష్టిం జేసిన వాని తండ్రి కడకుం జేరంగ వేపాకునే మృష్టాన్నమ్ముగ నెంచి చక్రధరుడే మ్రింగెం గదా చేదునున్ !
గురువుగారు శిష్యునితో.... కందంఇష్టముగ చదివి వ్రాసినఁగష్టము కాదుగ పరీక్ష? కఱకంఠునిపైదృష్టిఁ గొనక వ్రాసితివో?మృష్టాన్నము పగిదిఁ జక్రి మ్రింగెను చేఁదున్శార్దూలవిక్రీడితముఇష్టమ్ముంచియు నేర్వగన్ జదువగానిట్లుండు నీ వ్రాతలున్,"మృష్టాన్నమ్ముగ నెంచి చంద్రధరుఁడే మ్రింగెన్ గదా చేఁదునున్"గష్టమ్మట్లు పరీక్షనెంచితివనన్ గంగారు నీ వ్రాతలన్,"మృష్టాన్నమ్ముగ నెంచి చక్రధరుఁడే మ్రింగెన్ గదా చేఁదునున్"
కందంఇష్టమ్ముగనొడిఁ జేరిచికిష్టయ్యకు పూతన యిడ క్షీర గరళమున్నష్టము దెలిసిన వాడైమృష్టాన్నము పగిదిఁ జక్రి మ్రింగెను చేఁదున్!శార్దూలవిక్రీడితముఇష్టమ్మెంతయొ చూపి పూతనయె తానింపారగన్ జేర్చుచున్గిష్టయ్యన్ దన యంకపీఠమున తా క్ష్వేళంపు క్షీరంబిడన్నష్టమ్మన్నదెఱింగి చన్గుడుచుచున్నందాంగనా డింభుడైమృష్టాన్నమ్ముగ నెంచి చక్రధరుఁడే మ్రింగెన్ గదా చేఁదునున్!
ఇష్టమ్మని నవనీతముకష్టించి యొనర్చి రంట కమ్మగ హరికిన్నష్టమ్ముగ వారి శ్రమనుమృష్టాన్నము పగిదిఁ జక్రి మ్రింగెను చేఁదున్
సృష్టిని శాసించు గదర యిష్టాయిష్టములు లేని యీశుండతడే క్లిష్టం బెరుగడు కావున మృష్టాన్నము పగిదిఁ జక్రి మ్రింగెను చేఁదున్.భ్రష్టుం డెవ్వడొ చెప్పెనంచు తమరీ పాదమ్ము నే గాంచుచున్ క్లిష్టంబైన సమస్య గా దలచి పూరింపంగ నాకిస్తి రే యిష్టాయిష్ట ములుండ బోవు కద సర్వేశుండు తా కావునన్ మృష్టాన్నమ్ముగ నెంచి చక్రధరుఁడే మ్రింగెన్ గదా చేదునున్.
