15-2-2026 (ఆదివారం)కవిమిత్రులారా,
మహాశివరాత్రి శుభాకాంక్షలు!ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“శివ హర భవ శంకర యనఁ జేకుఱు నిడుమల్”(లేదా...)“శివ గౌరీశ్వర శంకరా హర యనన్ జేకూఱు సర్వాపదల్”
శివ హర భవ శంకర యనఁ జేకుఱు నిడుమల్,శిరసి ధరింతును నీ చరణారవిందముల్।భవభయ హరణ పరమేశ్వర పరాత్పర,భక్తుల పాలిత పరమానంద కందర॥గంగాధర గిరిజా రమణ గౌరీశ,నీలకంఠ శూలపాణి జగదీశ।అర్ధనారీశ్వర ఆది అనంత,ఆనంద తాండవ విహారి చిదంబరాంత॥పశుపతి పరమ శివ శాశ్వత మూర్తి,పాప విమోచన పవిత్ర కీర్తి।ఓంకార స్వరూప ఒళివెలుగు దీప,ఉమామహేశ్వర నీకు నా నిత్య స్మృతి దీప॥నామస్మరణే మాకు నావకరంబు,నీకరుణే మా జీవనారంభంబు।శివ హర భవ శంకర శరణు శరణు,చిరమున మా మనమున నిలచు పరమధనము॥
శివ కలుగును శివరాత్రిని శివ హర భవ శంకర యనఁ ; జేకుఱు నిడుమల్భవుని మరచి జీవితమునుచవి, పరితోషముల తోడ సాగించినచో
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
భవమన్నది లేదనుచునుభవుడన్నను కల్పితమని వాచించెడి వాడు విడంబనమ్ము తోడను శివ హర భవ శంకర యనఁ జేకుఱు నిడుమల్.ధవనాంశుండను జూటమందున సదాతా దాల్చెడిన్ వాడెగాభవనాశుండును రక్షకుండనుచు విశ్వాసమ్ముతో నిత్యమున్ శివ గౌరీశ్వర శంకరా హర యనన్ , జేకూఱు సర్వాపదల్ భువిలో మక్కిలు నంచు సర్వరసులౌ మోక్షార్థులే చెప్పిరే.
శివరాత్రినిఁ భక్త జనులుశివ హర భవ శంకర యనఁ ,జేకుఱు నిడుమల్వ్యవధి రహితమై తొలఁగగభువిపై భక్తుల మనుగడ మోదాన్వితమౌస్తవనీయంబని చంద్రచూడుని సదా శ్లాగింతురే భక్తులేశ్రవణానందము కల్గురీతి సతమా సర్వేశ్వరున్ దల్చుచున్శివ గౌరీశ్వర శంకరా హర యనన్, జేకూఱు సర్వాపదల్వ్యవధానంబు హుళక్కియై తొలఁగగా భాసిల్లునానందమే
కం॥ చవిఁ గనక భక్తిఁ దలఁపక భువిలో స్వార్థము విరియఁగ పొడవఁడు నటులన్వివరించఁగఁ బర్వ మనుచుశివ హర భవ శంకర యనఁ జేకుఱు నిడుమల్మ॥ చవి లేకుండఁగ భక్తిఁ గాంచకను నిస్త్రాణమ్ముగా నమ్మకన్ భవుఁడాప్తుండును దేవదేవుడనుచున్ భావించకన్ స్వార్థమేయవధుల్ దాటినఁ బర్వమంచు బహు దుష్టాత్ముండు దుశ్శీలుఁడైశివ గౌరీశ్వర శంకరా హర యనన్ జేకూఱు సర్వాపదల్భగవంతుడు చూసేది కేవలం సద్వర్తన మాత్రమేనండిపొడవడు దుష్టుడు
కం:శివునిన్ ద్వేషించెడు వైష్ణవ గురు డీ రీతి బల్కె "నాయన! మన కేశవు డొక్కడె మోక్ష మిడునుశివ హర భవ శంకర యనఁ జేకుఱు నిడుమల్
2)మ:స్తవముల్ పెక్కు లొనర్చినా విహమునన్ సౌభాగ్యముల్ బొంద నయ్యవి ప్రాప్తించిన శాశ్వతమ్ము లగునే?యధ్యాత్మ విద్యార్థి వై"శివ! గౌరీశ్వర! శంకరా! హర!" యనన్ జేకూఱు సర్వాపదల్, భవ రోగమ్ముల బాపు ముక్తి యను సద్భాగ్యమ్ము నీ జన్మలోన్.
