********************************************************************** డా. యస్వీ. రాఘవేంద్ర రావు (సుమశ్రీ) గారూ, కుమారసంభవ ఇతివృత్తం నేపథ్యంగా మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు. ********************************************************************** గన్నవరపు నరసింహమూర్తి గారూ, మన్మథుని జన్మవృత్తాంతంతో చక్కని పూరణ చేసారు. అభినందనలు. ‘కౌతుక ఘాతముల’ ...? ********************************************************************** మందాకిని గారూ, మదనారాతికి పుత్త్రుడు పుట్టిన భావంతో మీ పూరణ బాగుంది. అభినందనలు. కాని పునరుక్తి దోషం కనిపిస్తున్నది. మీ పద్యాన్ని ఇలా మారిస్తే ఎలా ఉంటుందంటారు? నాతి వియోగము పొందిన భూతాధిపతి(యె) హిమాద్రి పుత్త్రికి (మగడై) ఖ్యాతిగ(నె, నంత) మదనా రాతికి పుత్త్రుండు, పుట్టె రాజీవాక్షీ! ********************************************************************** తాడిగడప శ్యామలరావు గారూ, అద్భుతమైన పూరణ మీది. అభినందనలు. ‘ప్రీతిన్ భీతి’ అన్న మీ ప్రయోగం నా కాలేజీరోజుల్ని గుర్తుకు తెచ్చాయి. అప్పుడు నేను వ్రాసిన ‘నవవధువు’ అనే ఖండికలోని పద్యం ఇది ... (నేను వ్రాసిన మొదటి కందం ఇదే). తలిదండ్రుల నెడబాసెడి కలకంఠికి కంటినుండి కన్నీరొలికెన్ చెలులను విడనాడక తా విలపించెను నవవధువు సభీతిన్ ప్రీతిన్. ********************************************************************** అజ్ఞాత గారూ, మొదటి పూరణ ఉత్తమోత్తమమం. అభినందనలు. రెండవ పూరణలో మంచి విషయాన్నే ఎత్తుకొన్నారు. కాని ‘పంచుకొనినా బ్రాతికి’ .... అర్థం కావడం లేదు. ********************************************************************** సంపత్ కుమార్ శాస్త్రి గారూ, చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు. ‘ఘాతుకమున్’ అన్నచో ‘ఘాతుకమున’ అంటే బాగుంటుందేమో? **********************************************************************
చంద్ర శేఖర్ గారూ! ధన్యవాదములు. మాకు రోజు ఉదయం వేళ వుండే కరెంటు కోతవలన పూరణ పోస్ట్ చేయలేక పోయాను. కార్యాలయమునకు వెళ్ళినా.. ఈ ఐడియా తో ఎవరైనా పూరిస్తారేమో ననుకుంటూ వున్నాను.ఇప్పుడే వచ్చి ' అమ్మయ్య ' అనుకొని పూరించాను. ధన్యవాదములు.
గురువు గారూ ధన్యవాదములు. బాణాలకు గాయము లవుతాయి కదాండీ! మరి మరుడు వేసే బాణాల వలన కలిగే గాయము కౌతుకము. అందుకే కౌతుక ఘాతముల వలన బాధ అని వ్రాసాను. నాకున్న పురాణ జ్ఞానము తక్కువ . త్వరగా వ్రాసీక పోతే చంద్ర శేఖరులు వ్రాసేస్తారేమో ననే ఆతురము !
********************************************************************** మందాకిని గారూ, మీ రెండవ పూరణ చాలా బాగుంది. అభినందనలు. ********************************************************************** గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ ‘గుజరాతికి’ పుత్త్రుని పుట్టించిన పూరణ వైవిధ్యంగా ఉండి అలరించింది. అభినందనలు. ********************************************************************** రాజేశ్వరక్కయ్యా, కుంతి రాతిగుండెను చక్కగా ఆవిష్కరించారు. బాగుంది. రాతివంటి నాతికి పుతుడు కలిగాడన్న మీ రెండవ పూరణ బాగుంది. అభినందనలు. ఈ రోజు సవరణలకు అవకాశం ఇవ్వనందుకు నాకు కోపంగా ఉంది. :-) ********************************************************************** మంద పీతాంబర్ గారూ, మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు. ‘ఆ తిరుమలరాయని నా/మేతీరుగ’ అనేది ‘ఆ తిరుమలరాయని తా/నేతీరుగ’ అని ఉండాలనుకుంటాను. ********************************************************************** వసంత కిశోర్ గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు. ********************************************************************** శ్రీపతి శాస్త్రి గారూ, చక్కగా ఉంది మీ పూరణ. అభినందనలు. ********************************************************************** అజ్ఞాత గారూ, మీ సందేహం యుక్తమైనదే. అయితే అర్థవత్ సమాసః అన్నారు కదా! ‘దక్షారాతి’ అన్నచోట దక్షుని శత్రువు అనీ, భూమికి శత్రువు అనీ అర్థాభేదాలను పొందవచ్చు. **********************************************************************
డా. యస్వీ. రాఘవేంద్ర రావు (సుమశ్రీ) గారి పూరణ .....
