8, అక్టోబర్ 2011, శనివారం

దత్తపది - 15 (ఆలము, కాలము, గాలము, మేలము)

కవిమిత్రులారా,
"ఆలము, కాలము, గాలము, మేలము"
పై పదాలను ఉపయోగించి వాతావరణ కాలుష్యంపై
మీకు నచ్చిన ఛందస్సులో పద్యం వ్రాయండి.

ఈ దత్తపదిని పంపిన
డా. యస్వీ. రాఘవేంద్రరావు (సుమశ్రీ) గారికి
ధన్యవాదాలు.

22 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !

    వాతావరణ కాలుష్యం నుండి కాపాడ బడాలంటే
    అందరూ పూనికగొని చెట్లను పెంచడమే శరణ్యం !

    01)
    ____________________________________________

    మేలము గాదు,యీ జనులు - మేదిని మడ్డిని గప్పుచుండ, పో
    గాలము దాపురిం , చవని;- కాలము లన్నియు తారుమారయెన్ !
    నేలను కావగా మిగుల - నేర్పున జెట్లను బెంచగా వలెన్ !
    ఆలము జేయగా వలయు - నందరు పాదప రక్షణార్థమై !
    ____________________________________________

    రిప్లయితొలగించండి
  2. నేడీ భూమ్మీద నేల కాలుష్యం ! నీరు కాలుష్యం ! గాలి కాలుష్యం !
    ఋతువులు వాటి ధర్మాలే మరచి పోయేటంత కాలుష్యం !
    రోజు రోజుకీ భూమి వేడెక్కి పోతోంది !
    వర్షా కాలం వర్షాలు పడవు !
    శీతా కాలం చలంటే తెలియదు !
    మూడు కాలాల్లోనూ ప్రచండంగా భాను ప్రతాపమే !
    నేలను , నీటిని , గాలిని పరిశుభ్రంగా నుంచ వలసిన ఆవశ్యకత
    యెంతేని గలదు !

    ముఖ్యంగా ప్రాణాధారమైన గాలిని కాపాడి , భూ తాపాన్ని తగ్గించాలంటే
    అందరూ వృక్ష సంతతిని పెంపొందించేందుకు యుద్ధ ప్రాతిపదికన
    నడుం కట్టాలి !
    అంతే కాదు ప్రస్తుతం ఉన్నవాటిని పరి రక్షించుకోవాలి !

    రిప్లయితొలగించండి
  3. మేలము లాడకుమోయీ!
    కాలము మారెననియు, చెడుఁ గాలము వచ్చెన్
    ఆలము తగదిక నన-విన
    వేల? తరువులెల్ల యెడల విరివిగ నిడుమా!

    ఆలము- ఉపేక్ష

    వివరంగా మరో పూరణ చేయుటకు ప్రయత్నించెదను.

    రిప్లయితొలగించండి
  4. వినరా ! వినరా ! నరుడా !
    తెలుసు కోర - పామరుడా !
    భూజాతను - నేనేరా !
    నీ కాయువు - నిచ్చెదరా !||వినరా||

    వేన వేల చెట్లు గొట్టి - నేలను పడ వేసెదరా ?
    కర్రలుగా బొగ్గులుగా - మార్చి మార్చి కాల్చెదరా ?
    మీరు నిలుచు కొమ్మను - మీ చేతులతో నరికెదరా ?
    మీ యింటిని మీరందరు - తగల బెట్టు కొందురా ? ||వినరా||

    మా యంతట మేము పెరిగి - పెద్ద చెట్ల మౌదు మోయ్
    మీకెన్నో ఫలములనే - భక్షింపగ నిత్తు మోయ్
    మీ రొదిలిన గాలి పీల్చి - ప్రాణ వాయు విడుదు మోయ్
    మందులుగా మారి మీకు - ప్రాణంబుల నిడుదు మోయ్ ||వినరా||

    మా పళ్ళే తిని మమ్ముల - నరుకుట యేం న్యాయ మోయ్
    ఉపకారికి నపకారము - జేయుట యేం ధర్మ మోయ్
    కాలుష్యము పెరిగి పెరిగి - మిమ్మే కబళించు నోయ్
    మేమే లే కుండి నంత - మీరెట్లా యుందురోయ్ ||వినరా||

    రిప్లయితొలగించండి
  5. వినరా ! వినరా ! నరుడా !
    తెలుసు కోర - పామరుడా !
    భూజాతను - నేనేరా !
    నీ కాయువు - నిచ్చెదరా !||వినరా||

    1-1)
    _______________________________________________

    వాలము నాంజనేయు వలె - పంకము భూమిని హెచ్చు చున్నదోయ్ !
    జాలము సేయకోయి నర - జన్మము సార్థక మొందు రీతిగా
    సాలము బెంచవోయి పలు - జాతుల, రీతుల పెంపు సేయు మోయ్ !
    గాలులు వీచునోయి , చెడ - గాల్చును జిడ్డును క్షోణి యందునన్ !
    _______________________________________________
    పంకము = బురద, పాపము (కాలుష్యము)

    రిప్లయితొలగించండి
  6. ఆలముఁ జేసి మానవులయాచితరణ్యములన్ని నేరకన్
    కాలముఁ గాలమాగనిటు గాయము పాలగునట్లుఁ జేసి పో
    గాలము దాపురించెనిక. కర్మము లిట్లు ఫలించె నేటికిన్.
    మేలములాడఁ బాడియె? నమేయము లైనవి పాపకర్మముల్!

    రిప్లయితొలగించండి
  7. పై రెండు భాగాలూ

    " వృక్ష సందేశం "

    గా గమనించ ప్రార్థన !

