14, అక్టోబర్ 2011, శుక్రవారం

సమస్యా పూరణం -492 (దామోదరుఁ దిట్టువాఁడె)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
దామోదరుఁ దిట్టువాఁడె ధనవంతుఁ డగున్.

52 కామెంట్‌లు:

 1. పండిత నేమాని రామజోగి సన్యాసిరావు గారి పూరణ .....

  ఏ మనెదు వైర భక్తిని
  స్వామికి వాత్సల్యముకద సంతానముపై
  నామము దలచుచు నిత్యము
  దామోదరు దిట్టువాడె ధనవంతుడగున్

  రిప్లయితొలగించండి
 2. నమస్కారములు...!
  మీ సూచనల మేరకు ఫాంట్ మార్చడం జరిగింది. తెలుగు వెలుగు అనే గేయాన్ని ఈ లింక్ లో చదివి మీ అభిప్రాయాలు తెలియ జేయగలరని ఆశిస్తున్నాను.
  http://rpsarma.blogspot.com/2011/10/blog-post_6093.html

  ధన్యవాదములు...!

  రిప్లయితొలగించండి
 3. ఈ మాయలఁ బడి తాళక
  దామోదరుఁ దిట్టు; వాడె ధనవంతుడగున్
  దాఁ మాయా బంధములం
  దేమారక హరినిఁ గొల్చు దీనుండైనన్!

  రిప్లయితొలగించండి
 4. చక్కని పూరణ చేసిన శ్రీ పండిత నేమాని వారికి నమస్సులు.


  కోమల నామము గాదే !
  రామా యని నుడువ వాక్కు రమణీయ మగున్ !!
  వేమరు తలపుల మెదలగ
  దామోదరుఁ దిట్టు వాఁడె ధనవంతుడగున్ !!!

  రిప్లయితొలగించండి
 5. బహు చక్కని పూరణ చేసిన మందాకిని గారికి అభినందనలు !

  రిప్లయితొలగించండి
 6. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  శంకరార్యా !
  తామర + ఆకు = తామరాకు---సవర్ణ దీర్ఘ సంధి గదా !
  మరి యిదేమిటి ?

  తామరపాకు
  తామరపాకు : శబ్దరత్నాకరము (బహుజనపల్లి)
  ద్వ. వి. (తామర + ఆకు)
  పద్మపత్రము. (చూ. తల్లడము)

  రిప్లయితొలగించండి
 7. శంకరార్యా !
  సులక్షణ సారము లో
  8---సమ(ప్రధాన) గణములు
  2---సూర్య గణములు
  6---ఇంద్ర గణములు
  14---చంద్ర గణములు
  చెప్ప బడి యున్నవి !

  ఈ చంద్ర గణములు దేని కొఱకు ?

  రిప్లయితొలగించండి
 8. 01)
  ___________________________________

  తామేలు రూపు దాల్చిన
  తామస శయనుని భజించ - ధన్యత గలుగున్
  తామస గుణ మతి యౌటను
  దామోదరుఁ దిట్టువాఁడె - ధనవంతుఁ డగున్ !
  ___________________________________

  రిప్లయితొలగించండి
 9. గురువు గారికి నమస్కారములతో
  మామాయను పదవి కొఱకు
  దామోదరు దిట్టు వాడె ధనవంతుడగున్|
  ఈ మాయలతోడ జనుల
  వేమార్చుటనేర్చినట్టి వేమన తమ్మా|
  (మామా = మంత్రి , వేమన = విలాస పురుషుడు)
  గురువు గారిని,వేమన గారిని క్షమించమని కోరుతూ|

  రిప్లయితొలగించండి
 10. 02)
  ___________________________________

  తామస గుణులను సైతము
  ప్రేమగ తన దరికి జేర్చు - ప్రేమోన్నతుడే
  మీమాంస లేల మీకిక
  దామోదరుఁ దిట్టువాఁడె - ధనవంతుఁ డగున్ !
  ___________________________________

  రిప్లయితొలగించండి
 11. 03)
  ___________________________________

  ప్రేమను గుండెల దన్నిన
  నామర్షము శిశువు లందు - నగపడ నట్లే
  ప్రేమాస్పదుడగు నాథుని
  దామోదరుఁ, దిట్టువాఁడె - ధనవంతుఁ డగున్ !
  ___________________________________
  నాథుడు = జగన్నాథుడు

