26-2-2026 (గురువారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“సులభ మగును రాఘవపాండవీయమ్ముఁ జదువ”(లేదా...)“కడున్ సులభముగానె యర్థమగు సూరన రాఘవపాండవీయమే”
(ఛందోగోపనము)
తేటగీతిరామచరిత పాండవ గాథ రంగరింపద్వ్యర్థి కావ్యమ్ము వెలుగొందె! వ్యాకరణముమేటి పదసంపద గలుగ మీకు సులభమగును రాఘవపాండవీయమ్ముఁ జదువచంపకమాలతెలియుచు రామగాథ పరిధిన్ మరి పంచమవేద సార మావల పదసంపదన్ మిగుల వ్యాకరణాంశపు జ్ఞానదీప్తిమైగలిమిగ ద్వ్యర్థి కావ్యమదె కల్గఁగ నిష్ఠ తలిర్పఁగన్ గడున్సులభముగానె యర్థమగు సూరన రాఘవపాండవీయమే
రక రకముల కవితల రచన జేసి ,రాముని కథతోపాటు భారతము గూర్చు పింగళి విరచిత కవిత బెడగు సులభ మగును రాఘవపాండవీయమ్ముఁ జదువ
కఠిన తరమని పించెడి కావ్యమంచుపలుక నేలర యిదికాంచ వసుధయందుసంస్కృతాంధ్ర పండితులకున్ జాల సులభ మగును రాఘవపాండవీయమ్ముఁ జదువ.లలిత పదమ్ములందు కనరావని చింతయదేల చూడగావిలసిత మౌ పదమ్ములవి విజ్ఞులు మెచ్చెడి సంస్కృతమ్ముతో తెలుగున పాటవమ్ముగల ధీమతులే పఠియించినన్ కడున్ సులభముగానె యర్థమగు సూరన రాఘవపాండవీయమే.
శ్లేష విశ్లేషకులు విప్పిచెప్పు చుండరెండు రీతుల ధ్వనియించు చుండు గాదె!వివరణాత్మక ప్రచురణ వెలయ సులభమగును రాఘవపాండవీయమ్ముఁ జదువతెలిసిన రామగాథ మరి తిక్కన భారతమే సదా మనోఫలకము పైన నుండుగద పాఠకులెల్ల మహాద్భుతంబనన్బలువురు పండితోత్తములు భావమునే వివరింపగా కడున్ సులభముగానె యర్థమగు సూరన రాఘవపాండవీయమే
తేటగీతి
రిప్లయితొలగించండిరామచరిత పాండవ గాథ రంగరింప
ద్వ్యర్థి కావ్యమ్ము వెలుగొందె! వ్యాకరణము
మేటి పదసంపద గలుగ మీకు సులభ
మగును రాఘవపాండవీయమ్ముఁ జదువ
చంపకమాల
తెలియుచు రామగాథ పరిధిన్ మరి పంచమవేద సార మా
వల పదసంపదన్ మిగుల వ్యాకరణాంశపు జ్ఞానదీప్తిమై
గలిమిగ ద్వ్యర్థి కావ్యమదె కల్గఁగ నిష్ఠ తలిర్పఁగన్ గడున్
సులభముగానె యర్థమగు సూరన రాఘవపాండవీయమే
రక రకముల కవితల రచన జేసి ,
రిప్లయితొలగించండిరాముని కథతోపాటు భారతము గూర్చు
పింగళి విరచిత కవిత బెడగు సులభ
మగును రాఘవపాండవీయమ్ముఁ జదువ
రిప్లయితొలగించండికఠిన తరమని పించెడి కావ్యమంచు
పలుక నేలర యిదికాంచ వసుధయందు
సంస్కృతాంధ్ర పండితులకున్ జాల సులభ
మగును రాఘవపాండవీయమ్ముఁ జదువ.
లలిత పదమ్ములందు కనరావని చింతయదేల చూడగా
విలసిత మౌ పదమ్ములవి విజ్ఞులు మెచ్చెడి సంస్కృతమ్ముతో
తెలుగున పాటవమ్ముగల ధీమతులే పఠియించినన్ కడున్
సులభముగానె యర్థమగు సూరన రాఘవపాండవీయమే.
శ్లేష విశ్లేషకులు విప్పిచెప్పు చుండ
రిప్లయితొలగించండిరెండు రీతుల ధ్వనియించు చుండు గాదె!
వివరణాత్మక ప్రచురణ వెలయ సులభ
మగును రాఘవపాండవీయమ్ముఁ జదువ
తెలిసిన రామగాథ మరి తిక్కన భారతమే సదా మనో
ఫలకము పైన నుండుగద పాఠకులెల్ల మహాద్భుతంబనన్
బలువురు పండితోత్తములు భావమునే వివరింపగా కడున్
సులభముగానె యర్థమగు సూరన రాఘవపాండవీయమే