ఇష్టులగు బాండు గొమరులుదుష్టుడగు శకుని కుదుపన దొరగుచు నోడన్ ,కష్టమనిపించ , దానినిమృష్టాన్నము పగిదిఁ జక్రి మ్రింగెను చేఁదున్
స్పష్టముగ హాలహలమునుకష్టమ్మెంచక పినాకి కబళించె గదాక్లిష్టతరంబీ ప్రశ్నముమృష్టాన్నము పగిదిఁ జక్రి మ్రింగెను చేఁదున్కష్టమ్మెంచక భర్గ్యుడే గరళమున్ గ్రాహ్యంబుగానెంచినన్స్పష్టంబైన సమస్యనిచ్చిరిగదా సంక్లిష్టతన్ జేర్చుచున్'మృష్టాన్నమ్ముగ నెంచి చక్రధరుఁడే మ్రింగెన్ గదా చేఁదునున్'క్లిష్టంబైన సమస్యలోన శివుడే లేకుండెనే చూడగా
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
పుష్టిన్ గూర్చెడు దుగ్ధమున్ గుడుచు స్కంభుండా పరబ్రహ్మయౌకిష్టయ్యన్ నుఱు మాడఁపూతన యిడన్ క్షేళంపు క్షీరంబునున్మృష్టాన్నమ్ముగ నెంచి చక్రధరుడే మ్రింగెన్ గదా చేదునన్విష్టంబున్ తలగాచఁ రక్కసిని వేవేగన్ విఘాతించగన్
ఇష్టము కాకరకాయనిస్పష్టముగా దెలిసిన తన సహజన్మునకున్కష్టపడి చేయఁ గూరనుమృష్టాన్నము పగిదిఁ జక్రి మ్రింగెను చేఁదున్
కష్టంబుల్ కడతేర చక్రధరుఁడే గావింప సాహాయ్యమున్యిష్టంబంచు నెరింగి యాతనికితా నింపారగా కాకరన్తుష్టిం గూర్చునటంచు వండినది సంతోషమ్ముగా చెల్లెలేమృష్టాన్నమ్ముగ నెంచి చక్రధరుఁడే మ్రింగెన్ గదా చేఁదునున్
కం:ఇష్ట బడు శ్రీని బొందెనుమృష్టాన్నము పగిదిఁ జక్రి, మ్రింగెను చేఁదున్సృష్టిన్ గాచ హరుండె, యదృష్టము దేవతలకె పలు తీరుల నలరున్
కం॥ కష్టములఁ బెట్టు తలఁపున శిష్టుఁడు ప్రహ్లాదునకటు సీద్రపు కాటున్ దుష్టులు పొడిపించ నపుడుమృష్టాన్నము పగిదిఁ జక్రి మ్రింగెను చేఁదున్ శా॥శిష్టుల్ నోవును సైఁచ నొప్పడు గదా శీఘ్రమ్ముగన్ బ్రోచు విస్పష్టంబియ్యది భక్తవత్సలతతోఁ బ్రహ్లాదునిన్ గావఁగన్ గష్టంబంతయుఁ దాల్చి సర్పముల సంఘాతమ్ముఁ దప్పించఁగన్మృష్టాన్నమ్ముగ నెంచి చక్రధరుఁడే మ్రింగెన్ గదా చేఁదునున్ సీద్రము సర్పము చేదు విషము
(2)శా:భ్రష్ట మ్మై కృశియించు ధర్మమును గాపాడంగ దా రాముడై,కష్టమ్ముల్ బలు బొందె గానలను లంకన్ జేరి , శ్రీ కృష్ణుడైకష్టమ్ముల్ సహియించె సారథిగ రక్షన్ జేయ ధర్మమ్ము నేమృష్టాన్నమ్ముగ నెంచి చక్రధరుఁడే మ్రింగెన్ గదా చేఁదునున్
నష్టము గా మతి తన్నిన స్పష్టంబౌ రీతి సత్యభామా సతి స్వీయేష్ట సతియె యా తాఁపును మృష్టాన్నము పగిదిఁ జక్రి మ్రింగెను జేఁదున్ కష్టం బైనను నోర్చి శాంతముగ వీఁకన్ ఘోర కాకోల సందష్టాంగార్తి సమాన దుర్భరము గాంధారీ కుమారౌఘ దుర్నష్టైకార్తి యొసంగ శాపము వెసన్ నారాయణుం డత్తఱిన్ మృష్టాన్నమ్ముగ నెంచి చక్రధరుఁడే మ్రింగెన్గదా చేఁదునున్
సృష్టించి యొ సంగి రనుచు స్పష్టము గా దెలిసి తాను భయ పడ క యె తా నిష్ఠము గ కోరు చ య్యె డ మృష్టా న్నము పగిది చక్రి మ్రింగె ను జేదు న్
శా.
రిప్లయితొలగించండికష్టంబొందుచు విష్ణు పాదములు హృత్కంజాత పీఠంబుపై
నిష్టార్థమ్ముల సిద్ధికై నిలిపె దానీనా డదృష్టంబుగా
సృష్టిం జేసిన వాని తండ్రి కడకుం జేరంగ వేపాకునే
మృష్టాన్నమ్ముగ నెంచి చక్రధరుడే మ్రింగెం గదా చేదునున్ !