  రిప్లయితొలగించండి
 12. 04)
  ___________________________________

  కోమల హృదయుడు గావున
  గోముగ జనులకు శుభములు - గూర్చును గరుణన్ !
  మోమోడగ దన వారిని
  దామోదరుఁ, దిట్టువాఁడె - ధనవంతుఁ డగున్ !
  ___________________________________
  మోమోడు = దయ జూచు

  రిప్లయితొలగించండి
 13. 05)
  ___________________________________

  నామములన్నియు వానివె
  నామ రహితుడును, సహస్త్ర - నాముడు వాడే !
  నామమె గద తిట్టైనను !

  దామోదరుఁ, దిట్టువాఁడె - ధనవంతుఁ డగున్ !
  ___________________________________

  రిప్లయితొలగించండి
 14. 06)
  ___________________________________

  తామే యధికుల మనుకొని
  స్వామిని నిరశించు వారి - సాకును దయతో !
  ఏ మా యవ్యాజ కరుణ !!!
  దామోదరుఁ, దిట్టువాఁడె - ధనవంతుఁ డగున్ !
  ___________________________________

  రిప్లయితొలగించండి
 15. 07)
  ___________________________________

  నామ గుణ రూప రహితుడు
  చీమలు దోమలు సమస్త - జీవులు వాడే !
  ఆ మీనాక్షుని, నఙ్ఞత
  దామోదరు దిట్టువాఁడె - ధనవంతుఁ డగున్ !
  ___________________________________

  రిప్లయితొలగించండి
 16. కామము క్రోధము మోహము
  నేమమ్మునవీడినట్టి నిర్మలచిత్తుం
  డేమని సర్వేశ్వరుడగు
  దామోదరు దిట్టు? వాఁడెధనవంతుఁడగున్ !

  రిప్లయితొలగించండి
 17. హేమకశిపునిసముఖమున
  సామెతకైనేని పొగడ శౌరిని నేరం
  బౌ,మృత్యువుశిక్షౌ;నా
  దామోదరుఁ దిట్టువాఁడె ధనవంతుఁడగున్.

  రిప్లయితొలగించండి
 18. ఆర్యా !

  ఇది నావంతు పూరణ ! చిత్తగించవలెను ,

  మామతమున్ చేరండని
  వ్యామోహముజూపి,నేడు, పరమతసహనం
  బేమాత్రముపాటింపక
  దామోదరు(దిట్టువాడె ధనవంతుడగున్

  రిప్లయితొలగించండి
 19. పండిత నేమాని వారి వ్యాఖ్య ....

  అయ్యా! వసంత కిశోరు గారూ!
  సవర్ణ దీర్ఘ సంధి సంస్కృత సంధి.
  ఉదా: రాజ + ఆజ్ఞ = రాజాజ్ఞ
  సదా + ఆనందము = సదానందము
  తెలుగు పదాలకు తెలుగు సంధులే వర్తిస్తాయి.
  తామర + ఆకు = తామరాకు (అకార సంధి)

  రిప్లయితొలగించండి
 20. శంకరార్యా !
  అది సరే !
  తామర + ఆకు = తామరపాకు
  అని ఉంది ఆంధ్రభారతి(web dictionary) లో
  నే నడిగింది దీని గురించి

  రిప్లయితొలగించండి
 21. For Sri Vasamt KiShore Garu.
  అయ్యా! శుభాశీస్సులు.
  తామరాకు మరియు తామరపాకు అనే 2 పదములనూ వాడవచ్చును. పుగాగమ సంధి చేత తామరపాకు అగును. ఆగమము నిత్యము కాదు కాబట్టి పుగామము చేయవచ్చును లేనిచో చేయకపోవచ్చును.
  ఇట్లు - నేమాని సన్యాసిరావు

  రిప్లయితొలగించండి
 22. "తామరపాకు" - అన్నిచోట్లా(పదములు,అర్థవివరణలలో) , ఎక్కడైనా( పదములో ఎక్కడైనా)- వెదకితే మరిన్ని వివరాలను, కావ్యప్రయోగాలను చూడవచ్చు.

