23-2-2026 (సోమవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“తన్నినఁ గుందకయె నవ్వఁ దగు నెల్లపుడున్”(లేదా...)“తన్నినఁ దిట్టినన్ మదినిఁ దాపముఁ జెందక నవ్వఁగాఁ దగున్”
నిన్ననె కన్నని గాథను విన్న కొ మరునికి దృఢముగ పెలుచన గలుగన్మన్ను తినునతని బొమ్మనుతన్నినఁ గుందకయె నవ్వఁ దగు నెల్లపుడున్
కందంఎన్నెన్నో నేర్ప మనకుసున్నితముగ కర్కశముగఁ జుట్టు ననుభవాలెన్నియొ! ముద్దిడిన. ,గురుడుదన్నినఁ గుందకయె నవ్వఁ దగు నెల్లపుడున్ఉత్పలమాలఎన్నియొ నేర్పఁగన్ మనకు నిట్లని యట్లని దూరదృష్టితోసున్నిత, కర్కశమ్ములను జుట్టును తానను భుక్తినిచ్చుతన్సన్నుతులందెడున్ గురుఁడు స్వానుభవోక్తుల ముద్దు సేసినన్దన్నినఁ దిట్టినన్ మదినిఁ దాపముఁ జెందక నవ్వఁగాఁ దగున్
ఎన్నో యేండ్లకు పుట్టినికన్నకొడుకు వాడనుచును గారాబముతో మిన్నగ పెంచుకొనెడి చొఱ తన్నినఁ గుందకయె నవ్వఁ దగు నెల్లపుడున్.చెన్నగు రూపమున్ గలిగి చేష్టల తోడ మనస్సు దోచెడిన్ పిన్న వయస్సు బాలకుడె పెన్నిధి యంటు దలంచి పెద్దలే తిన్నగ పెంచుకొన్న తమ దేహజుడర్మిలి తల్లిదండ్రులన్ తన్నినఁ దిట్టినన్ మదినిఁ దాపముఁ జెందక నవ్వఁగాఁ దగున్.
ఎన్నిక కాగోరినచోక్రన్నన నీలక్షణములు గావలయుగదాసున్నిత మన్నది వీడుచుతన్నినఁ గుందకయె నవ్వఁ దగు నెల్లపుడున్ఎన్నికలందు నిల్పుటకు నెవ్విధి సిద్ధము సేయగావలెన్?పన్నుగ మాటలాడి పలు వన్నెలు చిన్నెలు చూపగావలెన్సున్నిత మన్నదే మరచి చోద్యపు పోకడ లుండగావలెన్తన్నినఁ దిట్టినన్ మదినిఁ దాపముఁ జెందక నవ్వఁగాఁ దగున్
నిన్ననె కన్నని గాథను
రిప్లయితొలగించండివిన్న కొ మరునికి దృఢముగ పెలుచన గలుగన్
మన్ను తినునతని బొమ్మను
తన్నినఁ గుందకయె నవ్వఁ దగు నెల్లపుడున్
కందం
రిప్లయితొలగించండిఎన్నెన్నో నేర్ప మనకు
సున్నితముగ కర్కశముగఁ జుట్టు ననుభవా
లెన్నియొ! ముద్దిడిన. ,గురుడు
దన్నినఁ గుందకయె నవ్వఁ దగు నెల్లపుడున్
ఉత్పలమాల
ఎన్నియొ నేర్పఁగన్ మనకు నిట్లని యట్లని దూరదృష్టితో
సున్నిత, కర్కశమ్ములను జుట్టును తానను భుక్తినిచ్చుతన్
సన్నుతులందెడున్ గురుఁడు స్వానుభవోక్తుల ముద్దు సేసినన్
దన్నినఁ దిట్టినన్ మదినిఁ దాపముఁ జెందక నవ్వఁగాఁ దగున్
రిప్లయితొలగించండిఎన్నో యేండ్లకు పుట్టిని
కన్నకొడుకు వాడనుచును గారాబముతో
మిన్నగ పెంచుకొనెడి చొఱ
తన్నినఁ గుందకయె నవ్వఁ దగు నెల్లపుడున్.
చెన్నగు రూపమున్ గలిగి చేష్టల తోడ మనస్సు దోచెడిన్
పిన్న వయస్సు బాలకుడె పెన్నిధి యంటు దలంచి పెద్దలే
తిన్నగ పెంచుకొన్న తమ దేహజుడర్మిలి తల్లిదండ్రులన్
తన్నినఁ దిట్టినన్ మదినిఁ దాపముఁ జెందక నవ్వఁగాఁ దగున్.
ఎన్నిక కాగోరినచో
రిప్లయితొలగించండిక్రన్నన నీలక్షణములు గావలయుగదా
సున్నిత మన్నది వీడుచు
తన్నినఁ గుందకయె నవ్వఁ దగు నెల్లపుడున్
ఎన్నికలందు నిల్పుటకు నెవ్విధి సిద్ధము సేయగావలెన్?
పన్నుగ మాటలాడి పలు వన్నెలు చిన్నెలు చూపగావలెన్
సున్నిత మన్నదే మరచి చోద్యపు పోకడ లుండగావలెన్
తన్నినఁ దిట్టినన్ మదినిఁ దాపముఁ జెందక నవ్వఁగాఁ దగున్