22, అక్టోబర్ 2025, బుధవారం

సమస్య - 5282

23-10-2025 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గుండ్రాతిని భక్తిఁ గొల్వఁ గుశలం బబ్బున్”
(లేదా...)
“గుండ్రాతిన్ గడు భక్తిఁ గొల్వ నిదె నాకున్ నీకు సౌఖ్యంబగున్”
(వద్దిపర్తి పద్మాకర్ గారి శతావధానంలో డా. మద్దూరి వేం.సు. సత్యనారాయణ గారి సమస్య)

8 కామెంట్‌లు:

  1. శా.
    ఇండ్రాప్రాస గవిత్వ మూర్తులగు మాకీయంగ వాటిల్లునే
    పండ్రూపంబగు పద్య రాజ మకటా, పాండిత్య సంశోభకున్
    మెండ్రోచిస్సులు గల్గునే ? తలపగన్ మెచ్చంగ నేమున్నదే
    గుండ్రాతిం గడు భక్తి గొల్వ నిదె నాకున్ నీకు సౌఖ్యంబగున్ ?

    రిప్లయితొలగించండి

  2. తీండ్రించు బొమ్మ లని యా
    యాండ్రైడు ను గాంచ నేల యద్భుత మనుచున్
    దండ్రీ యీశుండనుచును
    గుండ్రాతిని భక్తిఁ గొల్వఁ గుశలం బబ్బున్.


    ఆండ్రైడ్ ఫోనది చేత నున్నదని నిత్యంబందునన్ వింతలన్
    దండ్రీ గాన్చగ నేల వ్యర్థమగురా ధర్మమ్ము నే చెప్పగా
    గుండ్రాతిన్ శివుడుంచు చెప్పగనె యా కోపంబు నీకేలరా
    గుండ్రాతిన్ గడు భక్తిఁ గొల్వ నిదె నాకున్ నీకు సౌఖ్యంబగున్.

    రిప్లయితొలగించండి
  3. కందం
    ఉండ్రాళ్ల దేవుఁడును కో
    దండ్రాముండైన శిలలె దర్శింప గుడిన్
    జండ్రాయుఁడనెను భక్తిని
    గుండ్రాతిని భక్తిఁ గొల్వఁ గుశలం బబ్బున్

    శార్దూలవిక్రీడితము
    ఉండ్రాళ్లన్ ముదమార చేతగొనగా నొప్పారు దేవుండు, కో
    దండ్రాముండును, నాలయాల శిలలే దైవంబుగన్ మ్రొక్కఁగన్
    జండ్రాయుండనె సృష్టి సర్వమయుడై సర్వేశ్వరుండుండగన్
    గుండ్రాతిన్ గడు భక్తిఁ గొల్వ నిదె నాకున్ నీకు సౌఖ్యంబగున్!

    రిప్లయితొలగించండి
  4. కం॥
    ఆండ్రాయిడు ఫోనుకొనిన
    చండ్రాయుండందులోన సైటుల జూడన్
    గండ్రల్లివ్విధి కనబడె-
    "గుండ్రాతిని భక్తిఁ గొల్వఁ గుశలం బబ్బున్”

    (చండ్రాయుడు అన్న పేరు, రాయల సీమ జిల్లాల్లో వినబడుతుంది.
    సైటులు: ఇంటర్నెట్ లోని వివిధ సైట్లు
    గండ్రలు: వ్యర్థపు మాటలు)

    రిప్లయితొలగించండి
  5. గుండ్రాతిన్గొని స్వామి విగ్రహముగా గుర్తించి కైమోడ్పుతో
    ఉండ్రాళ్లన్దిను విష్ను నాయకుని నీ యుల్లంబునన్ నిల్పి యో
    తండ్రీ నాకిల దిక్కు నీవె యని శ్రద్ధాసక్తులన్ జూపి యా
    గుండ్రాతిన్ గడు భక్తిఁ గొల్వ నిదె నాకున్ నీకు సౌఖ్యంబగున్

    రిప్లయితొలగించండి
  6. గండ్రమెయి దగ్గ సాగుకు
    గుండ్రాతిని భక్తిఁ గొల్వఁ గుశలం బబ్బున్
    పిండ్రముగ భక్తి జూపుచు
    తండ్రిని దైవముగ దలచ దక్కును పుణ్యం

    రిప్లయితొలగించండి
  7. గుండ్రాయట్టుల సర్వదా కదలకన్ కూర్చుండి పిచ్చోడివై
    ఆండ్రాయిడ్ చరవాణియందు సినిమాలశ్రాంతమున్ జూచుచున్
    తండ్రీ కాలము వ్యర్థపుచ్చకనికన్ దా వేగ ముక్కంటి యా
    గుండ్రాతిన్ గడు భక్తి గొల్వ నిదె నాకున్ నీకు సౌఖ్యంబగున్

    రిప్లయితొలగించండి