  నమస్సులతో,
  శేషతల్పశాయి.

  రిప్లయితొలగించండి
 23. ఏ మాయలు తెలియక హరి
  నామామృత మందు మునిగి నిశ్చల భక్తిన్ !
  ఏ మఱు పాటున నొకపరి
  దామోదరు దిట్టు వాడె ధనవంతుడగున్ !

  రిప్లయితొలగించండి
 24. ఏమాయకు లోనయ్యె సుదాముడు
  ఆమాయతొ హితుని విడచె హా వైరమునన్ !
  ప్రెమారగ దినిపించ నటుకులు
  దామోదరు దిట్టు వాడె ధనవంతు డగున్ !

  రిప్లయితొలగించండి
 25. **********************************************************************
  పండిత నేమాని గారూ,
  వైరభక్తి అంశంగా మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
  **********************************************************************
  మందాకిని గారూ,
  ప్రశస్తంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
  మీరు అవసరం లేని చోట అరసున్నా పెడుతున్నారు. అరసున్నాలు అసలే వాడకున్నా తప్పులేదు. కాని అవసరం లేని చోట పెట్టడం పెద్ద తప్పు. మీ పూరణలో ‘దాఁ మాయా’ ... ?
  **********************************************************************
  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  ‘రమణీయ’మైన పూరణ మీది. అభినందనలు.
  **********************************************************************
  వసంత కిశోర్ గారూ,
  మీ ఏడు పూరణలూ దేనికదే బాగున్నాయి. అభినందనలు.
  **********************************************************************
  వరప్రసాద్ గారూ,
  చక్కగా ఉంది మీ పూరణ. అభినందనలు.
  **********************************************************************
  మంద పీతాంబర్ గారూ,
  చక్కని విరుపుతో మంచి పూరణ చెప్పారు. బాగుంది. అభినందనలు.
  **********************************************************************
  అజ్ఞాత గారూ,
  ప్రశస్తంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
  **********************************************************************
  కళ్యాణ్ గారూ,
  ఉత్తమంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
  **********************************************************************
  రాజేశ్వరక్కయ్యా,
  మంచి పూరణ చేసారు. అభినందనలు.
  కాని రెండవ పాదంలో యతి తప్పింది.
  **********************************************************************

  రిప్లయితొలగించండి
 26. గురువుగారు,
  తాన్ , తాను అనే ఉద్దేశ్యంతో అరసున్నా పెట్టాను. తప్పైతే మన్నించండి.

  రిప్లయితొలగించండి
 27. ఏమాయల వాడో ! గన
  దామోదరు దిట్టు వాడె ధనవంతు డగున్ !
  రాముని తిట్టగ గాచెను,
  ప్రేమారగ రామదాసు పిలువగ దాగెన్ !

  రిప్లయితొలగించండి
 28. హనుమచ్చాస్త్రిగారూ,
  మీ gmail account చూడండి. నేనొక ఈమెయిలు పంపాను.

  రిప్లయితొలగించండి
 29. ఏమో యీ కలి కాలము !
  రాముడు గీముండు లేడు, రామాయణమౌ
  నా ముని కల్పన మనుచున్
  దామోదరుఁ దిట్టువాఁడె ధనవంతుఁ డగున్!

  రిప్లయితొలగించండి
 30. మందాకిని గారికి ,అర్ధానుస్వరములపైన మక్కువ ఉన్న మిత్రులకు చిన్న సూచన. ద్రుత ప్రకృతికము మీది పరుషములకు ( క,చ,ట,త,ప ) సరళము ( గ,జ,ద,ద,బ )లగు ననునది సరళాదేశ సంధి.
  ఆ పై ఆదేశ సరళములకు ముందున్న ద్రుతమునకు బిందువు ( అరసున్న లేక నిండుసున్న ) లేక సంశ్లేషములు విభాష నగు నన్నది సూత్రము.

  మనము సరళాదేశ సంధి చేసి నప్పుడు మాత్రమే అనుస్వరములు ( అర లేక నిండు సున్న) ఉంచ వచ్చును.