    రిప్లయితొలగించండి
  8. కరుణశ్రీ గారి "పుష్ప విలాపం" నుండి :

    బుద్ద దేవుని భూమిలో - పుట్టి నావు !
    సహజ మగు ప్రేమ నీలోన - చచ్చె నేమి?
    అందమును హత్య జేసెడి - హంతకుండ
    మైల వడి పోయె నోయి నీ - మనుజ జన్మ !

    దీనిని గూడా "వృక్ష సందేశం" లో ముగింపుగా తీసుకోవచ్చు !

    రిప్లయితొలగించండి
  9. కిషోర్ జీ ! 'వృక్ష విలాపం' తో మంచి సందేశ మిచ్చారు.బాగుంది.
    మందాకిని గారూ ! చక్కని పూరణ.

    మేలము లాడకు నరుడా
    కాలముతో; ప్రకృతి వికృత కాలుష్య మవన్!
    ఆలములో గెలువవు లే
    గాలమునకు చిక్కి కాలు కాయము మసియై!!

    రిప్లయితొలగించండి
  10. చిన్న సవరణ తో ....

    మేలము లాడకు నరుడా
    కాలముతో; ప్రకృతి వికృత కాలుష్య మవన్!
    ఆలములో గెలువవు లే
    గాలమునకు చిక్కి చేరు కాయము కాలున్!!

    రిప్లయితొలగించండి
  11. ఆలము సేయరే జనులు హాయిని గూర్చెడి వృక్ష జాలముల్
    కూలుచు నుండగా? ప్రకృతి కూరిమి జూపును మానవాళిపై!
    చాలును మేలమాడుటయె, క్షామము గల్గును హద్దు దాట పో
    గాలము వచ్చు, వర్షము సకాలమునన్ కురవంగబోదికన్!!

    రిప్లయితొలగించండి
  12. ఆలము దప్పు నాయుధము లంతములై ధర కంచు నెంచు ని
    క్కాలము,భూ నభోంతరము కల్మషమున్ బొనరించి మృత్యువన్
    గాలము నందు జిక్కి లయకాల మహోద్ధుర దండధారితో
    మేలము లాడు మానవుడు మిక్కిలి వీరిడి గాడె చూడగన్ .
    యస్వీ రాఘవేంద్ర రావు (సుమశ్రి),రాజమహేంద్రవరము.
    ( కంది శంకరయ్య గారికి నమస్తే నాన్నగారు ఢిల్లీ టూర్ లో ఉన్నారు.వారి అబ్బాయిని టైపు చేసి పంపిస్తున్నాను)

    రిప్లయితొలగించండి
  13. ఆలము కాలమున తగదు,
    మేలము లాడగనురాదు మేదినితో,పో
    గాలము చేరువగును యిల
    గాలియు నేలయు జలములు గలుషితమవగా!!!

    రిప్లయితొలగించండి
  14. ************************************************
    వసంత కిశోర్ గారూ,
    మీ ‘వృక్షసందేశం’ బాగుంది. గోవుల గోపన్న చిత్రంలోని పాటకు మీ పేరడీ కూడా బాగుంది. అభినందనలు.
    ************************************************
    మందాకిని గారూ,
    మీ చిన్న పద్యం, దాని ననుసరించిన పెద్ద పద్యం రెండూ బాగున్నాయి. అభినందనలు.
    ************************************************
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ************************************************
    జిగురు సత్యనారాయణ గారూ,
    మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
    ************************************************
    డా .యస్వీ రాఘవేంద్ర రావు (సుమశ్రీ) గారూ,
    మీ దృష్టిలో నా బ్లాగు పడడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ధన్యవాదాలు.
    మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    ************************************************

    రిప్లయితొలగించండి
  15. మిత్రులందరి పూరణలూ ముచ్చటగా నున్నవి !

    శాస్త్రీజీ ! ధన్యవాదములు !

    శంకరార్యా ! ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి
  16. ఆలము సేయట మేలా?
    కాలము తీరుటకుమున్నె కాపాడెదమో
    గాలము లేసి ప్రకృతినిక
    మేలములాడినను పృథ్వి మ్రింగును మనలన్!
    మనవి: గాలములేసి=ఎత్తులువేసి

    రిప్లయితొలగించండి
  17. గన్నవరపు నరసింహ మూర్తి గారి పూరణ ......

    గాలము లేలను మీనుల
    ఆలములును మనుజవరుల నాయువు దీర్చన్
    కాలము తీరదె త్వరితము
    మేలములను నాడుచుండ మేదిని కలకున్ !

    రిప్లయితొలగించండి
  18. ‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ************************************************ ****************
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    పద్యం సలక్షణంగా ఉంది. ఒకటికి రెండుసార్లు చదివాక పూరణలోని మీ భావం అవగతమయింది. బాగుంది. అభినందనలు.
    *****************************************************************

    రిప్లయితొలగించండి
  19. (ఆలము) సేయబోకుమయ యార్యుల మాటలు పైడిమూటలౌ
    (కాలము) ముందునున్నదదె కాగల కార్యములన్నొ చేయగన్
    (గాలము) వేయవయ్య వరకట్నము గోరక కన్యనొక్కతిన్
    (మేలము) గూడుమోయి ఘన మేళము మ్రోగగ పెండ్లి వేదికన్ !!

    రిప్లయితొలగించండి
  20. (కాలము) చేసిన మార్పుగ
    (గాలము) వేసెను ప్రగతికి కావున జగతిన్
    (నాలము) జేయక జాగృతి
    (మేలము) నాపి నిశితముగ మేలును గూఁర్పన్!!

    రిప్లయితొలగించండి