తే.గీ:వలలు డొకనాడు కూరను వండి యందు నుప్పు మరచియు "రుచి నీవు చెప్పు" మనుచు గోర సైరంధ్రి యిట్లనె "మీరు వండ నుప్పు లేని కూరకు రుచి యుండును గద!" (విరటుని కొలువులో భీముడు వంట చేస్తూ ఒక సారి కూరలో ఉప్పు వేయటం మరిచిపోయి రుచి చెప్పమని ద్రౌపదిని అడిగాడు.ఆమె "మీరు ఉప్పు వేయటం మర్చిపోయారు" అనక "మీ వంట ఎంత గొప్పదో! ఉప్పు వెయ్యక పోయినా రుచిగా ఉంది" అన్నట్లు.)
మ:లవణమ్మున్ వదలంగ వైద్యుడన నేలన్ మీకు దుఃఖమ్ము? నే నివి యోచించితి నింక సైంధ లవణమ్మే వేసేదన్ ,గూరలన్ చవికై నిత్యము వాడు నుప్పు నిక నే చాలింతు లెండయ్య!యా లవణం బింతయు లేని కూర గన వాలాయంబుగా రుచ్యమౌ” (ఉప్పు వాడవ ద్దనగానే బాధ ఎందుకు? సైంధలవణం వాడితే ఆ మామూలు ఉప్పు వదిలేసినా రుచిగానే ఉంటుందని భార్య అన్నట్లు. కొందరు బి.పి.రోగులు సైంధలవణం వాడతారు.)
మ.
రిప్లయితొలగించండికవనోత్సాహ విరాజిత ప్రబల హృద్గాంభీర్య సంపత్తితో
కవిరాజిప్పుడు వ్రాసె కావ్యము మహా ఖ్యాతిన్ భువిం బొంద వే
కువలన్ రేయుల లెక్క చేయక సదా, క్షుద్బాధలో మున్గ న
ల్లవణంబింతయు లేని కూర గన వాలాయంబుగా రుచ్యమౌ !
శాకమేదైన లవణమె చవి నిడినను
రిప్లయితొలగించండిజీవికి లవణ మధికమై చెడును గూర్చు ;
తనివిగ తినెడు గాతిని దద్దరీతి
యుప్పు లేని కూరకు రుచి యుండును గద”
రిప్లయితొలగించండిహెచ్చె రక్తపోటని వెజ్జు డిపుడె చెప్పె
నిక రుచుల వీడి స్వస్థత నిచ్చు నట్టి
బోనమున్ జేసిన నదియెముదము గూర్చు
ఉప్పు లేని కూరకు రుచి యుండును గద.
కవిశ్రేష్ఠుల్ తమ కావ్య మందుగన శృంగారమ్మె ప్రాధాన్యమౌ
కావనమ్ముల్ రచియించి నంతనవి సత్కావ్యమ్ము లౌచున్ గదా
యవనిన్ నిల్చును నాల్గు కాలములు సత్యంబియ్యదే కాదుటే
లవణం బింతయు లేని కూర గన వాలాయంబుగా రుచ్యమౌ?
తేటగీతి
రిప్లయితొలగించండిఅతియె రాణింపదెందున నవనిపైన
వర్తనమ్ముననైనను వంటలందు
వినయమొప్పును తగినంతయు, నధికముగ
ఉప్పు లేని కూరకు రుచి యుండును గద.
మత్తేభవిక్రీడితము
అవనిన్మానవులేది యొప్పరతిగా నాస్వాదనన్మీరినన్
వివరంబొప్పెడువర్తనంబు దగుఁ దృప్తిన్ బొందరుచ్యంబులే
యవగుణ్యంబగు మించెడున్ వినయమే, యాహారమందెక్కువౌ
లవణం బింతయు లేని కూర గన వాలాయంబుగా రుచ్యమౌ!
ఉప్పుపై పన్ను విధియింప నుద్భవించె
రిప్లయితొలగించండినుప్పు సత్యాగ్రహమనుచు జెప్పు చుంద్రు
తప్ప నిసరిగా నెక్కువ తక్కువలగు
నుప్పు లేని కూరకు రుచి యుండును గద
లవణంబున్ దగినంత వైచినపుడే రంజిల్లుగా జిహ్వమే
భవితవ్యంబగు రీతి సన్నహనమై స్వాతంత్ర్య సంగ్రామమున్
జవసత్వంబులు గూర్చెనాలవణమే సత్యాగ్రహా మూలమై
లవణం బింతయు లేని కూర గన వాలాయంబుగా రుచ్యమౌ
[ఇంతయు = అధికముగా]
తే॥ విద్యరాని వాఁడె ధరను విజ్ఞుఁడైనఁ
రిప్లయితొలగించండిబప్పు లేని కూర వలన బలము విరియ
నొకటి కొక్కటి నిజముగ నుచిత మైన
నుప్పు లేని కూరకు రుచి యుండును గద
(మొదటి మూడు ఎంత నిజమో చివరిది అంతే నిజమని అండి)
మ॥ భువిలోఁ గాంచఁగ రక్తపోటధికమై ముద్దార వాచింతురే
నవ విజ్ఞానపు సంహితమ్మున సదా నమ్మంగ సూచించిరే
చవులూరించుచు స్వస్థతన్ గనదె నిస్సందేహ మీసూక్తియున్
లవణం బింతయు లేని కూర గన వాలాయంబుగా రుచ్యమౌ
( మంతెన వారి నీతి. రక్తపోటు మరీ అధికమైతే ఇలా తమకు తాము నచ్చజెప్పుకోవాలి కదండి)
ఉప్పు తగ్గించి తిను ట యే యొ ప్పు సతము
రిప్లయితొలగించండిపలుకు చుందురు వైద్యులు పలు విధాల
రక్త. పోటులు మున్ముందు రాదు గనుక
నుప్పు లేని కూరకు రుచి యుండు ను గద
తే.గీ:వలలు డొకనాడు కూరను వండి యందు
రిప్లయితొలగించండినుప్పు మరచియు "రుచి నీవు చెప్పు" మనుచు
గోర సైరంధ్రి యిట్లనె "మీరు వండ
నుప్పు లేని కూరకు రుచి యుండును గద!"
(విరటుని కొలువులో భీముడు వంట చేస్తూ ఒక సారి కూరలో ఉప్పు వేయటం మరిచిపోయి రుచి చెప్పమని ద్రౌపదిని అడిగాడు.ఆమె "మీరు ఉప్పు వేయటం మర్చిపోయారు" అనక "మీ వంట ఎంత గొప్పదో! ఉప్పు వెయ్యక పోయినా రుచిగా ఉంది" అన్నట్లు.)
మ:లవణమ్మున్ వదలంగ వైద్యుడన నేలన్ మీకు దుఃఖమ్ము? నే
రిప్లయితొలగించండినివి యోచించితి నింక సైంధ లవణమ్మే వేసేదన్ ,గూరలన్
చవికై నిత్యము వాడు నుప్పు నిక నే చాలింతు లెండయ్య!యా
లవణం బింతయు లేని కూర గన వాలాయంబుగా రుచ్యమౌ”
(ఉప్పు వాడవ ద్దనగానే బాధ ఎందుకు? సైంధలవణం వాడితే ఆ మామూలు ఉప్పు వదిలేసినా రుచిగానే ఉంటుందని భార్య అన్నట్లు. కొందరు బి.పి.రోగులు సైంధలవణం వాడతారు.)