12, అక్టోబర్ 2011, బుధవారం

నా పాటలు - (సాయి పాట - 1)

శ్రీకరా! చిదంబరా!

శ్రీకరా! చిదంబరా! గురువరా! పరాత్పరా!
చిన్మయా! కృపాకరా! షిరిడి సాయి! పాహిమాం
సదా భజామి సాయిరాం!
సదా స్మరామి సాయిరాం! .................................|| శ్రీకరా ||

మనోహరం మనోహరం త్వదీయ నామకీర్తనం || మనో ||
తమోహరం తమోహరం త్వదీయ రూపదర్శనం .....|| శ్రీకరా ||

శుభంకరం శుభంకరం త్వదీయ పాదసేవనం || శుభం ||
సుఖంకరం సుఖంకరం త్వదీయ బోధపాలనం .......|| శ్రీకరా ||

జయప్రదం జయప్రదం త్వదీయ సుగుణవర్ణనం || జయ ||
హితప్రదం హితప్రదం త్వదీయ ఊదిధారణం ..........|| శ్రీకరా ||

శ్రీ షిరిడి సాయి గీతాంజలి
రచన - కంది శంకరయ్య
సంగీతం - డా. సంజయ్ కింగీ.
గానం - ఉన్నతి, బృందం.

ఈ పాటను క్రింది url ద్వారా esnips లో వినండి.
http://www.esnips.com/doc/7c6af438-1be2-468b-b847-111f08078995/Sai---Srikara-Chidambara

16 కామెంట్‌లు:

 1. శంకరార్యా ! మీ పాట
  మహా మహా మనోహరం మహా మహా మనోహరం !

  రిప్లయితొలగించండి
 2. వసంత కిశోర్ గారూ,
  ధన్యవాదాలు.
  ఇంతకీ నేనిచ్చిన లింక్ పని చేసిందా? పాటను విన్నారా?
  ఇచ్చిన లింక్ పనిచేస్తుందో లేదో అని సందేహంగా ఉంది. దయచేసి పాట (ఆడియో) వినగలుగుతున్నారా, లేదా తెలియజేయండి.

  రిప్లయితొలగించండి
 3. శంకరార్యా !
  చక్కగా పని చేస్తోంది ! పాట పూర్తిగా విన్నాకనే నా post పెట్టాను !

  రిప్లయితొలగించండి
 4. శంకరార్యా !
  సంగీతం గానం కూడా చాలా బావున్నాయ్ !

  రిప్లయితొలగించండి
 5. శంకరార్యా !
  ఈ బాణీలో నాక్కూడా పాట వ్రాయాలనిపిస్తోంది !

  రిప్లయితొలగించండి
 6. శంకరార్యా !
  మనోహరం,తమోహరం,శుభంకరం,సుఖంకరం,జయప్రదం,హితప్రదమైన
  చక్కని గీతాన్ని అందించారు. బాగుంది.

  రిప్లయితొలగించండి
 7. http://rpsarma.blogspot.com/
  కొత్త బ్లాగు.
  తెలుగు సాహిత్య అభిమానుల కోసం.. సందర్శించండి. రసానందం పొందండి!!

  రిప్లయితొలగించండి
 8. చాలా మనోహరముగా ఉంది పాట. రచనకు తగ్గట్లే సంగీతము సమకూరింది. ఆలాపన మధురముగా ఉంది. అందఱికీ అభినందనలు.

  రిప్లయితొలగించండి
 9. శ్రీ శంకరయ్య గారు, అద్భుతంగా వుందండి సాహిత్యం, సంగీతం. చాల బాగా వ్రాసారు. మరొక సాయి భక్తుని సందర్శించినందుకు సంతోషంగా వుంది. పల్లవిలో చిన్న అచ్చుతప్పు వుంది. రెండవ పంక్తిలో "కృపాకరా" అని వుండాలి. తరువాత, మామూలుగ వాడుకలో "సుఖప్రదం" అని విన్నాను "సుఖంప్రదం" అని వినలేదు. అయినా నాకున్న పరిజ్ఞానం తక్కువ. ఇలా కూడ వాడవచ్చనుకుంటాను.

  రిప్లయితొలగించండి
 10. **********************************************************************
  వసంత కిశోర్ గారూ,
  రాజేశ్వరక్కయ్యా,
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  నా పాట నచ్చినందుకు ధన్యవాదాలు. ఇవి నేను పదేళ్ళక్రితం ఒక ఆడియో కంపినీ వాళ్ళు అడిగితే వ్రాసి ఉచితంగా ఇచ్చిన పాటలు. ఎనిమిది పాటలే రికార్డ్ అయ్యాయి. అన్నీ బాగానే ఉన్నాయి కాని పాడిన వాళ్లు ‘ఔత్సాహికులు’. అందులో మా అమ్మాయి స్వాతి కూడా ఉంది.
  **********************************************************************
  సూరి వులిమిరి గారూ,
  ధన్యవాదాలు. పల్లవిలో మీరు సూచించిన అచ్చు తప్పును సవరించాను.
  ఇక నేను పాటలో వాడింది ‘సుఖంప్రదం’ కాదు, సుఖంకరం. సుఖంకరం, శుభంకరం సాధుప్రయోగాలే. క్రింది ఉదాహరణలు చూడండి ...
  ‘శ్రీమంజునాథ ’ చిత్రంలోని పాటలోని కొంత భాగం ..
  ఏకనాథేశ్వరం ప్రస్తుతివశంకరం ప్రణత జన కింకరం దుర్జన భయంకరం సజ్జన ‘శుభంకరం’ ప్రాణి భవ తారకం.

  ‘తెలుగుశాల’ బ్లాగులో ... తెలుగు తెర నటరాజులు శీర్షికలో ...
  ‘దుష్టజన భయంకరం- ఇష్టజన శుభంకరం’... అంటారు పరమశివుడి గురించి బాగా తెలిసిన వారు.
  http://telugusala.blogspot.com/2011/03/blog-post_01.html
  **********************************************************************

  రిప్లయితొలగించండి
 11. సూరి పులిమిరి గారూ,
  మీ అభ్యంతరాన్ని శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారికి తెలిపి సందేహ నివృత్తి చేయవలసిందిగా కోరినాను. వారి సమాధానం ఇది ...

  అయ్యా! శుభాశీస్సులు. మీ సందేహ నివృత్తికొరకు నేనొక సంస్కృత పండితుని కూడా సంప్రదించేను. శుభంకరం మరియు సుఖంకరం సాధు ప్రయోగములే. అలుక్సమాసము చేస్తే అవి శుభకరం మరియు సుఖకరం అవుతాయి. అందుచే ఏ విధముగా వాడినా సరిపోతుంది. గ్రహించగలరు.
  పండిత నేమాని

  రిప్లయితొలగించండి
 12. పండిత నేమాని వారూ,
  సందేహ నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 13. గురువుగారూ మీ సాయిగీతం సభక్తికంగా, సలక్షణంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 14. శ్రీ శంకరయ్యగారికి, నిజమే, సుఖంకరం కు బదులు సుఖంప్రదం అని పొరబడ్డాను. క్షంతవ్యుడ్ని. తెలియని ఎన్నో విషయాలు తెలియజేసారు. ధన్యవాదాలు. శ్రీ నేమానివారికి కూడ నా నమస్సులు, ధన్యవాదములు తెలియజేయగలరు.

  రిప్లయితొలగించండి