గురువుగారు శిష్యునితో....
రిప్లయితొలగించండికందం
ఇష్టముగ చదివి వ్రాసినఁ
గష్టము కాదుగ పరీక్ష? కఱకంఠునిపై
దృష్టిఁ గొనక వ్రాసితివో?
మృష్టాన్నము పగిదిఁ జక్రి మ్రింగెను చేఁదున్
శార్దూలవిక్రీడితము
ఇష్టమ్ముంచియు నేర్వగన్ జదువగానిట్లుండు నీ వ్రాతలున్,
"మృష్టాన్నమ్ముగ నెంచి చంద్రధరుఁడే మ్రింగెన్ గదా చేఁదునున్"
గష్టమ్మట్లు పరీక్షనెంచితివనన్ గంగారు నీ వ్రాతలన్,
"మృష్టాన్నమ్ముగ నెంచి చక్రధరుఁడే మ్రింగెన్ గదా చేఁదునున్"
కందం
తొలగించండిఇష్టమ్ముగనొడిఁ జేరిచి
కిష్టయ్యకు పూతన యిడ క్షీర గరళమున్
నష్టము దెలిసిన వాడై
మృష్టాన్నము పగిదిఁ జక్రి మ్రింగెను చేఁదున్!
శార్దూలవిక్రీడితము
ఇష్టమ్మెంతయొ చూపి పూతనయె తానింపారగన్ జేర్చుచున్
గిష్టయ్యన్ దన యంకపీఠమున తా క్ష్వేళంపు క్షీరంబిడన్
నష్టమ్మన్నదెఱింగి చన్గుడుచుచున్నందాంగనా డింభుడై
మృష్టాన్నమ్ముగ నెంచి చక్రధరుఁడే మ్రింగెన్ గదా చేఁదునున్!
ఇష్టమ్మని నవనీతము
రిప్లయితొలగించండికష్టించి యొనర్చి రంట కమ్మగ హరికిన్
నష్టమ్ముగ వారి శ్రమను
మృష్టాన్నము పగిదిఁ జక్రి మ్రింగెను చేఁదున్
రిప్లయితొలగించండిసృష్టిని శాసించు గదర
యిష్టాయిష్టములు లేని యీశుండతడే
క్లిష్టం బెరుగడు కావున
మృష్టాన్నము పగిదిఁ జక్రి మ్రింగెను చేఁదున్.
భ్రష్టుం డెవ్వడొ చెప్పెనంచు తమరీ పాదమ్ము నే గాంచుచున్
క్లిష్టంబైన సమస్య గా దలచి పూరింపంగ నాకిస్తి రే
యిష్టాయిష్ట ములుండ బోవు కద సర్వేశుండు తా కావునన్
మృష్టాన్నమ్ముగ నెంచి చక్రధరుఁడే మ్రింగెన్ గదా చేదునున్.