రిప్లయితొలగించండికౌతుకమున ననె జంభా
రాతి శచికి "తారకుని దురాకృత మడఁగున్
భీతి తొలఁగు నిఁక త్రిపురా
రాతికి పుత్త్రుండు పుట్టె రాజీవాక్షీ!"
శివుడు గౌరితో ,
రిప్లయితొలగించండి' చేతల చిలిపి తనమ్మున
ఘాతుకమౌ శరములేయు గాసి పడంగా
కౌతుక ఘాతముల !' మురా
రాతికి పుత్రుండు పుట్టె రాజీవాక్షీ !
నాతి వియోగము పొందిన
రిప్లయితొలగించండిభూతాధిపతికి, హిమాద్రి పుత్త్రికి- సుతుడై
ఖ్యాతిగ స్కందుడు, మదనా
రాతికి పుత్త్రుండు, పుట్టె రాజీవాక్షీ!
ఒక భర్త , భార్యకు కుమారసంభవము గురించి వివరించుట.
ప్రీతిన్ భీతి సురాసుర
రిప్లయితొలగించండివ్రాతము గన హేమకశిపు పాలిటి మృత్యు
ఖ్యాతి ప్రహ్లాదుడు సురా
రాతికి పుత్త్రుండు పుట్టె రాజీవాక్షీ!
- తాడిగడప శ్యామలరావు.
నా మెదటి పూరణంలోని 3 వ పాదం సరిగా లేదు. సరిజేస్తే -
రిప్లయితొలగించండిప్రీతిన్ భీతి సురాసుర
వ్రాతము గన హేమకశిపు పాలిటి మృత్యు
ఖ్యాతిగ సకల నిలింపా
రాతికి పుత్త్రుండు పుట్టె రాజీవాక్షీ!
- తాడిగడప శ్యామలరావు.
ఓ పెద్ద ముత్తైదువ:
రిప్లయితొలగించండినీతలపులికఫలించుని
దే తరములనాటిగుడియొ,ఎంతటి మహిమో-
నా తనయయు మొక్కగనీ
రాతికి పుత్త్రుండు పుట్టె రాజీవాక్షీ!
పాతచెలిమియెకలిగిన
ట్లాతాపసువనిఁశకుంతలాదుష్యంతుల్
యాతురతఁబంచుకొనినా
బ్రాతికి, పుత్త్రుండు పుట్టె రాజీవాక్షీ!
నా పూరణ .....
రిప్లయితొలగించండి(ప్రహ్లాదుని తల్లి లీలావతి చెలికత్తెతో ....)
ఏతండ్రి యిటుల క్రూరుం
డై తనయుని హింసపెట్టునా? వాత్సల్యం
బే తెలియని శిల యయ్యెను;
రాతికి పుత్త్రుండు పుట్టె; రాజీవాక్షీ!
ఆ తారకఘాతుకమున్,
రిప్లయితొలగించండిభీతావహులైన జనుల ప్రేమగ బ్రోవన్,
చాతుర్య కుసుమబాణా
రాతికిపుత్రుండు పుట్టె రాజీవాక్షీ.
కుసుమబాణారాతి = ఈశ్వరుడు,
తారక= తారకాసురుడు,
**********************************************************************
రిప్లయితొలగించండిడా. యస్వీ. రాఘవేంద్ర రావు (సుమశ్రీ) గారూ,
కుమారసంభవ ఇతివృత్తం నేపథ్యంగా మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
**********************************************************************
గన్నవరపు నరసింహమూర్తి గారూ,
మన్మథుని జన్మవృత్తాంతంతో చక్కని పూరణ చేసారు. అభినందనలు.
‘కౌతుక ఘాతముల’ ...?
**********************************************************************
మందాకిని గారూ,
మదనారాతికి పుత్త్రుడు పుట్టిన భావంతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
కాని పునరుక్తి దోషం కనిపిస్తున్నది. మీ పద్యాన్ని ఇలా మారిస్తే ఎలా ఉంటుందంటారు?