  సరళా దేశ సంధి లేనప్పుడు అనుస్వరములు ఉంచ రాదు. కారణము :ద్రుతమునకు సరళ స్థిరములు పరంబగునపుడు ద్రుతమునకు లోపము గాని సంశ్లేషము గాని వస్తాయి. బిందువు రాదు.

  రిప్లయితొలగించండి
 31. మూర్తిగారు,
  శ్రమ తీసుకొని వివరించినందుకు ధన్యవాదములు.
  మీరు చెప్పింది అర్థమైంది.
  ఇక్కడ నా పద్యంలో సంశ్లేషము చేసినచో యతి భంగము కలుగుతుంది. కదా!
  దా మాయా అని ఉన్న అర్థలోపమేమీ రాదంటారా?

  రిప్లయితొలగించండి
 32. మందాకిని గారూ ' దా మాయా ' సరైనదేనండీ ( కాకపోతే గురువు గారు,శ్రీ నేమాని వారు ఉన్నారుగా చెప్పడానికి ). అక్కద ద్రుతమునకు లోపము వచ్చింది. నేను కూడా అనుస్వరములతో తప్పులు చేసి ఓ ఆదివరము జాగ్రత్తగా సంధి సూత్రములు చదివా. టూకీ గా గుర్తు పెట్టుకొన్నాను.

  రిప్లయితొలగించండి
 33. సరళములు గ,జ,డ ద,బ లు మరీ సరళముగా షిఫ్ట్ మీద వేలుంచి డ మీద నొక్కితే 'ద ' రెండు సార్లు పడింది.

  రిప్లయితొలగించండి
 34. శ్రీగురుభ్యోనమ:

  ఏమా యల్లరి కృష్ణా
  ఈ మట్టిన్ దినకుమయ్య ఎన్నడు ననుచున్
  ప్రేమగ నుడువుచు నరచుచు
  దామోదరుఁ దిట్టువాఁడె ధనవంతుఁ డగున్

  రిప్లయితొలగించండి
 35. శ్రీగురుభ్యోనమ:

  పీతాంబర్ గారూ, మీ పద్యం అత్యుత్తమంగా నున్నది. అభినందలు.

  రిప్లయితొలగించండి
 36. అయ్యా ! నమస్సులు !

  ఓపికతో నా కుశ్శంకలు దీర్చిన
  నేమాని వారికి ధన్యవాదములు !

  శంకరార్యా ! ధన్యవాదములు !

  చంద్ర గణములు ఎందుకో ?
  వాటిని ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా వాడడం జరిగిందా ?
  దయచేసి చెప్పగలరు !

  మిత్రులందరి పూరణలూ ముచ్చటగా నున్నవి !

  రిప్లయితొలగించండి
 37. మూర్తీజీ ! అమ్మో ! మీరు డాక్టరే కాకుండా
  తెలుగు పండితులు కూడానా !
  వ్యాకరణ పాఠాలు బాగానే చెబుతున్నారు !
  ఈ నుగాగమం , యడాగమం గురించి కూడా వివరించారంటే
  సగం తప్పులు మాయమైపోతాయి !

  రిప్లయితొలగించండి
 38. కిశోర్ జీ ధన్యవాదములు. నొప్పింపక ,దా నొవ్వక తప్పించుకు తిరుగు వాడె ధన్యుడు సుమతీ ! నాకు చాతనైనది శ్రమ పడటమే తీరిక ఉంటే. నుగామమము యడాగమములలో మిస్సన్న గారు నిపుణులు. నాకు తెలిసిన సుళువులు చెబుతా.

  ఉత్వ సంధి నిత్య సంధి. ఉకారము తర్వాత అచ్చు ఉంటే సంధి చేయాలి. ఉ కారము తర్వాత అందు వలన యడాగమము రాదు. నుగామమునకు అవకాశముంటే వేసుకోవచ్చును.

  ఇ కారము పైన ఇ ఎ లకు తప్ప సాధారణముగా మిగిలిన అచ్చులతో సంధి ఉండదు. అ కారము పైన కూడా ఎక్కువ సందర్భాలలో మిగిలిన అచ్చులతో సంధి జరుగదు. ఇక్కడ య డాగమము వేస్తే 90 శాతము నిర్దోషమే యవుతొంది.

