14, అక్టోబర్ 2011, శుక్రవారం
సమస్యా పూరణం -492 (దామోదరుఁ దిట్టువాఁడె)
కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
దామోదరుఁ దిట్టువాఁడె ధనవంతుఁ డగున్.
13, అక్టోబర్ 2011, గురువారం
సమస్యా పూరణం -491 (ద్రోణసుతుఁడు పాండవులకు)
కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
ద్రోణసుతుఁడు పాండవులకు ప్రాణసఖుఁడు.
12, అక్టోబర్ 2011, బుధవారం
నా పాటలు - (సాయి పాట - 1)
శ్రీకరా! చిదంబరా!
శ్రీకరా! చిదంబరా! గురువరా! పరాత్పరా!
చిన్మయా! కృపాకరా! షిరిడి సాయి! పాహిమాం
సదా భజామి సాయిరాం!
సదా స్మరామి సాయిరాం! .................................
||
శ్రీకరా
||
మనోహరం మనోహరం త్వదీయ నామకీర్తనం
||
మనో
||
తమోహరం తమోహరం త్వదీయ రూపదర్శనం .....
||
శ్రీకరా
||
శుభంకరం శుభంకరం త్వదీయ పాదసేవనం
||
శుభం
||
సుఖంకరం సుఖంకరం త్వదీయ బోధపాలనం .......
||
శ్రీకరా
||
జయప్రదం జయప్రదం త్వదీయ సుగుణవర్ణనం
||
జయ
||
హితప్రదం హితప్రదం త్వదీయ ఊదిధారణం ..........
||
శ్రీకరా
||
శ్రీ షిరిడి సాయి గీతాంజలి
రచన - కంది శంకరయ్య
సంగీతం - డా. సంజయ్ కింగీ.
గానం - ఉన్నతి, బృందం.
ఈ పాటను క్రింది url ద్వారా esnips లో వినండి.
http://www.esnips.com/doc/7c6af438-1be2-468b-b847-111f08078995/Sai---Srikara-Chidambara
సన్మాన పంచ రత్నములు
శ్రీమాన్ కట్టమూరి చంద్రశేఖర అవధాని గారికి
షష్టి పూర్తి సందర్భముగా
సమర్పించిన
సన్మాన పంచ రత్నములు.
శ్రీ
శ
భారతీశ శీతాద్రిజేశ సా
మ్ముఖ్య మంది కట్టమూరి చంద్ర
శేఖరావధాని! చిరకాల మారోగ్య
శుభ సుఖములతోడ శోభఁ గనుము.
అష్టావధాన విద్యను
కష్ట మ్మిసుమంత లేక కడు సులభముగా
నిష్టాగోష్ఠిగఁ జేయు వి
శిష్టంబగు ప్రతిభ నీది; చేసెద నుతులన్.
అస్త్రముల దూసిరట ఘన
శాస్త్రజ్ఞులు పృచ్ఛకుల్ ప్రచండముగా నీ
శస్త్రముల వంటి పూరణ
లే స్త్రైణమ్మై సొగసులనే కురిపించెన్.
విరులు సమస్యాపూరణ
లరయ లతలు దత్తపదులు ననఁగ నిషిద్ధా
క్షరు లాకులు వర్ణనములు
మురిపించునులే యుపవనముగ నీ రచనల్.
సృష్ట్యారంభక కరుణా
దృష్ట్యంచల లబ్ధ విభవ దీవ్యద్యశ సం
తుష్ట్యాద్యఖిల శుభంబుల
షష్ట్యబ్ది మహోత్సవమున సఫలతఁ గనుమా!
రచన
కంది శంకరయ్య
(‘ఆంధ్రామృతం’ బ్లాగు శ్రీ చింతా రామాకృష్ణారావు గారి సౌజన్యంతో)
సమస్యా పూరణం -490 (రాతికి పుత్త్రుండు పుట్టె)
కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
రాతికి పుత్త్రుండు పుట్టె రాజీవాక్షీ!
ఈ సమస్యను పంపిన
డా. యస్వీ. రాఘవేంద్ర రావు (సుమశ్రీ) గారికి
ధన్యవాదాలు.
11, అక్టోబర్ 2011, మంగళవారం
సమస్యా పూరణం -489 (పువ్వులోన రెండు)
కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
పువ్వులోన రెండు పువ్వు లమరె!
10, అక్టోబర్ 2011, సోమవారం
సమస్యా పూరణం -488 (భగవదారాధనము చేసి)
కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
భగవదారాధనము చేసి పతితుఁ డయ్యె.
9, అక్టోబర్ 2011, ఆదివారం
సమస్యా పూరణం -487 (ఆదరింపవలదు)
కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
ఆదరింపవలదు పేదజనుల.
సమస్యా పూరణం -486 (జీవుడు జీవిఁ జంపుపని)
వారాంతపు సమస్యాపూరణం
కవిమిత్రులారా,
ఈ వారాంతానికి పూరించవలసిన సమస్య ఇది ..
జీవుడు జీవిఁ జంపుపని
జీవిక కోసమె వృత్తి ధర్మమే
ఈ సమస్యను పంపిన
డా. యస్వీ. రాఘవేంద్రరావు (సుమశ్రీ) గారికి
ధన్యవాదాలు.
8, అక్టోబర్ 2011, శనివారం
దత్తపది - 15 (ఆలము, కాలము, గాలము, మేలము)
కవిమిత్రులారా,
"ఆలము, కాలము, గాలము, మేలము"
పై పదాలను ఉపయోగించి వాతావరణ కాలుష్యంపై
మీకు నచ్చిన ఛందస్సులో పద్యం వ్రాయండి.
ఈ దత్తపదిని పంపిన
డా. యస్వీ. రాఘవేంద్రరావు (సుమశ్రీ) గారికి
ధన్యవాదాలు.
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)