శివుడు కరుణించు భక్తుల శివ హర భవ శంకర యన :: జేకురు నిడుమ ల్ జవమున దొలగును భక్తులు దవి లియు మనసార గొలువ ధార్మిక పరులై
భువి లోన దేవ దేవుని నవమానింపఁ దగ దేరి కైనను సత్యం బవలోకింపఁగ నెవ్విధి శివ హర భవ శంకర యనఁ జేకుఱు నిడుమల్ శ్రవణానందము గల్గ రుద్రునకు వాత్సల్యంబు వర్ధిల్లఁగా నవనార్థమ్మున కుత్సహింపఁగ నసాధ్యం బెద్ది వీక్షింపఁగా భవ భక్తాలిని నిర్దయం గదియు నాపద్రాజి కెల్లన్ వెసన్ శివ గౌరీశ్వర శంకరా హర యనన్ జేకూఱు సర్వాపదల్
భవము నశించును భక్తిగశివ హర భవ శంకర యనఁ, జేకుఱు నిడుమల్శివ దూషణ మొనరించినభవహరుఁడగు శివుని వేడ భయములు తొలగున్
శివరాత్రిన్ శివసన్నిధానమున విశ్వేశున్ మదిన్ నిల్పుచున్భవ నాశంబు వరంబుగా నొసఁగు సంభావించి సద్భక్తితోశివ గౌరీశ్వర శంకరా హర యనన్, జేకూఱు సర్వాపదల్శివనిందా పరులైన కుత్సితులకున్ సిద్ధించుగా దుర్గతుల్
కందంఅవనిన్ భగవన్నామముస్తవమొనరింపనను వాడు సైతము భక్తిన్వివశత్వమ్మున మఱి మఱిశివ! హర! భవ! శంకర యనఁ, జేకుఱు నిడుముల్మత్తేభవిక్రీడితముఅవనిన్ దైవము నెప్పుడున్ మదిని నేనాశించి యేదానికిన్స్తవమున్ జేయనె జేయనన్ మనుజునిన్ సైతమ్ము భక్త్యాత్ముడైవివశత్వమ్మున మాటిమాటికిని సద్విశ్వాసమేపారగన్శివ! గౌరీశ్వర! శంకరా! హర యనన్, జేకూఱు సర్వాపదల్
శివ హర భవ శంకర యనఁ జేకుఱు నిడుమల్,
రిప్లయితొలగించండిశిరసి ధరింతును నీ చరణారవిందముల్।
భవభయ హరణ పరమేశ్వర పరాత్పర,
భక్తుల పాలిత పరమానంద కందర॥
గంగాధర గిరిజా రమణ గౌరీశ,
నీలకంఠ శూలపాణి జగదీశ।
అర్ధనారీశ్వర ఆది అనంత,
ఆనంద తాండవ విహారి చిదంబరాంత॥
పశుపతి పరమ శివ శాశ్వత మూర్తి,
పాప విమోచన పవిత్ర కీర్తి।
ఓంకార స్వరూప ఒళివెలుగు దీప,
ఉమామహేశ్వర నీకు నా నిత్య స్మృతి దీప॥
నామస్మరణే మాకు నావకరంబు,
నీకరుణే మా జీవనారంభంబు।
శివ హర భవ శంకర శరణు శరణు,
చిరమున మా మనమున నిలచు పరమధనము॥
శివ కలుగును శివరాత్రిని
రిప్లయితొలగించండిశివ హర భవ శంకర యనఁ ; జేకుఱు నిడుమల్
భవుని మరచి జీవితమును
చవి, పరితోషముల తోడ సాగించినచో
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిభవమన్నది లేదనుచును
భవుడన్నను కల్పితమని వాచించెడి వా
డు విడంబనమ్ము తోడను
శివ హర భవ శంకర యనఁ జేకుఱు నిడుమల్.
ధవనాంశుండను జూటమందున సదాతా దాల్చెడిన్ వాడెగా
భవనాశుండును రక్షకుండనుచు విశ్వాసమ్ముతో నిత్యమున్
శివ గౌరీశ్వర శంకరా హర యనన్ , జేకూఱు సర్వాపదల్
భువిలో మక్కిలు నంచు సర్వరసులౌ మోక్షార్థులే చెప్పిరే.