  అందుచే మీరు ఉకారము మీద యడాగమము వెయ్యకండి.
  ఈ విషయాలను మీకు చెప్పినట్లు గురువు గారికి చెప్పకండి. ఎందుకంటే యిది నా పరిశీలనే , శాస్త్ర జ్ఞానము కాదు.

  రిప్లయితొలగించండి
 39. **********************************************************************
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ మొదటి పూరణలో యతి తప్పిందన్నాను కాని ఆ సమయంలో విపరీతమైన తలనొప్పి ఉండడంతో సవరణ సూచించలేదు. మన్నించాలి. ‘నామామృత మందు మునిగి నయమగు భక్తిన్’ అంటే సరి!
  ఇక మీ రెండవ పూరణ .. కుచేలుడు విషయంగా చక్కగా పూరించారు. అభినందనలు.
  కాకపోతే 1,3 పాదాలలో గణదోషం, రెండవ పాదంలో ‘తొ’ ప్రయోగం ... బ్రాకెట్లలో నా సవరణలతో మీ పద్యం ..
  ఏమాయఁ (గనె) సుదాముడు
  ఆమాయ(ను) హితుని విడచె హా వైరమునన్ !
  ప్రేమఁ దినిపించ నటుకులు
  దామోదరు దిట్టు వాడె ధనవంతు డగున్ !
  **********************************************************************
  మందాకిని గారూ,
  తాన్ (తాను) ద్రుతప్రకృతికం. దీనిని గురించి గన్నవరపు వారు చాలా వివరంగా తెలిపారు. అయితే అక్కడ కొన్ని ఉదాహరణలు పేర్కొంటే బాగుండేది. ఈరోజు వీలు చూసుకొని దీనిపై సమగ్రమైన పాఠం ‘వ్యాకరణం’ శీర్షికలో ఇస్తాను.
  **********************************************************************

  రిప్లయితొలగించండి
 40. **********************************************************************
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
  **********************************************************************
  మిస్సన్న గారూ,
  వాస్తవాన్ని దర్శింపజేసారు మీ పూరణతో. బాగుంది. అభినందనలు.
  **********************************************************************
  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  ధన్యవాదాలు. శ్రమ తీసుకొని చక్కని వ్యాకరణ పాఠాన్ని చెప్పి నాకు కర్తవ్యబోధ చేసారు. ఇప్పటి వరకు మిత్రుల పూరణలలో "ఇది తప్పు. ఇలా ప్రయోగించరాదు. నా సవరణ.." అంటూ వస్తున్నానే కాని అది ఎందుకు తప్పు? నా సవరణ ఎలా ఒప్పు? అని వివరంగా చెప్పి వాళ్లు మళ్లీ ఆ తప్పు చేయకుండా సరిదిద్దుకొనే అవకాశం ఇవ్వలేదు. ఏదో హాబీగా, కాలక్షేపం కోసం మొదలుపెట్టిన బ్లాగు ఒక ఉద్యోగనిర్వహణాబాధ్యతగా మారింది. ఆ బాధ్యతకు సంపూర్ణ న్యాయం చేయాలి కదా! అందుకని నే నికనుండి లోపాలను వివరిస్తూ, వాటికి సంబంధించిన వివరాలను ‘వ్యాకరణం’ శీర్షికలో ఇవ్వాలనుకుంటున్నాను. దురదృష్టవశాత్తు నేను చదువుకుంటున్నప్పుడు సరియైన సంస్కృత, వ్యాకరణ గురువులు దొరకలేదు. సంప్రదాయ సాహిత్యం, ఛందస్సు, అలంకార శాస్త్రాలకు మంచి గురువులు దొరికారు. అలాగే ఆధునిక సాహిత్యానికి కూడా సరియైన గురువులు దొరకలేదు. అందువల్ల నాకు భావ, అభ్యుదయ, తదనంతర కవిత్వాల మీద ఆసక్తి లేకుండా పోయింది. నాకున్న అల్ప సంస్కృత, వ్యాకరణ జ్ఞానం స్వయంసంపాదితమే!
  **********************************************************************