నాతి వియోగము పొందిన
భూతాధిపతి(యె) హిమాద్రి పుత్త్రికి (మగడై)
ఖ్యాతిగ(నె, నంత) మదనా
రాతికి పుత్త్రుండు, పుట్టె రాజీవాక్షీ!
**********************************************************************
తాడిగడప శ్యామలరావు గారూ,
అద్భుతమైన పూరణ మీది. అభినందనలు.
‘ప్రీతిన్ భీతి’ అన్న మీ ప్రయోగం నా కాలేజీరోజుల్ని గుర్తుకు తెచ్చాయి. అప్పుడు నేను వ్రాసిన ‘నవవధువు’ అనే ఖండికలోని పద్యం ఇది ... (నేను వ్రాసిన మొదటి కందం ఇదే).
తలిదండ్రుల నెడబాసెడి
కలకంఠికి కంటినుండి కన్నీరొలికెన్
చెలులను విడనాడక తా
విలపించెను నవవధువు సభీతిన్ ప్రీతిన్.
**********************************************************************
అజ్ఞాత గారూ,
మొదటి పూరణ ఉత్తమోత్తమమం. అభినందనలు.
రెండవ పూరణలో మంచి విషయాన్నే ఎత్తుకొన్నారు. కాని ‘పంచుకొనినా బ్రాతికి’ .... అర్థం కావడం లేదు.
**********************************************************************
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
‘ఘాతుకమున్’ అన్నచో ‘ఘాతుకమున’ అంటే బాగుంటుందేమో?
**********************************************************************
గురువుగారు,
రిప్లయితొలగించండిసవరణకు ధన్యవాదాలు. ఇకపై జాగ్రత్తగా ఉంటాను.
మరొక పూరణ
భూతములకు నాథుండై
మాతల్లినిఁ జేయి పట్టి మంగళకరుడై
శీతనగమునున్న మరా
రాతికి పుత్త్రుండు పుట్టె రాజీవాక్షీ!
మరునికి అరాతి - మరారాతి
ప్రీతిగ గుజరాత్ పిల్లయె
రిప్లయితొలగించండినీ తనయుని పెండ్లి యాడె నిరుడే; అపుడే,
లేత తమల బుగ్గల గుజ
రాతికి పుత్త్రుండు పుట్టె, రాజీవాక్షీ!
హనుమచ్చాస్త్రిగారూ, నా ఐడియా కొట్టేశారు. ఇప్పుడే "...గుజరాతికి..." అని పోస్టు చేయబోయి మీ పూరణ చూశాను. ఇంకో ఐడియా వేయాలి. బాగుంది మీ పూరణ.
రిప్లయితొలగించండిచంద్ర శేఖర్ గారూ! ధన్యవాదములు. మాకు రోజు ఉదయం వేళ వుండే కరెంటు కోతవలన పూరణ పోస్ట్ చేయలేక పోయాను. కార్యాలయమునకు వెళ్ళినా.. ఈ ఐడియా తో ఎవరైనా పూరిస్తారేమో ననుకుంటూ వున్నాను.ఇప్పుడే వచ్చి ' అమ్మయ్య ' అనుకొని పూరించాను. ధన్యవాదములు.
రిప్లయితొలగించండికుంతీ తనయుడు కర్ణుడు
రిప్లయితొలగించండిసూతుని పుత్రునిగ పెరిగె సూర్యుని కోడుకై !
ఎంతటి యిడుములు బడసెనొ
రాతికి పుత్తుండు పుట్టె రాజీవాక్షీ !
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆ తిరుమలరాయని నా
రిప్లయితొలగించండిమేతీరుగ వేడెనేమొ యెదనల్లాడన్
ప్రీతిగమ్రొక్కెను నల్లని
రాతికి, పుత్త్రుండు పుట్టె రాజీవాక్షీ!
గురువు గారూ ధన్యవాదములు. బాణాలకు గాయము లవుతాయి కదాండీ! మరి మరుడు వేసే బాణాల వలన కలిగే గాయము కౌతుకము. అందుకే కౌతుక ఘాతముల వలన బాధ అని వ్రాసాను. నాకున్న పురాణ జ్ఞానము తక్కువ . త్వరగా వ్రాసీక పోతే చంద్ర శేఖరులు వ్రాసేస్తారేమో ననే ఆతురము !
రిప్లయితొలగించండిగీతా నేవలచి తినిను
రిప్లయితొలగించండినీతోడి దేనాదు జగతి నీయాన సుమీ !
