30, జులై 2026, గురువారం

సమస్య - 5544

31-7-2026 (శుక్రవారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“ఆద్యంతరహితుఁ డొక శిశువై యర్చించెన్”

(లేదా...)

“ఆద్యంతంబులు లేనివాఁడు శిశువై యర్చించె నాశాంతమున్”

(న.చ. సాహిత్ అర్ధశతావధానంలో మంచినీళ్ళ సరస్వతి గారి సమస్య)

8 కామెంట్‌లు:


  1. వేద్యుడు సాందీపని దరి
    విద్యను నేర్వంగ జేరి వృషనాషుండే
    విద్యాకరి నచ్చోటను
    ఆద్యంతరహితుఁ డొక శిశువై యర్చించెన్.
    *(శిశువు = శిష్యుడు)*

    హృద్యంబేను పురాణ గాథలనుచున్ హేరాళ మాలించితిన్
    విద్యా వేత్తలు చెప్పు గాథలవి యుద్వేలమ్ము గా వింటి నో
    విద్యావంతుని గా ప్రసిద్ధులిపుడావేదించుమా యెప్పుడా
    నాద్యంతంబులు లేనివాఁడు శిశువై యర్చించె నాశాంతమున్?

    రిప్లయితొలగించండి
  2. ఉద్యతి దుష్టుల దునుమగ
    చోద్యముగ ఖయిదున గంసు సోదరి కమరన్
    హృద్యమగు రీతి నామోను
    ఆద్యంతరహితుఁ డొక శిశువై యర్చించెన్”

    రిప్లయితొలగించండి
  3. సద్యశమొందిన బలినే
    చోద్యంబన మూడడుగులు చొక్కిలె వటువే
    హృద్యంబైన విధంబున
    నాద్యంతరహితుఁ డొక శిశువై యర్చించెన్

    ఆద్యంతమ్మొక చిత్రమైన తమితో నాలింతురీ ఘట్టమే
    చోద్యంబైన పురాణగాథఁ బలినే చొక్కింప భావించుచున్
    విద్యాలంకృత శోభితుండు వటువాపేక్షించి మూడడ్గులం
    దాద్యంతంబులు లేనివాఁడు శిశువై యర్చించె నాశాంతమున్

    రిప్లయితొలగించండి
  4. -
    చోద్యంబుగ రఘురాముం
    డాద్యంతరహితుడొక శిశువై యర్చించెన్
    వేద్యంబుగ ఋషిమునులన్
    పాద్యాదులతోడు‌ సన్నిభత్వము తెలుపన్


    రిప్లయితొలగించండి
  5. ఆద్యుడు గా సృష్టి కి నా
    మో ద్యపు స్థితు ల నొ న రించి పో షించు చు దా
    చోద్య ము గా నన సూ య కు
    నా ద్యంత రహితు డొ క శిశు వై య ర్చి o చె న్

    రిప్లయితొలగించండి
  6. విద్యా బుద్ధులు నేర్చినాడు మునులౌ విద్వాంసులే నేర్పగన్
    సద్యో జాతుని చాపమున్ విరిచెఁతా సంకల్ప మాత్రంబునన్
    చోద్యంబౌ విధి పెద్దలన్ గురువులన్ శుద్దాత్ము డారాముడున్
    ఆద్యంతంబులు లేని వాడు శిశువై యర్చించె నాశాంతమున్

    రిప్లయితొలగించండి