6-2-2026 (శుక్రవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“కుక్కకు జన్మించె నొక్క కుంజర మహహా”(లేదా...)“కుక్కకుఁ బుట్టెనంట యొక కుంజర మెల్లరుఁ జూడ వింతగన్”
పద్మవ్యూహములో పాల్గొన్న కౌరవ సైన్యములో గుసగుసలు....కందంఎక్కడి యభిమన్యుఁడితఁడు!త్రొక్కెను కరివోలె కదను త్రుంచె శిరములన్!మ్రొక్కి హరిఁ జెలఁగు నరుఁడన్గుక్కకు జన్మించె నొక్క కుంజర మహహా!ఉత్పలమాలమ్రక్కిడ సేనలెల్ల నభిమన్యుఁడొకండె మహోధృతమ్ముగన్ద్రొక్కెఁ గరేణువై కదను త్రుంచె శిరమ్ముల భీకరమ్ముగన్!మ్రొక్కుచు కృష్ణునిన్ జెలఁగఁ బూనెడు బంటుగ నొప్పు క్రీడియన్గుక్కకుఁ బుట్టెనంట యొక కుంజర మెల్లరుఁ జూడ వింతగన్!
నొక్కిన తెరచుకొను బొమలడొక్కల నుండి పతిమలు పడునటుల జేయన్మక్కువగ నొకటి నదుమగకుక్కకు జన్మించె నొక్క కుంజర మహహా
చక్కని దినగుణముతో మిక్కిలి కీర్తిని గడింప మేదిని యందున్ పెక్కురనిరి సూతుడనే కుక్కకు జన్మించె నొక్క కుంజర మహహా.ఒక్కడు వాడు గాంచగ మహోన్నత దానగుణమ్ముచే గదామిక్కిలి పేరుగాంచెనని మెచ్చి నుతించిరి నాడు శిష్టులౌ పెక్కురులివ్విధిన్ గనగ పేదనిషంగద సూతుడైన యాకుక్కకుఁ బుట్టెనంట యొక కుంజర మెల్లరుఁ జూడ వింతగన్.
అక్కజములెన్నొ కలిలోమిక్కుటముగ సంభవించు మేదిని యందున్చొక్కవరము గ్రామములోకుక్కకు జన్మించె నొక్క కుంజర మహహా
చక్కని కూనలు నాలుగుకుక్కకు జన్మించె; నొక్క కుంజర మహహాటక్కున బంతిని దన్నుచుమక్కువతో నాడెనచటి మైదానములోపక్కన నున్న బాలకుడు పల్కెను నాకడ నివ్విధంబునన్మిక్కిలి చక్కనైనవని మెచ్చెడు ముచ్చటగొల్పు కూనలేకుక్కకుఁ బుట్టెనంట; యొక కుంజర మెల్లరుఁ జూడ వింతగన్జక్కని నాట్యమాడెనట సందడి గొల్పుచు జంతుశాలలో
పద్మవ్యూహములో పాల్గొన్న కౌరవ సైన్యములో గుసగుసలు....
రిప్లయితొలగించండికందం
ఎక్కడి యభిమన్యుఁడితఁడు!
త్రొక్కెను కరివోలె కదను త్రుంచె శిరములన్!
మ్రొక్కి హరిఁ జెలఁగు నరుఁడన్
గుక్కకు జన్మించె నొక్క కుంజర మహహా!
ఉత్పలమాల
మ్రక్కిడ సేనలెల్ల నభిమన్యుఁడొకండె మహోధృతమ్ముగన్
ద్రొక్కెఁ గరేణువై కదను త్రుంచె శిరమ్ముల భీకరమ్ముగన్!
మ్రొక్కుచు కృష్ణునిన్ జెలఁగఁ బూనెడు బంటుగ నొప్పు క్రీడియన్
గుక్కకుఁ బుట్టెనంట యొక కుంజర మెల్లరుఁ జూడ వింతగన్!
నొక్కిన తెరచుకొను బొమల
రిప్లయితొలగించండిడొక్కల నుండి పతిమలు పడునటుల జేయన్
మక్కువగ నొకటి నదుమగ
కుక్కకు జన్మించె నొక్క కుంజర మహహా
రిప్లయితొలగించండిచక్కని దినగుణముతో
మిక్కిలి కీర్తిని గడింప మేదిని యందున్
పెక్కురనిరి సూతుడనే
కుక్కకు జన్మించె నొక్క కుంజర మహహా.
ఒక్కడు వాడు గాంచగ మహోన్నత దానగుణమ్ముచే గదా
మిక్కిలి పేరుగాంచెనని మెచ్చి నుతించిరి నాడు శిష్టులౌ
పెక్కురులివ్విధిన్ గనగ పేదనిషంగద సూతుడైన యా
కుక్కకుఁ బుట్టెనంట యొక కుంజర మెల్లరుఁ జూడ వింతగన్.
అక్కజములెన్నొ కలిలో
రిప్లయితొలగించండిమిక్కుటముగ సంభవించు మేదిని యందున్
చొక్కవరము గ్రామములో
కుక్కకు జన్మించె నొక్క కుంజర మహహా
చక్కని కూనలు నాలుగు
రిప్లయితొలగించండికుక్కకు జన్మించె; నొక్క కుంజర మహహా
టక్కున బంతిని దన్నుచు
మక్కువతో నాడెనచటి మైదానములో
పక్కన నున్న బాలకుడు పల్కెను నాకడ నివ్విధంబునన్
మిక్కిలి చక్కనైనవని మెచ్చెడు ముచ్చటగొల్పు కూనలే
కుక్కకుఁ బుట్టెనంట; యొక కుంజర మెల్లరుఁ జూడ వింతగన్
జక్కని నాట్యమాడెనట సందడి గొల్పుచు జంతుశాలలో