31-7-2026 (శుక్రవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఆద్యంతరహితుఁ డొక శిశువై యర్చించెన్”
(లేదా...)
“ఆద్యంతంబులు లేనివాఁడు శిశువై యర్చించె నాశాంతమున్”
(న.చ. సాహిత్ అర్ధశతావధానంలో మంచినీళ్ళ సరస్వతి గారి సమస్య)
వేద్యుడు సాందీపని దరి విద్యను నేర్వంగ జేరి వృషనాషుండే విద్యాకరి నచ్చోటను ఆద్యంతరహితుఁ డొక శిశువై యర్చించెన్.*(శిశువు = శిష్యుడు)*హృద్యంబేను పురాణ గాథలనుచున్ హేరాళ మాలించితిన్ విద్యా వేత్తలు చెప్పు గాథలవి యుద్వేలమ్ము గా వింటి నో విద్యావంతుని గా ప్రసిద్ధులిపుడావేదించుమా యెప్పుడా నాద్యంతంబులు లేనివాఁడు శిశువై యర్చించె నాశాంతమున్?
ఉద్యతి దుష్టుల దునుమగ చోద్యముగ ఖయిదున గంసు సోదరి కమరన్హృద్యమగు రీతి నామోనుఆద్యంతరహితుఁ డొక శిశువై యర్చించెన్”
సద్యశమొందిన బలినేచోద్యంబన మూడడుగులు చొక్కిలె వటువేహృద్యంబైన విధంబుననాద్యంతరహితుఁ డొక శిశువై యర్చించెన్ఆద్యంతమ్మొక చిత్రమైన తమితో నాలింతురీ ఘట్టమేచోద్యంబైన పురాణగాథఁ బలినే చొక్కింప భావించుచున్విద్యాలంకృత శోభితుండు వటువాపేక్షించి మూడడ్గులందాద్యంతంబులు లేనివాఁడు శిశువై యర్చించె నాశాంతమున్
-చోద్యంబుగ రఘురాముండాద్యంతరహితుడొక శిశువై యర్చించెన్వేద్యంబుగ ఋషిమునులన్పాద్యాదులతోడు సన్నిభత్వము తెలుపన్
ఆద్యుడు గా సృష్టి కి నా మో ద్యపు స్థితు ల నొ న రించి పో షించు చు దా చోద్య ము గా నన సూ య కు నా ద్యంత రహితు డొ క శిశు వై య ర్చి o చె న్
విద్యా బుద్ధులు నేర్చినాడు మునులౌ విద్వాంసులే నేర్పగన్సద్యో జాతుని చాపమున్ విరిచి తా సంకల్ప మాత్రంబునన్చోద్యంబౌ విధి పెద్దలన్ గురువులన్ శుద్దాత్ము డారాముడున్ ఆద్యంతంబులు లేని వాడు శిశువై యర్చించె నాశాంతమున్
రిప్లయితొలగించండివేద్యుడు సాందీపని దరి
విద్యను నేర్వంగ జేరి వృషనాషుండే
విద్యాకరి నచ్చోటను
ఆద్యంతరహితుఁ డొక శిశువై యర్చించెన్.
*(శిశువు = శిష్యుడు)*
హృద్యంబేను పురాణ గాథలనుచున్ హేరాళ మాలించితిన్
విద్యా వేత్తలు చెప్పు గాథలవి యుద్వేలమ్ము గా వింటి నో
విద్యావంతుని గా ప్రసిద్ధులిపుడావేదించుమా యెప్పుడా
నాద్యంతంబులు లేనివాఁడు శిశువై యర్చించె నాశాంతమున్?
ఉద్యతి దుష్టుల దునుమగ
రిప్లయితొలగించండిచోద్యముగ ఖయిదున గంసు సోదరి కమరన్
హృద్యమగు రీతి నామోను
ఆద్యంతరహితుఁ డొక శిశువై యర్చించెన్”
సద్యశమొందిన బలినే
రిప్లయితొలగించండిచోద్యంబన మూడడుగులు చొక్కిలె వటువే
హృద్యంబైన విధంబున
నాద్యంతరహితుఁ డొక శిశువై యర్చించెన్
ఆద్యంతమ్మొక చిత్రమైన తమితో నాలింతురీ ఘట్టమే
చోద్యంబైన పురాణగాథఁ బలినే చొక్కింప భావించుచున్
విద్యాలంకృత శోభితుండు వటువాపేక్షించి మూడడ్గులం
దాద్యంతంబులు లేనివాఁడు శిశువై యర్చించె నాశాంతమున్
-
రిప్లయితొలగించండిచోద్యంబుగ రఘురాముం
డాద్యంతరహితుడొక శిశువై యర్చించెన్
వేద్యంబుగ ఋషిమునులన్
పాద్యాదులతోడు సన్నిభత్వము తెలుపన్
ఆద్యుడు గా సృష్టి కి నా
రిప్లయితొలగించండిమో ద్యపు స్థితు ల నొ న రించి పో షించు చు దా
చోద్య ము గా నన సూ య కు
నా ద్యంత రహితు డొ క శిశు వై య ర్చి o చె న్
విద్యా బుద్ధులు నేర్చినాడు మునులౌ విద్వాంసులే నేర్పగన్
రిప్లయితొలగించండిసద్యో జాతుని చాపమున్ విరిచి తా సంకల్ప మాత్రంబునన్
చోద్యంబౌ విధి పెద్దలన్ గురువులన్ శుద్దాత్ము డారాముడున్
ఆద్యంతంబులు లేని వాడు శిశువై యర్చించె నాశాంతమున్