ఇష్టులగు బాండు గొమరులు
రిప్లయితొలగించండిదుష్టుడగు శకుని కుదుపన దొరగుచు నోడన్ ,
కష్టమనిపించ , దానిని
మృష్టాన్నము పగిదిఁ జక్రి మ్రింగెను చేఁదున్
స్పష్టముగ హాలహలమును
రిప్లయితొలగించండికష్టమ్మెంచక పినాకి కబళించె గదా
క్లిష్టతరంబీ ప్రశ్నము
మృష్టాన్నము పగిదిఁ జక్రి మ్రింగెను చేఁదున్
కష్టమ్మెంచక భర్గ్యుడే గరళమున్ గ్రాహ్యంబుగానెంచినన్
స్పష్టంబైన సమస్యనిచ్చిరిగదా సంక్లిష్టతన్ జేర్చుచున్
'మృష్టాన్నమ్ముగ నెంచి చక్రధరుఁడే మ్రింగెన్ గదా చేఁదునున్'
క్లిష్టంబైన సమస్యలోన శివుడే లేకుండెనే చూడగా
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపుష్టిన్ గూర్చెడు దుగ్ధమున్ గుడుచు స్కంభుండా పరబ్రహ్మయౌ
రిప్లయితొలగించండికిష్టయ్యన్ నుఱు మాడఁపూతన యిడన్ క్షేళంపు క్షీరంబునున్
మృష్టాన్నమ్ముగ నెంచి చక్రధరుడే మ్రింగెన్ గదా చేదునన్
విష్టంబున్ తలగాచఁ రక్కసిని వేవేగన్ విఘాతించగన్
ఇష్టము కాకరకాయని
రిప్లయితొలగించండిస్పష్టముగా దెలిసిన తన సహజన్మునకున్
కష్టపడి చేయఁ గూరను
మృష్టాన్నము పగిదిఁ జక్రి మ్రింగెను చేఁదున్
కష్టంబుల్ కడతేర చక్రధరుఁడే గావింప సాహాయ్యమున్
రిప్లయితొలగించండియిష్టంబంచు నెరింగి యాతనికితా నింపారగా కాకరన్
తుష్టిం గూర్చునటంచు వండినది సంతోషమ్ముగా చెల్లెలే
మృష్టాన్నమ్ముగ నెంచి చక్రధరుఁడే మ్రింగెన్ గదా చేఁదునున్
కం:ఇష్ట బడు శ్రీని బొందెను
రిప్లయితొలగించండిమృష్టాన్నము పగిదిఁ జక్రి, మ్రింగెను చేఁదున్
సృష్టిన్ గాచ హరుండె, య
దృష్టము దేవతలకె పలు తీరుల నలరున్
కం॥ కష్టములఁ బెట్టు తలఁపున
రిప్లయితొలగించండిశిష్టుఁడు ప్రహ్లాదునకటు సీద్రపు కాటున్
దుష్టులు పొడిపించ నపుడు
మృష్టాన్నము పగిదిఁ జక్రి మ్రింగెను చేఁదున్
శా॥శిష్టుల్ నోవును సైఁచ నొప్పడు గదా శీఘ్రమ్ముగన్ బ్రోచు వి
స్పష్టంబియ్యది భక్తవత్సలతతోఁ బ్రహ్లాదునిన్ గావఁగన్
గష్టంబంతయుఁ దాల్చి సర్పముల సంఘాతమ్ముఁ దప్పించఁగన్
మృష్టాన్నమ్ముగ నెంచి చక్రధరుఁడే మ్రింగెన్ గదా చేఁదునున్
సీద్రము సర్పము చేదు విషము
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి(2)శా:భ్రష్ట మ్మై కృశియించు ధర్మమును గాపాడంగ దా రాముడై,
రిప్లయితొలగించండికష్టమ్ముల్ బలు బొందె గానలను లంకన్ జేరి , శ్రీ కృష్ణుడై
కష్టమ్ముల్ సహియించె సారథిగ రక్షన్ జేయ ధర్మమ్ము నే
మృష్టాన్నమ్ముగ నెంచి చక్రధరుఁడే మ్రింగెన్ గదా చేఁదునున్
నష్టము గా మతి తన్నిన
రిప్లయితొలగించండిస్పష్టంబౌ రీతి సత్యభామా సతి స్వీ
యేష్ట సతియె యా తాఁపును
మృష్టాన్నము పగిదిఁ జక్రి మ్రింగెను జేఁదున్
కష్టం బైనను నోర్చి శాంతముగ వీఁకన్ ఘోర కాకోల సం
దష్టాంగార్తి సమాన దుర్భరము గాంధారీ కుమారౌఘ దు
ర్నష్టైకార్తి యొసంగ శాపము వెసన్ నారాయణుం డత్తఱిన్
మృష్టాన్నమ్ముగ నెంచి చక్రధరుఁడే మ్రింగెన్గదా చేఁదునున్
సృష్టించి యొ సంగి రనుచు
రిప్లయితొలగించండిస్పష్టము గా దెలిసి తాను భయ పడ క యె తా
నిష్ఠము గ కోరు చ య్యె డ
మృష్టా న్నము పగిది చక్రి మ్రింగె ను జేదు న్