12-2-2026 (గురువారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“విధునిఁ గాంచిన పద్మముల్ విచ్చుకొనెను”(లేదా...)“శశి యుదయించినంత వనజంబులు విచ్చుకొనెన్ ముదంబునన్”
తేటగీతిఇందువదనాన కృష్ణుఁడు నింపుగూర్పనలరు గోపికాంతల నయనాంబుజములుకవులకల్పనల్ వికటించె కనులఁ జూడవిధునిఁ గాంచిన పద్మముల్ విచ్చుకొనెనుచంపకమాలవశపడి గోపకాంతలట వాంఛలురేగగ కృష్ణమూర్తికైప్రశనమె మేలు మేలనిరి పంకజనేత్రలు లేక శౌరియేకుశలమునెంచి వేణువున గూర్చుచు రాగము శౌరిమోమునన్శశి యుదయించినంత వనజంబులు విచ్చుకొనెన్ ముదంబునన్
చ.యశమును పూర్వ దిక్కునకు నద్భుత రీతిని గూర్పగన్ వియద్వశమగు మార్గమందు తగు బంగరు కాంతుల వెగ్గలంబునౌ నిశిని పరాభవాన విడి నేత్రములార నుషామనః ప్రియా శశి యుదయించినంత వనజంబులు విచ్చుకొనెన్ ముదంబునన్ !
కలువమొగ్గలు పుష్పించె క్షణదయుదువిధునిఁ గాంచిన ; పద్మముల్ విచ్చుకొనెనుపూర్వదిక్కున సూర్యుడు బొడిచీనఃంత ,వెన్నెలదొర , వెలుగురాల వీకయిదియ
దూరదేశమేగిన పతి చేరవచ్చెనంచు ముదముతో దరిచేరె డతివ కనులకాంతి గని ధవుడు పలికె సంతసమునవిధునిఁ గాంచిన పద్మముల్ విచ్చుకొనెను.నిశియది చేరవచ్చె పరిణేతయె రాకమనస్సు బాధతోవశ పరికేదమందుతరి వచ్చెను మల్లెల బంతితోడ నారసికుడు వానిగాంచిన వరానన కన్నులు కాంతులీనెనేశశి యుదయించినంత వనజంబులు విచ్చుకొనెన్ ముదంబునన్.రెండవ పూరణ.వశ కనులన్ గనంగ కుటపమ్ములటంచును పోల్చినట్టి యారసికుడు సుందరాంగుడని రాత్రికరుండని పోల్చె భర్తనే నిశి దరి జేరవచ్చు పరిణేతని గాంచిన యింతి మోములో శశి యుదయించినంత వనజంబులు విచ్చుకొనెన్ ముదంబునన్.
వింతలన్నియు గమనింప విదితమౌనుకుసుమ రీతులఁ గాంచ ముకుళిత మయ్యెవిధునిఁ గాంచిన పద్మముల్; విచ్చుకొనెనుతూర్పు దిక్కున భానుడు తొంగి చూడవిశదముగా గ్రహించనగు విశ్వమునందలి వింతరీతులన్నిశి పరివేష్టితంబగును నీరజముల్ ముకుళించుఁ దప్పకన్శశి యుదయించినంత; వనజంబులు విచ్చుకొనెన్ ముదంబునన్దశదిశలన్ దివాకరుని ధామములే ప్రసరించినంతటన్
తేటగీతి
రిప్లయితొలగించండిఇందువదనాన కృష్ణుఁడు నింపుగూర్ప
నలరు గోపికాంతల నయనాంబుజములు
కవులకల్పనల్ వికటించె కనులఁ జూడ
విధునిఁ గాంచిన పద్మముల్ విచ్చుకొనెను
చంపకమాల
వశపడి గోపకాంతలట వాంఛలురేగగ కృష్ణమూర్తికై
ప్రశనమె మేలు మేలనిరి పంకజనేత్రలు లేక శౌరియే
కుశలమునెంచి వేణువున గూర్చుచు రాగము శౌరిమోమునన్
శశి యుదయించినంత వనజంబులు విచ్చుకొనెన్ ముదంబునన్
చ.
రిప్లయితొలగించండియశమును పూర్వ దిక్కునకు నద్భుత రీతిని గూర్పగన్ వియ
ద్వశమగు మార్గమందు తగు బంగరు కాంతుల వెగ్గలంబునౌ
నిశిని పరాభవాన విడి నేత్రములార నుషామనః ప్రియా
శశి యుదయించినంత వనజంబులు విచ్చుకొనెన్ ముదంబునన్ !
కలువమొగ్గలు పుష్పించె క్షణదయుదు
రిప్లయితొలగించండివిధునిఁ గాంచిన ; పద్మముల్ విచ్చుకొనెను
పూర్వదిక్కున సూర్యుడు బొడిచీనఃంత ,
వెన్నెలదొర , వెలుగురాల వీకయిదియ
రిప్లయితొలగించండిదూరదేశమేగిన పతి చేరవచ్చె
నంచు ముదముతో దరిచేరె డతివ కనుల
కాంతి గని ధవుడు పలికె సంతసమున
విధునిఁ గాంచిన పద్మముల్ విచ్చుకొనెను.
నిశియది చేరవచ్చె పరిణేతయె రాకమనస్సు బాధతో
వశ పరికేదమందుతరి వచ్చెను మల్లెల బంతితోడ నా
రసికుడు వానిగాంచిన వరానన కన్నులు కాంతులీనెనే
శశి యుదయించినంత వనజంబులు విచ్చుకొనెన్ ముదంబునన్.
రెండవ పూరణ.
వశ కనులన్ గనంగ కుటపమ్ములటంచును పోల్చినట్టి యా
రసికుడు సుందరాంగుడని రాత్రికరుండని పోల్చె భర్తనే
నిశి దరి జేరవచ్చు పరిణేతని గాంచిన యింతి మోములో
శశి యుదయించినంత వనజంబులు విచ్చుకొనెన్ ముదంబునన్.
వింతలన్నియు గమనింప విదితమౌను
రిప్లయితొలగించండికుసుమ రీతులఁ గాంచ ముకుళిత మయ్యె
విధునిఁ గాంచిన పద్మముల్; విచ్చుకొనెను
తూర్పు దిక్కున భానుడు తొంగి చూడ
విశదముగా గ్రహించనగు విశ్వమునందలి వింతరీతులన్
నిశి పరివేష్టితంబగును నీరజముల్ ముకుళించుఁ దప్పకన్
శశి యుదయించినంత; వనజంబులు విచ్చుకొనెన్ ముదంబునన్
దశదిశలన్ దివాకరుని ధామములే ప్రసరించినంతటన్