ప్రీతిగ చెలితో పలుకగ నా
[ నా ] రాతికి పుత్తుండు పుట్టె రాజీవాక్షీ !
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
నారదుడు శచీదేవితో :
01)
_________________________________
పూతక్రతునికి త్వరలో
యాతనలు తొలగు నిజముగ - నాశ్రమ మందున్
నేతకు భక్తుడు;దివిజా
రాతికి పుత్త్రుండు పుట్టె - రాజీవాక్షీ!
_________________________________
పూతక్రతుడు = ఇంద్రుడు
ఆశ్రమము = నారదుని యాశ్రమము
నేత = విష్ణువు
దివిజారాతి = హిరణ్యకశిపుడు
శ్రీగురుభ్యోనమ
రిప్లయితొలగించండిభీతావహులై చెదరగ
మాతామహుసముని దునిమి మదమును నణచన్
భీతిన్ గొల్పగ దక్షా
రాతికి పుత్త్రుండు పుట్టె రాజీవాక్షీ!
(మాతామహుసముడు = దాక్షాయని యొక్క తండ్రి దక్షుడు)
(దక్షారాతి = దక్ష + అరాతి = శివుడు)
దక్ష=భూమి
రిప్లయితొలగించండిఅరాతి=శత్రువు
**********************************************************************
రిప్లయితొలగించండిమందాకిని గారూ,
మీ రెండవ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
**********************************************************************
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ ‘గుజరాతికి’ పుత్త్రుని పుట్టించిన పూరణ వైవిధ్యంగా ఉండి అలరించింది. అభినందనలు.
**********************************************************************
రాజేశ్వరక్కయ్యా,
కుంతి రాతిగుండెను చక్కగా ఆవిష్కరించారు. బాగుంది.
రాతివంటి నాతికి పుతుడు కలిగాడన్న మీ రెండవ పూరణ బాగుంది. అభినందనలు.
ఈ రోజు సవరణలకు అవకాశం ఇవ్వనందుకు నాకు కోపంగా ఉంది. :-)
**********************************************************************
మంద పీతాంబర్ గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
‘ఆ తిరుమలరాయని నా/మేతీరుగ’ అనేది ‘ఆ తిరుమలరాయని తా/నేతీరుగ’ అని ఉండాలనుకుంటాను.
**********************************************************************
వసంత కిశోర్ గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
**********************************************************************
శ్రీపతి శాస్త్రి గారూ,
చక్కగా ఉంది మీ పూరణ. అభినందనలు.
**********************************************************************
అజ్ఞాత గారూ,
మీ సందేహం యుక్తమైనదే.
అయితే అర్థవత్ సమాసః అన్నారు కదా! ‘దక్షారాతి’ అన్నచోట దక్షుని శత్రువు అనీ, భూమికి శత్రువు అనీ అర్థాభేదాలను పొందవచ్చు.
**********************************************************************
పాతచెలిమియెకలిగిన
రిప్లయితొలగించండిట్లాతాపసువనిఁశకుంతలాదుష్యంతుల్
యాతురతఁబంచుకొనినా
బ్రాతికి, పుత్త్రుండు పుట్టె రాజీవాక్షీ!
పాతచెలిమియెకలిగిన
ట్లాతాపసువనిఁశకుంతలాదుష్యంతుల్
యాతురతన్బంచుకొనిన
బ్రాతికి, పుత్త్రుండు పుట్టె రాజీవాక్షీ!
వాళ్లు పంచుకొనిన ప్రేమకి, పిల్లాడు పుట్టాడు అని వ్రాయలి అని నా ఉద్దేస్యమండీ
అజ్ఞాత గారూ,
రిప్లయితొలగించండివివరణ వల్ల విషయం సుగమం అయింది. బ్రాఁతి ... మధ్య అరసున్నా లేక పోవడంతో కొద్దిగా తికమక పడ్డాను. బాగుంది. ధన్యవాదాలు.
నూతన దంపతులు:
రిప్లయితొలగించండిప్రీతిన్ జేయగ పూజలు
సీతారాములకు, గౌరి, శివ, విష్ణులకున్,
రీతిన్ సాలిగ్రామము
రాతికి, పుత్త్రుండు పుట్టె రాజీవాక్షీ!
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
భీతిలకమ్మా! ఇందిర!
రిప్లయితొలగించండినీతిని వర్జించ లేదు నీ కొడుకెటులన్
ప్రీతిగ నిటలీని చలువ
రాతికి పుత్త్రుండు పుట్టె రాజీవాక్షీ!