శివరాత్రినిఁ భక్త జనులు
రిప్లయితొలగించండిశివ హర భవ శంకర యనఁ ,జేకుఱు నిడుమల్
వ్యవధి రహితమై తొలఁగగ
భువిపై భక్తుల మనుగడ మోదాన్వితమౌ
స్తవనీయంబని చంద్రచూడుని సదా శ్లాగింతురే భక్తులే
శ్రవణానందము కల్గురీతి సతమా సర్వేశ్వరున్ దల్చుచున్
శివ గౌరీశ్వర శంకరా హర యనన్, జేకూఱు సర్వాపదల్
వ్యవధానంబు హుళక్కియై తొలఁగగా భాసిల్లునానందమే
కం॥ చవిఁ గనక భక్తిఁ దలఁపక
రిప్లయితొలగించండిభువిలో స్వార్థము విరియఁగ పొడవఁడు నటులన్
వివరించఁగఁ బర్వ మనుచు
శివ హర భవ శంకర యనఁ జేకుఱు నిడుమల్
మ॥ చవి లేకుండఁగ భక్తిఁ గాంచకను నిస్త్రాణమ్ముగా నమ్మకన్
భవుఁడాప్తుండును దేవదేవుడనుచున్ భావించకన్ స్వార్థమే
యవధుల్ దాటినఁ బర్వమంచు బహు దుష్టాత్ముండు దుశ్శీలుఁడై
శివ గౌరీశ్వర శంకరా హర యనన్ జేకూఱు సర్వాపదల్
భగవంతుడు చూసేది కేవలం సద్వర్తన మాత్రమేనండి
పొడవడు దుష్టుడు
కం:శివునిన్ ద్వేషించెడు వై
రిప్లయితొలగించండిష్ణవ గురు డీ రీతి బల్కె "నాయన! మన కే
శవు డొక్కడె మోక్ష మిడును
శివ హర భవ శంకర యనఁ జేకుఱు నిడుమల్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి2)మ:స్తవముల్ పెక్కు లొనర్చినా విహమునన్ సౌభాగ్యముల్ బొంద న
రిప్లయితొలగించండియ్యవి ప్రాప్తించిన శాశ్వతమ్ము లగునే?యధ్యాత్మ విద్యార్థి వై
"శివ! గౌరీశ్వర! శంకరా! హర!" యనన్ జేకూఱు సర్వాపదల్,
భవ రోగమ్ముల బాపు ముక్తి యను సద్భాగ్యమ్ము నీ జన్మలోన్.
శివుడు కరుణించు భక్తుల
రిప్లయితొలగించండిశివ హర భవ శంకర యన :: జేకురు నిడుమ ల్ జవమున దొలగును భక్తులు
దవి లియు మనసార గొలువ ధార్మిక పరులై
భువి లోన దేవ దేవుని
రిప్లయితొలగించండినవమానింపఁ దగ దేరి కైనను సత్యం
బవలోకింపఁగ నెవ్విధి
శివ హర భవ శంకర యనఁ జేకుఱు నిడుమల్
శ్రవణానందము గల్గ రుద్రునకు వాత్సల్యంబు వర్ధిల్లఁగా
నవనార్థమ్మున కుత్సహింపఁగ నసాధ్యం బెద్ది వీక్షింపఁగా
భవ భక్తాలిని నిర్దయం గదియు నాపద్రాజి కెల్లన్ వెసన్
శివ గౌరీశ్వర శంకరా హర యనన్ జేకూఱు సర్వాపదల్
భవము నశించును భక్తిగ
రిప్లయితొలగించండిశివ హర భవ శంకర యనఁ, జేకుఱు నిడుమల్
శివ దూషణ మొనరించిన
భవహరుఁడగు శివుని వేడ భయములు తొలగున్
శివరాత్రిన్ శివసన్నిధానమున విశ్వేశున్ మదిన్ నిల్పుచున్
రిప్లయితొలగించండిభవ నాశంబు వరంబుగా నొసఁగు సంభావించి సద్భక్తితో
శివ గౌరీశ్వర శంకరా హర యనన్, జేకూఱు సర్వాపదల్
శివనిందా పరులైన కుత్సితులకున్ సిద్ధించుగా దుర్గతుల్
కందం
రిప్లయితొలగించండిఅవనిన్ భగవన్నామము
స్తవమొనరింపనను వాడు సైతము భక్తిన్
వివశత్వమ్మున మఱి మఱి
శివ! హర! భవ! శంకర యనఁ, జేకుఱు నిడుముల్
మత్తేభవిక్రీడితము
అవనిన్ దైవము నెప్పుడున్ మదిని నేనాశించి యేదానికిన్
స్తవమున్ జేయనె జేయనన్ మనుజునిన్ సైతమ్ము భక్త్యాత్ముడై
వివశత్వమ్మున మాటిమాటికిని సద్విశ్వాసమేపారగన్
శివ! గౌరీశ్వర! శంకరా! హర యనన్, జేకూఱు సర్వాపదల్