  రిప్లయితొలగించండి
 41. **********************************************************************
  శ్రీపతి శాస్త్రి గారూ,
  ఏమా పూరణ? ప్రేమధనం అతిశయించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  **********************************************************************
  వసంత కిశోర్ గారూ,
  చంద్రగణాల గురించి త్వరలోనే వివరంగా ‘ఛందస్సు’ శీర్షికలో పాఠం పెట్టబోతున్నాను. ఇక యడాగమ, నుగాగమాల గురించి, అరసున్నాల గురించి కూడా ‘వ్యాకరణం’ శీర్షికలో పాఠాలు పెట్టుబోతున్నాను. కొంచెం ఓపిక పట్టండి.
  **********************************************************************

  రిప్లయితొలగించండి
 42. మూర్తీజీ ! ధన్యవాదములు !
  గురువుగారికి తెలియకుండా చక్కని పాఠం నా చెవిలో చెప్పారు !
  ధన్యవాదములు !
  శంకరార్యా ! ధన్యవాదములు !
  మీ పాఠాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం !

  రిప్లయితొలగించండి
 43. గురువు గారూ ,నమస్సులు. మీరిప్పటికే చాలా శ్రమ తీసుకొంటున్నారు. మీ దయ వలన తెలుగు భాషాభిమానులమొకచోటుకి చేరాము. మీ బ్లాగు వలన నాకు సహృదయులైన మిత్రులు, మీరు,నేమాని వారు,చింతా వారు వంటి పండితులతో పరిచయము చక్కని కవితలు చదివే అవకాశము కలిగింది. అందులకు మీకు కృతజ్ఞులము. విద్యా లాభము గురువుల వలన,సహాధ్యాయుల వలన పుస్తకాలు చదవడము వలన కలుగుతొంది. మీరు బ్లాగు ద్వారాలు తెఱిచి ఉంచారు కాబట్టి భారమంతా మీ మీదే వదలక ఒకరి కొకరు వారి వీలును బట్టి సహకరించుకొంటే బాగుంటుంది. మీరెక్కువ శ్రమ పడగూడ దనే మా ఆకాంక్ష. అందరమూ యిక్కడ ప్రవృత్తికే చేరాము. కాని మీ వలన చాలా నేర్చుకొంటున్నాము. మీకు మరో పర్యాయము పాదాభివందనములు

  రిప్లయితొలగించండి
 44. నమస్కారములు
  ఒంట్లో బాగుండక పోయినా ఇంత శ్రమ తీసుకుం టున్నందుకు బాధగా ఉంది .అంత తొందర ఏముందీ ? ఒకరోజు గాపు వస్తే నష్టం ఏమీ లేదుగదా ? మనమంతా ఒకటే . ఇక నుంచీ అలా చేయ వద్దు సరేనా ? శ్రమ తీసుకుని సవరణలు చేసి నందుకు ధన్య వాదములు.

  రిప్లయితొలగించండి
 45. గురువుగారూ ధన్యవాదాలు.
  మూర్తిమిత్రమా! ఏమీ తెలియదంటూనే
  చాలా విలువైన వ్యాకరణ పాఠం చెప్పేశారు.
  గురువుగార్ని రెచ్చగొట్టేశారు.
  అభినందనలు.

  రిప్లయితొలగించండి
 46. మామూలౌ స్కాములలో
  గోముగ వేలాది కోట్లు గోల్మాలవగా
  నీమముగ రాత్రి పగలా
  దామోదరుఁ దిట్టువాఁడె ధనవంతుఁ డగున్


  దామోదరుడు = నరేంద్ర దామోదర్ దాస్ మోడి

  ధనవంతుడు = పది రోజుల క్రితం "సీ బీ ఐ" దాడి చేసిన "ముద్దు బిడ్డ"

  రిప్లయితొలగించండి
 47. నీమపు పట్టాలివిగో!
  తామర కొలనది నిజముగ తాతల సొత్తే!
  నీ మహలక్ష్మిని నిమ్మని
  దామోదరుఁ దిట్టువాఁడె ధనవంతుఁ డగున్ :)

  రిప్లయితొలగించండి